colletor
-
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బదిలీ
యాదాద్రి: జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వినయ్ కృష్ణారెడ్డి నల్లగొండ జిల్లాకు కూడా కలెక్టర్ పని చేశారు. అయితే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజులు పాటు రాష్ట్రంలో పర్యటించి సమీక్ష సమావేశాలు నిర్వహించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహం, డబ్బులు పంచలేదని ఓటర్లు ధర్నాలు చేయడం, పోలింగ్ కేంద్రాలకు వెళ్లకపోవడం, కొందరు అధికారుల పనితీరుపై ఆరోపణలు రావడం వంటి విషయాలను ఎత్తి చూపింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అధికారులపై ఫిర్యాదులు రావడాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు స్థానభ్రంశం కలిగించింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డిని కూడా బదిలీ చేసింది. వినయ్ కృష్ణారెడ్డి యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా రెండు నెలలకు పైగా పని చేశారు. ఆయన స్థానంలో గురువారం సాయంత్రం 5 గంటల లోగా నూతన కలెక్టర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
వైద్య సేవలను మెరుగుపర్చాలి
భూపాలపల్లి అర్బన్ : ప్రభుత్వ వైద్యశాలలంటే దేవుడి గుడిలా భావించేలా వైద్యులు ప్రజలకు వైద్య సేవలందించాలని కలెక్టర్ అమయ్‌కుమార్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 25 పీహెచ్‌సీలు, 4 సీహెచ్‌సీ కేంద్రాల్లో వైద్యుల పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించి ప్రభుత్వ వైద్యశాలలపై నమ్మకం కలిగించే పని చేయాలన్నారు. వందశాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అంగన్వాడీ సెంటర్లో గర్భిణుల వివరాలను సేకరించి తేదీలవారీగా ఒక ప్రణాళిక రూపొందించుకొని, వారిని కలిసి ఆరోగ్య స్థితిని తెలుసుకొని ఎప్పటికప్పుడు వైద్యసేవలందించాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో ప్రజలకు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పనిచేసే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధునాతన వైద్య పరికరాలను ఏఏ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలో నివేదిక సమర్పించాలని, వైద్య పోస్టుల ఖాళీల వివరాలను తెలియజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ–ఔషధి పథకంలో వచ్చే మందుల వివరాలు ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి చేసి నివేదికగా అందించాలన్నారు. ప్రాథమిక కేంద్రాల్లో ఎక్కువ సమయం పని చేస్తే ప్రసవాల సంఖ్య పెరుగుతుందని, వైద్యులు పనిచేసే సెంటర్ల పరిధిలోనే నివాసం ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వైద్యులకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ మధుసూదన్, క్రాంతికుమార్, ఆస్పత్రి సూపరింటెండెట్లు వాసుదేవరెడ్డి, గోపాల్, రవిప్రవీణ్, ప్రోగ్రాం ఆఫీసర్ శృతి, రవీందర్ పాల్గొన్నారు. -
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
బోథ్(ఆదిలాబాద్) : అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు సక్రమంగా అందుతాయని కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. మండలంలోని వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో స్థానిక పరిచయ గార్డెన్లో మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ఆయా శాఖల అధికారులు నివేదికలు చదివి వినిపించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు వివరించగా త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో రైతుల కోసం కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్1800–120–3244కు ఫోన్ చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, రుణాల వంటి సమస్యలను తెలియజేయవచ్చన్నారు. ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ఎంపీడీవో, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు గ్రామపంచాయతీ 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను వెచ్చించాలన్నారు. మండలంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికారుల కృషి చేయాలన్నారు. జిల్లాలో జైనథ్, బోథ్, ఇచ్చోడ, బేల, ఆదిలాబాద్ మార్కెట్లలో శెనగ కొనుగోలు కేంద్రాలను వారం రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రాజేశ్వర్, ఎంపీపీ గంగుల లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు బండారు సాయమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల శారద, బోథ్ సర్పంచ్ మంగారపు సునీత, తహసీల్దార్ దుర్వ లక్ష్మణ్, ఎంపీడీవో బి.అప్పారావ్, వ్యవసాయాధికారి భాస్కర్, ఎఫ్ఆర్వో మనోహర్, రైతు సమసన్వయ సమితి అధ్యక్షుడు రుక్మణ్‌సింగ్, వివిధశాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆసుపత్రి తనిఖీ అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ గది నిర్మాణం పూర్తి కాకపోవడంతో సంబంధిత ఈఈతో ఫోన్లో మాట్లాడి సత్వరం పూర్తయ్యేలే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వార్డులను పరిశీలించారు. రోగులకు మెరుగైన సేవలందించాలని వైద్యులకు సూచించారు. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలి బజార్హత్నూర్(బోథ్): గ్రామాల్లో ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వివరించగా.. పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రాథోడ్, జెడ్పీటీసీ మునేశ్వర్ నారాయణ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అల్కే గణేశ్, జిల్లా సభ్యులు చిల్కూరి భూమన్న, సహకార సంఘం చైర్మన్ తురాటి భోజన్న, వైస్ ఎంపీపీ శ్రీమతి, సర్పంచ్‌లు సాయన్న, భాస్కర్‌రెడ్డి, విద్యాసాగర్, రాధ, భీంబాయి, పద్మ, రేణుక, కైలాస్, రాజు, ఎంపీటీసీలు నారాయణ, గంగాప్రసాద్, తహసీల్దార్ రాజేందర్‌సింగ్, ఎంపీడీవో శంకర్, ఏవో ప్రమోద్‌రెడ్డి పాల్గొన్నారు. కస్తూరిబా పాఠశాల, పీహెచ్సీ తనిఖీ మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎస్వో సెలవుపై ఉండడంతో పర్యవేక్షణ కరువైందని చెప్పగా రెగ్యూలర్ ఎస్వోను నియమిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేశారు. ప్రసుతి గది, రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. ఆసుపత్రి ప్రహరీకి నిధులు కేటాయిస్తానని తెలిపారు. -
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి
భూపాలపల్లి అర్బన్ : నీతి ఆయోగ్‌తో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌మిశ్రా అన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఆదివారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా దుర్గాశంకర్‌మిశ్రా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు, మిషన్ భగీర«థ పనులు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం, డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మా ణం, కేసీఆర్ కిట్ల పథకం అమలు తీరు బాగుందని తెలిపారు. అలాగే టూరిజం అభివృద్ధి పనులు చకచక సాగుతున్నాయని, జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా జంతు సంపద అధికంగా లేదన్నారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఇతర జంతువులు పెంపకాన్ని అధికారులు ప్రోత్సహించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శితో మాట్లాడి కర్ణాటక రాష్ట్రం తరహాలో ఎకో టూరి జానికి ప్రత్యేక అధికారులను నియమించేలా చూస్తామని తెలిపారు. మరో 8 నెలల్లో జిల్లా సందర్శనకు వస్తానని, అప్పటి లోపు అభివృద్ధి చేసి చూపించాలన్నారు. సమావేశంలో డీఎఫ్ఓ రవికిరణ్, డీఆర్వో మోహ న్లాల్, జిల్లా అధికారులు అనురాధ, డాక్టర్ అప్పయ్య, అక్బర్, రాజారావు, భూపాలపల్లి మునిసిపల్ కమిషనర్ రవీందర్, అధికారులు పాల్గొన్నారు. -
సామాజిక బాధ్యత పెంచడానికే తనిఖీలు
-మరో 25 అంగన్వాడీ కేంద్రాల దత్తత యోచన -కలెక్టర్ సతీమణి, శిశుసంజీవిని కో ఆర్డినేటర్ శ్రీదేవి వెదురుపాక(రాయవరం) : ‘జిల్లాలో 50 అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకున్నాను. ఆ కేంద్రాల్లో సామాజిక బాధ్యతను పెంచడానికి చేసిన ప్రయత్నం ఫలించింది. మరో 25 కేంద్రాలను దత్తత తీసుకునే యోచన ఉం’దని కలెక్టర్ సతీమణి, మహిళా శిశు సంజీవిని జిల్లా కో ఆర్డినేటర్ హెచ్.శ్రీదేవి తెలిపారు. మండలంలోని వెదురుపాకలో సోమవారం 10వ అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 5,546 సెంటర్లలో 50 సెంటర్లను యూనిసెఫ్ çసహకారంతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మహిళా శిశు సంజీవిని స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో మత్స్యకార, నాన్ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్న ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన బలహీనమైన చిన్నారులు జన్మిస్తున్నారని, వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరగడం లేదని అన్నారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకునేలా చైతన్యం కల్పిస్తూ ఏడాదిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సఫలమైందన్నారు. బాల్య వివాహాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బాల్య వివాహాలు చేసుకున్నవారికిì పుట్టే పిల్లలు బలహీనంగా ఉంటున్నారన్నారు. చిన్న గుడ్లు తీసుకోవద్దు.. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా శ్రీదేవి కోడిగుడ్లు చిన్నవిగా ఉండడం గమనించారు. గుడ్లు చిన్నవిగా ఉంటే ఎందుకు తీసుకుంటున్నారని కేంద్రం కార్యకర్తను ప్రశ్నించారు. చిన్నవిగా ఉన్న గుడ్లను వెనక్కు ఇవ్వాలని సూచించారు. చిన్నారులకు తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూశారు. చిన్నారులకు ఆటపాటలు ఎలా నేర్చుకున్నదీ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలను సమర్థంగా నిర్వహించేందుకు ఐసీడీఎస్ పీవో సీహెచ్ వెంకటనరసమ్మ, సూపర్వైజర్ అన్నపూర్ణలకు కొన్ని సూచనలు చేశారు. కార్యక్రమంలో వీఆర్వో పైన నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి పల్లేటి వెంకటరత్నం, యానిమేటర్ ఎం.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.