Civil Supplies depatment
-
అవాస్తవాలే పరమావధిగా ఈనాడు!
సాక్షి, విజయవాడ: అవాస్తవాలు, అసత్య ప్రచారాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అక్కసు.. ఇవే ఈరోజుల్లో ఈనాడుకు పతాక శీర్షికలుగా మారాయి. తాజాగా ‘ధాన్యం కొనుగోలు నిలిపివేత!’ అనే శీర్షికతో తప్పుడు కథనం ప్రచురించింది. దీంతో ఈ కథనం ఆధారంగా ఏపీ రైతులు ఆందోళనకు గురి కావొద్దని అధికారులు వాస్తవాలను తెలియజేశారు. అవేంటంటే.. ‘‘పౌరసరఫరాల సంస్థ తమ లక్ష్యం పూర్తయిదని తేల్చేసింది. రైతుల వద్ద ఇంకా నిల్వలు ఉన్నాయి. ఎదురుచూపులు తప్పట్లేదు. బ్యాంకు గ్యారంటీలు లేక కొనడానికి నిరాకరిస్తున్న మిల్లర్లు, రంగు మారిన ధాన్యం సేకరణకూ మొండి చెయ్యి’’ అంటూ పూర్తిగా అంటూ అవాస్తవాలనే ప్రచురించింది ఈనాడు. అయితే.. ధాన్యం సేకరణకు సంబంధించిన ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడించిన వాస్తవాలను ఒకసారి పరిశీలిస్తే.. ధాన్యం కొనుగోలు నిలిపివేత పూర్తిగా అవాస్తవం. కొనుగోలు ఏ జిల్లాలోనూ బ్రేకులు పడలేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తెలియజేసింది. ప్రతిజిల్లా లోని రైతు భరోసా కేంద్రము పరిధిలో.. రైతుల వద్ద ధాన్యము నిల్వ లేదని నిర్దారించుకొన్న తర్వాతనే ధాన్యం సేకరణ ప్రక్రియ ముగించడం జరుగుతుంది. సదరు రైతు భరోసా కేంద్రము వద్ద.. అధికారుల తనిఖీ చేసి రెవిన్యూ, సివిల్ సప్లై, అగ్రికల్చర్ అధికారుల ద్వారా ఆమోద పత్రం పొందిన తర్వాత మాత్రమే సంబంధిత రైతు భరోసా కేంద్రము వద్ద ధాన్యము సేకరణ ప్రక్రియ మూసి వేస్తారు. అంతేకాదు సేకరణ ప్రక్రియ మూసేసే వారం రోజులు ముందు నుంచే గ్రామంలో చాటింపు వేస్తారు. లక్ష్యమంటూ ఏదీ లేదు ఏపీలో పౌరసరఫరాల సంస్థ ధాన్యం సేకరణలో ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోదు. కేవలం తాత్కాలిక అంచనా మాత్రమే ఉంటుంది. వరి పండించే ప్రతి ఒక్క రైతుకు మద్దతు ధర కల్పించటం, ఏ ఒక్క రైతుకూ మద్దతు ధర కంటే తక్కువ ధరకంటే తక్కువకు అమ్ముకునే పరిస్థితి లేకుండా చూడటం ప్రభుత్వ ఉద్దేశాలు. అలాంటప్పుడు టార్గెట్ అనే టాపికే ఉండదు. ఇంకా నిల్వలు.. ఎదురుచూపులంటూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ.. రైతుల వద్ద ఉన్న ధాన్యము నిల్వల తనిఖీ చేసిన తర్వాతే.. సదరు ధాన్యము నిల్వలను భరోసా కేంద్రము ద్వారా కొనుగోలు చేస్తుంది. కానీ, నిల్వలు ఉన్నాయంటూ, రైతులు ఎదురుచూపులంటూ అవాస్తవాలను హైలెట్ చేస్తోంది. అది అవాస్తవం బ్యాంకు గ్యారంటీలు లేక.. కొనడానికి నిరాకరిస్తున్న మిల్లర్లు అని ఈనాడు కథనంలో పేర్కొన్న విషయం పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్ జిల్లాలకు బ్యాంకు గారంటీల యొక్క రేషియోను పెంచింది ఏపీ పౌర సరఫరాల శాఖ. తద్వారా ధాన్యము సేకరణ ప్రక్రియకు సంబంధించి సంబంధిత జిల్లాలకు కేటాయింపు కూడా పెంచారు. ధాన్యము సేకరణ: తేది18-01-2023 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారు 4,77,098 రైతుల వద్ద నుంచి.. రూ.5,373.82 కోట్ల విలువ గల 26,32,372 మెట్రిక్ టన్నుల ధాన్యమును కొనుగోలు చేసింది. అందుకు గాను రూ.4768.79 కోట్ల (89%)ను 4,65,967 రైతుల ఖాతాలో జమ చేయటం జరిగింది. గోనె సంచుల చార్జీలు, హమాలీ ఛార్జీలు, రవాణా చార్జీలు తాలుకు రూ.65.01 కోట్లరూపాయలను చెల్లించవలసి ఉండగా రూ. 26.28 కోట్ల రూపాయలను (40%) రైతుల ఖతాలో జమ చేయటం జరిగింది. కాబట్టి, ఈనాడు పత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అసత్యం. రైతులందరికి విజ్క్షప్తి ఏంటంటే.. దళారులను, మధ్య వర్తులను నమ్మి మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్మి మోసపోవద్దు. ధాన్యము సేకరణలో ఎటువంటి సమస్య వచ్చిన సత్వరమే పరిష్కరించేలా ప్రతి మండలంలో అధికారులను నియమించారు. ఒక వేళ రైతులకు సమస్య వస్తే సదరు సమస్య పరిష్కారం కోసం సంబంధిత మండల అధికారి దృష్టికి తీసుకువెళ్లాలి అని ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ వైఎస్ చైర్మన్ & ఎండీ వీరపాండియన్(ఐఏఎస్) ద్వారా ఒక ప్రకటన విడుదల అయ్యింది. -
