colestrol
-
మీ చర్మ కాంతిని మరింత పెంచే మసాజ్ స్క్రాపర్.. ధర ఎంతంటే..
చర్మ సంరక్షణకు మించిన సౌందర్య రహస్యం మరోకటి లేదు. దానికి అద్భుతమైన టూల్ ఈ మసాజ్ స్క్రాపర్. హై క్వాలిటీ ఆక్రిలోనిట్రైల్ బుటాడిన్ స్టెరిన్ – స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్‌తో రూపొందిందీ మినీ డివైజ్. దీని నుంచి విడుదలయ్యే 45 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్.. స్కిన్ కేర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వైబ్రేషన్స్.. చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, కాంతిమంతం చేయడానికి తోడ్పడతాయి. అంతేకాదు ఇది ఒత్తిడిని దూరం చేసి.. ప్రశాంతతను అందిస్తుంది. అదనపు కొవ్వును తగ్గిస్తుంది. ఈ స్క్రాపింగ్ మసాజ్ టూల్.. చర్మంపైన ఆక్యుపాయింట్స్ని ప్రేరేపించేలా త్రికోణ ఆకారంలో ఉంటుంది. దీనిలో స్మూతింగ్ మోడ్, యాక్టివేటింగ్ మోడ్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. స్మూతింగ్ మోడ్.. లో–వైబ్రేషన్ అందిస్తే, యాక్టివేటింగ్ మోడ్.. హైయర్–వైబ్రేషన్‌ను అందిస్తుంది. దాంతో కొన్ని నిమిషాల్లోనే చర్మం తేజోవంతమవుతుంది. ఇక్కడున్న చిత్రాన్ని గమనించినట్లైతే.. కింద ఉన్న చార్జింగ్ బేస్‌కి వెనుక భాగంలో యు.ఎస్.బి పోర్ట్ ఉంటుంది. దాంతో ఈ డివైజ్‌ని చార్జింగ్ బేస్‌లో అమర్చి.. యు.ఎస్.బి పోర్ట్‌కి చార్జర్ పెట్టుకుంటే.. వైర్లెస్ మసాజర్గా ఉపయోగించుకోవచ్చు. దీన్ని మరోసారి ఉపయోగిస్తున్నప్పుడు.. చివరిగా ఏ మోడ్‌తో ఆఫ్ అయ్యిందో అదే మోడ్‌తో పని చేస్తుంది. ఈ ట్రయాంగిల్ టూల్ వాటర్ ప్రూఫ్ కావడంతో నీటితో శుభ్రం చేసుకోవచ్చు. దీని ధర 159 డాలర్లు. అంటే సుమారు 12 వేల రూపాయలు. చదవండి: ప్రపంచంలోనే అతిచిన్న తుపాకి.. లక్షల్లో ధర! -
Health Benefits: కరివేపాకు.. బరువును అదుపులో ఉంచుతుంది.. ఇంకా
మనలో చాలా మంది కూరలో కరివేపాకు కనిపిస్తే చాలు.. వెనకా ముందూ ఆలోచించకుండా తీసి పక్కన పెట్టేస్తాం! కానీ దీనిలోని పోషకాల గురించి తెలిస్తే ఇంకెప్పుడూ కరివేపాకు తీసిపారెయ్యలనే ఆలోచనే రాదంటే నమ్మండి. అవేంటో తెసుకుందామా.. మన భారతీయ ఆహార అలవాట్లలో కరివేపాకుకు విశిష్ట స్థానం ఉంది. సాంబార్ నుంచి పెరుగు చట్నీ వరకు ప్రతి కూరలో దర్శనమిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారతంలో కరివేపాకు లేకుండా కూరలను అసలు ఊహించలేమంటే అతిశయోక్తి కాదేమో! కేవలం రుచి కి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దీనిలో మెండేనండోయ్. ఏమిటా ప్రయోజనాలు? విటమన్ ‘ఎ’, ‘సి’, పొటాషియం, కాల్షియం, ఫైబర్, రాగి, ఐరన్ వంటి భిన్న రకాల పోషకాలు కరివేపాకు ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా బరువును అదుపులో పెట్టడంలో, మధుమేహం నివారణలో, పేగు సంబంధిత ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ నిర్వహణలోనూ కీలకంగా వ్యవహరిస్తోంది. కొవ్వులను ఏ విధంగా నిరోధిస్తుంది? కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు పొంచిఉన్నట్లేనని ఎక్కువ మంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ చైనీస్ మెడిసిన్ అధ్యనాల ప్రకారం రక్తంలోని గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే గుణం కరివేపాకు రసంలో పుష్కలంగా ఉందని వెల్లడించాయి. ఈ పరిశోధకులు డయాబెటిక్ ఎలుకలకు వరుసగా 10 రోజుల పాటు కరివేపాకు రసాన్ని ఇంట్రాపెరిటోనియల్ ఇంజక్షన్ రూపంలో ఇచ్చారు. తద్వారా వీటి రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోస్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు కనుగొన్నారు. కాబట్టి మీ రోజువారి ఆహారంలో భాగంగా కరివేపాకు ఆకులను తీసుకున్నట్టయితే కొలెస్ట్రాల్, ట్రైగ్లిసెరాయిడ్ స్థాయిలు అదుపులో ఉంచడానికి తోడ్పడుతుందనేడి ఈ అధ్యయనాల సారాంశం. మన రోజువారీ ఆహారంలో కరివేపాకును ఏ విధంగా తీసుకోవాలి? 