Civics
-
బంపర్ ఆఫర్....వ్యాక్సిన్ తీసుకో..బహుమతి పట్టు
చంద్రపూర్: కరోనా వ్యాక్సిన్లు ప్రజలందరూ తీసుకునేలా ప్రోత్సహించే నిమిత్తం మహారాష్ట్రలోని చంద్రపూర్ మునిసిపల్ కార్పొరేషన్ టీకా బంపర్ లక్కీ డ్రాను ప్రకటించింది. పైగా ఈ లక్కీ డ్రాలో ఎల్ఈడీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు నుండి వాషింగ్ మెషీన్ల వరకు మంచి ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకోవచ్చు అని తెలిపింది. అంతేకాదు నవంబర్ 12 నుంచి 24 వరకు సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్ల వద్ద వ్యాక్సిన్లు తీసుకున్నవాళ్లకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. (చదవండి: విమానాలకు రన్‌వేగా..) ఈ మేరకు మేయర్ రాఖీ సంజయ్ కంచర్లవార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పౌరులకు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించడంతోనే ఈ లక్కీ డ్రా ప్రకటించినట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో పౌర కమీషనర్ రాజేష్ మోహితే కూడా ఇతర అధికారులను, ప్రజలను తమ సమీపంలోని సివిక్-రన్ ఇనాక్యులేషన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్లు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఇప్పటివరకు నగరంలో అర్హులైన వ్యక్తుల సంఖ్యతో పోలిస్తే వ్యాక్సిన్లు తీసుకున్నవారి సంఖ్య ఇంకా తక్కువగానే ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పైగా పౌరసరఫరాల శాఖ ఆరోగ్య విభాగం సుమారు 21 కేంద్రాల్లో టీకాలు వేసే సౌకర్యాలను ఏర్పాటు చేసిందన్నారు. క్రయ విక్రయలు చేసేవాళ్లు, ఉద్యోగస్తులు, అధికారులు, ప్రజలతో నిత్యం సంప్రదింపులు చేసే వాళ్లు, తదితరులు కనీసం ఒక్కడోస్ అయిన తీసుకుంటేనే నగరంలోని మార్కెట్లోకి అనుమతిస్తామని లేకుంటే అనుమతించేదే లేదని మోహితే చెప్పారు. అంతేకాక ప్రభుత్వ ఆదేశాల మేరకు నూరుశాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించే దిశగా తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. (చదవండి: సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!) -
ఇంటర్లో సివిక్స్ సబ్జెక్ట్ పేరెందుకు మార్చారు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ కోర్సు కోసం సవరించిన సిలబస్‌లో ’సివిక్స్’సబ్జెక్ట్ పేరును ’పొలిటికల్ సైన్స్’గా మార్పు చేయడాన్ని సవాల్ చేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇంటర్ బోర్డుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎందుకిలా మార్పు చేస్తున్నారో తెలియజేయాలని, పూర్తి వి వరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యాక్ట్–1971 ప్రకారం సివిక్స్ సబ్జెక్ట్ ప్రవేశపెట్టడం జరిగిందని, దేశవ్యాప్తంగా ప్లస్ టు స్థాయి విద్య లో సివిక్స్ బోధన జరుగుతోందని, ఎలాంటి అధికారాలు లేకపోయినా ఇంటర్ బోర్డు కార్యదర్శి సివిక్స్ సబ్జెక్ట్ పేరు మార్పు చేయడం చెల్లదని పేర్కొంటూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్కాలర్స్ అసోసియేషన్ రిట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని ఒక విశ్వవిద్యాలయంలో సివిక్స్ చదివిన విద్యార్థికి బీఏ పొలిటికల్ సైన్స్ సీటు రాలేదని చెప్పి ఇంటర్ బోర్డు సెక్రటరీ ఇలా ఏకపక్షంగా పేరు మార్పు చేశారని తెలిపారు. ఇంటర్ బోర్డు సెక్రటరీకి ఎలాంటి అధికారం లేదని రిట్లో పేర్కొన్నారు. -
ఇంటర్మీడియట్ మోడల్ పేపర్స్
Civics (English version) Paper-II (Second year) Time: 3 Hours Max. Marks: 100 Section - A I. Answer any Three of the following in 40 lines each. 3 × 10 = 30 1. Explain the salient features of Indian constitution. 2. Explain the powers of Prime Minister. 3. Discuss the powers and functions of Indian Parliament. 4. Explain the powers and functions of State Governor. 5. Mention the Powers and Functions of District Collector. Section - B II. Answer any Eight of the following in 20 lines each. 8 × 5 = 40 6. What are the causes for the rise of National movement in India? 7. Mention the socialist principles as laid down in the directive principles of State Policy. 8. Explain the powers of Indian Vice President. 9. Briefly explain the powers of High Court. 