Clean City
-
‘క్లీన్‌సిటీ’ల్లో విశాఖకు నాలుగో స్థానం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2023 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట పడింది. జాతీయ స్థాయిలో ఫైవ్‌స్టార్ రేటింగ్స్‌తో నాలుగు కార్పొరేషన్లు ‘క్లీన్‌సిటీ’ అవార్డులను సొంతం చేసుకుని దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా నిలిచింది. దేశంలో అత్యుత్తమ నగరాలుగా గ్రేటర్ విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగర పాలక సంస్థలు ఈ అవార్డులు దక్కించుకున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆలిండియా 4వ ర్యాంకు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు 6వ ర్యాంకు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు 8వ ర్యాంకు లభించగా.. హైదరాబాద్ తొమ్మిది, ఇండోర్ మొదటి స్థానంలో నిలిచాయి. అలాగే, ఫాస్ట్ మూవింగ్ సిటీ విభాగంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు 2వ ర్యాంకు లభించింది. ఇక సీఎం వైఎస్ జగన్ నియోజకవర్గమైన పులివెందులకు ‘క్లీన్ సిటీ ఆఫ్ ఏపీ’ అవార్డు లభించింది. స్వచ్ఛ భారత్ మిషన్ రూపొందించిన సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్, సర్టిఫికేషన్, సిటిజన్ వాయిస్‌కి సంబంధించి 9,500 మార్కులకు గాను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 8,879.25 మార్కులు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే చెత్తరహిత నగరాల్లో ఫైవ్‌స్టార్ రేటింగ్‌ను విశాఖ సాధించింది. మరోవైపు.. ♦ 2021, 2022, 2023 సంవత్సరాలలో గ్రేటర్ విశాఖ బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్, క్లీన్ బిగ్ సిటీ.. విజయవాడ కార్పొరేషన్ ఇండియా క్లీనెస్ట్ సిటీ, క్లీన్ స్టేట్ క్యాపిటల్ జాతీయ అవార్డులను వరుసగా సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాయి. ♦ఇక తిరుపతి నగరం బెస్ట్ స్మాల్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ (2021), సఫాయిమిత్ర సురక్షిత్ ప్రెసిడెంట్ అవార్డు (2022), జాతీయ అవార్డు (2023) దక్కించుకుంది. ♦ పుంగనూరు పురపాలక సంఘం 2021, 2022లో బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ అవార్డును, పులివెందుల 2022లో ఇన్నోవేషన్, బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు, 2023లో స్టేట్ అవార్డును దక్కించుకున్నాయి. పెరిగిన స్టార్ రేటింగ్ నగరాలు.. ఇదిలా ఉంటే.. గతేడాది కంటే ఈసారి ఎక్కువ నగరాలు స్టార్ రేటింగ్ ర్యాంకింగ్‌లో నిలిచాయి. గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్‌లో గతేడాది జీవీఎంసీ, తిరుపతికి మాత్రమే ఫైవ్‌స్టార్ రేటింగ్ వచ్చాయి. ఈసారి విజయవాడ, గుంటూరు, జీవీఎంసీ, తిరుపతి నగరాలూ ఈ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. వీటితోపాటు కర్నూలు, వైఎస్సార్ కడప 3 స్టార్ రేటింగ్‌లోను, బొబ్బిలి, పులివెందుల, రాజమండ్రి 1 స్టార్ రేటింగ్‌లోను నిలిచాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం.. ఢిల్లీలోని భారత్ మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను గురువారం ప్రదానం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హారి్థప్సింగ్ పూరీ చేతుల మీదుగా మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, అధికారులతో కలిసి మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ అవార్డులు అందుకున్నారు. పారిశుధ్యం విభాగంలో సర్వే, టెస్ట్ ప్రాక్టీస్, సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం జారీచేస్తుంది. దేశవ్యాప్తంగా నాలుగు వేల పట్టణ స్థానిక సంస్థలు పోటీపడగా ఏపీ టాప్–10లో నిలవడం విశేషం. అనంతరం.. ఏపీ భవన్లో విశాఖపట్నం మేయర్ గొలగాని వెంకటకుమారి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తిరుపతి మేయర్ శిరీష యాదవ్, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, అధికారులతో కలిసి మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ఆలోచనతోనే సాధ్యం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన విధానంతోనే దక్షిణ భారతదేశంలో ఏపీ టాప్–1గా నిలిచిందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమాన్ని వైఎస్ జగన్ రెండు కళ్లుగా చూశారని, అభివృద్ధి అనేది సమస్యగా కాకుండా ఒక అవకాశంగా తీర్చిదిద్దారన్నారు. ఒకటే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఏం జరుగుతుందో రాష్ట్ర విభజన ద్వారా అందరికీ అర్థమైందని చెప్పారు. ఆ పరిస్థితులు ఏపీలో పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి జిల్లాలకు ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటుచేసి ఆయా ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పిలుపులో భాగంగా మున్సిపల్ కారి్మకులు ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడం, తడి–పొడి చెత్తలను వేరుచేయడం, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను అత్యంత హుందాగా, శ్రద్ధగా చేసినట్లు చెప్పారు. మరోపక్క.. రోడ్లు, పారిశుధ్యం, డ్రెయినేజీలు, మొక్కలు నాటడం, జంక్షన్ల అభివృద్ధి వంటి వాటిని అభివృద్ధి చేయడంవల్లే ఇది సాధ్యమైందని మంత్రి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలు.. పట్టణాలు టాప్ ర్యాంకులు సాధించి అవార్డులు అందుకుంటాయని ఆదిమూలపు సురేష్ ధీమా వ్యక్తంచేశారు. -
100% క్లీన్‌సిటీగా హైదరాబాద్
గచ్చిబౌలి (హైదరాబాద్): వంద శాతం మురుగు నీటి శుద్ధి చేసిన నగరంగా కొద్ది నెలల్లోనే హైదరాబాద్ నిలవనుందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇలా దేశంలోనే మొదటి నగరంగా చరిత్రలో నిలిచిపోనుందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతోపాటు ఏడెనిమిది మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వంద శాతం మురుగునీటి శుద్ధీకరణకు రూ.3,866 కోట్ల నిధులను కేటాయించామన్నారు. 31 కొత్త ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్, మే నాటికి ఎస్టీపీల పనులు పూర్తవుతాయని, 100 శాతం మురుగునీటిని శుద్ధి చేసిన నగరంగా హైదరాబాద్ నిలవనుందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో రూ.263 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్తగూడ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ను కొత్త సంవత్సరం కానుకగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో జీవన ప్రమాణాలు పెంచి విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. వెయ్యి కోట్లతో నాలాల విస్తరణ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఎన్డీపీ)లో భాగంగా వెయ్యి కోట్లతో నాలాల విస్తరణ చేపడతామని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ విజన్‌తో దేశంలో ఏ నగరంలో జరగనంత మౌలిక వసతుల విస్తరణ హైదరాబాద్‌లో జరుగుతోందన్నారు. వేగంగా విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా ఎన్నో ప్రాజెక్ట్‌లు చేపడుతున్నామని, అందులో ముఖ్యమైనది స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) అని చెప్పారు. దీని ద్వారా చేపట్టిన 34 ప్రాజెక్ట్‌లను ఇప్పటికే ప్రారంభించామని, ఈ సంవత్సరంలో మరో 11 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తవారు ఇక్కడి అభివృద్ధిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, రెండు మూడేళ్లలో పెద్దఎత్తున మార్పులు వచ్చాయని సోషల్ మీడియాలో చెబుతుంటే సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత అభివృద్ధి–సంక్షేమం అనే ద్విముఖ లక్ష్యంతో విస్తృతమైన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. విద్య–ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇతర పట్టణాలు, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హైదరాబాద్‌కు వలస వస్తున్నారని, అందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు పనుల్ని వేగంగా పూర్తిచేస్తున్న ఇంజినీర్ల కృషిని గుర్తించిన కేటీఆర్ కొత్తగూడ ఫ్లై ఓవర్‌ను ఈ ప్రాజెక్టు పనులు పర్యవేక్షించిన జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) వెంకటరమణచే రిబ్బన్ కట్ చేయించడం విశేషం. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మేయర్ విజయ లక్ష్మీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు. -
క్లీన్ ఏలూరుకు ‘క్లాప్’
ఏలూరు టౌన్: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలం. వ్యక్తిగత, ఇల్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల నాని ప్రత్యేక శ్రద్ధతో ఏలూరు నగరాన్ని క్లీన్‌గా ఉంచేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లాప్ ప్రోగ్రామ్‌ను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటికీ మూడు రంగుల చెత్త డబ్బాలు పంపిణీ చేయగా, చెత్త సేకరణకు ప్రత్యేకంగా వాహనాలనూ ఏర్పాటు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ చెత్తసేకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెత్తసేకరణ చేస్తూ యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. 60 వాహనాలు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని 60 వేల గృహాల నుంచి చెత్తసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలో సుమారు 79 సచివాలయాల పరిధిలో 60 చెత్త సేకరణ వాహనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో చెత్త సేకరణ వాహనంలో డ్రైవర్, ఒక శానిటరీ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. కార్పొరేషన్ పాలక మండలి నగరంలోని గృహాలకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ప్రతి ఇంటికీ మూడు రంగుల డస్ట్‌బిన్స్ పంపిణీ చేసింది. ఒక బుట్టలో తడి చెత్త, మరో బుట్టలో పొడి చెత్త, ఇంకో బుట్టలో ప్రమాదకర వ్యర్థాలను వేరుచేసి చెత్త సేకరణ వాహనానికి అందించేలా ప్రణాళిక తయారు చేసి అమలు చేస్తున్నారు. యూజర్ చార్జీలు తప్పనిసరి స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న ఇంటింటా చెత్తసేకరణలో విధిగా యూజర్ చార్జీలు వసూలు చేయాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు పరిసరాల పరిశుభ్రతకు చెత్త సేకరణ చేస్తూనే ప్రజల నుంచి సేవా పన్ను వసూలు చేయాలని ఆదేశించింది. యూజర్ చార్జీలు వసూలు చేయని రాష్ట్రాలకు స్వచ్ఛ భారత్ నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది. దీంతో ఏలూరు నగరంలోనూ సేవా పన్ను వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పారదర్శక సేవలకు చార్జీలు ఏలూరు నగరంలో చెత్తసేకరణ సేవలకు చార్జీలు వసూలును అత్యంత పారదర్శకంగా వసూలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్లమ్ ఏరియాలో ఒక్కో ఇంటికి నెలకు రూ.60, సాధారణ ప్రాంతాల్లో రూ.100 వసూలు చేస్తుండగా, హాస్పిటల్స్, మాల్స్, పెద్దషాపులు, హోటల్స్, సినిమా థియేటర్లు, కమర్షియల్ ఇలా 3500 ప్రాంతాల్లో రోజువారీ చెత్త అధారంగా పన్ను వసూలు చేసేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఈ నెల నుంచీ ఈపాస్ మిషన్ల ద్వారా చార్జీలు వసూలు చేసేలా చర్యలు తీసుకున్నారు. నగదు, క్రెడిట్, డెబిట్, ఇతర విధానాల్లో