Common Account Number
-
కామన్ అకౌంట్ నంబర్ అంటే?
ఫండ్స్‌లో కామన్ అకౌంట్ నంబర్ (క్యాన్) అంటే ఏమిటి? ఇందులో అనుకూల, ప్రతికూలతలు ఏమున్నాయి? – దిలీప్ కామన్ అకౌంట్ నంబర్/క్యాన్ అనేది ఎంఎఫ్ యుటిలిటీస్ వద్ద రిజిస్టర్ చేసుకున్న వారికి ఇచ్చే ఏకీకృత ఖాతా. ఇది మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి అన్ని రకాల లావాదేవీలను నిర్వహించే ఏకీకృత వేదిక. 2015లో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అన్నీ కలసి దీన్ని ఏర్పాటు చేశాయి. ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులకు సౌకర్యం, సులభతర నిర్వహణ దీని ఏర్పాటు ఉద్దేశ్యంగా ఉంది. ఈ ప్లాట్‌ఫామ్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడికి వీలు కల్పిస్తుంది. ఒక ఇన్వెస్టర్ వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు చెందిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే, విడివిడిగా ఖాతాలు ప్రారంభించి, లావాదేవీలను నిర్వహించుకోవాలి. ఇందుకోసం ప్రతి ఏఎంసీ వద్ద విడిగా నమోదు చేసుకోవాలి. అయితే, క్యాన్‌ను కలిగి ఉండడం తప్పనిసరి కాదు. ఎంఎఫ్ యుటిలిటీ ద్వారానే ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన కూడా లేదు. ఇదొక వేదిక మాత్రమే. ఆ తర్వాత కాలంలో ఎన్నో ఫిన్‌టెక్ కంపెనీలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా, బ్రోకర్ల ద్వారా సులభంగా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. నా వయసు 40 ఏళ్లు. వచ్చే ఏడాది పీపీఎఫ్ గడువు తీరి రూ.15 లక్షలు చేతికి వస్తాయి. ఎన్పీఎస్ తదితర అధిక వృద్ధికి అవకాశం ఉన్న సాధనాల్లోకి ఈ మొత్తాన్ని బదిలీ చేయాలని అనుకుంటున్నాను. పీపీఎఫ్ నుంచి నాకు అందే మొత్తం పన్ను మినహాయింపు కిందకు వస్తుందని తెలిసింది. కనుక ఈ మొత్తాన్ని క్రమానుగతంగా ఈక్విటీ ఫండ్స్‌లోకి మళ్లించేది ఎలా? – సుచిత్ పూతియా పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లోకి మళ్లించే సమయంలో మీరు కొన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఇందులో ముందుగా డ్యురేషన్ ఒకటి. మీరు ఆ మొత్తం సమకూర్చుకోవడానికి పట్టిన కాలంలో సగం కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మీరు పీపీఎఫ్‌లో 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఈ మొత్తం సమకూరింది. కనుక ఏడున్నరేళ్ల పాటు సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయమని కాదు. గరిష్టంగా మూడేళ్లకు మించకుండా నెలవారీ వాయిదాల రూపంలో మీ వద్దనున్న మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ పెట్టుబడిని సమకూర్చుకోవడానికి ఐదేళ్లు పట్టిందని అనుకుందాం. అందులో సగం అంటే రెండున్నరేళ్ల పాటు క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ నూతన కాల వ్యవధి 15–20 ఏళ్లు అని అంటున్నారు. కనుక ఈక్విటీలకు ఎక్కువ కేటాయించుకోవాలి. ఎందుకంటే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించి మెరుగైన రాబడులను ఈక్విటీలు ఇవ్వగలవు. ఎన్పీఎస్ పథకాన్ని ఎంపిక చేసుకుంటే అందులో ఈక్విటీల్లో 75% ఇన్వెస్ట్ చేసే యాక్టివ్ చాయిస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 60 ఏళ్లకు వచ్చిన తర్వాత అప్పటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్నే ఉపసంహరించుకోవడానికి ఉంటుంది. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ వరకు నిధిని ముట్టుకోని వారు అయితే, ఫ్లెక్సీ క్యాప్ఫండ్స్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలు. ఉపసంహరణలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఎన్‌పీఎస్‌లో అయితే ఈక్విటీ పెట్టుబడుల్లో అధిక శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కే కేటాయిస్తారు. కానీ, ఫ్లెక్సీక్యాప్ పథకాలు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి పెట్టుబడులను వైవిధ్యం చేస్తాయి. కనుక ఇవి కొంచెం మెరుగైన రాబడులు ఇస్తాయి. ఇప్పటి వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన అనుభవం లేకపోతే, నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకునే విషయంలో ఆందోళన చెందుతుంటే, అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి ఈక్విటీల్లో 65% వరకే ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన 35 శాతాన్ని డెట్‌లో పెడుతాయి. దీనివల్ల ఈక్విటీల్లోని అస్థిరతలను కొంత వరకు తగ్గించుకోవడానికి వీలుంటుంది. ఈక్విటీలతో పోలిస్తే స్థిరమైన రాబడులు ఇస్తాయి. -
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: ఈ విషయాలు తెలుసా మీకు?
మ్యూచువల్ ఫండ్స్‌లో కామన్ అకౌంట్ నంబర్ (క్యాన్) అంటే ఏమిటి? ఇందులో అనుకూల, ప్రతికూలతలు ఏమున్నాయి? ఇన్వెస్టర్లు దీని కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరా? -దిలీప్ సాహి కామన్ అకౌంట్ నంబర్/క్యాన్ అనేది ఎంఎఫ్ యుటిలిటీస్ వద్ద రిజిస్టర్ చేసుకున్న వారికి ఇచ్చే ఏకీకృత ఖాతా. ఇది మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి అన్ని రకాల లావాదేవీలను నిర్వహించే వేదిక. 2015లో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అన్నీ కలసి దీన్ని ఏర్పాటు చేశాయి. ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారుల సౌకర్యం, సులభతర నిర్వహణ దీని ఏర్పాటు ఉద్దేశ్యం. ఈ ప్లాట్‌ఫామ్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడికి వీలు కల్పిస్తుంది. ఒక ఇన్వెస్టర్ వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు చెందిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే, విడివిడిగా లావాదేవీలను నిర్వహించుకోవాలి. ఇందుకోసం ప్రతి ఏఎంసీ వద్ద విడిగా నమోదు చేసుకోవాలి. 2015లో ఎంఎఫ్‌యూ ఏర్పాటు తర్వాత ఇన్వెస్టర్లు ఇందులో క్యాన్ తెరిచి వాటన్నింటినీ దీని నుంచే నిర్వహించుకునే ఏర్పాటు అందుబాటులోకి వచ్చింది. ఏ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలో ఇన్వెస్ట్ చేసినా క్యాన్‌కు మ్యాపింగ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులన్నింటినీ ఈ ఖాతానుంచే చూసుకోవచ్చు. నిర్వహించుకోవచ్చు. తాజా పెట్టుబడులు, పెట్టుబడుల ఉపసంహరణలు, కాంటాక్టు వివరాల్లో మార్పులు అన్నీ కూడా క్యాన్‌లో చేసుకుంటే సరిపోతుంది. క్యాన్‌ను కలిగి ఉండడం తప్పనిసరి కాదు. ఎంఎఫ్ యుటిలిటీ ద్వారానే ఇన్వెస్ట్ చేయాలని లేదు. ఇదొక వేదిక మాత్రమే. ఆ తర్వాత కాలంలో ఎన్నో ఫిన్‌టెక్ కంపెనీలు అందుబాటులోకి వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే కేవైసీ పూర్తి చేసి ఉండాలి. పాన్, ఫొటో, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆదాయ మూలం తదితర వివరాలతో ఏదైనా మ్యూచువల్ ఫండ్ సంస్థను లేదా క్యామ్స్ తదితర ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లను సంప్రదించి కేవైసీ నమోదు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారుల ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈటీఎఫ్‌లకు సంబంధించి డివిడెండ్లు నా బ్యాంకు ఖాతాకు జమ అవుతాయా? పన్ను ఎలా లెక్కిస్తారు? -శరణ్ డివిడెండ్లు అన్నవి కంపెనీ నుంచి వాటాదారులకు అందే లాభాలు. మన దేశంలో ఈటీఎఫ్‌లు ఇన్వెస్టర్లకు డివిడెండ్లు చెల్లించడం లేదు. దీనికి బదులు డివిడెండ్ రూపంలో కంపెనీల నుంచి వచ్చిన మొత్తాన్ని ఈటీఎఫ్‌లు తిరిగి అదే పథకంలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇటువంటి సందర్భాల్లో బెంచ్‌మార్క్ రాబడులకు, ఈటీఎఫ్ రాబడులకు మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. ఈటీఎఫ్‌లు