10. What are the fundamental duties of Indian Citizen? 11. Bring out the Legislative relations between the Union and State Governments. 12. Explain the composition and functions of Zilla Parishad. 13. Explain the law making procedure of Ordinary Bill. 14. What are the remedies for corruption? 15. What are the basic features of Indian Foreign Policy? 16. What are the suggestions for the successful functioning of U.N.O? 17. What are the factors responsible for Globalisation? Section - C III. Answer any Fifteen of the following in 5 lines each. 15 × 2 = 30 18. Methods of Moderates 19. Causes for Minto - Morley reforms Act 20. Write four differences between fundamental rights and Directive Principles 21. Election method of President 22. What is a Money Bill? 23. Composition of Legislative Council 24. Public accounts Parliamentary Committee 25. Union List 26. Finance Commission 27. Collective responsibility of Ministers 28. Qualifications of Rajya Sabha members 29. Sessions of Parliament 30. Residuary powers 31. Mandala Mahasabha 32. Judicial Activism 33. Cantonment Board 34. Disarmament 35. General determinants of Foreign Policy 36. Veto Power 37. Tactics of Terrorists G.W. Stevenson Director Royal Educational Institutions, Hyderabad Economics (English version) Paper-II (Second year) Time: 3 Hours Marks: 100 SECTION – A I. Answer any THREE of the following in 40 lines each. 3 × 10 = 30 1. Explain the characteristic features of developing Economies with special reference to India. 2. Define Poverty. What are the causes for Poverty? 3. What are the causes for Low Productivity in Indian Agriculture and suggest measures to improve it? 4. Explain the 1991 Industrial Policy Resolution. 5. What are the causes for rapid growth of Population in India and suggest measures to Control it? SECTION - B II. Answer any EIGHT of the following in 20 lines each. 8 × 5 = 40 6. Explain the objectives and functions of W.T.O. 7. Explain the objective of GATT. 8. Explain New Population Policy - 2010. 9. Explain the sectoral contribution to National Income. 10. What are the causes for Rural indebtedness? 11. Explain the functions of NABARD. 12. Explain the problems faced by Small Scale and Cottage Industries. 13. Explain the functions of IDBI. 14. Define Service Sector and write about the importance of Service Sector in the Indian Economy. 15. What are the features of Tourism in India? 16. Explain the reasons for Regional Imbalances in India. 17. What are the major causes for deforestation? Suggest measures for conservation of forests. SECTION - C III. Answer any FIFTEEN of the following in 5 lines each. 15 × 2 = 30 18. What is Economic Growth? 19. Per capita Income 20. Micro Finance 21. Co-operative farming 22. Green Revolution 23. Rythu Bazar 24. Kisan Credit Card Scheme 25. Industrial Estates 26. SIDBI 27. Liberalisation 28. Define Globalisation 29. Primary sector 30. Sarva Siksha Abhiyan 31. Janani Suraksha Yojana 32. LIC 33. Science & Technology 34. Bharat Nirman 35. Economic planning 36. Plan Holiday 37. Sustainable Development K. Janardhan Reddy Chairman, Royal Educational Institutions, Hyderabad -
ఇంటర్ సివిక్స్ మాదిరి ప్రశ్న పత్రాలు
