cm relative
-
సీఎం బంధువునంటూ బెదిరింపులు
పొందూరు: బిల్డింగ్ కూల్చివేత విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, అతని తనయుడు తమ్మినేని చిరంజీవినాగ్‌తో పాటు ఇతరుల గురించి బెదిరింపు ధోరణిలో మాట్లాడిన వైఎస్సార్ కడప జిల్లా ప్రాద్దుటూరు మండలం తాలమాల్పురం గ్రామానికి చెందిన అన్నెపురెడ్డి చిన్న వెంకటసుబ్బారెడ్డిపై శ్రీకాకుళం జిల్లా పొందూరులో కేసు నమోదైంది. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వాసుదేవరావు అనే వ్యక్తిపై కూడా దురుసుగా ప్రవర్తించాడని కూడా సుబ్బారెడ్డిపై ఫిర్యాదు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాను సీఎం బంధువునని, సీఎంఓ ఆఫీసులో ఉంటానని, బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించి విచారణకు వచ్చానంటూ కొన్ని ఆడియో క్లిప్పింగులను వినిపించి మీ స్పీకర్ సంగతి, మీ నానిబాబు (చిరంజీవినాగ్) సంగతి చూస్తానంటూ సుబ్బారెడ్డి బెదిరించాడు. అలాగే.. ‘ఆర్డీఓ, ఈఓలతోను మాట్లాడాను, వారి ఉద్యోగాలు తీయిస్తా.. జైలు పాలవుతావు’ అని వాసుదేవరావును భయపెట్టాడు. దీంతో వాసుదేవరావు సీఎంఓ ఆఫీసుకు ఫోన్‌చేయగా అక్కడ అలాంటి వారెవరూ లేరని తేలింది. అనంతరం వాసుదేవరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఐపీసీ 448, 418, 506 సెక్షన్ల కింద సుబ్బారెడ్డిపై కేసులు నమోదు చేశారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా.. శ్రీకాకుళంలో రూం అద్దెకు తీసుకుని అక్కడే భూదందాలు, ఉద్యోగాలిప్పిస్తానంటూ డబ్బులు వసూలుచేస్తున్నట్లు తేలింది. దీంతో అతనికి 41ఏ నోటీసు ఇచ్చి పంపించామని ఎస్ఐ ఎస్. లక్ష్మణరావు చెప్పారు. -
వసూళ్ల దందా..!
స్విమ్స్ పాలన గాడి తప్పిందని చెప్పే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. మొన్నటికి మొన్న స్విమ్స్‌లో జర్నలిస్టులపై దాడి, ఆ తర్వాత టీటీడీ అంబులెన్స్ డ్రైవర్‌కు వైద్యం నిరాకరణ, ఆరోగ్యశ్రీ అమలులో అవినీతి, ఇప్పుడేమో స్విమ్స్ ఉద్యోగులు, వైద్యుల నుంచి అక్రమ వసూళ్లకు లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేయడం సీఎం బంధువు కీలకమైన పదవిలో కూర్చుని అక్రమాలకు తెర తీశారన్న ఆరోపణలకు ఈ సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. సాక్షి, తిరుపతి: స్విమ్స్ అధికారులు సిల్వర్ జూబ్లీ పేరుతో నేరుగా వసూళ్ల దందాకు దిగారు. స్విమ్స్ సిల్వర్ జూబ్లీ ఆర్చ్(స్వాగత తోరణం) ఏర్పాటుకు రెగ్యులర్ ఉద్యోగుల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే విరాళాలకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం గమనార్హం. ఉద్యోగులు నేరుగాగాని, వేతనం నుంచి అయినా అందించవచ్చని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొనడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పటికే ఈ దందాను అధిక శాతం మంది వైద్యులు తిరస్కరించారు. వారం రోజులు గా ఈ తంతు స్విమ్స్‌లో గుట్టుగా సాగుతోంది. సిల్వర్ జూబ్లీ వసూళ్లు.. స్విమ్స్ ఆస్పత్రి 1993 ఫిబ్రవరి 26న ప్రారంభమైంది. ఇప్పుడు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు సమీప బంధువుగా చలామణి అవుతూ స్విమ్స్‌లో కీలక పదవిలో ఉన్న వ్యక్తి చక్రం తిప్పుతూ స్విమ్స్ పరువు తీస్తున్నారని చెప్పడానికి నిదర్శనమే ఈ వసూళ్లు. సిల్వర్ జూబ్లీ ఆర్చ్ ఏర్పాటుకు స్విమ్స్‌లోని 600 మంది రెగ్యులర్ ఉద్యోగుల నుంచి నగదును సమకూర్చాలని సీఎం సమీప బంధువు ఉన్నతాధికారులకు సూచించి నట్లు çసమాచారం. ఆయన సూచించడమే తడువుగా వారం రోజుల క్రితం స్విమ్స్‌లోని అన్ని విభా గాలకు సర్క్యులర్ జారీ చేశారు. విరాళం ఇవ్వడానికి ఇష్టమైతే ఒక రోజు, రెండు రోజుల వేతనం, అంతకంటే ఎక్కువే ఇవ్వచ్చని ఉత్తర్వుల్లో సూచిం చారు. నగదును నేరుగా అధికారులకు అందజేసే వెసులుబాటును కూడా కల్పించారు. వసూళ్ల దందాతో ఉద్యోగులు బిత్తరపోతున్నారు. అధికా రులు జారీ చేసిన సర్క్యులర్‌లో ఆర్చ్ ఎస్టిమేషన్ చూపకపోవడం కొసమెరుపు. అయితే ఈ వసూళ్ల దందాను సగానికి పైగా వైద్యులు తిరస్కరిం చారు. కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల్లోని వైద్యులు పూర్తిగా దీన్ని వ్యతిరేకించి నట్లు సమాచారం. టీటీడీ తలచుకుంటే... స్విమ్స్ సిల్వర్ జూబ్లీ ఆర్చ్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు టీటీడీకి రిక్విజేషన్ లెటర్ పెట్టుకుంటే చాలు ఆర్చ్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. అయితే స్విమ్స్‌లో కీలక పదవిలో ఉన్న సీఎం బంధువు ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించడం వల్లే వసూళ్ల దందాకు తెరతీశారు. ఇప్పటికే దీనిపై స్విమ్స్ ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. స్విమ్స్ పరువును బజారుపాలు చేసే ఇటువంటి నిర్ణయాలపై ఉన్నతాధికారులు పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్విమ్స్ ఉద్యోగులు చెబుతున్నారు. వసూళ్లపై సాక్షి అధికారులను వివరణ అడిగే ప్రయత్నం చేయగా వారు అందుబాటులోకి రాలేదు. -
సీఎం బంధువును దారుణంగా చంపేశారు
చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సమీప బంధువును అతని స్నేహితులు దారుణంగా చంపారు. బీఎండబ్ల్యూ కారును ఆయనపై మూడుసార్లు తొక్కించడంతో తీవ్రంగా గాయపడి మరణించాడు. చండీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్‌కు మేనల్లుడు ఆకాంశ్ సింగ్ (28) బుధవారం అర్ధరాత్రి లేట్ నైట్ పార్టీలో పాల్గొన్నాడు. గురువారం తెల్లవారుజామున పార్టీలో వారు గొడవపడ్డారు. ఇద్దరు స్నేహితులు.. ఆకాంశ్‌ను కొట్టి, ఆయనపై కారును మూడుసార్లు పోనిచ్చారు. బీఎండబ్ల్యూ కారును ఆకాంశ్‌ను 50 మీటర్ల దూరం లాక్కెళ్లింది. రక్తపుమడుగులో పడిఉన్న ఆకాంశ్‌ను అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. కాగా తీవ్రంగా గాయపడ్డ ఆకాంశ్‌ను చాలా ఆలస్యంగా గుర్తించారు. శుక్రవారం చండీగఢ్‌లోని ఆస్పత్రిలో తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. నిందితులను హర్మితాబ్ సింగ్ ఫరీద్, బలరాజ్ సింగ్ రంధావాలుగా గుర్తించారు. వీరిద్దరిపై హత్యకేసు నమోదు చేశామని, పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. పోలీసుల విచారణ తీరుపై వీరభద్ర సింగ్ కుటుంబ సభ్యులు విమర్శించారు. హత్య జరిగిన 24 గంటలు దాటినా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదని వీరభద్ర సింగ్ కొడుకు విక్రమాదిత్య సింగ్ అన్నారు. వీరభద్ర సింగ్ మాట్లాడుతూ.. తాను పంజాబ్ గవర్నర్‌తో మాట్లాడానని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరానని, నిందితులు దేశం విడిచి పారిపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని చండీగఢ్ వచ్చారు.