బెంచ్‌మార్క్‌ను అనుసరించే ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక ఈ రెండింటి మధ్య డివిడెండ్ల రూపంలో వచ్చిన రాబడుల వ్యత్యాసాన్ని ట్రాకింగ్ ఎర్రర్‌గా పరిగణిస్తారు. ‘గతంలో ఈటీఎఫ్‌లు ఇన్వెస్టర్లకు డివిడెండ్లు ప్రకటించేవి. కానీ, ఇప్పుడు కేవలం లిక్విడ్ ఈటీఎఫ్‌ల వరకే ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటిస్తున్నాయి. వారి ఖాతాల్లో జమ చేస్తున్నాయి’అని ఓ ప్రముఖ ఫండ్ హౌస్ సీనియర్ అధికారి ఈ విషయంలో సమాచారాన్ని తెలియజేశారు. ఇక డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం 2020-21 తర్వాత నుంచి ఇన్వెస్టర్ల ఆదాయంగా పరిగణించి పన్ను అమలు చేస్తున్నారు. ఇన్వెస్టర్ ఆదాయపన్ను శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. ధీరేంద్ర కుమార్, సీఈఓ వాల్యూ రీసెర్చ్ -
మ్యూచువల్ ఫండ్లకూ ‘సింగిల్ విండో’
మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. ఒక ఫారం నింపటంతో పాటు... ఇవ్వాల్సిన మొత్తానికి చెక్ రాసివ్వాలి. అదే సంస్థ ఆఫర్ చేస్తున్న వేరొక ఫండ్‌లో పెట్టుబడి పెడదామనుకుంటే... మరో ఫారం నింపి, మరో చెక్ ఇవ్వాలి. ఇతర సంస్థలు ఆఫర్ చేస్తున్న ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే... మళ్లీ కథ మొదటికే. అన్నిటికీ ప్రత్యేక ఫారాలు... ప్రత్యేక చెక్‌లు. వీటిన్నిటికీ విరుగుడుగా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ). ఒక సింగిల్ విండో లావాదేవీల ప్లాట్‌ఫారాన్ని ‘మ్యూచువల్ ఫండ్ యుటిలిటీ’ ’(ఎంఎఫ్‌యూ) పేరిట ఆరంభిస్తోంది. దీనిద్వారా ఎన్ని సంస్థలకు చెందిన ఎన్ని ఫండ్లలో పెట్టుబడి పెట్టినా... ప్రత్యేక ఫారాలు, ప్రత్యేక చెక్కులు అవ సరం లేదు. అదీ కథ. ఎంఎఫ్‌యూ ద్వారా జరిగే లావాదేవీలన్నీ ప్రాసెసింగ్ కోసం అసెట్ మేనేజిమెంట్ కంపెనీలు, లేక రిజిష్ట్రార్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లకు వెళ తాయి. ఈ ప్లాట్‌ఫారాన్ని యాక్సెస్ చేసుకోవటానికి మీకు ‘కామన్ అకౌంట్ నంబర్’ (క్యాన్) ఉండాలి. దీన్ని రిజిస్ట్రేషన్ ఫారం నింపి ఇవ్వటం ద్వారా ఏ ఎంఎఫ్ ఏజెన్సీ, లేదా డిస్ట్రిబ్యూటర్ దగ్గరైనా పొందవచ్చు. ఈ ప్లాట్ ఫారం వల్ల వ్యక్తులు 24 గంటల్లో ఎప్పుడైనా తమ మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్లను ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. పోర్టు ఫోలియో సమాచారమే కాక, ఇతర స్కీమ్ సంబంధ సమాచారాన్ని కూడా అప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ఇంకా తమ ఇన్వెస్ట్మెంట్లను సమర్థంగా నిర్వహించుకోవటానికి వీలుగా అలెర్ట్‌లు, ట్రిగ్గర్లు, రిమైండర్ల వంటి విలువ ఆధారిత సేవలూ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 25 ఏఎంసీ కంపెనీలు ఈ ఎంఎఫ్యూను వినియోగించుకోవటానికి అంగీకరించాయి. ఈ నెల 4వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.