త్వరలో సమగ్ర ఆరోగ్య విధానం
న్యూఢిల్లీ: ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్రధాన వ్యాధులకు సం బంధించి త్వరలో సమగ్ర ఆరోగ్య విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. తన శాఖకు చెందిన ఉన్నతాధికారులతో దాదాపు మూడుగంటలపాటు సమావేశమైన వర్ధన్... ఆరోగ్య రంగం, కొత్త కొత్త కార్యక్రమాలపై వారితో చర్చలు జరిపా రు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య రంగంపై తమ శాఖ దృష్టి సారించిందన్నా రు. ఇందులోభాగంగా కొత్త కొత్త కార్యక్రమాలను చేపడతామన్నారు. ఆరోగ్యాన్ని ఓ సామాజిక ఉద్యమంగా మలుస్తామన్నారు. వివిధ వ్యాధులపై ప్రజ లకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇందుకు సంబంధించి తమ శాఖ అనేక మంది నిపుణులతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు.
వర్ధన్ నివాసం ఎదుట ఆప్ నిరసన ప్రదర్శన
ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారి (సీవీఓ) సంజీవ్ చతుర్వేదిని పదవి నుంచి తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తలు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నివాసం ఎదుట సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులను చేబూనిన వీరంతా వర్ధన్‌కు వ్యతిరేకంగా నినదించారు. బీజేపీ నేత అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చాడనే కోపంతోనే సంజీవ్‌ను బలి పశువు చేశారన్నారు. కాగా ఈ నెల 20వ తేదీన ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారి (సీవీఓ) సంజీవ్ చతుర్వేదిని కేంద్ర ప్రభుత్వం అకారణంగా పదవినుంచి తప్పించిన సంగతి విదితమే. ‘కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రోజుకో రీతిలో వ్యవహరిస్తున్నారు. తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు వీలుగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు.