cogress party
-
ఈ బడ్జెట్‌తో కాంగ్రెస్ మోసం బయటపడింది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ట్రానికి ఆ పార్టీ చేసిన మోసం బయటపడిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే.. కాంగ్రెస్‌ది అంకెలతో పాటు మాటల గారడీ సర్కార్ అని విమర్శించారు. ‘‘మొత్తంగా ఈ బడ్జెట్.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా తప్పించుకునేలా కనబడుతోంది. ఇది తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన దారుణ మోసం’’అని మండిపడ్డారు. బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలను చూస్తే.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చి న గ్యారంటీ.. ఇక అమలు కానట్టేనన్నారు. ‘ౖసాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు (రూ. 28 వేల కోట్లు) ఏమాత్రం సరిపోవు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వమూ చేస్తోంది. గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీకి కూడా ఈ నిధులు సరిపోవు’అని వ్యాఖ్యానించారు. అసలు ‘రాజీవ్ ఆరోగ్య శ్రీ’అమలవుతుందా? బడ్జెట్లో వైద్యరంగానికి రూ.11వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అసలు ‘రాజీవ్ ఆరోగ్య శ్రీ’ని తెలంగాణలో అమ లు చేస్తుందా? దీనికోసం ఎన్ని నిధులు అవసరం? ఎంత కేటాయించారు? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మైనారిటీలకు (15 శాతం జనాభాకి) రూ.2,200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. 50 శాతానికి పైగా జనాభా ఉన్న బీసీల సంక్షేమానికి రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను మోసం చేసిందని విమర్శించారు.వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించారని, మరి రైతుబంధు (భరోసా), రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధి పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఇక ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు లేనట్టేనా? కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల్లో... మొదటి సమావేశంలోనే బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధం చేస్తామన్నారనీ కానీ ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కి బీసీలను నిలువునా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ 73వ రాజ్యాంగ సవరణ గురించి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అంబేడ్కర్ మాటలను ఉటంకించారు. కానీ అమలులో మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ‘కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల గురించి గొప్పగా చెప్పుకున్నరు. బడ్జెట్లో కేటాయించింది మాత్రం రూ. 7,700 కోట్లు. మీరు వాగ్దానం చేసినట్లుగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు కట్టడానికి మొత్తం రూ. 22 వేల కోట్లు అవసరమైతే.. ఇచ్చింది రూ.7,700 కోట్లు మాత్రమే’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ లెక్కలు.. అధ్యయనానికి బెంగుళూరుకు బృందం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడనుందనే విషయంలో ఆర్టీసీ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పథకం ఎలా అమలవుతోంది, అక్కడ ఎంత ఖర్చవుతోంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తోంది..అన్న విషయాలను పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం బెంగళూరుకు వెళ్తోంది. రెండు రోజుల పాటు అక్కడ పరిశీలించి నివేదికను సిద్ధం చేయనుంది. అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావటంతో అధికారులు పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కొలువుదీరబోతోంది. దీంతో వీలైనంత తొందరలో ఈ పథకం అమలు చేసే అవకాశం ఉన్నందున, ముఖ్యమంత్రి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కూడా అమలు చేస్తే.. దక్షిణాదిలో తొలుత తమిళనాడు రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించారు. కానీ అక్కడ, కేవలం నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే బస్సులను అందుబాటులోకి తెచ్చారు. వాటిల్లోనే ఈ వెసులుబాటు ఉంటుంది. కానీ, కర్ణాటకలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఈ వసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని ప్రకటించింది. అధికారంలోకి రావటంతో దాన్ని అమలులోకి తెచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ కర్ణాటక మోడల్‌ను అనుసరిస్తుందా, తమిళనాడు మోడల్‌ను చేపడుతుందా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కర్ణాటక తరహాలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే సాలీనా రూ.2200 కోట్లు అవుతుంది. పల్లెవెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏటా రూ.750 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సింది ప్రతినెలా దాదాపు రూ.185 కోట్లు.. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే, ఆ రూపంలో ఆర్టీసీ కోల్పోయే టికెట్ ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే సాలీనా రూ.2200 కోట్ల వరకు రీయింబర్స్ చేయాలి. అంటే ప్రతి నెలా రూ.185 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. జీరో టికెట్ ప్రవేశపెడతారా..? ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారన్నది లెక్క తేలాల్సి ఉంటుంది. ఇందుకోసం కర్ణాటకలో జీరో టికెట్ విధానం ప్రారంభించారు. మహిళలకు రూ.సున్నా అని ఉండే జీరో టికెట్‌ను జారీ చేస్తారు. అలా రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా లెక్కిస్తారు. ఇక్కడ అదే పద్ధతి ప్రవేశపెడతారా లేక మరో విధానాన్ని అనుసరిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
జీవన్‌రెడ్డి ఓడినా.. పదవి యోగం!
జగిత్యాలజోన్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి పదవీకాలం 2025 మే వరకు ఉండటంతో.. ఆయనకు పదవి యోగం వచ్చే అవకాశముందని జిల్లాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. శాసన మండలిలో కాంగ్రెస్ తరఫున ఏకైక ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి ఉండటంతో.. జీవన్‌రెడ్డిని శాసన మండలి నాయకుడిగా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు కొత్తగా ఎన్నికై న 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మంది కొత్తవారు కావడంతో.. ప్రభుత్వంపై పట్టు ఉండే అవకాశం లేదు. దీంతో సీనియర్ నాయకుడితో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు, సాగునీటి వ్యవస్థపై మంచి పట్టున్న జీవన్‌రెడ్డికి వ్యవసాయ మంత్రి పదవిస్తే.. అసెంబ్లీలో బలంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ ప్రతిపక్షాల నుంచి వచ్చే మాటల దాడులను తిప్పికొట్టేందుకు సరైన నాయకుడు జీవన్‌రెడ్డి అని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2024 ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలుండటం.. గతంలో కేసీఆర్‌పై రెండుసార్లు ఎంపీగా పోటీ చేయడంతో.. జీవన్‌రెడ్డిని పార్లమెంట్‌కు పంపేందుకు సైతం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటినుంచే కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బేస్ ఏర్పాటు చేసుకునేందుకు జీవన్‌రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకొని.. ఆ రెండు పార్లమెంట్ స్థానాల్లో పట్టు బిగించేందుకు కూడా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. జీవన్‌రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని.. నా సేవలు పార్టీకి అవసరమనుకొని ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఏనాడూ పదవుల కోసం తాపత్రయపడలేదని, పదవి వచ్చినా ఒక్కటే, రాకున్నా ఒక్కటేనని, ఎప్పుడూ ప్రజల మధ్యే ప్రజాసేవ కోసం కృషి చేస్తానని ప్రకటించడం విశేషం. -
అలాగైతే మాకేంటి.. అసంతృప్తుల సూటి ప్రశ్నలు..?
యాదాద్రి: ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అక్కడక్కడా అసంతృప్తి స్వరం వినిపిస్తుండగా.. దానికి చెక్ పెట్టేందుకు ఆయా పార్టీల నాయకత్వాలు ప్రయత్నిస్తున్నాయి. తమకు ప్రాధాన్యం దక్కడం లేదని కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ద్వితీయ శ్రేణి నాయకులతో ఎమ్మెల్యే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని ఓ రిసార్ట్‌లో ఆలేరు బీఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారు. అదేవిధంగా భువనగిరి కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. బుధవారం బీబీనగర్, భువనగిరి శివారులో ఆ పార్టీ నేతలు, ఆశావహులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందరూ హాజరు కాకపోవడంతో గురువారం మళ్లీ ఉప్పల్ శివారులోని ఓ హోటల్లో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. తమకు చేకూరే లబ్ధిపై హామీ ఇవ్వాలని ప్రస్తావన.. ఉప్పల్ సమీపంలోని ఓ హోటల్లో గురువారం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి సమన్వయ కర్తగా భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆశావహుల సమావేశం జరిగింది. టికెట్ ఆశిస్తున్న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో సహా జిట్టా బాలకృష్ణారెడ్డి, తంగెళ్లపల్లి రవికుమార్, పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్, పంజాల రామాంజనేయులుగౌడ్, పోత్నక్ ప్రమోద్‌కుమార్, బర్రె జహంగీర్ మరికొందరు ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో ముందుగా ఆశావహులు కొందరు తీవ్ర వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ స్కీంలను ప్రజల్లోకి తీసుకుపోకుండా గ్రూపులుగా విడిపోయి అడ్డుకుంటే ఎన్నికల్లో జరిగే నష్టంపై చర్చించారు. అధిష్టానం టికెట్ ప్రకటించే వరకు ఎవరూ తానే అభ్యర్థినని ప్రకటించుకోవద్దని నిర్ణయించారు. శుక్రవారం పోచంపల్లిలో జరిగే కాంగ్రెస్ సమావేశానికి ఆశావహులందరూ హాజరవుతామని అంగీకారానికి వచ్చారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఏవిధమైన లబ్ధిచేకూరుతుందో ముందుగానే హామీ ఇవ్వాలని పలువురు సమావేశంలో ప్రస్తావించారు. జిల్లాకు చెందిన సీనియర్ నేతలు జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను త్వరలో కలవాలని నిర్ణయించారు. జానారెడ్డిని కలిపించే బాధ్యతలను కసిరెడ్డి తీసుకున్నారు. మాకేంటి.. అసంతృప్తుల సూటి ప్రశ్న..? కొండమడుగులో బీఆర్ఎస్ సమావేశం ఆలేరు నియోజకవర్గంలోని కొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని ఓ రిసార్టులో ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాఽధించే క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆమె ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. పార్టీలో ఉండి అసమ్మతి పేరుతో నష్టం చేసేవారు పద్ధతి మార్చుకోవాలని లేదంటే తప్పుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కొత్త, పాత నాయకులంటూ తేడాలు లేకుండా విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు. వంద మంది ఓటర్ల బాధ్యత ఒక్కరు తీసుకుని పక్కాగా పనిచేయాలని నిర్ణయించారు. రానున్న 40 రోజులు అత్యంత ముఖ్యమైన సమయం కనుక ఎవరూ ఊరు విడిచి వెళ్లొద్దని సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులకు సూచించారు. కొందరు పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా చర్చిస్తున్నారని అలాంటి వారిని గుర్తించి సరిచేయాలని ఆదేశించారు. ఆలేరు కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అసంతృప్తి.. ఆలేరు నియోజకవర్గంలో సైతం అసంతృప్తులు కొనసాగుతున్నాయి. పీసీసీ కార్యదర్శి బీర్ల అయిలయ్య నియోజవకర్గంలో తనకు టికెట్ వస్తుందన్న ధీమాతో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే మిగతా నేతలు ఎవరూ ఆయనతో కలిసి రావడంలేదు. టికెట్ ఆశిస్తున్న నేతలు ఎవరికి వారే టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నగేష్ ఢిల్లీలో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లి వచ్చారు. అయితే కొందరు నేతలను బుజ్జగించేందుకు అయిలయ్య ప్రయత్నిస్తున్నా సఫలం కావడం లేదని సమాచారం. -
సింహం, ఏనుగులే ప్రత్యామ్నాయం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. గులాబీ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ జాబితాపై కసరత్తు ప్రారంభించింది. బీజేపీ కూడా ఎమ్మెల్యే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. ఈ నెలాఖరు వరకు కాంగ్రెస్, బీజేపీల జాబితాపై స్పష్టత రానుంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు అసంతృప్తులు ఎలాగైనా ఎమ్మెల్యే బరిలో నిలిచేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు త్వరలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా జాబితా వెల్లడయ్యాక.. అసంతృప్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీరంతా తమ పార్టీ, అధికార పార్టీ కాకుండా మరో ప్రత్యామ్నాయ వేదిక నుంచి పోటీ చేసేందుకు సై అంటారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో వీరికి రాజకీయంగా రెండు వేదికలు అందుబాటులో ఉంటాయి. అవి ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) కాగా, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ). ఈ రెండు పార్టీలు జిల్లాలో చాలాకాలంగా తమ ఉనికి చాటుకుంటున్నాయి. రెండు పార్టీలకు బలమైన క్రియాశీలక నేతలు లేకపోయినా, అసంతృప్తులను అప్పటికపుడు అక్కున చేర్చుకునే రాజకీయ వేదికలుగా మారాయి. సెంటిమెంట్‌కు మారుపేరుగా.. ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) గతంలో నామమాత్రంగా ఎన్నికల సమయంలో మాత్రమే తెరపైకి వచ్చేది. కానీ, 2018లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్(ఏఐఎఫ్బీ) గుర్తు సింహం సింబల్‌పై గెలుపొందడంతో ఈ పార్టీ పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది. అప్పట్లో కోరుకంటి చందర్ విజయం ఒక సంచలనం. చందర్ గెలిచిన తరువాత ఉమ్మడి జిల్లాలో సింహం గుర్తు సానుభూతికి మారుపేరుగా మారిపోయింది. అధికార – ప్రతిపక్ష పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ వారంతా క్రమంగా ఏఐఎఫ్‌బీలో చేరడం, సింహం గుర్తుపై పోటీ చేయడం ఆనవాయితీగా మారింది. ఈ పార్టీగుర్తుపై పోటీ చేసిన వారిలో విజయశాతం కూడా బాగుండటం అసంతృప్తులు పార్టీని ఎంచుకోవడానికి ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇదేదారిలో పయనించిన 24 మంది రాజకీయ నేతలు స్థానిక సంస్థల్లో విజయం సాధించి సింహం గుర్తుతో తమ సత్తా చాటుకున్నారు. అయితే, వీరంతా తరువాత అధికార పార్టీకి చేరువవుతండటం గమనార్హం. ప్రస్తుతం రామగుండంలో కందుల సంధ్యారాణి, పెద్దపల్లిలో నల్ల మనోహర్‌రెడ్డి సింహం గుర్తుపై పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. వీరే కాక ఉమ్మడి జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్, బీజేపీ అసంతృప్తులు సైతం బీఎస్పీతోనూ టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 60 అసెంబ్లీ స్థానాల్లో పోటీ క్రితంసారి రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 188 మంది మా పార్టీ నుంచి పోటీ చేయగా.. 92 మంది విజయం సాధించారు. ఈసారి ఉమ్మడి జిల్లాలో 13 స్థానాలు, రాష్ట్రవ్యాప్తంగా 60 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఏఐఎఫ్బీ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భావజాలానికి, ఆయన సిద్ధాంతాలను అభిమానించే వారు, కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉన్నవారు మా పార్టీని తప్పకుండా ఆదరిస్తారు. – జోజిరెడ్డి, ఏఐఎఫ్బీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏఐఎఫ్బీ గెలిచిన సీట్లు ఇవే.. రామగుండం అసెంబ్లీ: ఎమ్మెల్యే (తర్వాత బీఆర్ఎస్లో చేరారు) స్థానికసంస్థల్లో ఇలా.. ► కరీంనగర్ కార్పొరేషన్లో 12 పోటీ మంది చేస్తే 3 సీట్లు దక్కించుకున్నారు. దాదాపుగా 12,700 ఓట్లు సాధించారు. అదేసమయంలో కాంగ్రెస్ 50 స్థానాల్లో పోటీ చేయగా.. 9,000కుపైగా ఓట్లు రావడం గమనార్హం. ► రామగుండంలో 14 స్థానాల్లో పోటీ చేయగా.. 9 మంది కార్పొరేటర్లు విజయం సాధించడం ఇక్కడ సింహం సింబల్‌కు ఉన్న ఆదరణకు నిదర్శనం. ► చొప్పదండిలో ఎంపీటీసీ స్థానం, పెద్దపల్లి 5 ఎంపీటీసీలు, మానకొండూరులో ఒకటి, రాయికల్‌లో ఒకటి, రామగుండంలో ఎంపీటీసీ మొత్తానికి 9 ఎంపీటీసీ స్థానాల్లో సింహం విజయం సాధించింది. ► చొప్పదండి మున్సిపల్లో ఒక కౌన్సిలర్, జగిత్యాలలో ఒక కౌన్సిలర్, పెద్దపల్లిలో ఒక కౌన్సిలర్ చొప్పున ముగ్గురు గెలిచారు. బోణీ కోసం బీఎస్పీ తహతహ.. ► 2004లో, 2014లో బీఎస్పీ తెలంగాణలో మంచిప్రభావమేచూపింది. 2014లో రెండు అసెంబ్లీ స్థానాలు గెలిచిన తరువాత తిరిగి ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. 2004లో కరీంనగర్ పార్లమెంటు నుంచి పోటీ చేసిన అభ్యర్థికి 43వేల ఓట్లు వచ్చాయి. 2006లో కోనరావుపేటలో ఐదు ఎంపీటీసీలు, సుల్తానాబాద్‌లో రెండు ఎంపీటీసీలు గెలుచుకుంది. ► 2021లో ఆర్ఎస్ ప్ర వీణ్‌కుమార్ రాష్ట్ర ప గ్గాలు చేపట్టాక పార్టీ మునపటి కంటే ఆర్థి కంగా బలపడిందన్న ధీమా కేడర్‌లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పెద్దపల్లి అసెంబ్లీ బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష(ఐఐటీ– ఖరగ్‌పూర్) పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉంటూ, విజయంపై ధీమాగా ఉన్నా రు. మిగిలిన స్థానాల్లోనూ నిశ్శబ్ద ఫలితా లు ఉంటాయని, ప్రవీణ్‌కుమార్ నాయకత్వం, ఆయనకు జిల్లాతో ఉన్న అనుబంధం తమకు కలిసి వస్తుందని నాయకులు ధీమాగా ఉన్నారు. ఈసారి పోటీ చేసేందు కు ఇతర పార్టీల నుంచి వచ్చినా.. తమపార్టీ నిబంధనలకు కట్టుబడి ఉంటేనే టికెట్ ఇస్తామని నాయకులు స్పష్టంచేస్తున్నారు. -
భూపాలపల్లిలో రచ్చకెక్కిన ఫ్లెక్సీల వివాదం
-
రాహుల్ గాంధీ యాత్ర కశ్మీర్ చేరేలోపు కాంగ్రెస్ కనుమరుగు
దిస్పూర్: భారత్ జోడో యాత్రపై సెటైర్లు వేశారు బీజేపీ నేత, అసోం మంత్రి పీజూష్ హజారికా. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర కశ్మీర్ చేరేలోపు కాంగ్రెస్ కనుమరుగవుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్‌గా దేశం అవతరిస్తుందని వ్యాఖ్యానించారు. అసోం ధుబ్రీ జిల్లాలోని రాజీవ్ భవన్లో కాంగ్రెస్ సోమవారం సమావేశం నిర్వహించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నవంబర్1న రాష్ట్రంలోకి చేరుతున్న సందర్భంగా దీన్ని విజయవంతం చేసే విషయంపై చర్చ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. Looks like by the time “he” reaches Kashmir, India will see a Cong Mukt Bharat 😅. pic.twitter.com/KHXqPIamPN — Pijush Hazarika (@Pijush_hazarika) September 26, 2022 ఇందుకు సంబంధించిన వీడియోనూ షేర్ చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు పీజూష్. చూడబోతే కాంగ్రెస్ దేశంలో కనుమరుగయ్యేలా ఉందని పంచులు వేశారు. మరోవైపు జిల్లా కాంగ్రెస్‌లో వర్గ పోరు లాంటిది ఏమీ లేదని ఆ పార్టీ నాయకులు తెలిపారు. తప్పుదోవ పట్టించవద్దని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్‌లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. అయితే ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిపై కొందరు నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ విషయంపై చర్చిందేందుకు ఇది సరైన సమయం కాదని పార్టీ నాయకులు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో పునరుత్తేజం తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న మొదలైన ఈ యాత్ర 150 రోజుల పాటు సాగనుంది. 12 రాష్ట్రాలను కవర్ చేస్తూ 3,500 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. చదవండి: పీఎఫ్ఐపై రెండో విడత దాడులు.. కర్ణాటకలో 45 మంది అరెస్టు -
బంపర్ ఆఫర్
-
నేటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతల జిల్లాల పర్యటన
-
ఎడ్ల బండిపై నుంచి కిందపడ్డ దామోదర రాజనర్సింహ్మ
-
కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి ఆడియో క్లిప్ వైరల్
-
‘సిద్ధు’కు షాకిచ్చిన రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన విభేదాలను పరిష్కరించే క్రమంలో అధిష్టానం కొన్నిరోజులుగా నేతలతో ఢిల్లీలో మంతనాలు జరుపుతోంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ, పలువురు పంజాబ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, రాహుల్ తాజా వ్యాఖ్యలతో.. పార్టీ చీలికకు ముఖ్యకారణంగా భావిస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధుకు గట్టి షాక్ తగిలినట్లయింది. తాను ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలుస్తానని సిద్ధు చెప్పగా అలాంటిదేమీ ఉండబోదని.. రాహుల్ కుండబద్దలుకొట్టారు. కాగా మంగళవారం, జన్‌పథ్ 10లోని తన నివాసం నుంచి తన తల్లి, పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటికి పయనమైన రాహుల్ గాంధీ ఏఎన్ఐతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘‘సిద్ధుతో సమావేశం ఉండదు’’ అని స్పష్టం చేశారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సంక్షోభాన్ని రూపుమాపేందుకు ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. కాగా ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన అర్జున్ ప్రతాప్‌సింగ్ బజ్వా, భీష్మ పాండే కుమారులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం అమరీందర్ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో పరస్పర విమర్శలతో సీఎం, సిద్ధు వర్గం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ హరీష్ రావత్, సీనియర్ నేత జేపీ అగర్వాల్‌లతో కూడిన ఈ కమిటీ రంగంలోకి దిగింది. ఈ ప్యానెల్ ఎదుట హాజరైన సీఎం అమరీందర్ సింగ్ గట్టిగానే తన వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిద్ధుతో మీటింగ్ ఉండబోదంటూ రాహుల్ వ్యాఖ్యానించడం ఆయన వర్గానికి మింగుడుపడటం లేదు. చదవండి: సీఎం VS సిద్ధూ.. అసలేం జరుగుతోంది? -
సైద్ధాంతిక అయోమయంలో ఆ రెండు పార్టీలు
చకరక్కల్: సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు సైద్ధాంతికపరంగా అయోమయంలో పడ్డాయని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. కేరళలో కత్తులు దూసుకుంటున్న ఈ రెండు పార్టీలు.. బెంగాల్లో కలిసికట్టుగా పోరాడుతుండటం ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సమయంలో గమనించదగ్గ విషయమని ఆయన అన్నారు. కేరళలోని ధర్మదామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి సీకే పద్మనాభన్ తరఫున ఆయన శనివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇక్కడ సీపీఎం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ బరిలో ఉన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశ విషయమై వెల్లువెత్తిన ఆందోళనలను అణచివేసేందుకు అధికార సీపీఎం అణగదొక్కేందుకు యత్నించగా, కాంగ్రెస్ పార్టీ ఎప్పటి మాదిరిగానే కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హామీ ఇస్తోందన్నారు. ఒక్క బీజేపీ మాత్రమే ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో పోరాటం చేస్తోందని చెప్పారు. బంగారం స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన సీఎం విజయన్.. విచారణ అధికారులు ఆయన కార్యాలయానికి వెళ్లగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేస్తోందంటూ ఎదురుదాడికి దిగారన్నారు. కేరళ ప్రజలు ప్రధాని మోదీ వెంటే నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం కేరళకు భారీ ప్రాజెక్టులు మంజూరు చేసేలా తమ పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. -
కొత్త సారధిపై రాని క్లారిటీ
-
అన్నా.. ఎవరు గెలుస్తరే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ముందెన్నడూ లేని ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా.. కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా అన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య కూడళ్లు, రెస్టారెంట్లు, టీ సెంటర్లు, గ్రామాల్లో రచ్చబండలు ఇలా ఎక్కడ ఏ నలుగురు కలిసినా తెలంగాణ ఎన్నికల్లో గెలుపోటములపైనే చర్చ. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసి ఎన్నికలకు వెళ్తున్న చంద్రశేఖర్‌రావు.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీల కూటమి నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్2న టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభ తర్వాత ఆ పార్టీ ప్రతిష్ట కొంత మసకబారినట్లు అనిపించినా కొద్ది రోజులకే మార్పు కనిపించింది. ఈ ఏడాది మే, జూన్‌ల్లో కాంగ్రెస్ పుంజుకుంటున్న వాతావరణం కనిపించినా.. టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించడంతోనే టీఆర్ఎస్ బలపడుతున్న సంకేతాలు కనిపించాయి. దానికి తోడు కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం నామినేషన్ల గడువు ముగిసేదాకా తేలకపోవడం కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనిపించింది. టీడీపీతో పొత్తు.. కాంగ్రెస్‌కు మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న రెడ్డి సామాజికవర్గానికి టీడీపీతో పొత్తు రుచించలేదు. దీంతో ఈ సామాజికవర్గంలో కొంత మేర చీలిక వచ్చి టీఆర్ఎస్కు ఉపయోగపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘అసెంబ్లీ రద్దు అయ్యే నాటికి ఎన్నికల కోసం టీఆర్ఎస్కు ఎన్నికలకు ముందున్న ఎజెండా సంక్షేమ పథకాలు.. కానీ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం టీఆర్ఎస్ ఎజెండానే మార్చేసింది. టీడీపీతో కాంగ్రెస్ ఎప్పుడు జత కలిసిందో అప్పుడే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చంద్రబాబు రూపంలో ఎన్నికల ప్రచారానికి సెంటిమెంట్ అస్త్రం మరోసారి కలిసొచ్చింది. దీన్ని అంత తేలిగ్గా తీసిపారేయలేం’అని ఓ రాజకీయ విశ్లేషకుడు పేర్కొన్నారు. సెటిలర్లంతా బాబును బలపరుస్తారా? ఏపీ సెటిలర్లందరూ టీడీపీని బలపరుస్తారన్న తప్పుడు అంచనాతో కాంగ్రెస్ తన గొయ్యి తనే తవ్వుకుందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. గత టీఆర్ఎస్ పాలనలో సెటిలర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం, ఏపీ ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత టీఆర్ఎస్కు కలసివస్తాయని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ద్వారా కాంగ్రెస్ ఒకే ఒక సామాజికవర్గం ఓట్లలో మాత్రమే 60 నుంచి 70 శాతం మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉందని, ఇది టీఆర్ఎస్ విజయావకాశాలను ఎంత మాత్రం దెబ్బతీయదని పేర్కొంటున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అదీ టీడీపీ సానుభూతిపరులు ఎక్కువగా నివసించే అమీర్‌పేటలో నిర్వహించిన కూటమి సభకు హాజరైన జనం 2,500 నుంచి 3 వేల వరకు ఉండటాన్ని వారు ఉదహరిస్తున్నారు. తెలంగాణలో స్థిరత్వం కోరుకుంటున్న ఏపీ సెటిలర్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారని, ఇది కాంగ్రెస్‌కు మింగుడుపడని వ్యవహారమని రాజధానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఎక్కడ చర్చ జరిగినా సీఎంగా కేసీఆర్‌కే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. అయితే టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందిపై వ్యతిరేకత ఉందని, అది పార్టీ విజయావకాశాలపై ప్రబావం చూపొచ్చని పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ మాత్రం వంద శాతం విజయం సాధిస్తామని, సంక్షేమ ఫలితాలు పొందిన వారిలో 80 శాతం మంది తమకే ఓటేస్తారని విశ్వసిస్తోంది. కూటమి ఎన్ని హామీలు ఇచ్చినా, గడచిన నాలుగేళ్ల పాలనలో తాము అందించిన సంక్షేమ పథకాల ఫలాల కంటే అవేమీ గొప్ప కాదని, పైగా బహు నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పట్ల ప్రజల్లో నమ్మకం లేదని టీఆర్ఎస్ అంటోంది. కాంగ్రెస్ మాత్రం ఏడాదిలో లక్ష ఉద్యోగాలతో యువత, పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచడం ద్వారా ఉద్యోగులు, ఏడాదిలో ఆరు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడమన్న హామీతో మహిళల ఆదరణ ఉంటుందని, గట్టెక్కుతామని నమ్మకంతో ఉంది. జోరుగా బెట్టింగులు తెలంగాణ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బెట్టింగ్‌లు జోరందుకుంటున్నాయి. ఏపీలో భీమవరం, రైల్వేకోడూరు, మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా బెట్టింగులు సాగుతున్నాయి. భీమవరం కేంద్రంగా ఇప్పటికే వందల కోట్లలో బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ‘15 రోజుల కింద దాకా టీఆర్ఎస్ 50 దాటదు అన్న బెట్టింగ్ ఎక్కువగా నడిచింది. ఇప్పుడు టీఆర్ఎస్కు 60 దాటొచ్చు అన్న దానిపైనే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. కూటమికి ఒక దశలో 50 సీట్లు దాటుతాయన్న బెట్టింగ్‌లు ఎక్కువగా నడిచినా, ఇప్పుడు 40 దాటుతుందన్న దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు’అని భీమవరం కేంద్రంగా నడుస్తున్న ఓ బెట్టింగ్ నిర్వాహకుడు చెప్పారు. వచ్చే నెల 2–5 తేదీల మధ్య బెట్టింగ్‌ల్లో మార్పులు ఉంటాయని, అప్పుడు స్పష్టత వస్తుందని చెప్పారు. -
ఏకకాలంలో రూ.2 లక్షల మాఫీ