ఐ. కింది ప్రశ్నల్లో ఏవైనా మూడింటికి 40 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి. 3 10 = 30 1. రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి, దాని ప్రాముఖ్యాన్ని వివరించండి. 2. సార్వభౌమాధికారం లక్షణాలను వివ రించండి. 3. గాంధేయవాదంపై ఒక వ్యాసం రాయండి. 4. సమాఖ్య ఉపయోగాలను, నష్టాలను తెలపండి. 5. న్యాయశాఖ విధులను వివరించండి. విభాగం - బి ఐఐ. కిందివాటిలో ఏవైనా ఎనిమిది ప్రశ్నలకు 20 పంక్తుల్లో సమాధానాలు రాయండి. 8ణ5 = 40 6. రాజనీతిశాస్త్రం, నీతిశాస్త్రాల మధ్య సంబంధాన్ని తెలపండి. 7. రాజ్యానికి సంబంధించిన ఏవైనా రెండు మౌలికాంశాలను వివరించండి. 8. రాజ్యం - సమాజాల మధ్య భేదాలను రాయండి. 9. స్వేచ్ఛను రక్షించే సాధనాలను రాయండి. 10. సమానత్వ రూపాలను వివరించండి. 11. న్యాయం రకాలను వివరించండి. 12. మిగులు విలువ సిద్ధాంతం గురించి రాయండి. 13. సంక్షేమ రాజ్యం అంటే ఏమిటి? సంక్షేమ రాజ్య మౌలిక లక్షణాలను వివరించండి. 14. {పజాస్వామ్య ప్రయోజనాలు రాయండి. 15. ద్విసభా విధానం గురించి రాయండి. 16. ఆధునిక కాలంలో కార్యనిర్వాహక శాఖ ప్రాముఖ్యత పెరగడానికి కారణాలేమిటి? 17. {పజాభిప్రాయ సాధనాలను తెలపండి. విభాగం - సి ఐఐఐ. కిందివాటిలో పదిహేను ప్రశ్నలకు 5 పంక్తుల్లో సమాధానాలు రాయండి. 15ణ2 = 30 18. సామాజిక శాస్త్రం 19. {పభుత్వ అంగాలు 20. న్యాయం నిర్వచనం 21. డిఫ్యాక్టో డిజ్యూర్ సార్వభౌమాధికారం 22. జాతీయత 23. {పజాభిప్రాయ సేకరణ 24. వయోజన ఓటు హక్కు 25. సమన్యాయం 26. రక్షక రాజ్యం (పోలీసు రాజ్యం) 27. శాసనం లక్షణాలు 28. హక్కుల అమలుకు హక్కు 29. లౌకిక రాజ్యం 30. సామాజిక న్యాయం (సాంఘిక న్యాయం) 31. వర్గ పోరాటం 32. బహు కార్యనిర్వాహక వర్గం 33. సహజ స్వేచ్ఛ 34. న్యాయ సమీక్ష 35. కార్‌లమార్‌క్స రచనలు 36. ద్విసభా విధానం 37. {పభావ వర్గాలు ఐ్ట్ఛటఝ్ఛఛీజ్చ్ట్ఛీ ్కఠఛజీఛి ఉ్ఠ్చఝజ్చ్టీజీౌట, క్చటఛిజి 2014 ఇజీఠిజీఛిట ్క్చఞ్ఛటఐఐ (ఖ్ఛీఠజఠ గ్ఛటటజీౌ) ఖీజీఝ్ఛ: 3 ఏటట క్చ్ఠ.క్చటజుట: 100 విభాగం - ఎ ఐ. కింది ప్రశ్నల్లో ఏవైనా మూడింటికి 40 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి. 3ణ10 = 30 1. భారత రాజ్యాంగం మౌలిక లక్షణాలను వివరించండి. 2. భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులను రాయండి. 3. భారత రాష్ర్టపతి అధికారాలను వివరించండి. 4. భారత పార్లమెంట్ అధికారాలు - విధులను వివరించండి. 5. పట్టణ ప్రాంత స్థానిక ప్రభుత్వాల నిర్మాణం, విధులను వివరించండి. విభాగం - బి ఐఐ. కిందివాటిలో ఏవైనా ఎనిమిది ప్రశ్నలకు 20 పంక్తుల్లో సమాధానాలు రాయండి. 8ణ5 = 40 6. భారతదేశంలో జాతీయోద్యమం ఆవిర్భావానికి కారణాలేమిటి? 7. సహాయ నిరాకరణోద్యమం గురించి రాయండి. 8. ఆదేశసూత్రాల్లోని గాంధేయవాద నియమాలను తెలపండి. 9. లోక్‌సభ స్పీకర్ విధులను రాయండి. 10. కేంద్ర మంత్రిమండలి విధులను రాయండి. 11. కేంద్ర, రాష్ర్ట సంబంధాలపై సర్కారియా కమిటీ సూచనలు రాయండి. 12. {దవ్య బిల్లు - సాధారణ బిల్లుల మధ్య భేదాలను తెలపండి. 13. సుప్రీంకోర్టు అధికారాలను క్లుప్తంగా రాయండి. 14. భారత రాజ్యాంగం 73వ రాజ్యాంగ సవరణ ముఖ్యాంశాలు ఏవి? 15. విదేశాంగ విధానాన్ని నిర్ధారించే కారకాలను పేర్కొనండి. 16. ఐక్యరాజ్యసమితి సాధించిన విజయాలు, పరాజయాలను తెలపండి. 17. ఉగ్రవాదం రకాలను వివరించండి. విభాగం - సి ఐఐఐ. కిందివాటిలో పదిహేను ప్రశ్నలకు 5 పంక్తుల్లో సమాధానాలు రాయండి. 15ణ2 = 30 18. దండి యాత్ర 19. చౌరీ చౌరా సంఘటన 20. శాసనోల్లంఘనోద్యమం 21. ముసాయిదా కమిటీ 22. కోరం 23. స్త్రీ సంక్షేమం గురించి తెలిపిన ఆదేశ సూత్రాలు ఏవి? 24. అవిశ్వాస తీర్మానం 25. కోర్ట ఆఫ్ రికార్డు 26. ఉమ్మడి జాబితా 27. క్షమాభిక్ష 28. {పభుత్వ ఖాతాల సంఘం 29.ఙ్ట్చఛగ్రామ సభ 30. పురపాలక సంఘాల స్థాయిలు 31. మేయర్ 32. కంటోన్మెంట్ బోర్డు 33. సార్క సమావేశాలు 34. అలీన విధానం 35. అడ్వకేట్ జనరల్ 36. ధర్మకర్తృత్వమండలి 37. ఐక్యరాజ్యసమితి సభ్యత్వం -
పౌరశాస్త్రం
లౌకికతత్వం భారతీయ సమాజం సర్వధర్మ సమభావనతో ఐకమత్యానికి నిలయంగా ఉంది. దేశంలో అనేక మతాలు, కులాలు, భాషలు, ఆచార వ్యవహారాలకు చెందిన ప్రజలు ఒకేజాతిగా మనుగడ సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, జాతీయ సమైక్యత అనే భావనలు భారతీయ సమాజానికి మార్గదర్శకాలుగా ఉన్నాయి. ప్రాచీనకాలం నుంచి భారతీయ సంస్కృతి సర్వమత సమ్మేళనంగా పరిఢవిల్లుతోంది. వివిధ మతాలకు పుట్టినిల్లయిన భారతదేశం విదేశీ మతాలకు కూడా సాదరంగా ఆశ్రయమిస్తూ లౌకికతత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. లౌకికం అంటే మతంతో సంబంధం లేనిది. లౌకికవాద పాలన అంటే ఏ మత ప్రమే యం లేకుండా పాలన నిర్వహించడం. ప్రజల మతసంబంధ విషయాల్లో జోక్యం కల్పించుకోని రాజ్యాన్ని లౌకికరాజ్యం అంటారు. సర్వమత