Coal Department
-
సింగరేణి గని చూసొద్దామా?
గోదావరిఖని: మీరెన్నడూ బొగ్గుగని చూడలేదా..? మరి ఇప్పుడు కుటుంబంతో సహా చూడాలనుకుంటున్నారా? అయితే.. సింగరేణిలో భూగర్భగని టూరిజం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు.. సౌకర్యాల కల్పనపై కేంద్ర బొగ్గుగనుల శాఖ ఆదేశాల మేరకు సింగరేణి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలో సింగరేణి కూడా ఓ పర్యాటక ప్రాంతంగా మారబోతోంది. ఇందులో భాగంగా ఇటీవలే మూసివేసిన జీడీకే–7ఎల్ఈపీ గనిని దీనికోసం ఎంపిక చేయాలని సింగరేణి యాజమాన్యం భావిస్తోంది. ఈ మేరకు గనిలో చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించాలని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించా రు. ఇప్పటికే కోలిండియాలో ఇలాంటివి రెండు గనులు ఉండగా.. సింగరేణిలోనూ ఏర్పాటు చేయబోతున్నారు. సాంకేతిక కమిటీ పరిశీలించి గనిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఎలాంటి సదుపాయాలు కల్పించాలి. రక్షణపరంగా సమస్యలేమిటి?.. ఇలా అనేక కోణా ల్లో పరిశీలించి నివేదిక అందిస్తుంది. 12 దశాబ్దాల చరిత్ర ఉన్న సింగరేణిలో ఎన్నో భూగర్భగనులు, ఓసీపీలను యాజమాన్యం మూసివేసింది. కానీ టూరిజం స్పాట్లుగా ఎక్కడా అభివృద్ధి చేయలేదు. గనిని పరిశీలించిన సాంకేతిక బృందం గోదావరిఖని పట్టణం సమీపంలోనే ఉన్న ఆర్జీ– 2 ఏరియా జీడీకే– 7ఎల్ఈపీ గనిని గురువారం సాంకేతిక కమిటీ పరిశీలించింది. ముందుగా మేనేజర్ కార్యాలయంలో గనికి సంబంధించిన మ్యాప్‌ను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ బృందంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జీఎం సుభాని, సేఫ్టీ జీఎం గురువయ్య, జీఎం సీపీపీ నాగభూషణ్‌రెడ్డి, ఎన్విరాన్మెంట్ జీఎం కొండయ్య, సివిల్జీఎం రమేశ్‌బాబు ఉన్నారు. అదృష్టమే.. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు రావడంతో సంస్థ సీఎండీ, ఇటీవలే మూసివేసిన గనిని ఎంపిక చేసి టెక్నికల్ కమిటీని అధ్యయనానికి పంపడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతం టూరిజంలో అభివృద్ధి చెందుతుంది. సింగరేణి గనులను కుటుంబంతో సహా చూసే అవకాశం ప్రజలకు దక్కుతుంది. – సుభాని, ఆర్అండ్డీ జీఎం టీం కన్వీనర్ -
ఎవరినీ ఒత్తిడి చేయలేదు
హిందాల్కోకు బొగ్గుబ్లాకు కేటాయింపుపై మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వెల్లడి కుమార మంగళం బిర్లా లేఖను కేవలం పరిశీలనకోసమే బొగ్గుశాఖకు పంపా న్యూఢిల్లీ : ఒడిశాలోని తలబిరా-2 బొగ్గుబ్లాకును హిందాల్కో కంపెనీకి కట్టబెట్టడానికి తాను ఎవరిపైనా ఒత్తిడి తీసుకురాలేదని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ బొగ్గు స్కాంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐకి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి తొందరపాటూ లేదని స్పష్టంచేశారు. హిందాల్కోకు గని కేటాయింపుపై పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లాకు తాను ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. 2005లో మన్మోహన్ బొగ్గు శాఖనూ నిర్వహించడం తెలిసిందే. అయితే ఈ గని కేటాంచాలని కోరుతూ బిర్లా రాసిన లేఖను, ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్ రాసిన లేఖను ‘శ్రద్ధగా పరిశీలించాలి’ అని మాత్రమే బొగ్గు శాఖ అధికారులకు పంపానని ఆయన తెలిపారు. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శి ఇలాంటి వాటిని పంపడం పరిపాటేనని, పరిపాలనలో ఇది సాధారణంగా జరిగేదేనన్నారు. ఇలాంటివాటిని ప్రధాని స్థాయివ్యక్తి పెద్దగా పట్టించుకోరని తెలిపారు. ఈ విషయంలో రిమైండర్లు పంపాల్సిందిగా తానెవరికీ చెప్పినట్లు గుర్తులేదన్నారు. హిందాల్కోకు గనిని కేటాయించాలని బొగ్గుశాఖ చేసిన సిఫారసులను తాను ఆమోదించానని తెలిపారు. ఈ స్కాం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మన్మోహన్‌కు నిందితునిగా సమన్లు జారీ చేయడం తెలిసిందే. ఈ మేరకు ఆయన శుక్రవారం సీబీఐకి లిఖితపూర్వకంగా వివరాలు వెల్లడించారు. 25వ స్క్రీనింగ్ కమిటీ మినిట్స్‌కు ఆమోదం తెలపాల్సిందిగా బొగ్గు కార్యదర్శికి తాను ఫైలు పంపిన విషయం తనకు తెలుసన్నారు. బిర్లా లేఖను, నివేదిక రూపొందించాల్సిందిగా సూచిస్తూ సాధారణ పరిశీలనకే బొగ్గుశాఖకు పంపానని, ఈ విషయంలో ఆయనకు హామీ ఇవ్వలేదన్నారు. కాగా, మన్మోహన్‌తో పాటు బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్.. మరికొందరికి ప్రత్యేకకోర్టు జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు ఏప్రిల్ 1న స్టే జారీ చేసింది. తొలుత హిందాల్కోకు కేటాయింపులను నిరాకరించి, తర్వాత కేటాయించడం వివాదాస్పదమైంది. ప్రభుత్వరంగ సంస్థకు ఇవ్వాల్సిన బొగ్గుబ్లాకును బిర్లా కంపెనీకి కట్టబెట్టడంపై ఆరోపణలు వచ్చాయి. తమ సంస్థకు బొగ్గుబ్లాకును కేటాయించకూడదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా కోరుతూ బిర్లా లేఖలు రాశారు. ఒడిశా సీఎం పట్నాయక్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ లేఖరాశారు. -
హిందాల్కో, జిందాల్ పవర్‌కు బొగ్గు బ్లాకులు
-
హిందాల్కో, జిందాల్ పవర్‌కు బొగ్గు బ్లాకులు
న్యూఢిల్లీ: బొగ్గు గనుల వేలంలో గురువారం జిందాల్ పవర్ రెండు, ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ ఒకటి చొప్పున బ్లాకులను దక్కించుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో గనులకు జిందాల్ పవర్ రూ. 1,679 కోట్లు, గెరె పామా బ్లాకు కోసం హిందాల్కో రూ. 14,858.9 కోట్లు వెచ్చించనున్నట్లు బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్.. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. గెరె పామా 4/5 బ్లాకులో 42.43 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. టన్నుకు రూ. 3,502 మేర బిడ్డింగ్ చేసి హిందాల్కో దీన్ని దక్కించుకున్నట్లు అనిల్ స్వరూప్ పేర్కొన్నారు. ఈ బ్లాకు కోసం దాదాపు 12 గంటల పాటు సాగిన బిడ్డింగ్‌లో హిందాల్కోతో పాటు అంబుజా సిమెంట్స్, బాల్కో, హిందాల్కో తదితర సంస్థలు పోటీపడ్డాయి. ప్రభుత్వం మొదటి విడతగా 19 బొగ్గు బ్లాకులు వేలానికి ఉంచగా ఇప్పటిదాకా 15 బ్లాకులను కంపెనీలు దక్కించుకున్నాయి. బిఛర్పూర్ గనికి బిడ్డింగ్ కొనసాగుతోంది. తొలి విడత ఫిబ్రవరి 22న ముగియనుంది. జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ, రిలయన్స్ సిమెంట్, సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్, జైప్రకాష్ అసోసియేట్స్, బాల్కొ తదితర సంస్థలు బొగ్గు గనులను దక్కించుకున్నాయి. బొగ్గు బ్లాకుల వేలం ద్వారా ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రూ. 50,000 కోట్ల పైచిలుకు ఆదాయం రాగలదని అంచనా.