నేడు మధురపూడికి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఆదివారం మధురపూడి విమానాశ్రయానికి రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు చెప్పారు. శనివారం ఇక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లేందుకుగాను జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ నుంచి మధురపూడి విమానాశ్రయానికి మధ్యాహ్నం 1.30 గంటలకు వస్తున్నారని చెప్పారు. జననేతకు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం విమానాశ్రయానికి తరలిరావాలని కన్నబాబు పిలుపునిచ్చారు.