సహనాన్ని అనుసరించి, దాని గురించి ప్రచారం చేసిన ప్రాచీన భారతదేశ చక్రవర్తి - అశోకుడు. అక్బర్ చక్రవర్తి అన్ని మతాల సారాన్ని మేళవించి, ‘దిన్-ఇ-ఇలాహీ’ అనే మతాన్ని స్థాపించాడు. మత స్వాతంత్య్రం అనేది రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక హక్కు. మన రాజ్యాంగ ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో లౌకిక అనే పదాన్ని చేర్చారు. లౌకికతత్వాన్ని పెంపొందించే అంతిమ బాధ్యత ప్రభుత్వానిదే. భారతదేశ లౌకికతత్వ భానవలోని ముఖ్యాంశాలు పాలనా వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండకూడదు. దేశంలో రాజ్య (ప్రభుత్వ) మతం లేదు. అంటే భారత్ ఏ మతాన్ని అధికారికంగా గుర్తించలేదు. ప్రజల మత విశ్వాసాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ప్రతి ఒక్కరికీ మతస్వేచ్ఛ ఉంది. మత సామరస్యానికి భంగం కలిగించే విశ్వాసాలను ప్రచారం చేయకూడదు. ప్రజాధనంతో నిర్వహించే ఏ విద్యాలయంలోనూ మతవిద్య బోధించకూడదు. ఎన్నికల ప్రచారంలో మతం, మత చిహ్నాలను ఉపయోగించకూడదు. ప్రపంచ శాంతి శాంతియుత జీవనానికి ఆటంకం కలిగించే ప్రతి అంశం సమాజాభివృద్ధికి అవరోధం కలిగిస్త్తుంది. రెండు ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విషాదాల నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రపంచదేశాలు శాంతియుత సమాజాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాయి. ప్రచ్ఛన్న యుద్ధానికి కాలుదువ్విన రెండు అగ్రదేశాలు అలీన దేశాల ఆసక్తులను గౌరవించి, ప్రపంచశాంతిని ప్రపంచదేశాల ఎజెండాగా మార్చాయి. శాంతి స్థాపనకు సంబంధించిన లక్ష్యాల సాధన కోసం ఏర్పడిన సంస్థలే నానాజాతి సమితి (1920), ఐక్యరాజ్య సమితి (1945). ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి ప్రపంచశాంతి పరిరక్షణకు శాయశక్తులా కృషి చేస్తోంది. భారతదేశ విదేశాంగ విధానానికి మూలసూత్రమైన అలీనవిధానం ప్రపంచశాంతి పటిష్ట తకు ఎంతగానో దోహదపడుతోంది. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమై 1918లో ముగిసింది. రెండో ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమై 1945లో ముగిసింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌కు చెందిన హిరోషిమా, నాగసాకి నగరాలు బాంబుదాడికి గురై తీవ్రంగా నష్టపోయాయి. అలీన విధానం అంటే అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్య్ర విధానాన్ని రూపొందించుకుని ప్రపంచశాంతికి కృషి చేయడం. ఈ విధానాన్ని అనుసరించినవే అలీన దేశాలు. దీని రూపశిల్పి భారత ప్రథమ ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ. ఈయనకు మార్షల్ టిటో (యుగోస్లేవియా అధ్యక్షుడు), నాసర్ (ఈజిప్ట్ అధ్యక్షుడు) సహకరించారు. భారత్, చైనా మధ్య పంచశీల ఒప్పందం జరిగింది. దీన్ని 28 జూన్ 1954న భారత ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చౌ-ఎన్-లై సంయుక్తంగా అంగీకరించారు. ఆసియా దేశాల మొదటి, రెండో సమావేశాలు వరుసగా 1947, 1949లలో ఢిల్లీలో జరిగాయి. వీటి ఏర్పాటులో నెహ్రూ ప్రముఖ పాత్ర పోషించారు. ఆసియా ఆఫ్రికా దేశాల మొదటి సమావేశం ‘బాండుంగ్’ (ఇండోనేషియా)లో 1955లో జరిగింది. ఈ సమావేశంలోనే అలీన విధానం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అలీనోద్యమ కూటమి (నామ్) 1961లో ఏర్పడింది. దీంట్లో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య 118. విదేశాంగ విధానం అంటే ఇతర దేశాలతో అనుసరించాల్సిన విధానాలు. జాతీయ ప్రయోజనాలను పరిరక్షిస్తూ, కేంద్ర ప్రభు త్వం విధానాల రూపకల్పన చేస్తుంది. ప్రపంచ వ్యవహారాల్లో పోషించాల్సిన పాత్ర గురించి మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో సూచించారు. భారత్, చైనా మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం - క్రీ.శ. 1962 కామన్వెల్త్ కూటమి అంటే - బ్రిటిషర్లు పాలించిన వలస దేశాల కూటమి. దీంట్లో 53 సభ్యదేశాలున్నాయి. ఇది 1931లో ఏర్పాటయ్యింది. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాలు జరిగిన సంవత్సరాలు - 1948, 1965, 1971, 1991. బంగ్లాదేశ్ కారణంగా 1971లో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలిని ‘సార్క’ అంటారు. దీంట్లో సభ్యదేశాల సంఖ్య 8. సార్క్‌ను 1985లో స్థాపించారు. దీని మొదటి శిఖరాగ్ర సమావేశం ఢాకా (బంగ్లాదేశ్)లో జరిగింది. సార్క దేశాల ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని భారతదేశంలో, ప్రాంతీయ వ్యవసాయ సమాచార కేంద్రాన్ని బంగ్లాదేశ్‌లో ఏర్పాటు చేశారు. మూడో ప్రపంచ దేశాలు - వలస పాలన నుంచి విముక్తి పొంది, అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని దేశాలు. 1973లో జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ (ఎన్ఐఈవో) ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. ఈ సమావేశం అల్జీర్స (అల్జీరియా)లో జరిగింది. ఐక్యరాజ్యసమితి 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి (ూ్ఖై) ఆవిర్భవించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క (యూఎస్ఏ)లో ఉంది. ఐక్యరాజ్యసమితి ప్రధానాంగాలు 6. అవి: సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక- సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, కార్యదర్శివర్గం. యూఎన్వో సాధారణ సభ సంవత్సరానికి ఒకసారి సమావేశమవుతుంది. భద్రతా మండలి సభ్య దేశాల సంఖ్య 15. 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం, 10 దేశాలకు తాత్కాలిక సభ్యత్వం ఉంది. యూఎన్వో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు - రష్యా, యూఎస్ఏ, యూకే, చైనా, ఫ్రాన్స. భద్రతా మండలిలోని తాత్కాలిక సభ్యదేశాల పదవీ కాలం - 2 సంవత్సరాలు. భద్రతామండలిలో తీర్మానం నెగ్గాలంటే 5 శాశ్వత సభ్యదేశాలు, ఏవైనా నాలుగు తాత్కాలిక సభ్యదేశాలు అంగీకరించాలి. 1948 డిసెంబర్ 10న యూఎన్వో మానవ హక్కుల ప్రకటన చేసింది. డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. శాశ్వత సభ్యదేశాలకు ఉన్న ఈ అధికారాన్ని ‘వీటో అధికారం’ అంటారు. వీటో అధికారం అంటే వ్యతిరేకించే అధికారం. భద్రతా మండలికి ఏ దేశంపై అయినా సైనిక చర్యకు ఆదేశించే అధికారం ఉంది. వలస పాలన కింద కొనసాగిన భూ భాగాల ప్రయోజనాలు రక్షించేందుకు ధర్మకర్తృత్వ మండలి కృషి చేస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ది హేగ్ (నెదర్లాండ్స)లో ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్య - 15. పదవీ కాలం 9 ఏళ్లు. యూఎన్వో ప్రధాన కార్యనిర్వహణాధికారిని ప్రధాన కార్యదర్శి (సెక్రటరీ జనరల్) అంటారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాన్-కీ-మూన్. ప్రధాన కార్యదర్శి పదవీ కాలం 5 సంవత్సరాలు. అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్ (ఐబీఆర్డీ)ను ప్రపంచ బ్యాంక్‌గా పిలుస్తారు. యూఎన్వో సాధారణ సభ 1988లో నిరాయుధీకరణపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. సీటీబీటీ అంటే - సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం. 1995లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యత నిర్మూలనకు కృషిచేస్తున్న సంస్థ - యునెస్కో. అంతర్జాతీయ కార్మిక మండలి (ఐఎల్వో) లో మనదేశం శాశ్వత సభ్యత్వం కలిగి ఉంది. పేద, ధనిక దేశాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించడానికి వ్యూహాలను విల్లీబ్రాంట్ కమిషన్ (1980లో) రూపకల్పన చేసింది. యూఎన్వో రాజ్యాంగంలో 111 అధికరణలు, 19 అధ్యాయాలు ఉన్నాయి. ప్రారంభంలో యూఎన్వోలో 50 దేశాలకు సభ్యత్వం ఉండేది. దీంట్లో ప్రస్తుతం 193 సభ్యదేశాలుగా ఉన్నాయి. 2011లో దక్షిణ సూడాన్ 193వ దేశంగా చేరింది. యూఎన్వో ధర్మకర్తృత్వ మండలి కార్యకలాపాలను 1994 నుంచి నిలిపివేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం భవనాన్ని శాంతి భవనం (పీస్ ప్యాలెస్)గా పిలుస్తారు. డాగ్హామర్స (మాజీ సెక్రటరీ జనరల్) యూఎన్వోను ‘ప్రజలను స్వర్గానికి తీసుకెళ్లేందుకు కాకుండా, వారిని నరకం నుంచి కాపాడేందుకు ఏర్పడిన సంస్థ’గా అభివర్ణించాడు. ఇండియా... యూఎన్వోలో 1945లో సభ్యదేశంగా చేరింది. యూఎన్వో గుర్తించిన అధికార భాషలు ఆరు. అవి: ఇంగ్ల్లిష్, చైనీస్, రష్యన్, స్పానీష్, ఫ్రెంచ్, అరబిక్. యూఎన్వో చిహ్నం - రెండు ఆలీవ్ కొమ్మలు (శాంతికి చిహ్నం), యూఎన్వో పతాకంలో తెలుపు, లేత నీలం రంగులు ఉంటాయి. యూఎన్వో ఆర్థిక సంవత్సరం - జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు. యూఎన్వో లక్ష్యాలు: అంతర్జాతీయ శాంతి భద్రతలను పరిరక్షించడం, దేశాల మధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పడం, అంతర్జాతీయ సహకారాన్ని అందించడం. యూఎన్వో మొదటి సమావేశం 1945లో లండన్‌లో జరిగింది. -
సరైన సాధనతో విజయ శిఖరాలకు..!
చార్టర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడాలని కోరుకునే వారు కొందరు.. కంపెనీ సెక్రటరీ కొలువును చేజిక్కించుకోవాలనుకునే వారు మరికొందరు.. వీరి లక్ష్యాల సాధనకు మార్గాన్ని సుగమం చేసే సబ్జెక్టులు.. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇవి గ్రూపు సబ్జెక్టులుగా ఉన్న సీఈసీని అధిక మార్కులతో దిగ్విజయంగా పూర్తిచేసి సుస్థిర వృత్తి జీవితం వైపు అడుగులు వేయొచ్చు. ఈ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ సీఈసీ ప్రిపరేషన్ ప్రణాళిక.. సివిక్స్ సీనియర్ ఇంటర్ సివిక్స్ పాఠ్య ప్రణాళికలో భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం, పరిపాలన అంశాలు ఉన్నాయి. సిలబస్‌లో ఎనిమిది యూనిట్లు ఉన్నాయి. ప్రశ్నపత్రం: *** సివిక్స్‌కు 100 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రం మూడు విభాగాలుగా ఉంటుంది. *** సెక్షన్-ఎలో ఐదు వ్యాసరూప ప్రశ్నలుంటాయి. వాటిలో మూడింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు. *** సెక్షన్-బిలో 12 ప్రశ్నలుంటాయి. వాటిలో 8 ప్రశ్నలకు కనీసం 20 పంక్తుల్లో సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. *** సెక్షన్-సిలో 20 ప్రశ్నలు ఇస్తారు. వాటిలో 15 ప్రశ్నలకు కనీసం 5 పంక్తుల్లో సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. వ్యాసరూప ప్రశ్నలకు ముఖ్యమైనవి: 1. భారత రాజ్యాంగం-ముఖ్య లక్షణాలు. 2. ప్రాథమిక హక్కులు. 3. భారత రాష్ట్రపతి. 4. భారత ప్రధానమంత్రి. 5. భారత పార్లమెంటు. 6. రాష్ట్ర గవర్నర్. 7. గ్రామీణ- పట్టణ స్థానిక ప్రభుత్వాలు. 8. జిల్లా కలెక్టర్ తదితర అంశాలు. ఐదు మార్కుల ప్రశ్నలకు: *** భారత జాతీయోద్యమం ఆవిర్భావానికి కారణాలు, వివిధ జాతీయోద్యమ ఉద్యమాలు, భారత ప్రభుత్వ చట్టాలు. *** ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు- ఆదేశిక సూత్రాల మధ్య భేదాలు. *** ఉప రాష్ట్రపతి- మంత్రిమండలి. *** శాసన తయారీ విధానం- వివిధ బిల్లులు, పార్లమెంటరీ కమిటీలు. *** సుప్రీంకోర్టు అధికారాలు; రాష్ట్ర ప్రభుత్వం- రాష్ట్ర శాసనశాఖ- రాష్ట్ర న్యాయశాఖ. *** కేంద్ర- రాష్ట్ర సంబంధాలు- సర్కారియా కమిషన్ సూచనలు. *** 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు, వివిధ స్థానిక ప్రభుత్వాల విధులు. *** భారత విదేశాంగ విధానం, ఐక్యరాజ్యసమితి, సమకాలీన ధోరణులు- అంశాలు. రెండు మార్కుల ప్రశ్నలకు: ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన ఏ అంశం నుంచైనా రెండు మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అయితే ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశమున్న ముఖ్యమైన అంశాలు: భారత రాజ్యాంగం (యూనిట్ 1); కేంద్ర ప్రభుత్వం (యూనిట్ 3); భారత పార్లమెంటు (యూనిట్ 4); రాష్ట్ర శాసనశాఖ (యూనిట్ 7); కేంద్ర- రాష్ట్ర సంబంధాలు (యూనిట్ 9); స్థానిక ప్రభుత్వాలు (యూనిట్ 10); ఐక్యరాజ్య సమితి (యూనిట్ 12); సమకాలీన ధోరణులు- అంశాలు (యూనిట్ 13). సూచనలు: *** ప్రశ్నపత్రాన్ని ఒకటికి రెండుసార్లు చదవాలి. పూర్తిగా అవగాహన ఉన్న ప్రశ్నలనే ఎంపిక చేసుకోవాలి. *** మొదట రెండు మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ విభాగంలో 15 ప్రశ్నలకే సమాధానాలు రాయాల్సి ఉన్నా అదనంగా మరో రెండింటికి సమాధానాలు రాస్తే మంచిది. *** వ్యాసరూప ప్రశ్నలకు 