compulsion
-
బిల్లుకు అయిష్టంగానే విపక్షాల ఆమోదం
భోపాల్/జైపూర్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లుకు పార్లమెంట్లో ప్రతిపక్షాలు మరో గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే మద్దతు ఇచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నారీశక్తిని అర్థం చేసుకొని, సంకోచిస్తూనే బిల్లుకు ఆమోదం తెలిపాయని అన్నారు. తమ పట్టుదల వల్లే బిల్లు పార్లమెంట్లో నెగ్గిందని వివరించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లు పరిస్థితి ఏమిటో మనకు తెలిసిందేనని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అహంకార కూట మికి అధికారం అప్పగిస్తే ఈ బిల్లు విషయంలో వెనక్కి మళ్లుతాయంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. బిల్లు పరిస్థితి వెనక్కి వెళ్లిపోతుందని పరోక్షంగా స్పష్టం చేశారు. జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో సోమవారం నిర్వహించిన ‘కార్యకర్త మహాకుంభ్’లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీని తుప్పు పట్టిన ఇనుముతో పోల్చారు. బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్‌కు అలవాటేనని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ను రాజకీయ నాయకులు నడిపించడం లేదని, పార్టీని అర్బన్ నక్సలైట్లకు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలను, నినాదాలను ఈ లీజుదారులే నిర్ణయిస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గనుక గెలిపిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ దివాలా తీసింది కాంగ్రెస్ దేశంలో ప్రతికూలతను వ్యాప్తి చేస్తోందని, దేశం సాధించిన ఘనతలను ఆ పార్టీ ఇష్టపడడం లేదని ప్రధానమంత్రి మోదీ ధ్వజమెత్తారు. దేశాన్ని 20వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థను కాంగ్రెస్ వ్యతిరేకించిందని, కానీ, ప్రపంచ దేశాలు ఈ వ్యవస్థను ప్రశంసించాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ మనోబలం కోల్పోయిందని, దివాలా తీసిందని చెప్పారు. అందుకే అర్బన్ నక్సలైట్లకు పార్టీని లీజుకు ఇచ్చారని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు ప్రజాబలం లేదన్నారు. మహిళలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే వారంతా అప్రమత్తంగా ఉండాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పేదలు ఎప్పటికీ పేదలుగా ఉండాలన్నదే కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించాలి రాజస్తాన్‌లో సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువత జీవితాల్లో ఐదేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలి్పంచలేదని అన్నారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ‘పరివర్తన్ సంకల్ప్ మహాసభ’లో మాట్లాడారు. పరిపాలన పరంగా కాంగ్రెస్ సర్కారుకు సున్నా మార్కులే వస్తాయన్నారు. కాంగ్రెస్ పాలనలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. మహిళల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కాంగ్రెస్ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచి్చందని చెప్పారు. -
ఇష్టంగానే సెక్స్ వర్క్ చేస్తున్నాం!