రైతుల చేతికే గోనె సంచులు!
ధాన్యం కొనుగోళ్లు సమయంలో ఏటా ఎదురవుతున్న గోనె సంచుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందునుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియను పక్కాగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. పొరుగు జిల్లా విజయనగరంలో విజయవంతమైన రైతులకే గోనె సంచులు అందించే విధానాన్ని ఇక్కడ కూడా ఈ ఏడాది అమలు చేయనున్నారు. వీరఘట్టం/పాలకొండ: రైతుల కోసం వైఎస్సార్‌కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమం కార్యక్రమాలను చేపడుతోంది. రైతులు ఆరుగాలం శ్రమించి పండిస్తున్న వరి ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బందుల్లేకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.15 లక్షల హెక్టార్లలో వరిసాగవుతోంది. గతేడాది వచ్చిన దిగుబడుల ప్రకారం ఈసారి 10.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో బీపీటీలు, సాంబమసూరి వంటి వాణిజ్య ప్రాధాన్యం ఉన్న రకాలు స్థానిక అవసరాల కోసం తీసివేయగా 7.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సొసైటీలు, రైతుభరోసా కేంద్రాలు సంయుక్తంగా ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సిద్ధంగా 50 శాతం గోనె సంచులు ఏటా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేపడుతున్నప్పటికీ గోనె సంచుల కొరత వేధిస్తోంది. రైతులకు అవసరమైనప్పడు సంచులు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా గోనె సంచుల ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అధికారుల లెక్క ప్రకా రం 7.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు 1.50 కోట్లు సంచులు అవసరం ఉంది. గతేడాది మిల్లర్లకు ఇచ్చిన 50 లక్షల గోనె సంచులు వారి వద్దే ఉన్నాయి. అధికారుల వద్ద మరో 25 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ల కోసం 50 శాతం సంచులు సిద్ధంగా ఉన్నట్టే. ఇంకా కావాల్సిన సంచుల కోసం పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తోంది. పొరుగు జిల్లా మాదిరిగానే.. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో ఏటా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నప్పుడు కావాల్సిన గోనె సంచులను రైతులు లేదా మిల్లర్లు సమకూర్చుతున్నారు. దీంతో రైతు నుంచి గోనె సంచి రూపంలో అదనంగా రెండు కిలోల ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుంటున్నారు. ఈసారి ఇలాంటి ఇబ్బంది లేకుండా పక్క జిల్లా విజయనగరంలో అమలు చేస్తున్న మాదిరిగానే ధాన్యం కొనుగోళ్లు సమయంలో రైతులకు కావాల్సిన గోనె సంచులను ప్రభుత్వమే అందించనుంది. తర్వాత ఈ గోనె సంచిలో మిల్లుకు చేరిన ధాన్నాన్ని మిల్లింగ్ చేసి అదే గోనె సంచిలో మరలా సీఎంఆర్ కింద బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగిస్తారు. అంతా పారదర్శకంగానే.. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కొనుగోళ్లు కేంద్రాల ద్వారా గోనె సంచులు (50 కిలోల బస్తా)ను రైతులకు ఇచ్చి..వారి నుంచి ధాన్యం సేకరించి మిల్లర్లకు అప్పగిస్తాం. అదే బస్తాలో మిల్లింగ్ చేసిన బియ్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లర్ నుంచి సేకరిస్తాం. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఇదే పద్ధతిలో ఏటా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా అదే పద్ధతి అనుసరిస్తాం. –ఎ.కృష్ణారావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, శ్రీకాకుళం -
ఇళ్ల స్థలాలిస్తుంటే అభ్యంతరాలెందుకు?
-
హవ్వ... పరువు తీశారు!
రైతులనుంచి సేకరించిన ధాన్యం మరాడించి ఇవ్వాల్సిన మిల్లర్లు రీసైక్లింగ్ బియ్యాన్నే అంటగడుతున్నారు. నాణ్యత లోపించినా... కిమ్మనకుండా క్వాలిటీసెల్ అధికారులు ఆమోద ముద్ర వేసేస్తున్నారు. ఇన్నాళ్లూ జిల్లాలో ఆ తరహా బియ్యానే పౌరసరఫరాల అధికారులు లబ్ధిదారులకు అందించారు. ఇక్కడ గోదాములు నిండిపోయేసరికి ఇతర జిల్లాలకు తరలించినపుడు అసలు బాగోతం బయట పడుతోంది. గతంలో విశాఖలో... తాజాగా ఒంగోలులో అధికారులు ఇక్కడి బియ్యాన్ని తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం జిల్లా అధికారుల పనితీరుపై ప్రభావం చూపుతోంది. సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : పౌరసరఫరాల సంస్థ అధికారులు, మిల్లర్ల మధ్య లోపాయికారీ ఒప్పందాలతో పేదోడి బియ్యం పక్కదారి పడుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లర్లకు తరలిస్తున్న ధాన్యం మరాడించి ఇచ్చేందుకు ప్రభుత్వం తక్కువ మొత్తాన్ని అందజేస్తున్నా మిల్లర్ల అత్యుత్సాహానికి కారణం రీసైక్లింగేనని స్పష్టమవుతోంది. జిల్లాలోని కొందరు మిల్లర్ల నుంచి వస్తున్న రీసైక్లింగ్ బియ్యాన్ని తనిఖీ చేసేందుకు ప్రతీ పౌరసరఫరాల గోదాములో బియ్యం తనిఖీ చేసే సాంకేతికాధికారులున్నారు. వారిలో కొందరు మిల్లర్లు ఇచ్చిన మొత్తాలకు అలవాటు పడి నాణ్యత బాగుందంటూ ధ్రువీకరించడంతో వీటిని గోదాములకు తరలిస్తున్నారు. ఇక్కడి గోదాముల్లో ఖాళీ లేకపోవడంతో ఇతర జిల్లాలకు తరలించే ప్రక్రియలో ఈ బాగోతం బయటపడింది. ఇటీవల ఒంగోలు తరలించిన బియ్యాన్ని తనిఖీ చేసిన అక్కడి అధికారులు వాటిలో నాణ్యత లేదనీ, ముక్కి, రంగుమారాయని తిరస్కరించారు. దీంతో ఇక్కడి నాణ్యత డొల్లతనం బయట పడింది. దీనిపై రాష్ట్ర స్థాయి అధికారులు పంచాయితీ నిర్వహించారు. ముక్కిన బియ్యం 800 టన్నులు? జిల్లా నుంచి తరలిన బియ్యం దాదాపు 800 టన్నులు ముక్కి, రంగుమారిపోయినట్టు ఒంగోలులోని నాణ్య తా విభాగం అధికారులు ధ్రువీకరించినట్టు తెలిసింది. దీనిపై కమిషనర్ స్థాయి అధికారులు బదిలీపై వెళ్లిన జిల్లా మేనేజర్, సహాయ మేనేజర్లను పిలిపించిన పోస్ట్‌మార్టం నిర్వహించారు. చివరకు ఇక్కడి నాణ్యతా విభాగం డొల్లతనాన్ని ఎత్తిచూపారు. జిల్లానుంచి చిత్తూరు, విశాఖ పట్నం తదితర జిల్లాల్లోని గోదాములకూ గతంలో బియ్యాన్ని తరలించారు. ఎక్కడి నుంచి వెళ్లిన బియ్యాన్నైనా భద్రపరిచేముందు నాణ్యతా తనిఖీలు నిర్వహిస్తారు. అలాంటి సమయాల్లో ఎగుమతి చేసిన జిల్లాలోని నాణ్యతా విభాగం సిబ్బంది పనితనం తేటతెల్లమవుతుంది. ఇప్పుడదే జరిగింది. ఒంగోలులో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన బియ్యంలో కొంత భాగం సూరంపేట గోదామునుంచి తరలించినవి. వాస్తవానికి సూరంపేటలోనే కాదు. మరికొన్ని గోదాముల్లోని నాణ్యతా విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, మిల్లర్లతో