సాక్షి,బోధన్(నిజామాబాద్): తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని మాయ మాటలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ బోధన్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మహకూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని, తాము అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2లక్షల చొప్పన పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. బుధవారం మండలంలోని రాజీవ్‌నగర్ తాండ, బెల్లాల్, ఊట్పల్లి, అమ్దాపూర్ గ్రామాల్లో సుదర్శన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. హామీల అమలులో టీఆర్ఎస్ విఫలమైందని, స్వార్థ ప్రయోజనాల కోసం మిషన్ భగీరథ వంటి పథకాలను చేపట్టిందని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తి చేస్తామని, అప్పటివకు నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖతాల్లో రూ.15లక్షలు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఎంపీపీ గంగాశంకర్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లె రమేశ్, మండలాధ్యక్షుడు నాగేశ్వర్రావ్, నేతలు నరేందర్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, ఖలీల్, శంకర్, సురేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్ ఓటమికి.. కోవర్టులు పనిచేస్తున్నారు’
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ముగ్గురు బడా నేతలు కోవర్టులుగా పనిచేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపించారు. మంచి వారిగా నటిస్తూ.. పార్టీలోని అంతర్గత విషయాల్ని టీఆర్ఎస్కు చేరవేస్తున్నారని మండిపడ్డారు. అందుకే, 20 మంది డమ్మీలను కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించిందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమై.. ఎక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టాలో ఈ కోవర్టులు ఒప్పందం చేసుకున్నారని ఆయన మీడియాకు బుధవారం వెల్లడించారు. తమ వ్యాపార లావాదేవీల కోసం పార్టీ భవితవ్యాన్ని తాకట్టు పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే, కరీంనగర్లోనూ మరో ఇద్దరు కాంగ్రెస్ కోవర్టులున్నారని కాంతం అన్నారు. కేటీఆర్ చెప్పిన వారికే టికెట్లు వచ్చేలా చేశారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసిన వారికి టికెట్లు రాకుండా.. ఈ కోవర్టులంతా కలిసి హైకమాండ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్లో మాత్రం ఉద్యమ నాయకులకు టికెట్లు కేటాయించారని అన్నారు. ‘రేపు (గురువారం) విద్యార్థి నాయకులం, ఉద్యమకారులం భేటీ అవుతాం. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌లో జరిగిన అవకతవకలను బయటపెడతాం’ అని ఆయన హెచ్చరించారు. వాస్తవాలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడేది లేదని స్పష్టం చేశారు. -
‘అలా చేస్తే చంద్రబాబును గుడ్డలూడదీసి తంతారు’
-
‘అలా చేస్తే చంద్రబాబును గుడ్డలూడదీసి తంతారు’
సాక్షి, విజయనగరం : కాంగ్రెస్‌తో కలిస్తే చంద్రబాబును గుడ్డలూడదీసి తంతారని వ్యాఖ్యానించిన మీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు మంత్రి అయ్యన్నపాత్రుడు, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తిలకు ఏం సమాధానం చెప్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి చంద్రబాబును ప్రశ్నించారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో.. తిరిగి అదే పార్టీతో కలవడం ద్వారా ఆయన ఆత్మ క్షోభిస్తుందని టీడీపీ నేతలు మదన పడుతున్నారనీ ఈ విషయం చంద్రబాబుకు పట్టదా అని కోలగట్ల నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీది రక్తంతో తడిసిన హస్తమని నాడు వ్యాఖ్యానించిన చంద్రబాబు నేడు అదే చేతిలో చెయ్యేసి నడుస్తున్నారని కోలగట్ల అన్నారు. అంటే మీ చేతులకు రక్తం అంటించుకున్నట్టు అంగీకరిస్తున్నట్టేనా అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయట పడేందుకు, మీ అవినీతి చరిత్ర పై విచారణ ఎదుర్కొనేందుకు ఓ జాతీయ పార్టీ అవసరం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జతకడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆగర్భశత్రువైన కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జతకట్టడాన్ని తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ‘పదవుల కోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారుతాడు. ఎంతటి నీచ నికృష్ట రాజకీయాలు చేయడానికైనా సిద్దపడతారని మరోసారి రుజువైంది’ అని ఎమ్యెల్సీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసిన విషయాన్ని మర్చిపోయారా అని ఆయన బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఖబడ్దార్ చంద్రబాబూ అంటూ కోలగట్ల వ్యాఖ్యానించారు. -
ప్రాణం తీసిన ఫేస్బుక్ పోస్ట్
ముంబై : ఫేస్బుక్ పోస్ట్ ప్రాణం తీసింది. వివరాలు.. ముంబైకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మనోజ్ దుబే(45) అనే వ్యక్తిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. దుబే తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఓ పొలిటికల్ పోస్ట్ ఈ దాడికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అయితే దాడి చేసిన వ్యక్తుల గురించి పూర్తి సమాచారం తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుబే మృతి పట్ల మహారాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు సంతాపం తెలిపారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడి చేశారంటూ ఆరోపించారు. Shocking! Manoj Dubey, a staunch Congress worker was murdered for his facebook post by BJP goons. We strongly condemn such a coward act! The culprits should be brought to justice. Our deepest condolences to his family, Congress party stands with his family at this hour of grief. pic.twitter.com/BcVhzZdtD0 — Maharashtra Congress (@INCMaharashtra) October 22, 2018 -
గుజరాత్, రాహుల్ ఎన్నికలకు లింకేమిటీ?
