హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 20 శాతం స్కూళ్లను చూస్తే.. వాటిలో సగం మంది విద్యార్థులు పదో తరగతిలో ఫెయిలయ్యారట. ఇంటర్‌లో 14 శాతం మంది పాస్ కాలేకపోయారు. ఈ విషయాన్ని కాగ్ ఎత్తిచూపింది. 2011 నుంచి 2015 వరకు పదోతరగతిలో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని .. దాదాపు 16 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదని, 232 స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం 25 కంటే తక్కువ ఉందని కాగ్ తెలిపింది. ఇక ఇంటర్ విషయానికి వస్తే, 10 కాలేజీలలో సున్నా శాతం ఫలితాలు, 48 కాలేజీల్లో 25 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత కనిపించాయి.
2009 నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్న రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకం అమలు విషయంలో రాష్ట్రంలో అనేక లోపాలు ఉన్నాయని కాగ్ చెప్పింది. ఈ పథకం కింద 2014-15 సంవత్సరానిఇక రూ. 348.47 కోట్ల నిధులు అందుబాటులో ఉంటే, ప్రభుత్వం కేవలం రూ. 218.67 కోట్లే ఖర్చుపెట్టిందని, దాదాపు రూ.130 కోట్లు నిరుపయోగంగా వదిలేశారని తెలిపింది. పాఠశాలల్లో టీచర్ల కొరత కూడా తీవ్రంగా ఉన్న విషయాన్ని కాగ్ తప్పుబట్టింది. వివిధ పాఠశాలల్లో 14 నుంచి 39 శాతం వరకు సిబ్బంది కొరత ఉందని చెప్పింది.
ఆ స్కూళ్లలో సగం మంది పదోతరగతిలో ఫెయిల్
Published Wed, Apr 13 2016 1:58 PM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM
Advertisement