20-30 నిమిషాలు, ఐదు మార్కుల ప్రశ్నలకు 10-20 నిమిషాలు, రెండు మార్కుల ప్రశ్నలకు ఐదు నిమిషాలు కేటాయించాలి. చివరి 5 నిమిషాలు పునఃపరిశీలనకు కేటాయించాలి. *** సీనియర్ ఇంటర్ సిలబస్‌లో రాజ్యాంగ అధికరణలు (ఆర్టికల్స్) ఉన్నాయి. అందువల్ల అవసరమైన చోట ఆర్టికల్స్‌ను, సమకాలీన ఉదాహరణలు రాయవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువ మార్కులు వచ్చేందుకు అవకాశముంటుంది. కామర్స్ పార్ట్-1 వాణిజ్య శాస్త్రం సిలబస్: యూనిట్ 1: అంతర్జాతీయ వర్తకం. యూనిట్ 2: మార్కెటింగ్ వ్యవస్థలు, వ్యాపార ప్రకటనలు, వినియోగదారిత్వం. యూనిట్ 3: వ్యాపార సేవలు. యూనిట్ 4: స్టాక్ ఎక్స్చేంజ్లు. యూనిట్ 5: కంప్యూటర్ అవగాహన. పార్ట్- 2 వ్యాపార గణక శాస్త్రం: యూనిట్ 1: వర్తకం బిల్లులు, తరుగుదల. యూనిట్ 2: కన్సైన్మెంట్ ఖాతాలు. యూనిట్ 3: వ్యాపారేతర సంస్థల ఖాతాలు. యూనిట్ 4: ఒంటిపద్దు విధానం. యూనిట్ 5: భాగస్వామ్య వ్యాపార ఖాతాలు, భాగస్తుని ప్రదేశం, భాగస్తుని విరమణ. ప్రశ్నపత్రం: పార్ట్- 1 థియరీ- 50 మార్కులు విభాగం- మార్కులు- సమయం సెక్షన్-ఎ- 10 x 2 *** 20- 35 నిమిషాలు సెక్షన్-బి- 4 x 5 *** 20- 35 నిమిషాలు సెక్షన్-సి- 5 x 2 *** 10- 20 నిమిషాలు *** సెక్షన్-ఎ విభాగంలో వ్యాసరూప ప్రశ్నలు.. ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్, మార్కెటింగ్ వ్యవస్థ, వ్యాపార సేవలు, వినియోగదారిత్వం యూనిట్ల నుంచి వస్తాయి. అధిక మార్కులు సాధించేందుకు నిర్వచనం, ముఖ్యాంశాలను అండర్లైన్ చేస్తూ ముగింపు రాయాలి. *** సెక్షన్-బిలోని లఘు సమాధాన ప్రశ్నలు.. ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్, అంతర్జాతీయ వర్తకం, వ్యాపార ప్రకటనలు, కంప్యూటర్ అవగాహన లేదా వ్యాపార సేవల యూనిట్ల నుంచి వస్తాయి. ఈ సెక్షన్లో పూర్తి మార్కులు పొందేందుకు ఎక్కువ అవకాశం ఉన్నందున నిర్వచనంతో పాటు ప్రశ్నకు సంబంధించిన ప్రత్యక్ష సమాధానాలను విపులంగా రాయాలి. *** సెక్షన్-సిలో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు క్లుప్తంగా, వివరంగా సమాధానాలు రాసి పూర్తి మార్కులు పొందొచ్చు. పార్ట్- 2 అకౌంట్స్- 50 మార్కులు విభాగం- మార్కులు- సమయం సెక్షన్-డి- 1 x 20 *** 20- 30 నిమిషాలు సెక్షన్-ఇ- 1 x 10 *** 10- -20 నిమిషాలు సెక్షన్-ఎఫ్- 2 x 5 *** 10- 20 నిమిషాలు సెక్షన్-జి - 5 x 2 *** 10- 20 నిమిషాలు *** సెక్షన్-డి లో భాగస్వామ్య వ్యాపార సంస్థకు సంబంధించి 20 మార్కుల ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం సుదీర్ఘంగా ఉండటం వల్ల సంబంధిత పట్టికల్లో జాగ్రత్తగా వ్యవహారాలను నమోదు చేస్తూ సరైన పద్ధతిలో ఖాతాల నిల్వల్ని తేల్చాలి. సమయం వృథా కాకుండా చూసుకోవాలి. *** సెక్షన్-ఇ లో కన్సైన్మెంట్ ఖాతాలు, వ్యాపారేతర సంస్థల ఖాతాల నుంచి 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటిని బాగా చదివి, అర్థం చేసుకొని ఒక ప్రశ్నను ఎంపిక చేసుకొని అవసరమైన మేరకు మాత్రమే సమాధానం రాయాలి. *** సెక్షన్-ఎఫ్ లోని నాలుగు ప్రశ్నల్లో 3 అకౌంట్స్ ప్రశ్నలు, 1 థియరీ ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. విద్యార్థులు వారికి అనువైన ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి. *** సెక్షన్-జి లో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు క్లుప్తంగా, సవివరంగా సమాధానాలు రాయాలి. సూచనలు: *** అకౌంట్స్ విభాగంలో అధిక శాతం సుదీర్ఘ సమాధాన ప్రశ్నలు, calculations ఉన్నందున సమాధానాలు రాయటంలో వేగం, కచ్చితత్వం ప్రధానం. *** అకౌంట్స్‌లో నియమాలు, సూత్రాలను అనుసరిస్తూ సమాధానాలు రాయాలి. అవసరమైన చోట తప్పనిసరిగా స్కేలు, పెన్సిల్ ఉపయోగించాలి. ఎకనామిక్స్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం అర్థశాస్త్రంలో అధిక మార్కులు సాధించాలంటే భారత దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలు, ఆర్థిక సమస్యలు- కారణాలు, నివారణ చర్యలు, గణాంక వివరాలను కూలంకషంగా చదివి, అర్థం చేసుకుంటే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సిలబస్: యూనిట్ 1: ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి. యూనిట్ 2: నూతన ఆర్థిక సంస్కరణలు. యూనిట్ 3: జనాభా, మానవ వనరుల అభివృద్ధి. యూనిట్ 4: జాతీయాదాయం. యూనిట్ 5: వ్యవసాయ రంగం. యూనిట్ 6: పారిశ్రామిక రంగం. యూనిట్ 7: తృతీయ రంగం. యూనిట్ 8: ప్రణాళికలు. యూనిట్ 9: పర్యావరణం, ఆర్థికాభివృద్ధి. యూనిట్10: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ- విహంగ వీక్షణం. ప్రశ్నపత్రం: *** సెక్షన్- ఎలోని ఐదు ప్రశ్నల్లో మూడింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు. *** సెక్షన్- బిలోని 12 ప్రశ్నల్లో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. *** సెక్షన్- సిలోని 20 ప్రశ్నల్లో 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. మార్కుల వెయిటేజీ: యూనిట్- 10 మార్కులు- 5 మార్కులు- 2 మార్కులు 1 - 1 - -- 2 2 - 1 - 2 - 2 3 - 1 - 1 - 2 4 - 1 - 2 - - 5 - 1 - 2 - 4 6 - 1 - 2 - 2 7 - - 2 - 3 8 - - 1 - 3 9 - - 1- 3 10 - - 1 - - *** పది మార్కుల ప్రశ్నకు 20 నిమిషాలు, ఐదు మార్కుల ప్రశ్నకు 10 నిమిషాలు, రెండు మార్కుల ప్రశ్నకు రెండు నిమిషాలు కేటాయించాలి. పునఃపరిశీలనకు 10 నిమిషాలు కేటాయించాలి. సూచనలు: *** ద్వితీయ సంవత్సరం అర్థశాస్త్రం సిలబస్‌లో ముఖ్యంగా నాలుగు యూనిట్లపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అవి: జాతీయాదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, నూతన ఆర్థిక సంస్కరణలు. వీటి నుంచి దాదాపు 80 నుంచి 90 మార్కుల వరకు ప్రశ్నలు వస్తాయి. *** ప్రతి సమాధానంలో సబ్ హెడ్డింగ్స్, గణాంకాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశముంటుంది. *** 10 మార్కుల ప్రశ్నకు కనీసం 8 కారణాలు, ఆరు నివారణ చర్యలు రాయాలి. 5 మార్కుల ప్రశ్నకు ఐదారు అంశాలు రాయాలి. *** పరీక్షలో తొలుత రెండు మార్కుల ప్రశ్నలకు, తర్వాత ఐదు మార్కుల ప్రశ్నలకు, చివరగా 10 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఎకనామిక్స్ జాతీయాదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, నూతన ఆర్థిక సంస్కరణల అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. కామర్స్ ‘అకౌంట్స్’ విభాగానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాయటంలో వేగం, కచ్చితత్వం ప్రధానం. సివిక్స్ అవసరమైన చోట సమకాలీన ఉదాహరణలు, ఆర్టికల్స్‌తో సమాధానాలు రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. prepared by K. Janardhan Reddy (Economics) Kuruhuri Ramesh (Commerce) G.W. Stevenson (Civics) Royal Educational Institutions, Hyderabad.