completes 10 years
-
పదేళ్ల ప్రయాణం ఉల్లాసంగా సాగింది
అనంతపురం సప్తగిరిసర్కిల్ : ఆర్డీటీ ఆధ్వర్యంలో పదేళ్లుగా నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ కోచింగ్ క్యాంపు ప్రయాణం ఉల్లాసంగా సాగుతోందని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం అనంత క్రీడా గ్రామంలో సెయింట్ విన్సెంట్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన స్పెయిన్ బృందం వేసవి ఫుట్‌బాల్ శిక్షణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు జిల్లాలో 1600 మంది క్రీడాకారులు ఫుట్‌బాల్ ఆడుతున్నారంటే దానికి కారణం ఆనాడు సెయింట్ విన్సెంట్ ఫుట్‌బాల్ క్లబ్ వారు చేసిన కృషి వల్లనే సాధ్యపడిందన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 24 మంది సభ్యులతో కూడిన బృందం పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ బృందం జిల్లాలోని అన్ని కేంద్రాల్లోనూ ఈ నెల 2 నుంచి 10 వరకు శిక్షణ అందించి క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తుందన్నారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ పదేళ్ల ప్రయాణం సందర్భంగా కేక్‌ను కట్ చేసి, బ్రోచర్ విడుదల చేశారు. కార్యక్రమంలో స్పెయిన్ మేయర్ మైఖెల్, క్లబ్ వైస్ చైర్మన్ పటావు, స్పెయిన్ బృందం సభ్యుడు పెరీఫెర్రర్, ఆర్డీటీ డైరెక్టర్లు నిర్మల్‌కుమార్, దశరథరామయ్య, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, కార్యదర్శి నాగరాజు, ఆర్డీటీ వైద్యుడు సయ్యద్ హుస్సేన్, శాప్ ఫుట్‌బాల్ కోచ్ జాకీర్, అకాడమీ కోచ్‌లు దాదాఖలందర్, రియాజ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్గీరాజా రికార్డు బద్దలయింది
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆదివారం ముఖ్యమంత్రి స్థానంలో పదేళ్లు పూర్తి చేసుకొని అంతకుముందు మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌కు ఉన్న రికార్డును బద్దలు కొట్టేశారు. పదేళ్లకాలంపాటు మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా కూడా ఆయన కొత్త రికార్డును లిఖించారు. 2005లో తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన శివరాజ్ సింగ్ చౌహాన్.. తొలిసారి ఎమ్మెల్యేగా బుద్ని నియోజకవర్గం నుంచి 1989-90 మధ్యలో ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ వంటి నేతలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతం నచ్చి ఓ సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తాను మొత్తం జీవితాన్ని ప్రజలకోసమే వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీతో సహా పలువురు అగ్రనేతలు తనకు ఫోన్ కాల్ చేసి అభినందించారని, తన పనితీరు బాగుందని ప్రశంసలు కురిపించారని చెప్పారు. దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1993 నుంచి 2003మధ్యకాలంలో పదేళ్లపాటు పనిచేశారు. -
దానికి సమయం ఏది?
నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్న కథానాయికల పట్టికలో నటి తమన్న చేరారు. అలాగే వయసు పరంగాను రెండున్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఈ 25 ఏళ్ల భామ పదేళ్లలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మూడు పదుల చిత్రాలు చేశారు. వీటిలో అధికంగా టాలీవుడ్ చిత్రాలే ఉండటం, ఈ బ్యూటీని విజయపథంలో కూర్చోబెట్టింది ఆ సినిమాలే కావడం విశేషం. కథానాయకిగానే కాదు, అతిథి పాత్రలు, ఐటమ్‌సాంగ్స్ కూడా ఎలాంటి చింతా లేకుండా ఆడేశారీకాంత. తమిళంలో పైయ్య, తెలుగులో రచ్చ వంటి చిత్రాల్లో వాన పాటలు తడి తడి అందాలు ఆరబోయడానికి వెనుకాడలేదు. తాజాగా నయనతార నాయకిగా నటిస్తున్న తమిళ చిత్రం నన్భేండాలో ఐటమ్ సాంగ్‌లో అందాలమోతతో కుర్రకారుని గిలిగింతలు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ పాటలో నటించడానికి నయనతార నిరాకరించడంతో తమన్నతో స్టెప్స్ వేయించనున్నారని కోడంబాక్కం వర్గాల సమాచారం. తమన్న నటించిన బాలీవుడ్ చిత్రం చాంద్‌సా రోషన్ చెహా చిత్రం మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. మరో విషయం ఏమిటంటే పదేళ్లుగా ప్రముఖ నటిగా వెలుగొందుతున్న ఈ అమ్మడి పై పెద్దగా వదంతులు ప్రచారం కాకపోవడం విశేషం. ప్రేమ, దోమా ప్రచారాలకు కూడా తావివ్వలేదనే పేరు సంపాదించుకోవడం సాధారణ విషయం కాదు. ఎవరిని ప్రేమించలేదా? అన్న ప్రశ్నకు తమన్న బదులిస్తూ తనకంత సమయం ఎక్కడుంది అంటున్నారు. ఆమె మాట్లాడుతూ తాను చాలా చిన్న వయసులోనే అంటే ప్లస్1 చదువుకుంటున్న సమయంలోనే హీరోయిన్గా తెరంగేట్రం చేశానని తెలిపారు. ఇంకా చెప్పాలంటే బాల తారగానే నటినవ్వాలని ఆశించానని అన్నారు. అయితే ఆశలన్నీ వాస్తవ రూపం దాల్చవుకదా అన్నారు. అదే విధంగా తాను కళాశాల జీవితాన్ని చాలా కోల్పోయానన్నారు. తొలుత తనకు విజయానందాన్ని కలిగించింది తెలుగు చిత్ర పరిశ్రమఅని వెల్లడించారు. హ్యాపీడేస్ చిత్రంలో లక్కీగా అవకాశం లభించిందని ఆ చిత్రం అనూహ్య ఘన విజయం సాధించి, తన సినీ జీవితాన్నే మార్చేసిందని పొంగిపోయారు. అదే విధంగా తమిళంలో పయ్యా చిత్రం కూడా తనకు మంచి బ్రేక్ నిచ్చిందన్నారు. ఇకపోతే వదంతులను ఎలా తప్పించుకుంటున్నారని అడుగుతున్నారని నిజం చెప్పాలంటే తన జీవితమే సినిమామయం అన్నారు. సినిమాకు చెందిన వారు మినహా ఇతరులెవ్వరితోను తనకు పరిచయాలు లేవని వెల్లడించారు. తన చుట్టూ ఎప్పుడూ సినిమావారే ఉంటారని వారితో కూడా సినిమా విషయాలనే చర్చిస్తుంటానని, ఇతర సమయాల్లో కలవనని తమన్న అన్నారు.