Colony residents
-
ఏపీ: అమరారెడ్డినగర్ కాలనీ వాసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సాక్షి, అమరావతి: తాడేపల్లి అమరారెడ్డినగర్ కాలనీ వాసుల పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. 245 మందికి స్థలాలు కేటాయించామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులకు నష్ట పరిహారం కూడా చెల్లించామని ప్రభుత్వం పేర్కొంది. ఇళ్లు ఖాళీ చేసేందుకు పిటిషనర్లు రెండు నెలలు సమయం కోరగా, వారి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. రెండు వారాల్లో ఇళ్లు ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
వర్షం కురవాలి.. సిరులు పండాలి
వర్షాలు పుష్కలంగా కురిసి సిరులు పండాలని కాంక్షిస్తూ ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీవాసులు దాదాపు వెయ్యి మంది పూజారి తిమ్మప్ప ఆధ్వర్యంలో గుంటె రంగస్వామికి తుంగభద్ర నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. ఎమ్మిగనూరు టౌన్: వర్షం కోసం ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీ వాసులు ఆయుధాలు చేపట్టారు. వీటితో పూజారి తిమ్మప్ప ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది పాదయాత్రగా నందవరం మండలంలోని గంగవరానికి వెళ్లారు. అక్కడ తుంగభద్ర జలాలను తీసుకొని శుక్రవారం అర్ధరాత్రి తిరుగు పయానమయ్యారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో పట్టణానికి చేరుకున్నారు. తుంగభద్ర జలాల బిందెతో పూజారి తిమ్మప్ప, కాలనీ వాసులు పట్టణంలోని వీధుల గుండా బయలుదేరి మధ్యాహ్నం 12.30గంటలకు వెంకటాపురం కాలనీకి చేరుకున్నారు. దారిపొడువున మహిళలు పూజారికి కాళ్లకు జలాభిషేకం చేసి ఆహ్వానం పలికారు. శ్రీగుంటె రంగస్వామి ఆలయం చుట్టూ ఐదుసార్లు పూజరితో పాటు జలాల కోసం వెళ్లిన ప్రజలు ప్రదక్షణ చేశారు. ప్రదక్షణ సందర్భంగా తమ కోర్కేలు తీర్చుకునేందుకు మహిళలు పూజారి కాళ్లకు అడ్డం పడుతూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. కాలనీలోని శ్రీగుంటెరంగస్వామికి పూజారి జలాభిషేకం చేశారు. అనంతరం శ్రీవెంకటేశ్వరస్వామి, లక్ష్మమ్మ అవ్వ, ఆంజనేయస్వామితో పాటు గ్రామదేవతలకు నదీ జలాలతో అభిషేకించారు. వర్షం కురవాలి..సిరులు పండాలంటూ శ్రావణమాసం మొదటి శనివారం ప్రతి ఏడాదీ దేవతలను తుంగభద్ర జలాలతో అభిషేకిస్తామని కాలనీ వాసులు తెలిపారు. నదీ జలా లు తీసుకొచ్చే సమయంలో అడవి జంతువుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు పూర్వీకులు ఆయుధాలు తీసుకెళ్లేవారని, ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని వారు పేర్కొన్నారు. కౌన్సిలర్లు భాస్కర్‌రెడ్డి, నాగమ్మ, కాలనీ పెద్దలు నీలకంఠరెడ్డి, బజారి, బి.జగన్నాథ్‌రెడ్డి, రంగన్న, పాండు, గుంటె రంగస్వామి పాల్గొన్నారు. -
న్యాయం చేయండి
సాక్షి, గుంటూరు: ‘మేం పైసా పైసా కూడబెట్టుకోని స్థలం కొనుకున్నాం. అప్పు, సప్పు చేసి లోన్లు పెట్టుకొని, కష్టార్జితంతో ఇల్లు కట్టుకొన్నాం. 30,40 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇళ్లు ఖాళీ చేయాలని దౌర్జ్యనం చేస్తున్నారు. ఆడవాళ్లను కూడా దారుణంగా బెదిరిస్తున్నారు’ అని మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెం అంబటినగర్ కాలనీ వాస్తవ్యులు వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వారంతా బుధవారం కలెక్టర్ కాంతిలాల్ దండేను కలిసి సమస్యను వివరించారు. భూమికి సంబంధించిన రికార్డులను కలెక్టర్‌కు చూపించారు.1967లొనే ఫ్లాట్లకు పంచాయతీ నుంచి అనుమతి పొందామని వివరించారు. ఇప్పుడు సింగ్‌నగర్ నుంచి రౌడీలు వచ్చి స్థలాలు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటి గేట్లు తోసుకొని లోపలికి వచ్చేస్తున్నారని, సింగ్‌నగర్ వచ్చి మాట్లాడాలని వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసుల ద్వారా రక్షణ కల్పించాలని వేడుకున్నారు. రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. బాధితులకు అండగా నిలిచిన ఆర్కే.. అంబటినగర్కాలనీవాసులకు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అండగా నిలిచారు. కాలనీవాసులు 20వ తేదీన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. నకిలీ ధృవపత్రాలు సృష్టించి, సబ్‌రిజిస్టార్‌పై ఒత్తిడి తెచ్చి రెండెకరాల స్థలాన్ని రిజిస్టర్ చేయించుకున్నారని వివరించడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు. బాధితులకు తగిన రక్షణ కల్పించాలని స్థానిక డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం బాధితులతో కలిసి కలెక్టర్‌కు ఆయన సమస్యను వివరించారు. కలెక్టర్ వెంటనే జిల్లా రిజిస్ట్రార్‌కు ఫోన్‌చేసి భూమి రికార్డులు తీసుకురావాలని సూచించారు. బాధితుల తరఫున న్యాయం ఉందని తేలితే ఆ ప్రాంతంలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు కూడా నిలుపుదల చేస్తామని హామీఇచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆర్కే విలేకర్లతో మాట్లాడుతూ కాలనీలో మధ్యతరగతి ప్రజలు, విశ్రాంత ఉద్యోగులు 50 ఏళ్లుగా ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారని చెప్పారు. ఇప్పుడు విజయవాడ నుంచి కొంతమంది వచ్చి దౌర్జన్యంగా ఇళ్లు ఖాళీ చేయమంటున్నారన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ అండగా ఉండి పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.పాతగుంటూరు : కాలనీలోని 783ఎ, బి, సి సర్వేనంబర్లలో మొత్తం 11. 20 ఎకరాలు భూమి ఉంది. అందులో విశాంత ఉద్యోగులు స్థలాలను కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకొని 150 కుటుంబాలు జీవిస్తున్నాయి. వారం రోజుల క్రితం కొందరు వ్యక్తులు వచ్చి ఇది ఓ జడ్జికి చెందిన భూమి అని బెదిరింపులకు దిగారు. అప్పటి నుంచి రోజు రోజుకు బెదిరింపులు పెరుగుతున్నాయి. ఆ వివరాలుబాధితుల మాటల్లోనే... రాజధాని ప్రచారంతోనే.. రాజధాని అని ప్రచారం జరగటంతో ఈ ప్రాంతాల్లో భూదందాలు జరుగుతున్నాయి. 20 సంవత్సరాలుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాం. నంబర్ ప్లేట్లు లేని కారుల్లో కొందరు రౌడీలు వచ్చి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కూడా భూమి మేడందంటూ బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి. - తాడేపల్లి లలిత ఎలా బతకాలి.. 50 సంవత్సరాల క్రితం చాలీచాలని జీతాలతో తినితినక స్థలాలు కొనుగోలు చేసి గృహాలు నిర్మించుకున్నాం.ఇప్పుడు ఖాళీచేయాలని బెదిరించటంతో ఎలా బతకాలో అర్థంకావటంలేదు. నా భర్త వికలాంగుడు. వికలాంగ పింఛన్‌తో జీవిస్తున్నాం. న్యాయం చేయాలి. - జానపాటి ఆదిలక్ష్మి పూర్తి పత్రాలు ఉన్నాయి న్యాయాన్ని కాపాడాల్సిన జడ్జి ఇటువంటి అక్రమాలకు పాల్పడుతుంటే మాలాంటి వారు ఎలా జీవించాలో అర్థంకావటంలేదు. పూర్తి పత్రాలు మా దగ్గర ఉన్నాయి. అయినా మళ్లీ ఏవిధంగా రిజిస్టర్ చేస్తారు. దీనిపై విచారణ చేసి అధికారులు న్యాయం చేయయాలి. - తమ్మ తార