బెంగళూరు: సాటి మనిషికి పట్టించుకునే తీరిక లేనప్పుడు సమస్యలు ఆ వ్యక్తిని చెడుగుడు ఆడేస్తాయి. వాటి బెంగతో కొందరు మహిళలు.. ప్రాణం తీసుకుంటే.. ఇంకొందరు పోరాటానికి నిలబడతారు. మరికొందరు మానం(గౌరవం) ఇచ్చేసైనా బతుకుతారు.. బతికిస్తారు. ఆ సమయంలో గౌరవం లాంటివి వారిని ముందుకు నడిపించలేవు. ఆత్మాభిమానం వారిని అడ్డుకోలేదు. ఎందుకంటే ఆ సమయంలో వారికి అమాంతం తొక్కేస్తున్న సమస్య అనే భూతాన్ని చంపడమే లక్ష్యంగా ఉంటుంది. బెంగళూరులో సునీత(పేరు మార్చాం) అనే మహిళకు 30 ఏళ్లు. చాలా చిన్న వయసులో పెళ్లి చేశారు. ఇద్దరు పిల్లలు కలగగానే భర్త చనిపోయాడు. పరిస్థితులు వెంటనే ఆమెను వ్యభిచార రొంపిలోకి దింపాయి. అక్కడ అనుభవిస్తున్న బాధ నుంచి ఎలాగైనా విముక్తి పొందాలని ఎదురుచూసింది. పోలీసుల రూపంలో సహాయం దొరకడంతో ఆ కూపంలో నుంచి తప్పించుకోగలిగింది. దాదాపు పదేళ్లపాటు అందులో నరకం అనుభవించి తిరిగి స్వేచ్చను పొందింది. ఇప్పుడు ఆమె ఓ వ్యక్తిని తన పిల్లలకు రక్షణగా, తనకు తోడుగా ఉండేందుకు పెళ్లి చేసుకుంది. అతడు ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. అయితే, ఆమె తన వృత్తిని మాత్రం మానుకోలేదు. భర్త ఇష్టం మేరకే ఆ పనికొనసాగిస్తుంది. అయితే, ఈసారి అలాంటి గృహానికి వెళ్లి కాదు.. బలవంతంగా కాదు. ఆమె ఇష్ట ప్రకారమే.. నచ్చినవారితో మాత్రమే ఆ పనిచేస్తోంది. 'నేనొక సెక్స్ వర్కర్ని.. కానీ బలవంతంగా ఆ పనిచేయడం లేదు.. చాయిస్ ప్రకారం చేస్తున్నాను' అని చెప్తోంది. అలాగే శశికల(పేరు మార్చాం) అనే మరో మహిళ కూడా సెక్స్ వర్కరే.. ఆమె కూడా తన చాయిస్ ప్రకారమే ఆ పనిచేస్తుంది తప్ప బలవంతంగా చేయడం లేదంటూ బదులిచ్చింది. ఆమెకు ముగ్గురు పిల్లలు.. వారిలో ఇద్దరి పెళ్లిల్లు కూడా చేసింది. ఆమె ఆ పనిచేస్తున్న విషయం తన పిల్లలకు తెలుసని.. తన వృత్తే తమకు భోజనం పెడుతుందని, చదువుకు ఫీజులు కట్టిందని.. తన కోడలికి కూడా తన వృత్తి విషయం చెప్పినట్లు చెప్పింది. ఇలా ఎంతోమంది తమకు ఇష్టం ఉండే, నచ్చినవారితోనే అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప ప్రస్తుతం బలవంతంగా ఆ పనిచేయడంలేదని, తమ జీవితాలు ఎలా ఉన్నా తమ పిల్లల భవిష్యత్తు బంగారంగా మారుతుందనే ఈ వృత్తి చేస్తున్నామని చెప్తున్నారు. -
'పుట్టుకతో భారతీయుడిని కాదు..కానీ'
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ తాను భారతీయుడిని అని ధృవీకరించారు. పాస్ పోర్ట్ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన ఆయన ఆప్లికేషన్ ఫారమ్ లో తాను భారతీయుడినని పేర్కొన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ అక్కడి కార్యాలయంలో బయోమెట్రిక్ డాటా అయిన వేలి ముద్రలు, ఐరిష్ తదితర వివరాలను సమర్పించారు. కుమార్తెను చూసేందుకు ఆయన సౌదీ అరేబియా వెళ్లదలచుకున్నారు. అందు నిమిత్తం ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లకోసం పాస్ పోర్ట్ ఆఫీస్ కు వెళ్లారు. జాతీయత అనే ఆప్షన్లో గిలానీ ఇండియన్ అని టిక్ పెట్టారని పాస్ పోర్ట్ ఆఫీస్ అధికారి తెలిపారు. 'పుట్టుకతో నేను భారతీయుడిని కాదు..కానీ తప్పడం లేదు, బలవంతంగా అయ్యాను' అని గిలానీ అన్నారు. కశ్మీర్ కు చెందిన ప్రతిఒక్కరూ విదేశాలకు వెళ్లాలంటే ఇండియన్ పాస్ పోర్టుతోనే వెళ్లాక తప్పదని గిలానీ పేర్కొన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ నేత గిలానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదాలకు దారితీశాయి. భారతీయుడినని గిలానీ ఒప్పుకోవాలని, జాతీయతను వ్యతిరేకించే కార్యకలాపాలను చేపట్టినందున క్షమాపణ కోరాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇదిలాఉండగా, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఓమర్ అబ్దుల్లా మాత్రం పాస్ పోర్టు ఇవ్వడం అనేది సమస్యే కాదంటూ గిలానీకి మద్ధతు పలికారు. గతంలో ఆయనకు ఎన్నోసార్లు ఈ సౌకర్యాన్ని కల్పించార్న విషయాన్ని గుర్తుచేశారు.