Configuration
-
డబ్బే..డబ్బు
ఒంగోలు టౌన్: జిల్లా స్థూల ఉత్పత్తిని ఆధారం చేసుకొని రానున్న ఐదేళ్లలో జిల్లాలో 30,276 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. తాము రూపొందించిన ప్రణాళికలను జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిస్తే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఇదేవిధమైన ప్రణాళికలు రూపొందించేలా చూడాలని ప్లానింగ్ సెక్రటరీకి సూచించినట్లు తెలిపారు. మంగళవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాది సాధించిన ప్రగతి, రానున్న సంవత్సరాల్లో చేపట్టే కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయం ద్వారా 4618 కోటు ్ల(15.3 శాతం), పరిశ్రమల ద్వారా 7992 కోట్లు (26.4 శాతం), సర్వీస్ సెక్టార్ ద్వారా 17666 కోట్లు(58.3శాతం) అదనపు ఆదాయం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. నిమ్జ్ ద్వారా లక్షా 75వేల మందికి ఉపాధి జిల్లాలోని పామూరు - పీసీపల్లి మధ్య 38 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) ద్వారా ప్రత్యక్షంగా 75 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్‌కు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లక్ష్మీపురం నుంచి దొనకొండ వరకు 18 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి నీటిని అందించేందుకు ఎన్ఎస్పీ టెక్నికల్ కమిటీ అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. రామయపట్నం పోర్టు అభివృద్ధి, గుండ్లకమ్మ వద్ద పార్కు, ఒంగోలులో అంబేద్కర్ కళా క్షేత్రానికి రూ.3 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రంగారాయుడు చెరువుద్ద 1200మంది ఒకేసారి కూర్చునే విధంగా టౌన్ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. సిటీ స్క్వేర్‌లో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏర్పాటుచేసి 10వేల మంది కూర్చొని వీకెండ్స్‌లో పాత చిత్రాలు చూసేవిధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒంగోలుకు సమీపంలోని గుత్తికొండవారిపాలెం వద్ద ఐదు ