class 10 results
-
మార్కులు చూసి మూర్చబోయిన విద్యార్థి.. ఐసీయూలో చేరిక
మీరట్: పదో తరగతి పరీక్షల్లో తనకు వచ్చిన మార్కులు చూసి మూర్చపోయి ఐసీయూలో చేరాడో విద్యార్థి. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి తనకు బోర్డు పరీక్షల్లో చెప్పుకోదగ్గ 93.5 శాతం మార్కులు రావడంతో ఉప్పొంగిపోయాడు. రిజల్ట్స్ చూసి కుప్పకూలిపోవడంతో ఐసీయూలో చేర్చవలసి వచ్చింది.ఉత్తర ప్రదేశ్ బోర్డ్ హైస్కూల్ లేదా 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఫలితాలను శనివారం ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థులు 89.55 శాతం ఉత్తీర్ణత సాధించగా, 12వ తరగతి విద్యార్థులు 82.60 శాతం ఉత్తీర్ణత సాధించారు.మీరట్‌లోని మోడిపురం మహర్షి దయానంద్ ఇంటర్ కాలేజ్‌కు చెందిన అన్షుల్ కుమార్ తన పరీక్షలలో 93.5 శాతం మార్కులు సాధించాడు. అయితే, ఫలితాలను చూడగానే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అన్షుల్ తండ్రి, పోస్టాఫీసులో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేసే సునీల్ కుమార్ తెలిపారు. కాగా అన్షుల్ పరిస్థితి ప్రస్తుతం కుదటపడినట్లు తెలిసింది. -
ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి ఫలితాల్లో 582 మార్కులు సాధించాను..!
-
CBSE 10th Class Result 2023: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పదో తరగతి ఫలితాలను విడదుల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను https://cbseresults.nic.in/ వెబ్‌సైట్‌తో పాటు డిజిలాకర్, ఇతర వెబ్సైట్లలో చెక్‌చేసుకోవచ్చు. సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు జరిగాయి. మొత్తం 21, 86,940 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు కూడా ఇప్పటికే విడుదల అయ్యాయి. చదవండి: మోదీ 'మన్ కీ బాత్' వినలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఫైర్.. -
నేడు ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల
-
వరంగల్ ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్
తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో వరంగల్ జిల్లా ఉత్తీర్ణతలో మొదటిస్థానంలో ఉండగా, హైదరాబాద్ జిల్లా చిట్టచివర నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే అధిక శాతం ఉత్తీర్ణతను సాధించారు. బాలుర కంటే బాలికలు 1.87 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 2,62,187 మంది బాలురు హాజరు కాగా 2,22,071 మంది (84.70 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలికలు 2,57,307 మంది హాజరు కాగా, 2,22,757 మంది (86.57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం విడుదల చేశారు. ఈసారి పదోతరగతి పరీక్షలకు మొత్తంగా 5,55,265 మంది హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 5,19,494 మంది హాజరు కాగా 4,44,828 మంది (85.63 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 35,771 మంది హాజరు కాగా 14,136 మంది (39.52 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈసారి 2,379 పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించగా, 10 పాఠశాలల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. ఇక రాష్ట్రంలో 95.13 శాతం ఉత్తీర్ణతతో వరంగల్ ప్రథమ స్థానంలో నిలువగా, 76.23 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ గురుకులాలు 96.84 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రభుత్వ పాఠశాలలు 77.80 శాతం ఉత్తీర్ణతను సాధించాయి.జిల్లా పరిషత్తు, గిరిజన సంక్షేమ గురుకులాలు, ఎయిడెడ్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 85.63 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. ఇక కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, తెలంగాణ రాష్ట్ర గురుకులాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలురాష్ట్ర సరాసరి ఉత్తీర్ణతశాతం కంటే కంటే ఎక్కువ ఉత్తీర్ణతను సాధించాయి. -
ఆ స్కూళ్లలో సగం మంది పదోతరగతిలో ఫెయిల్
హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 20 శాతం స్కూళ్లను చూస్తే.. వాటిలో సగం మంది విద్యార్థులు పదో తరగతిలో ఫెయిలయ్యారట. ఇంటర్లో 14 శాతం మంది పాస్ కాలేకపోయారు. ఈ విషయాన్ని కాగ్ ఎత్తిచూపింది. 2011 నుంచి 2015 వరకు పదోతరగతిలో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని .. దాదాపు 16 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదని, 232 స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం 25 కంటే తక్కువ ఉందని కాగ్ తెలిపింది. ఇక ఇంటర్ విషయానికి వస్తే, 10 కాలేజీలలో సున్నా శాతం ఫలితాలు, 48 కాలేజీల్లో 25 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత కనిపించాయి. 2009 నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్న రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకం అమలు విషయంలో రాష్ట్రంలో అనేక లోపాలు ఉన్నాయని కాగ్ చెప్పింది. ఈ పథకం కింద 2014-15 సంవత్సరానిఇక రూ. 348.47 కోట్ల నిధులు అందుబాటులో ఉంటే, ప్రభుత్వం కేవలం రూ. 218.67 కోట్లే ఖర్చుపెట్టిందని, దాదాపు రూ.130 కోట్లు నిరుపయోగంగా వదిలేశారని తెలిపింది. పాఠశాలల్లో టీచర్ల కొరత కూడా తీవ్రంగా ఉన్న విషయాన్ని కాగ్ తప్పుబట్టింది. వివిధ పాఠశాలల్లో 14 నుంచి 39 శాతం వరకు సిబ్బంది కొరత ఉందని చెప్పింది.