సాక్షి, న్యూడిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీని డిసెంబర్ నెలలో ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైన విషయం తెల్సిందే. సోమవారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకుంటారు. అయితే ఆయన అధికారికంగా అధ్యక్ష బాధ్యతలను మాత్రం డిసెంబర్ 19వ తేదీన స్వీకరిస్తారు. అంటే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. డిసెంబర్ 18వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌తోపాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా వస్తే రాహుల్ అధ్యక్షతన పార్టీ విజయం సాధించిందంటూ ప్రచారం చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవచ్చనేది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పొందితే ఆ బాధ్యత రాహుల్ గాంధీది కాదని, ఆయన ఇంకా అధికారికంగా బాధ్యతలు స్వీకరించలేదని సమర్థించుకోవచ్చు. గుజరాత్ పోల్చితే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు అంత ప్రతిష్టాత్మకమైనవి కావనేది అందరికీ తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్‌లో బీజేపీ విజయం సాధించి గుజరాత్లో ఓడిపోతే అది ఆ పార్టీకి ఎదురుదెబ్బే. అదేగనుక జరిగితే ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో రాహుల్ గాంధీ నాయకత్వానా పార్టీని మున్ముందు మరింత బలోపేతం చేసుకోవచ్చన్నది వ్యూహకర్తల భావంగా కనిపిస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే ప్రగాఢ విశ్వాసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేదనేది మాత్రం ఈ వ్యూహం ద్వారా తెలుస్తోంది. -
'అప్పుడు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు'
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను విస్మరించిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చాక ఇప్పుడు ప్రత్యేక హోదా విషయం గుర్తొచ్చిందని వెంకయ్య నాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని ప్రశ్నించారు. -
పరువు కోసం పాకులాట!
సాక్షి, అనంతపురం : రాహుల్ గాంధీ సభకు జన సమీకరణ చేసేందుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి నానా పాట్లు పడుతున్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుతో జిల్లా వాసులు ఆ పార్టీ అంటేనే మండిపడుతున్నారు. విభజన నిర్ణయం తర్వాత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చాలా మంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న రాహుల్‌ను ప్రసన్నం చేసుకునేందుకు రఘువీరా తలపట్టుకుంటున్నారు. జిల్లా నుంచి ఎలాగూ జనం రారన్న అంచనాకొచ్చిన రఘువీరా.. పక్క రాష్ర్టం నుంచి జనాన్ని తరలించేనిలో పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం హిందూపురంలో రాహుల్ గాంధీ సభ జరగనుంది. విభజన తర్వాత అనంతలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడింది. అనంతరం ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారంతా దాదాపు కొత్త ముఖాలే. కనీసం ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఆ పార్టీ అభ్యర్థులను ఆదరించేవారే కరువయ్యారు. కాంగ్రెస్‌లో కొనసాగితే భవిష్యత్ ఉండదని గ్రహించిన90 శాతం మంది ద్వితీయ శ్రేణి చీదరించుకుంటున్నారు. పెనుకొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. తనకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నా ఎవరూ స్పందించడం లేదు. సమైక్య ఉద్యమకారులు, ఉద్యోగులు రఘువీరా మాటల్ని గుర్తుకు తెచ్చుకుని ‘అప్పుడలా అన్నారు.. ఇప్పుడేమో కుటుంబ సభ్యులంతా రోడ్లమీదకొచ్చి ఓట్ల కోసం పాకులాడుతున్నారు’ అని వ్యాఖ్యానిస్తున్నారు. తన ప్రచారానికి అనుకున్నంత స్పందన లేకపోయేసరికి ఓటర్లకు డబ్బు ఎర వేస్తున్నారు. కొంత మంది పోలీసులను లోబరుచుకుని ఓటర్లకు డబ్బు పంపిణీ యథేచ్ఛగా సాగిస్తున్నారు. పుట్టపర్తి సత్యసాయి మృతి చెందినపుడు చోటుచేసుకున్న హైడ్రామా వల్ల, పెనుకొండ కాళేశ్వర్ మృతి ఘటనల్లో ఈ మాజీ మంత్రి భారీగా లబ్ధి పొందారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఇపుడా డబ్బులో రెండు మూడు శాతం ఖర్చు చేసి అయినా సరే విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన అనుచరులు కొందరు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభంజనం నేపథ్యంలో ఆయన ఖర్చుకు వెరవకుండా డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా సీమాంధ్రలో తానొక్కడినైనా గెలవకపోతే ‘అమ్మ’ వద్ద పరువుపోతుందని ఆయన వాపోతున్నారట. ఇందులో భాగంగా ఒక వైపు బెదిరింపులు.. మరో వైపు డబ్బు ఆశ చూపుతున్నా గ్రామ స్థాయి నేతలు, ఓటర్లు కన్నెత్తి చూడక పోవడం ఆయనను ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తినేతలను గుర్తించి భారీ ప్యాకేజీలతో తన వైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు అధిష్టారం పార్టీ ఫండ్ పంపినా ఆ మొత్తాన్ని ఇతర అభ్యర్థులకు ఇవ్వకుండా తన నియోజకవర్గంలో ఖర్చు పెట్టి ఎలాగైనా విజయం సాధించాలన్న ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. అయితే చాలా మంది ఓటర్లు తిరస్కరిస్తుండటంతో ఏం చేయాలో ఆయన వర్గీయులకు పాలుపోవడం లేదు. కాగా, టీడీపీ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి తిరిగి పోటీ చేస్తున్నారు. ఆయనపై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2009 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శంకరనారాయణ విజయానికి కృషి చేస్తున్నారు. మహానేత వైఎస్ పథకాలు, జననేత జగన్ నాయకత్వంలో శంకరనారాయణ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పెనుకొండలో పర్యటించినప్పుడు.. శంకరనారాయణను గెలిపిస్తే క్యాబినెట్లోకి తీసుకుంటానని ప్రకటించడం కీలకంగా మారింది. అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతం ఆయన మంత్రి అయితే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లు యూ టర్న్ తీసుకుని ఫ్యాన్ జోరును పెంచుతున్నారు. డబ్బుతో ఏదైనా సాధించవచ్చనుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరాకు, అభివృద్ధి గురించి పట్టించుకోని టీడీపీ అభ్యర్థి పార్థసారధికి తగిన శాస్తి చేస్తామని స్థానికులు బాహాటంగా చెబుతున్నారు. -
రేషన్ దుకాణాల్లో నో స్టాక్
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రేషన్ సరుకుల పంపిణీపై సర్కారు చేతులెత్తేసింది. సద్దుల బతుకమ్మ... దసరా పండుగల ముందు నిరుపేద కుటుంబాల్లో సంబురం లేకుండా చేసింది. కీలకమైన సమయంలో నిత్యావసరాల పంపిణీని విస్మరించింది. ప్రధానంగా ఇంటింటా అవసరమయ్యే చక్కెర, పామాయిల్, కందిపప్పునకు కొరత ఏర్పడింది. అక్టోబర్‌లో జిల్లాకు రావాల్సిన రేషన్ కోటాలో దాదాపు 40 శాతం కోత పడింది. నిర్ణీత ప్రణాళిక ప్రకారం ఈ నెలలో పంపిణీ చేయాల్సిన సరుకులన్నీ గత నెలాఖరు నాటికి జిల్లాకు చేరాలి... డీలర్లకు సైతం చేరవేయాలి. ఒకటి నుంచి 18వ తేదీలోగా రేషన్ డీలర్లు వీటిని పంపిణీ చేయాలి. కానీ.. ఈసారి అన్ని రేషన్ షాపులకు సరుకులు అరకొరగా సరఫరా అయ్యాయి. దీంతో తొమ్మిది సరుకులుండాల్సిన ‘అమ్మహస్తం’ సంచిలో చక్కెర, పామాయిల్, కందిపప్పు ప్యాకెట్లు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని రేషన్ షాపుల్లో ఈ మూడు సరుకులు లేవనే సమాధానం వినిపిస్తోంది. దాదాపు 30 శాతం రేషన్ కార్డులున్న కుటుంబాలకు పండుగ చేదెక్కినట్లే. ఈ నెలలో రావాల్సినంత సరుకుల కోటా రాలేదని.. సీమాం ధ్రలో ఆందోళనలతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా మన జిల్లాకు గుంటూరు నుంచి కందిపప్పు, చిత్తూరు జిల్లా నుంచి చక్కెర, కాకినాడ నుంచి పామాయిల్ దిగుమతి అవుతోంది. అక్కడ రవాణా నిలిచి పోవడంతో సరిపడేన్ని సరుకులు రాలేదని సివిల్ సప్లయిస్ విభాగం జిల్లా మేనేజర్ రాజేంద్రకుమార్ తెలిపారు. చక్కెర, కందిపప్పు, పామాయిల్ కోటా తగ్గిందని ఆయన అంగీకరించారు. సద్దులు... పిండివంటలు... ఇంటింటా పండుగ అవసరాల రీత్యా సాధారణంగా ఈ నెలలోనే రేషన్ సరుకులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో కోటాలో కోత పడడంతో డీలర్లు సైతం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సకాలంలో డీడీలు చెల్లించినప్పటికీ సర్కారుకు ముందుచూపు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. -
సీఎం జిల్లాకు రూ.6వేల కోట్లా..?
చాదర్‌ఘాట్,న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, సొంత జిల్లాకు రూ.6 వేల కోట్లు కేటాయించటం అమానుమాషమని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీష్‌రావు పేర్కొన్నారు. ఆదివారం పాతబస్తీకి చెందిన పలువురు యువకులు పార్టీ ఎమ్మెల్సీ మహిమూద్ అలీ, ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో గులాబీదళంలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ అధికారం కోసం పూటకోమాట మాట్లాడుతున్న చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిని గాడ్సేగా చిత్రీకరించిన చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో మోడీని గాంధీజీతో పోల్చటం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధిచేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు కేవలం వారి బంధువుల ఆస్తులను పెంచుకోవడం కోసం చేశారన్నారు. ఓల్డ్‌సిటీలో నిరుద్యోగ ముస్లిం యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు రేస్‌కోర్స్ గ్రౌండ్లో ఐటీపార్కు ఏర్పాటు చేయిస్తామని, చంచల్‌గూడ జైలును ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని హామీఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తధ్యమని, హైదరాబాద్ పై కావాలని రాద్ధాంతం చేస్తున్నారని..హైదరాబాద్ లేని తెలంగాణను అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో గ్రేటర్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్మాలిక్, జలమండలి గౌరవాధ్యక్షుడు చవ్వా సతీశ్, మలక్ పేట,నాంపల్లి నియోజకవర్గాల ఇంచార్జీలు ఆజంఅలీ,కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.