సాక్షి, న్యూడిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీని డిసెంబర్ నెలలో ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైన విషయం తెల్సిందే. సోమవారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకుంటారు. అయితే ఆయన అధికారికంగా అధ్యక్ష బాధ్యతలను మాత్రం డిసెంబర్ 19వ తేదీన స్వీకరిస్తారు. అంటే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. డిసెంబర్ 18వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌తోపాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా వస్తే రాహుల్ అధ్యక్షతన పార్టీ విజయం సాధించిందంటూ ప్రచారం చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవచ్చనేది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పొందితే ఆ బాధ్యత రాహుల్ గాంధీది కాదని, ఆయన ఇంకా అధికారికంగా బాధ్యతలు స్వీకరించలేదని సమర్థించుకోవచ్చు. గుజరాత్ పోల్చితే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు అంత ప్రతిష్టాత్మకమైనవి కావనేది అందరికీ తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్‌లో బీజేపీ విజయం సాధించి గుజరాత్‌లో ఓడిపోతే అది ఆ పార్టీకి ఎదురుదెబ్బే. అదేగనుక జరిగితే ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో రాహుల్ గాంధీ నాయకత్వానా పార్టీని మున్ముందు మరింత బలోపేతం చేసుకోవచ్చన్నది వ్యూహకర్తల భావంగా కనిపిస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే ప్రగాఢ విశ్వాసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేదనేది మాత్రం ఈ వ్యూహం ద్వారా తెలుస్తోంది.
Published Tue, Nov 21 2017 2:56 PM | Last Updated on Tue, Aug 21 2018 2:56 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment