comma
-
అనుకోని అరుదైన వ్యాధి ఆమె జీవితాన్నే మార్చేసింది
రాజస్తాన్: మనం కాస్త బాగొకపోతేనే డీలా పడిపోతాం. కొంచెం వంట్లో బాగోకపోతే ఇక రెస్ట్ తీసుకుంటాం. కానీ రాజస్తాన్‌కి చెందిన ఒక అమ్మాయి లక్షల్లో ఒక్కరికీ వచ్చే అరుదైన వ్యాధితో పోరాడుతూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడానికీ శతవిధాల ప్రయత్నిస్తోంది. వివరాల్లోకెళ్లితే..... రాజస్తాన్‌కి చెందిన హర్షిత దరియాని 11 ఏళ్ల ప్రాయంలో తల్లిని కోల్పయింది. అంత చిన్నవయసులో ఆ దుఃఖాన్ని అధిగమించి అందరిలా నవ్వుతూ, ఆడుతూ...హయిగా చదువుకునేది. సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటుండగా అనుకోని అరుదైన గుయిలిన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్ ) వ్యాధి ఆమెను మళ్లీ అగాధంలోకి తీసుకువెళ్లిపోయింది. హర్షిత ఇంటర్మీడియేట్‌లో ఉండగా ఒక రోజు బ్యాడ్మింటన్ ఆడుతుంటే ఎడమ చేయి విపరీతమైన నొప్పి వచ్చి ఇక ఆడలేక హాస్టల్‌కి వచ్చేసింది. ఆ తర్వా త రోజు స్టడీ అవర్స్ కోసమై వార్డెన్ మేడం తెల్లవారుఝూమున లేపితే ఆమె అసలు బెడ్‌మీద నుంచి ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అప్పుడే తెలిసింది అత్యంత అరుదుగా నూటికి ఒక్కరికో ఇద్దరికో వచ్చే గుయిలిన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్ ) బాధపడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు. అప్పటికే ఆమె ఆ వ్యాధి నరాల వ్యవస్థపై దాడి చేసి శరీరం మొతం పక్షవాతం వచ్చినట్లుగా చలనం లేకుండా చేసేసింది. ఆఖరికి ఊపిరితిత్తులు కూడా పనిచేయడం మానేశాయి. దీంతో శ్వాస తీసుకోవడమే కష్టమైంది, ఆమె ఐసీయూలో 47 రోజులు కోమాలోనే ఉంది. అయినప్పటికీ విద్యాసంవత్సరాన్ని క్పోల్పోకుండా పరీక్షకి వీల్ చైర్లో వెళ్లి మరీ రాసి మంచి మార్కులతో ఇంటర్మీడియేట్ పాసై అయ్యింది. కానీ ఈ వ్యాధి కారణంగా తనకి ఇష్టమైన మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలన్న ఆశను వదులుకోవల్సి వచ్చింది. ప్రస్తుతం తాను బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వుతున్నానని, అమెజాన్‌తో కలిసి పనిచేయడానికీ ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ మేరకు హర్షిత మాట్లాడుతూ..."సరిగ్గా ఐద్దేళ్ల క్రితం తాను కనీసం కళ్ల రెప్పలను కూడా కదిలించ లేకపోయాను చూపుతోటే చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడూ వాటన్నింటిని అధిగమించగలిగాన. జీబీఎస్ వ్యాధి నా జీవితాన్ని మార్చేసింది. దేన్నైన తట్టుకుని బతకలగలనన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది. ఈ కష్టం నన్ను కదలనియదు అనుకున్నాను కానీ కాలంతో పాటు అది మారిపోతుంది. కబళించేసేంతా కష్టమైన కదలకుండ ఉండదని, కాల గమనంతోపాటు మారిపోతుంది" అంటూ తన ఆత్మస్థైర్యాన్ని వ్యక్తం చేసింది. -
బాలుడిని కాపాడిన వైద్యులు
సైకిల్ తొక్కుతూ కిందపడి గాయపడిన శ్రీరామకృష్ణ నాయక్ గుంటూరు మెడికల్ : సైకిల్ తొక్కుతూ జారిపడి గొంతు వాపు, ఛాతి వాపు సమస్యతో ఆసుపత్రికి వచ్చిన బాలుడు కోమాలోకి వెళ్లడంతో మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాపాయ స్థితి నుంచి అతనిని కాపాడినట్లు గుంటూరు జీజీహెచ్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ మెగావత్ మోతిలాల్ చెప్పారు. ఆసుపత్రిలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అచ్చంపేట మండలం, తాడవాయి తండాకు చెందిన భుక్కా భాస్కర్‌నాయక్, సాయిబాయి రెండో కుమారుడు శ్రీరామకృష్ణ నాయక్ S ఈనెల 19న ఇంటి వద్ద సైకిల్ తొక్కుతూ పడిపోయాడు. గొంతు మధ్య భాగంలో బలమైన గాయం, విపరీతమైన నొప్పి, ఛాతిపైన వాపుతో చికిత్స కోసం అదేరోజు జీజీహెచ్‌కు అచ్చంపేట వైద్యుల సూచనల మేరకు తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అదేరోజు రాత్రి సీటీ స్కాన్, చెస్ట్ ఎక్స్‌రే పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసుకున్నారు. ఛాతి కుడివైపు భాగంలో, ఒళ్ళంతా చెడు గాలి చేరడం వల్ల వాపు వచ్చిందని, దీన్ని వైద్య పరిభాషలో సర్జికల్ ఎంఫైసియా, నిమో థొరాక్స్గా పిలుస్తారని డాక్టర్ మోతిలాల్ చెప్పారు. పక్కటెముకలకు గొట్టం అమర్చి వాపు తగ్గిస్తున్న సమయంలో పిల్లవాడికి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడని, నాలుగు రోజులపాటు కోమాలోనే ఉన్నాడని వెల్లడించారు. సీటీ బ్రెయిన్ పరీక్ష చేసి శరిబ్రల్ ఎడిమాగా నిర్ధారణ చేశామని, మెడలో నీరు చేయడం వల్ల బాలుడు కోమాలోకి వెళ్ళినట్లు నిర్ధారణ చేశామన్నారు. నాలుగు రోజుల పాటు మెరుగైన వైద్య సేవలు అందించి కోమాలో చనిపోయే స్థితిలో ఉన్న పిల్లవాడిని తిరిగి బతికించామని డాక్టర్ మోతిలాల్ వివరించారు. జీజీహెచ్ సీటీఎస్ వైద్య విభాగంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. బాలుడి ప్రాణాలు రక్షించిన డాక్టర్ మోతిలాల్‌కు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. బాలుడిని మంగళవారం డిశ్చార్జి చేశారు. -
‘కామా’కు ఫుల్స్టాప్!
లండన్: ఆంగ్ల భాష వాక్య నిర్మాణంలో విరివిగా ఉపయోగించే విరామ చిహ్నమైన ‘కామా’ వాడకానికి ‘ఫుల్స్టాప్’ పెట్టొచ్చని ఓ అమెరికా విద్యావేత్త సూచించారు. ఆధునిక అమెరికా వాచకాల నుంచి ఈ చిహ్నాన్ని తొలగించినా వాక్యాల స్పష్టత విషయంలో ఎటువంటి నష్టం జరగదని కొలంబియా యూనివర్సిటీకి చెందిన తులనాత్మక సాహిత్య, ఆంగ్ల అసోసియేట్ ప్రొఫెసర్ జాన్ మెక్వోర్టర్ అభిప్రాయపడ్డారు. నెటిజన్లతోపాటు ఆధునిక రచయితలు వారికి తోచినట్లుగా లిపిని వాడుతున్నారని, ‘కామా’ను వాడటానికి ఇష్టపడటంలేదని చెప్పారు. ఇటువంటి వాటి వాడకం కేవలం సంప్రదాయమేనని... కాలానుగుణంగా అవి మారుతుంటాయన్నారు.