చార్జీలు వసూలు చేయటంతోపాటు తప్పనిసరిగా రశీదు అందజేస్తారు. నగర ప్రజలు సహకరించాలి నగర ప్రజలు సహకరిస్తే రాబోయే కాలంలో క్లీన్ ఏలూరుగా చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. నగరంలో సుమారు 60 వేల ఇళ్ల నుంచి నిత్యం చెత్తను సేకరించేందుకు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి రోజూ ఒక్కో వ్యక్తి ద్వారా అరకేజీ చెత్త తయారవుతుందని ప్రభుత్వ అంచనా. యూజర్ చార్జీలను పారదర్శకంగా సేకరించేందుకు ఈపాస్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – షేక్ నూర్జహాన్, ఏలూరు నగర మేయర్ రోడ్లపై చెత్త, వ్యర్థాలు వేయకండి నగరాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. నగరంలోని ప్రజలు చెత్త సేకరణకు సిబ్బందికి సహకరించాలి. రోడ్లపైనా, డ్రెయినేజీల్లోనూ చెత్త, వ్యర్థాలు వేయవద్దు. చెత్త ఒక రోజు మర్చిపోయినా మరుసటి రోజు వరకు వ్యర్థాలను ఇంటివద్దనే ఉంచి చెత్త సేకరణ వాహనాలకు అందించాలి. ఇష్టారాజ్యంగా రోడ్లపై, డ్రెయినేజీల్లో వేయటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. – డి.చంద్రశేఖర్, ఏలూరు నగర కమిషనర్ -
హైదరాబాద్ ను క్లీన్ సిటీ గా చూడడమే ప్రభుత్వ లక్ష్యం మంత్రి కేటీఆర్
-
బెస్ట్ సిటీ ఇండోర్
న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా నాలుగో ఏడాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఎంపికైంది. ఆ తర్వాతి స్థానాల్లో సూరత్, నవీముంబై నిలిచాయి. అలాగే, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసి ‘ఉత్తమ గంగా పట్టణం’గా మొదటి స్థానంలో నిలిచింది. 100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీలో ఛత్తీస్‌గఢ్ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉన్నాయి . రాజధానిలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాలు–2020 వివరాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్సింగ్ పూరి వెల్లడించారు. దేశ రాజధానిలోని ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (రాజ్‌పథ్, ప్రముఖులుండే ల్యుటెన్స్ ప్రాంతం) పరిశుభ్రమైన రాజధాని నగరంగా ఎంపికయింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 97 గంగాతీర నగరాలతోపాటు, 1.87 కోట్ల మంది పౌరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. విజేతలకు ప్రధాని అభినందనలు స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వేలో మొదటి స్థానాల్లో నిలిచిన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగతా నగరాలు కూడా మెరుగైన పరిశుభ్రత కోసం కృషి చేయాలని కోరారు. దీంతో కోట్లాది మందికి లాభం కలుగుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్షకు పైగా జనాభా కలిగినవి) 1. ఇండోర్ 2. సూరత్ 3. నవీముంబై 4. విజయవాడ 5. అహ్మదాబాద్ అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్ష కంటే తక్కువ జనాభా ఉన్నవి) 1. కరాడ్ 2. సస్వద్ 3. లోనావాలా పరిశుభ్రమైన రాష్ట్రం(100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీ) 1. ఛత్తీస్‌గఢ్ 2. మహారాష్ట్ర 3. మధ్యప్రదేశ్ పరిశుభ్రమైన రాజధాని.. 1. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కంటోన్మెంట్లలో పరిశుభ్రమైనవి 1. జలంధర్ కంటోన్మెంట్ బోర్డ్ 2. ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్ 3. మీరట్ కంటోన్మెంట్ బోర్డ్ ► పౌరుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ ‘ఉత్తమ మెగా సిటీ’గా ఎంపికైంది. ► పౌరుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఉత్తమ కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్ ఎంపికైంది. ► ఇన్నోవేషన్, ఉత్తమ విధానాలు ఆచరిస్తున్న గుజరాత్ రాజధాని గాంధీనగర్ మొదటి ర్యాంకు సాధించింది. -
ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్చ సర్వేక్షణ ర్యాంకులు
-
దేశంలో అత్యంత పరిశుభ్ర నగరం ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్ నగరం వరుసగా నాలుగోసారి ముందువరుసలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన క్లీన్లినెస్ సర్వేలో ఇండోర్ టాప్ వన్ సిటీగా నిలిచింది. ఇదే రాష్ట్రానికి చెందిన భోపాల్ రెండో స్ధానంలో నిలవగా, గుజరాత్‌లోని రాజ్‌కోట్ రెండో క్వార్టర్లో(ఏప్రిల్-జూన్) ద్వితీయ స్ధానంలో నిలిచింది. ఇక ఇదే క్వార్టర్లో సూరత్ (గుజరాత్) మూడో స్ధానంలో, రెండో క్వార్టర్లో నవీ ముంబై (మహారాష్ట్ర)లు మూడో స్ధానం దక్కించుకున్నాయి. 10 లక్షల మంది కన్నా తక్కువ జనాభా కలిగిన నగరాల విభాగంలో జార్ఖండ్‌కు చెందిన జంషెడ్పూర్ తొలిస్ధానంలో నిలిచిందని క్లీన్లినెస్ సర్వే వెల్లడించింది. -
ఈ రోజు చెత్త పడలేదే!
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త ఇంటినుండి బయలుదేరి ఎటో వెళుతున్నారు. కొద్దిదూరం వెళ్ళిన తరువాత ఒక ఇంటిదగ్గర గోడపై నుండి ఊడ్చిన చెత్తాచెదారం పైన పడింది. ప్రవక్త మహనీయులు తల, వస్త్రాలు శుభ్రంగా దులుపుకొని తన దారిన తను వెళ్లిపోయారు. రెండవరోజు కూడా అదేవిధంగా ఊడ్చిన చెత్తమీద పడింది. ప్రవక్త ఆ మలినమంతా మళ్ళీ శుభ్రం చేసుకొని ముందుకు సాగిపోయారు. ప్రతిరోజూ ఇలానే జరిగేది.ఎవరో కావాలనే ప్రతిరోజూ చెత్తాచెదారం వేయడం, ప్రవక్త ఎవరినీ ఏమీ అనకుండానే ఓ చిరునవ్వు నవ్వి దులుపుకుని వెళ్ళిపోవడం ఇదే తంతు. ఏం జరిగిందో ఏమోగాని ఒకరోజు ప్రవక ్తమహనీయులు యధాప్రకారం అదే దారిన వెళ్ళారు. కాని ఆరోజు కసువు పడలేదు. ఆ రోజే కాదు, తరువాత రెండు రోజులు కూడా ఎలాంటి చెత్తాచెదారం పడలేదు. అలా రెండు మూడు రోజులుగా పడకపోయేసరికి చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. ఫలానా ఇంట్లో ఎవరూ లేరా? ఏదైనా ఊరెళ్ళారా? అని.ఆ ఇంట్లో ఒక ముసలమ్మ మాత్రమే ఉంటుందని, కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని వారు చెప్పారు. వెంటనే ప్రవక్త తను వెళుతున్న పని వాయిదా వేసుకొని, ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక వృద్ధురాలు తీవ్రజ్వరంతో బాధపడుతోంది. వైద్యం, తిండి తిప్పలు లేక ఆమె నీరసించి పోయింది.‘‘అమ్మా! ఎలా ఉన్నారు?’’ అని ఆప్యాయంగా పరామర్శించారు. మంచినీళ్ళు తాగించారు. అత్యవసర సేవలు అందించి సపర్యలు చేశారు. రోజూ వచ్చి, ఆమె కోలుకునే వరకూ కనిపెట్టుకుని ఉన్నారు. తనపట్ల ప్రవక్త ప్రవర్తిస్తున్న తీరుకు ఆ వృద్ధురాలు ఆశ్చర్యచకితురాలైంది. తను ఆయనని ఛీత్కరించినా, చెత్తాచెదారం పైన పోసి అవమానించినా, ఆ మహనీయుడు తనపై చూపిన దయకు, చేసిన మేలుకు ముగ్ధురాలైపోయింది. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందుతూ, ప్రవక్తకు ప్రియశిష్యురాలిగా మారిపోయింది. చెడుకు చెడు సమాధానం కాదు. చెడును మంచి ద్వారా నిర్మూలించడమంటే ఇదే..! – మదీహా -
ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ ఉత్తమం
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షన్–2018లో రాష్ట్రానికి 4 పురస్కారాలు లభించాయి. ఘన వ్యర్థాల నిర్వహణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ రాష్ట్ర రాజధాని నగరంగా హైదరాబాద్ ఎంపికైంది. దక్షిణాదిన అత్యంత పరిశుభ్ర నగరంగా సిద్దిపేటకు పురస్కారం దక్కింది. దేశంలోని 4,203 నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై సర్వే నిర్వహించి రూపొందించిన ‘స్వచ్ఛ సర్వేక్షన్–2018’ ర్యాంకులను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ పురి బుధవారం ఢిల్లీలో ప్రకటించారు. దేశంలో అత్యంత పరిశుభ్ర నగరంగా ఇండోర్ తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, భోపాల్, చండీగఢ్‌లు రెండు, మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. జాతీయ స్థాయిలో పలు అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న 23 నగరాలకు పురస్కారాలు ప్రకటించగా, ఘన వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ రాజధాని నగరం కేటగిరీలో హైదరాబాద్‌కు పురస్కారం వరించింది. లక్ష పైన జనాభా ఉన్న నగరాలు, రాజధాని నగరాలను జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపిక చేయగా, లక్ష లోపు జనాభా ఉన్న నగరాలకు ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, ఈశాన్య జోన్ల వారీగా కేంద్రం పురస్కారాలు ప్రకటించింది. దక్షిణ జోన్ పరిధిలో నాలుగు పట్టణాలకు పురస్కారాలు వరించగా, అందులో మూడు రాష్ట్రానికి సంబంధించినవే కావడం గమనార్హం. దక్షిణ జోన్ పరిధిలో అత్యంత పరిశుభ్ర నగరంగా సిద్దిపేట, పౌరుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం అత్యుత్తుమ సిటీగా బోడుప్పల్, ఆవిష్కరణలు, ఉత్తమ విధానాల అమల్లో ఉత్తమ నగరంగా పీర్జాదిగూడలు ఎంపికయ్యాయి. -
హెల్మెట్ ధరించండి: నటుడు
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఇల్లు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యం గా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే పరిసరాల పరిశుభ్రతతో నగరం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా రాజమహేంద్రవరం నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నెంబర్ వన్ చేయాలని నగర ప్రజలకు ప్రముఖ సినీ నటుడు ఆలీ పిలుపునిచ్చారు. గురువారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీని కోటిపల్లి బస్టాండ్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ డీలక్స్ సెంటర్, మెయిన్‌రోడ్, కోటగుమ్మం మీదుగా పుష్కరఘాట్ చేరుకుంది. ఈ ర్యాలీలో మేయర్ రజనీ శేషసాయి, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, కమిషనర్ విజయరామరాజు పాల్గొన్నారు. పుష్కరఘాట్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆలీ మాట్లాడుతూ.. అందరూ శుభ్రత పాటించాలన్నారు. ఇతర దేశాల్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తే జరిమానా వేస్తారన్నారు. ప్రతీ ఒక్కరూ తడిచెత్త, పొడిచెత్తలను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు. మేయర్ రజనీశేషసాయి మాట్లాడుతూ.. స్వచ్ఛ నగరాన్ని సాధించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించగలమన్నారు. హెల్మెట్ ధరించండి : ఆలీ ‘తల్లిదండ్రులు పిల్లలను చదివించాలి. అయితే మోటారుసైకిళ్లు కొనిచ్చి ప్రమాదాలకు ఆస్కారమివ్వకండి. వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి’ అని సినీ నటుడు ఆలీ పిలుపునిచ్చారు. ప్రమాదంలో ప్రాణాలు పోవడానికి నిమిషం చాలని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల్లో ప్రాణాలకు రక్షణ ఉంటుందని అన్నారు. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలకు హైస్పీడ్ మోటారు సైకిళ్లు కొనిచ్చి, ప్రమాదాలు కొని తెస్తున్నారన్నారు. కమిషనర్‌ను ఆకాశానికెత్తిన ఆలీ స్వచ్ఛ సర్వేక్షణ్ సభలో సినీ నటుడు ఆలీ ఎక్కువ సమయం కమిషనర్ విజయరామరాజును పొగిడేందుకే కేటాయించారు. పాలక మండలి ప్రస్తావన తేకుండా నగరంలో అభివృద్ధి అంతా కమిషనర్ ఒక్కరే చేసినట్లు చెప్పుకొచ్చారు. కమిషనర్‌ను సినీ హీరోలు మహేష్‌బాబు, పవన్ కళ్యాణ్‌లతో పోల్చి మాట్లాడారు. ఆలీ మాట్లాడిన సమయంలో సగం పైగా కమిషనర్‌ను పొగిడేందుకే వెచ్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. -
పరిశుద్ధ నగరం పగటి కలా?
