వరదలు, తుపాన్ల వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సత్య ప్రకాశ్ టక్కర్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు సీఎస్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వరదలు, తుపాన్ల వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సత్య ప్రకాశ్ టక్కర్ అధికారులను ఆదేశించారు. నైరుతి రుతుపవనాల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో విపత్తుల సన్నద్ధతపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో శుక్రవారం ఆయన సమీక్షించారు.నిత్యావసర సరుకులు అవసరమైన మేరకు స్టాకును సిద్ధంగా ఉంచుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.