8-10 కరివేపాకు ఆకులు, చిన్న అల్లం ముక్కను నీళ్లలోవేసి 15 నుంచి 20 నిముషాలు మరగనియ్యండి. దీనిపై మూతను పెట్టి 10 నిముషాలు పక్కన పెట్టండి. తర్వాత వడకట్టి తాగండి. రుచికోసం దీనికి నిమ్మరసం, తేనెకూడా జోడించవచ్చు. ఇలా తయారు చేసిన టీని రోజు మొత్తంలో ఎప్పుడైనా తాగవచ్చు. అలాగే వివిధ రకాల వంటకాలలో కరివేపాకును చేర్చడం ద్వారా, కరివేపాకు పచ్చడి, లస్సీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ప్రతి రోజూ పిడికెడు కరివేపాకు ఆకులను నేరుగా తిన్నా మంచిదే. నిపుణులు సూచిస్తున్న ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి. ఆరోగ్యంగా ఉండండి. చదవండి: Typhoid Diet: టైఫాయిడ్‌తో బాధపడే వారికి దివ్యౌషధం.. ఇవి తిన్నారంటే.. -
చేదైనా సరే తినండి... చేటు తప్పించుకోండి
చాలామంది కాకరకాయను చూడగానే ముఖం చిట్లిస్తారు. చేదంటూ దాని జోలికే వెళ్లరు. కానీ కాయ చేదైనా దాంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే వారంలో ఒకసారైనా కాకరకాయను ఏదో ఒక వంటకంగా చేసుకుని తినండి. వంట ప్రక్రియలో చేదును విరిచేసే ప్రక్రియలూ ఉంటాయి. వాటిని అనుసరించి కాకరకాయను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం కలిగే ప్రయోజనాలివే... ♦ కాకరకాయలో క్యాలరీలు చాలా తక్కువ అందుకే స్థూలకాయం, ఊబకాయం రాకుండా నివారిస్తుంది. క్యాలరీలు తక్కువగా పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. ♦ ఇందులో విటమిన్ బి1, బి2, బి3, సి...లతో పాటు జీర్ణక్రియకు దోహదం చేసే పీచు ఎక్కువగా ఉంటుంది. ♦ మెగ్నీషియ్, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలూ ఎక్కువ. ♦ కాకరలోని విటమిన్–సి దేహంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. మన దేహంలో పుట్టే ఫ్రీరాడికిల్స్ మ్యాలిగ్నంట్ కణాల (క్యాన్సర్ కారక కణాలు) ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఇలా కాకర సాధారణ క్యాన్సర్లనే కాకుండా, లుకేమియా లాంటి బ్లడ్క్యాన్సర్లనూ నివారిస్తుంది. ♦ కాకర కాయ కడుపులో చేరిన పరాన్నజీవులను హరిస్తుంది. కడుపులో నిల్వ చేరిన విషపూరితమయ్యే వ్యర్థాలను తొలగిస్తుంది. ♦ కాకర మలేరియా బ్యాక్టీరియానూ తుదముట్టించగలదు. చికెన్‌పాక్స్, మీజిల్స్, హెర్ప్స్, హెచ్ఐవి కారక వైరస్‌లను శక్తిహీనం చేస్తుంది. ♦ కాకర గింజలు గుండె పనితీరును క్రమబద్ధం చేస్తాయి. ఇవి రక్తనాళాల్లోని కొవ్వును కరిగించి గుండె గదులు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా రక్షిస్తాయి. ♦ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కాకర మంచి స్వాభావికమైన ఔషధంగా అనుకోవచ్చు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ నిల్వలను తగ్గిస్తుందన్న విషయం చాలామందికి తెలిసిందే. ♦ బ్లడ్‌ప్రెషర్‌లో హెచ్చుతగ్గులు లేకుండా చూస్తుంది. ♦ కాలేయంపై పడే అదనపు భారాన్ని కూడా కాకర నివారిస్తుంది. -
ఇలా చేస్తే 15 రోజుల్లో పొట్ట తగ్గుతుందట!
సాక్షి, హైదరాబాద్: చంకలో పిల్లాడిన్ని పెట్టకుని ఊరంతా వెతికారట!! అనే సామెత తెలిసే ఉంటుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆరోగ్య నియమాలు పాటించకుండా దాదాపు అందరూ పొట్టలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నవారే..!! అధిక బరువుతో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నవారే..!! కానీ ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం మనం రోజూ వాడే జీలకర్రలోనే ఉందట. అందుకే చంకలో పిల్లాడు... అనే సామెత చెప్పింది. అవును ఇది నిజం. జీలకర్ర ద్రావణం గొప్ప ఆరోగ్య ఔషదమని పరిశోధనల్లో తేలింది. రోజూ ఉదయం... జీలకర్ర నీటితో కేవలం 15 రోజుల్లో శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. రోజూ పరగడుపున ఈ నీటిని తీసుకుంటే చెడు కొవ్వుని తగ్గించుకోవడంతోపాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఒక ఓ రీసెర్చ్ వెల్లడించింది. జీరా వాటర్ మలబద్దకాన్ని దూరం చేసి, జీర్ణక్రియను మెరుగు పరుస్తుందనీ.. జీవ క్రియ రేటుని పెంచుతుందని తెలిపింది. తయారీ విధానం... ఒక గ్లాసు మంచి నీటిలో టేబుల్ స్పూన్ జీలకర్రను రాత్రి మొత్తం నానబెడితే చాలు. నీరంతా జీరా గింజల్లోకి చేరడంతో వాటిలో ఉండే పోషకాలు నీటిలోకి చేరతాయి. అంతే జీరా వాటర్ రెడీ. పసుపు రంగులోకి మారిన ఆ ద్రావణంలో కేవలం 7 కాలరీలు మాత్రమే ఉండడం విశేషం. బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచి సాఫ్ట్ డ్రింక్‌గా పనిచేస్తుందనేది పరిశోధనల సారాంశం. చెడు కొవ్వు మైనస్, మంచి కొవ్వు ప్లస్ సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామం చేయకపోవడంతో జీవక్రియ మందగిస్తుంది. శరీరంలోని చక్కెరలు, కొవ్వులు ఖర్చు కావు. దాంతో శరీరంలో అధికంగా కొవ్వు పేరకుపోయే ప్రమాదం ఉంది. జీరా ద్రావణాన్ని రోజూ తీసుకోవడం వల్ల అందులో విరివిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్‌ను తొలగిస్తాయని తెలిసింది. తద్వారా జీవక్రియ మెరుగు పడి బరువు తగ్గడం తేలికవుతుందని రీసెర్జి అధికారులు అంటున్నారు. ఇది ఒంట్లోని చెడు కొవ్వుని తొలగించడంతో గుండె జబ్బుల బారిన అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇంకా శరీరానికి అవసరమైన మంచి కొవ్వుని వృద్ధి చేస్తుంది. హ్యాపీగా తినొచ్చు.. మంచి జీర్ణక్రియతో మంచి ఆరోగ్యం సాధ్యం. జీరా వాటర్ ప్రేగుల్లో కదలికలను మెరుగు పరచి, అక్కడ ఉండే ఎంజైమ్‌లపై ప్రేరకంగా పనిచేస్తుంది. తద్వారా పొట్టలో ఉబ్బరాన్ని తగ్గించి, మంచి జీర్ణక్రియ సొంతమవుతుందని పరిశోధకులు వెల్లడించారు. -
కనబడని కొవ్వుతో మరణం!
ఢిల్లీ: మనకు పైకి కనిపించడానికి లావుగా ఉండే వారిలోనే కాకుండా అంతర్గతంగా ఏర్పడేటువంటి కొవ్వుతో చాలా ప్రమాదం పొంచి ఉందనీ, ఒక రకంగా ఇది మరణానికి దగ్గరవుతున్నట్లే అని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదర భాగంలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం వలన ప్రమాదం మరింత పెరుగుతుందంటున్నారు. చర్మం కింది భాగాలలో అంతర్గతంగా తయారయిన కొవ్వు మూలాన అనేక వ్యాధుల బారిన పడటానికి అవకాశం ఉంటుంది. హృద్రోగులలో ఈ తరహా కొలెస్ట్రాల్ ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మనదేశంలోని స్థూలకాయుల్లో హైపర్‌టెన్షన్, థైరాయిడ్, డయాబెటిస్ తదితర వ్యాధుల బారిన పడిన వారికి ఆ వ్యాధుల మీద అవగాహన లేకపోవడం వలన తప్పకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సైతం తీసుకోలేకపోతున్నారు. ఇది ఎక్కువ నష్టం జరగడానికి దోహదం చేస్తుందని ఒబెసిటీ రంగంలో కృషి చేస్తున్న ఇండియా కంపెనీ వీఎల్సీసీ స్థాపకురాలు వందనా మిశ్రా తెలిపారు. ప్రతి యేటా నవంబర్ 26 ను యాంటీ ఒబెసిటీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో అస్తవ్యస్తమైన జీవన విధానం, అహారపు అలవాట్ల మూలంగా పెరుగుతున్న స్థూలకాయులు తప్పకుండా తమ బరువును తగ్గించుకోవడం దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.