విశ్లేషణ వరద నీరు బయటకు పోవడానికి ఉద్దేశించిన కాలువలను చెత్తతో నింపేసి, అది నీటి ప్రవాహాన్ని అడ్డగించినప్పుడు ప్రజలు, అందుకు కారణమైన తమను తప్పుపట్టుకోకుండా నగర పాలన సంస్థ వైపు వేలెత్తి చూపుతుంటారు. బహిరంగ ప్రదేశాలను చెత్త చేస్తున్నందుకు 14 లక్షల మందిని హెచ్చరించి, 5 లక్షలకంటే ఎక్కువ మందికి జరిమానాలు విధించి ఒక్క ఏడాదిలోనే రూ. 8.27 కోట్లను జరిమానాలుగా వసూలు చేశారంటే... ఆ నగరం చెత్తకు పూర్తి అతీ తంగా కాకపోయినా, మరింత పరిశుభ్రమైనదిగా ఉంటుందని అనుకోవడం సహజం. కానీ దేశంలోనే అతి పెద్ద, సుసంపన్న పట్టణ ప్రాంతమైన ముంబై విషయంలో అలా జరగలేదు. నగర పరిశుభ్రతపై అన్ని హెచ్చరికలను జారీ చేశాక గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు జరిమానాలు విధించడం మొదలెట్టాయి. నగర పాలక సంస్థ ఉద్యోగులు, ఔట్ సోర్స్డ్ ఉద్యోగులు యూనిఫారాలు ధరించి, రసీదు పుస్తకాలు పట్టుకుని నిర్లక్ష్యంగా నగరాన్ని చెత్త చేసే వారిపై కన్నేసి ఉంచుతున్నారు. ఆ నగర జనాభా 1.24 కోట్లు. పగటి వేళల్లో అంతకంటే గణనీయంగా ఎక్కువ జనాభాతో కిటకిటలాడిపోతుంటుంది. శివారు ప్రాంతాల నుంచి గుంపులు గుంపులుగా జనం పని చేయడం కోసం నిత్యం ముంబైకి వస్తుంటారు. శివారు ప్రాంతాలు నిజానికి సొంత స్థానిక పరిపాలనా సంస్థలు గల ఇతర నగరాలే. నగర పాలక సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన పథకాలలో ఎక్కడా కిక్కిరిసిన మురికివాడలు కానరావు. బ్రహ్మాండమైన ఈ నగరంలోని గొప్ప వైరుధ్యం ఇది. 300 మంది ఉపయోగించే ఒక్కో మరుగుదొడ్డి శుద్ధికి అతి కొద్దిగానే నీరు లభ్యం కావడం, చెత్త చెదారం వగైరాలను తరలించేవారు లేకపోవడం వంటివి ఈ మహా నగర పారిశుద్ధ్య సమస్యలకు అదనం. పారిశుద్ధ్య పరిరక్షకులు ఈ మురికివాడలను సందర్శించరు. జనం ఎక్కువగా తిరిగే స్టేషన్లలాంటి ప్రాంతాలకే వారు పరిమితమవుతారు. ప్రకాశవంతమైన, ఉజ్వలమైన ముంబై అనే భావనకు మురికివాడలు ఒక వైరుధ్యంగా నిలుస్తాయి. కార్యాలయాలుండే అద్దాల టవర్లు, నివాసాలుండే ఆకాÔ¶ హర్మ్యాలకు ఆనుకునే మురికివాడలుంటాయి. చెత్తకు నిలయంగా పేరు మోసిన నగరంలోని ఆ పది శాతం ప్రాంతంలోని మురికివాడలు నగర జనాభాలో సగానికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. నగర ప్రణాళికల నమూనాలలో ఎక్కడా వాటికి చోటుండదు. ముంబైని పరిశుభ్రమైన నగరమని అనలేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇది, మురికివాడల నుంచి చెత్తను తీసుకుపోవడం, అక్కడ నివసించేవారికి తాగునీటిని, దాదాపుగా పనికిరాకుండా ఉండే ఉమ్మడి మరుగుదొడ్లకు నీటిని అందించడానికి సంబంధించిన సమస్యలు నగర నిర్వాహకుల దృష్టికి సుదూరం నుంచైనా కానరావు. బిల్డర్ల దృష్టిలో మురికివాడలంటే అక్కడివారికి ప్రత్యామ్నాయ గృహవసతిని కల్పించి, బహిరంగ మార్కెట్ కోసం అదనపు నిర్మాణాలను నిర్మించి భారీ లాభాలతో జేబులు నింపుకునే రియల్ ఎస్టేట్ ఆస్తులు. అంతేగానీ జనావాసాలు మాత్రం కావు. దక్షిణ ముంబై, నగరంలోని అతి గొప్ప ప్రాంతం. వలస కాలం నాటి భవనాలు, వ్యాపార ప్రాంతాలు, సముద్ర తీరానికి అభిముఖంగా ఉండే ప్రాంతాలు, భారీ మైదానాలు అక్కడే ఉంటాయి. పారిశుద్ధ్య పరిరక్షకులు (క్లీన్ అప్ మార్షల్స్) విధుల్లో ఉన్నా అక్కడి బహిరంగ ప్రదేశాలు సైతం శుభ్రంగా ఉండవు. వీధిలో ఏమైనా పారేసినందుకు లేదా ఉమ్మినందుకు రూ. 200, మలమూత్ర విసర్జనకు రూ. 200, పెంపుడు కుక్క మలమూత్ర విసర్జన చేయడాన్ని అనుమతించినందుకు రూ. 500 జరిమానాలను విధిస్తున్నారు. సదరు పౌరులు వారితో వాదులాడినా చాలావరకు జరిమానాలను చెల్లిస్తున్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి, దుకాణాలను ఏర్పాటు చేసుకుని పాదచారులు వాటిని ఉపయోగించుకోనివ్వకుండా చేసే వీధుల్లోని చిన్నవ్యాపారులు ఇప్పుడు జాగ్రత్తగా తమ వ్యర్థాలను చెత్తబుట్టలో వేస్తున్నారు. కాబట్టి ఒకప్పటి కంటే నగరం ఇప్పుడు మరింత శుభ్రంగా ఉందని నగర పరిపాలనా విభాగం చెప్పుకోవచ్చు. కానీ అది, మొత్తంగా ఈ కథనంలోని ఒక భాగం మాత్రమే. ఇది నా ఇల్లు కాకపోతే చాలు, చెత్తా చెదారం పడేసి మురికిమయం చేయదగిన ప్రాంతమేననే ప్రజల వైఖరి ఈ కథనంలోని మరో భాగం. ఆసక్తికరంగా, ఈ జరిమానాల గురించిన అధికారిక గణాంక సమాచారంతో మీడియా నివేదిక వెలువడిన రోజునే మరో కథనం కూడా వెలువడింది. అది, నగరంలోని ప్రధానమైన కాలువలలో చెత్త పడేయడాన్ని నిరోధించడానికి వాటిపై పాలీకార్బనేట్ (దృఢమైన «థర్మో ప్లాస్టిక్) షీట్లను కప్పే పథకం గురించినది. ఈ కాలువలు నిజానికి వరద నీరు బయటకు పోవడానికి ఉద్దేశించినవి. కానీ అవి అతి పెద్ద చెత్త పడేసే స్థలాలుగా మారాయి. కాలువల్లో చెత్త పేరుకుపోయి, నీటి ప్రవాహాన్ని అడ్డగించినప్పుడు ప్రజలు... అందుకు కారకులైన తమను తప్పుపట్టుకోకుండా నగర ప్రభుత్వం వైపు వేలెత్తి చూపుతుంటారు. పౌరులు గొంతును శుభ్రపరచుకుని ఎక్కడబడితే అక్కడ ఊసే పరిస్థితి ఉన్నప్పుడు నిజంగానే పరిశుభ్రత కానరాదు. అలా ఊసేట ప్పుడు అది దారిన పోయేవారిపై పడకుండా ఉండటం అరుదు. ఇద్దరూ దీనికి ఎంతగా అలవాటు పడిపోయారంటే పాన్, తంబాకు నమిలేవారు ఆ పనిని... పారి శుద్ధ్య పరిరక్షకుల కంటపడితే తప్ప... సర్వసాధారణమనే భావిస్తుంటారు. పరిశుభ్రతను అలవాటుగా చేయడానికి బహుశా ఇప్పుడున్న దానికి వేల రెట్ల బలమైన భారీ బలగం అవసరం కావచ్చు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
క్లీన్‌సిటీకి సహకరించండి
వృత్తుల్లో మార్పులు వస్తున్నాయ్ పరిస్థితులకు తగ్గట్టుగా మారాలి మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కార్పొరేషన్ : కులవృత్తులు, చేతివృత్తుల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా ప్రతిఒక్కరూ మారాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పందుల పెంపకందార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎదుగుదల ఉండాలంటే చేసే వృత్తిని అసహ్యించుకోకుండా నూతన పద్ధతులను ఆకళింపు చేసుకోవాలని, కసి, పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని అన్నారు. దొంగతనం, మోసం లేకుండా చెమటోడ్చి చేసే ప్రతిపనిలోనూ సంతృప్తి ఉంటుందన్నారు. పందులు నగరంలో తిరగడం వల్ల జబ్బులు వస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి ఉందన్నారు. నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడానని, పందులు చంపడం పరిష్కారం కాదని, అందరితో మాట్లాడి పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే మొదటి అడుగువేశామన్నారు. స్థలం సేకరించి ప్రయోగాత్మకంగా ఫాంలు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక కొత్త పద్ధతిలో ముందుకు వెళితే ఫలితాలు వాటంతటవే వస్తాయని తెలిపారు. చేస్తరా..? చూస్తరా..? అనే అనుమానం తమలో కలుగకుండా చేతల్లో చూపించి ఆత్మ విశ్వాసం కల్గిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రజలు కోరుకునే దిశగా మనం నడవాలని, నగరంలో పందులు తిరగకుండా ఫాంలు ఏర్పాటుకు అన్ని సౌకర్యాలతో స్థలం కేటాయిస్తామన్నారు. ఉన్నత చదువులు చదివిన వారికి జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. పందులు, పేదరికం రెండింటికీ విముక్తి కావాలని అన్నారు. పంది మాంసాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా ఎదగాలని పిలుపునిచ్చారు. పందుల ఫాంలతో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ కులవృత్తిలో ఎంతమంది ఉన్నారు..? ఎవరికి ఏం అవసరం ఉంది..? అనే అంశాలపై చర్చిస్తున్నామని తెలిపారు. ఉపాధి బాటవైపు వెళ్లే వారికి రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పందిమాంసం అమ్ముకునేందుకు హైదరాబాద్ తరహాలో లైసెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా సొసైటీగా ఏర్పడాలని కోరారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కార్పొరేషన్ కమిషనర్ డి.కృష్ణబాస్కర్, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, నాయకులు కట్ల సతీష్, చొప్పరి వేణు, ఎరుకల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి, మాజీ కార్పొరేటర్ కుర్ర తిరుపతి, మున్సిపల్ అధికారులు, పందుల పెంపకందారులు పాల్గొన్నారు. -
మళ్లీ క్లీన్‌సిటీ..
- నడుం బిగించిన మహానగరపాలక సంస్థ - వరంగల్ పూర్వవైభవానికి సన్నాహాలు - నేడు సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి రాక - అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం - పటిష్ట కార్యాచరణతో ముందుకు.. 2012 అక్టోబర్ 10 నుంచి 17.. క్లీన్‌సిటీ చాంపియన్ షిప్.. దేశంలోనే ప్రప్రథమంగా వరంగల్ నగరంలో చేపట్టిన బృహత్తర కార్యక్రమం. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వెరసి ఆరు నెలల్లోనే సీన్ రివర్స్ అరుంది. ఈ క్రమంలో క్లీన్సిటీని మళ్లీ గాడిన పెట్టేందుకు మహా నగర పాలక సంస్థ నడుం బిగించింది. మసకబారిన ఓరుగల్లు క్లీన్‌సిటీ ప్రతిష్టను తిరిగి నిలబెట్టేందుకు రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, డెరైక్టర్ జనార్దన్‌రెడ్డి, బల్దియా కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బల్దియూ సిబ్బందికి దిశానిర్దేశం చేసేందుకు సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి ఆదివారం వరంగల్‌కు రానున్నారు. వరంగల్ అర్బన్ : క్లీన్సిటీపై వరంగల్ మహానగరపాలక సంస్థ మళ్లీ దృష్టి కేంద్రీకరించింది. సమైక్య రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని వరంగల్ నగరంలో 2012లో చేపట్టారు. 1.19 లక్షల ఇళ్లు, షాపుల నుంచి తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించారు. జిల్లా అధికారులు, సిబ్బందితోపాటు తెలంగాణ ప్రాంతంలోని మునిసిపాలిటీల నుంచి 150 బృందాలు 450 మంది ఉద్యోగులు విచ్చేసి కార్యక్రమంలో వారం రోజులపాటు పాల్గొన్నారు. అప్పటి కమిషనర్ వివేక్‌యాదవ్ ఈ బృహత్తర కార్యక్రమానికి నడుం బిగించగా... అవార్డుల మీద అవార్డులు వచ్చారు. దేశంలోని పలు నగరాలకు వరంగల్ రోల్‌మోడల్‌గా మారింది. కానీ.. పలు కారణాలతో ఈ కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోరుంది. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం.. రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో క్లీన్సిటీపై సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ దృష్టి కేంద్రీకరించారు. 2012లో... ట్రైసిటీ పరిధి చెత్తను సేకరించేందుకు 600 రూట్లను ఏర్పాటు చేశారు. ప్రతి రూట్‌కు తోపుడు బండి, ఒక మగ, మరో ఆడ కార్మికులను కేటాయించారు. ఇద్దరు కార్మికులు రోజు వారీగా 250 నుంచి 300 ఇళ్ల నుంచి తడి,పొడి చెత్తను సేకరించడం ప్రారంభించారు. చెత్త కుండీల రహిత నగరంగా మార్చేశారు. కార్మికులు సేకరించి తడి,పొడి చెత్తను తూకం వేయడం, పనితీరును పర్యవేక్షించడం కొనసాగింది. డ్రై వేస్ట్ సెంటర్‌కు పొడి చెత్తను తరలించడం, వేరు చేసి పలు సంస్థలకు విక్రయించారు. తడి చెత్తను మడికొండ డంపింగ్ యార్డుకు తరలించడం... అక్కడ ప్రత్యేక యంత్రం ద్వారా శుద్ధి చేశారు. కమిషనర్, నోడల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు క్షేత్ర స్థాయిలో నిత్యం సమన్వయంతో విధులు నిర్వర్తించారు. కార్మికులకు ప్రోత్సాహం, కాలనీ ప్రజలను బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆరు నెలల పాటు క్లిన్‌సిటీ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగింది. దీంతో కార్పొరేషన్‌కు ప్రశంస పత్రాలు, దేశ వ్యాప్త అవార్డులు వరించాయి. కొంత కాలం తర్వాత ప్రధాన రహదారుల్లో వ్యాపార,వాణిజ్య సంస్థల నుంచి పొడి చెత్తను సేకరించడంలో సిబ్బంది వెనుకబడిపోయారు. ఇంటింటా ఉదయం 6 గంటల నుంచి చెత్త సేకరణ కార్యక్రమం కొనసాగింది. దుకాణాలు ఉదయం 10 నుంచి 11 గంటలకు తెరవడం వల్ల సకాలంలో షాపుల నుంచి చెత్తను సేకరించకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనిమిచ్చింది. ఈ క్రమంలో అప్పటి కమిషనర్ వివేక్‌యాదవ్ 150 చెత్త కుండీలను తెప్పించి, ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేయించారు. అనంతరం కమిషనర్ వివేక్‌యాదవ్ బదిలీ బాట పట్టారు. తదుపరి కమిషనర్ సువర్ణపండాదాస్ బాధ్యతలు స్వీకరించారు. తడి, పొడి చెత్త సేకరణపై అప్పటి కమిషనర్ దృష్టి కేంద్రకరించకపోవడంతోపాటు మొత్తం చెత్తను డంప్ యార్డుకు తరలించాలని ఆదేశించారు.విద్యుత్ తయారీ చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పారిశుద్ద్య కార్మికులు తడి,పొడి చెత్తను కలిపి ఇంటింటా సేకరించడం తోపుడుబండ్ల ద్వారా వాహనాలకు చేర్చడం, అక్కడి నుంచి డంపింగ్ యార్డులోకి చేరడం ప్రారంభమైంది. దీంతో యార్డులో చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోరుుంది. దీంతో క్లీన్‌సిటీ కార్యక్రమం పూర్తిస్థారుులో అటకెక్కింది. గత తప్పిదాలు, లోటుపాట్ల నేపథ్యంలో క్లీన్సిటీలో ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలు... రూట్ల విభజన 2012లో 600 రూట్లలో ఇంటింటా తడి,పొడి చెత్త సేకరించారు. ప్రస్తుతం విస్తరించిన నగరంలో మరి న్ని రూట్లు విభజించి సిబ్బందికి కేటారుుంచాలి. క్షేత్రస్థారుులో పర్యవేక్షణకు అధికారులను నియమించాలి. తడి, పొడి చెత్త.. ఇంట్లో వెలువడిన వ్యర్థాలను తడి, పొడి చెత్త రూపంలో వేర్వేరుగా వేసేలా నగర ప్రజల్లో పూర్తిస్థారుులో అవగాహన కల్పించాలి. తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు, పొడి చెత్తను రీ సైక్లింగ్ చేయడం ద్వారా ఆదాయం వస్తుందని, ఈ మేరకు సహకరించేలా ప్రజల్లో చైతన్యం తేవాలి. పొడి చెత్తను ఏ రోజుకు ఆ రోజు విక్రయించేలా ఏర్పాట్లు చేయాలి. మార్కెట్ల నుంచి వెలువడిన వ్యర్థాలను బయోగ్యాస్ ఆధారిత ప్లాంట్లకు ఎప్పటికప్పుడు తరలించేలా పటిష్ట ఏర్పాటు చేయూలి. సేకరణ, నిర్వహణ కీలకం... పారిశుద్ధ్యం విషయంలో చెత్త సేకరణ, నిర్వహణ కీలకాంశాలు. ఇందుకోసం మహా నగర పాలక సంస్థ ఏటా కోట్లాది రూపాయాలు వెచ్చిస్తున్నప్పటికీ... పరిస్థితిలో ఆశించిన మార్పులు రావడం లేదు. నగర పరిధిలోని ప్రతి ప్రాంతానికి.. నిర్ధిష్ట సమయంలో తోపుడు బండ్లు, ట్రాలీలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. సమన్వయం.. ప్రోత్సాహకం.. పర్యవేక్షణ కమిషనర్, నోడల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు క్షేత్ర స్థాయిలో నిత్యం సమన్వయంతో పనిచేయూలి. కార్మికులకు ప్రోత్సాహకాలు అందించి వారిలో ఉత్తేజం నింపాలి. అదేవిధంగా అధికారులు నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. వాహనాలపై నిఘా పెట్టాలి.. కాజీపేట, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల నుంచి రోజూ చెత్తను తరలించడానికి సరిపడా వాహనాలున్నాయి. ట్రాక్టర్లు, డంపర్ ప్లేసర్లు, ఆటోలు, క్యాంపాక్టర్లులు మొత్తంగా 70 వరకు ఉన్నాయి. వీటిని సరైన పద్ధతిలో నడిపించే వారు లేరు. వాహనాల పని తీరుపై నిఘా లేదు. ఇంటర్నెట్ ద్వారా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అమల్లో ఉన్నప్పటికీ.. దీన్ని పరిగణనలోకి తీసుకుంటలేరు. కాంట్రాక్టు డ్రైవర్లు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల నడుమ సమన్వయం కొరవడడంతో ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ మేరకు గాడినపెట్టాలి. వాహనాలపై నిఘా ఉంచాలి. ఖాళీపోస్టులు భర్తీ చేయాలి.. క్లీన్‌సిటీ సక్రమ నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ ఉండాలంటే ఉద్యోగులు, అధికారుల కొరత లేకుండా చూడాలి. ప్రస్తుతం మహా వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో క్షేత్ర స్థాయి ఉద్యోగుల కొరత వేధిస్తోంది. పదోన్నతులపై ఏఈలు, టీపీఎస్‌లు, టీపీబీఓలు బదిలీపై వెళ్తున్నారు. వీరి స్థానంలో కొత్త వారు రాకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగింది. రోజురోజుకూ విస్తరిస్తున్న కొత్త కాలనీలతో క్షేత్ర స్థాయి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. జీఓ ఎంఎస్ నెంబర్ 151 ప్రకారం కార్పొరేషన్‌కు 103 పోస్టుల భర్తీ ప్రక్రియ నాలుగేళ్లలో జరగాలి. కానీ.. కేవలం పది నుంచి పదిహేను మంది అధికారులు, ఉద్యోగుల పోస్టుల మంజూరయ్యాయి. అంత్యంత కీలకమైన సీటి ప్లానర్, ఎంహెచ్ఓ, ఆరోగ్యశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు క్షేత్ర స్థాయి ఉద్యోగులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేయూలి. ప్రజలను భాగస్వాములను చేయాలి.. బృహత్తర కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ఇళ్లల్లో వెలువడిన తడి,పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలి. రోజు చెత్త అందించే బాధ్యతను కట్టబెట్టాలి. లేనిపక్షంలో జరిమానాలు విధించాలి. పారిశుద్ధ్య సిబ్బంది రోజు గడపగడపనూ తట్టాలి. కాలనీ వారీగా క్లీన్‌సిటీ కమిటీలను ఏర్పాటు చేయాలి. వారికే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలి. అప్పడే ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టిసారించాలి... సేంద్రియ ఎరువు తయారీకి మడికొండ డంప్‌యార్డులో సూమారు రూ.40లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా షెడ్లను నిర్మించారు. తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డులో ప్రత్యేక మిషన్ ద్వారా జల్లెడ పట్టినప్పటికీ సేంద్రియ ఎరువు తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఈ మేరకు వీటిపై దృష్టిసారించాలి. తడి చెత్తతో సేంద్రియ ఎరువును విరివిగా తయారు చేసి సరసమైన ధరకు విక్రరుుంచాలి. బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ అందుబాటులోకి తేవాలి... చెత్త ప్రక్షాళన నిబంధనావళిలో భాగంగా హన్మకొండలో చిల్డ్రన్ పార్కులో బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్లాంట్ విజయవంతంగా కొనసాగుతోంది. బాలసముద్రంలోని కూరగాయల మార్కెట్ నుంచి వ్యర్థాలు తీసుకెళ్లి, ఎర్రల సహాయంతో సేంద్రియ ఎరువు తయారు చేసి బయోగ్యాస్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. బల్దియా ప్రధాన కార్యాలయం అవరణలో బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినా.. అందుబాటులోకి రాలేదు. దీన్ని అందుబాటులోకి తెస్తే కొంతమేరనైనా విద్యుత్ సమస్య తీరుతుంది. -
బస్తీల బాగుకు ‘బాధ్యులు’
- 330 మందికి బాధ్యతలు - సీఎం, మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు సైతం.. - పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పనే ధ్యేయం సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని బస్తీలను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రజలకవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సీఎం ఆలోచన మేరకు బస్తీల రూపురేఖలు మారేలా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు జీహెచ్ఎంసీలోని 330 డివిజన్లకు ప్రత్యేక బాధ్యులను నియమించనున్నారు. ఈ బాధ్యుల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో పాటు ఆయన మంత్రి మండలి సభ్యులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్ఎస్లు, ఇతరత్రా సివిల్‌సర్వీస్ అధికారులుండనున్నారు. తాము బాధ్యత వహించే డివిజన్లో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక సౌకర్యాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా మహిళలకు ఎక్కువ భాగస్వామ్యం కల్పిస్తారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే 330 డివిజన్ల ముసాయిదాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూళ్లు చేసే బిల్కలెక్టర్ల పరిధిలోకి వచ్చే ప్రాంతాల వారీగా ఈ 330 డివిజన్లు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఒక్కో డివిజన్‌కు ఒక్కో మంత్రి/ ఉన్నతాధికారి బాధ్యత వహించనున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సమన్వయ బాధ్యతలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ విస్తీర్ణం 625 చ.కి.మీలు కాగా ఒక్కో అధికారి దాదాపు 2 చ.కి.మీల పరిధిలో పారిశుధ్యం, పరిశుభ్రత, పచ్చదనం పెంపు వంటి చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించి నగరాన్ని క్లీన్ సిటీగా మార్చనున్నారు. ఒక్కో అధికారి పరిధిలో దాదాపు 4 వేల ఇళ్ల వరకు ఉండే వీలుంది. సంబంధిత డివిజన్లోని కాలనీసంఘాలు, అసోసియేషన్ల నాయకులతోనూ తరచూ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. జీహెచ్ఎంసీకి చెందిన సంబంధిత అధికారులతోనూ సమీక్షలు నిర్వహించి చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరిస్తారు. ప్రగతినగర్ తరహాలో కాలనీలు, బస్తీలను తీర్చిదిద్దేందుకు ఇక మంత్రులు, అధికారులు తమవంతు బాధ్యతగా ఈ పనులు నిర్వహించనున్నారు. త్వరలోనే ఏయే డివిజన్‌కు ఎవరెవరు బాధ్యత వహిస్తారో ప్రకటించనున్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 150 కార్పొరేటర్ల డివిజన్లున్నాయి. 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నగరాన్ని ఎలా విభజించాలా అనేదానిపై గందరగోళం, సందేహాల్లేకుండా ఉండేందుకు ఒక్కో బిల్ కలెక్టర్ పరిధిలోకి వచ్చే ప్రదేశాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి 330 డివిజన్లతో ముసాయిదా రూపొందించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ 330 ప్రాంతాలకు 330 మంది బిల్కలెక్టర్లు, 330 మంది నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. అదే తరహాలో 330 మంది మంత్రులు/ ఉన్నతాధికారులు తమ బాధ్యతలు నిర్వహించనున్నారు. వీటిని 330 డాకెట్లుగా పరిగణిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో డాకెట్ బాధ్యతలప్పగిస్తారు. అవసరాన్ని బట్టి కొందరికి రెండు, మూడు డాకెట్లు అప్పగించే అవకాశాలున్నాయి. -
క్లీన్ సిటీని పరిశీలించిన ట్రెయినీ కలెక్టర్
కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వరంగల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న క్లీన్ సిటీ కార్యక్రమాన్ని ట్రెయినీ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ, రవాణా విధానంతో పాటు హన్మకొండలోని బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్రాజెక్టు, సేంద్రియ ఎరువు తయారీ విధానం, డ్రై రిసోర్స సెంటర్‌ను సందర్శించారు. ఇందులో భాగంగా వ్యర్థాలతో బయోగ్యాస్ విద్యుత్, సేంద్రియ ఎరువు తయారీ వివరాలను ఎంహెచ్ఓ ధన్‌రాజ్.. ట్రెయినీ కలెక్టర్‌కు వివరించారు. ఆ తర్వాత మడికొండలోని కాకతీయ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కు(డంపింగ్ యార్డు)ను కూడా పరిశీలించిన ఆయన శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల విధులను అడిగి తెలుసుకున్నారు.