మిలాఖత్ అయి పాడైన బియ్యాన్ని తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలోనూ విశాఖలోనూ తిరస్కరణ గతేడాది విశాఖపట్నం తరలించిన దాదాపు 40 లారీల లోడ్ల బియ్యం నాణ్యత బాగాలేదని అక్కడి అధికారులు ధ్రువీకరించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న అక్కడి డీఎం బియ్యాన్ని తిప్పి పంపారు. కానీ ఇక్కడినుంచి సహాయ మేనేజర్‌ను పంపించి గొడవ పెద్దది కాకుండా సర్దుబాటు చేయించారనే ఆరోపణలు వినిపించాయి. ఆ తరువాత ఆ బియ్యంలో కొంత మాత్రమే ఇతర చోట్లకు పంపించారు. మిగతాది అక్కడే సర్దుబాటు చేశారని అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఖరీఫ్ సరుకును రబీకి మార్చిన వైనం జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో 3.40లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా ధాన్యం ఉన్నాయని మిల్లర్లు, రైతులు చెప్పడంతో మరో లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేయొచ్చని అధికారులు ఉన్నతాధికారులకు ఇక్కడినుంచి నివేదిక పంపారు. కానీ 60వేల టన్నులు కొనుగోలు చేసేందుకు నిర్ణయించి వాటిని వెంటనే ఆగమేఘాల మీద ఆన్లైన్ చేశారు. కానీ రైతులకు మాత్రం నేటికీ డబ్బు ఇవ్వలేదు. విచిత్రమేమిటంటే ఇక్కడి రబీ ధాన్యం ఇతరులు కొనుగోలు చేసుకోగా ఖరీఫ్‌లోని ధాన్యాన్నే రబీ లో కొన్నట్టుగా అధికారులు రికార్డులు సిద్ధం చేశారు. ఇంకా ముక్కిన బియ్యం గోదాముల్లో.. జిల్లాలోని పలు గోదాముల్లో ముక్కిన, రంగుమారిన బియ్యాన్ని నిల్వ ఉంచారు. ఈ బియ్యాన్ని అదను చూ సి ఇతర గోదాములకు మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సూరంపేట ఘటన తరువాత ఈ బియ్యాన్ని ఎక్కడిదక్కడ గప్‌చుప్‌గా దాచేసినట్టు తెలు స్తోంది. కొన్ని గోదాముల్లోని బియ్యం ఇటీవల కురిసి న వర్షాలకు మరింత పాడై తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నట్టు సమీపంలో నివాసం ఉంటున్న ప్రజలు ఫిర్యాదు కూడా చేశారు.ఈ వైఖరిపై కొత్తగా వచ్చిన ఇన్చార్జి జిల్లా మేనేజర్ సమీక్షించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే దీనిపై సంబంధిత శాఖా ధికారులు ఎవరూ స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. -
విపత్తుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
అధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: వరదలు, తుపాన్ల వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సత్య ప్రకాశ్ టక్కర్ అధికారులను ఆదేశించారు. నైరుతి రుతుపవనాల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో విపత్తుల సన్నద్ధతపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో శుక్రవారం ఆయన సమీక్షించారు.నిత్యావసర సరుకులు అవసరమైన మేరకు స్టాకును సిద్ధంగా ఉంచుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.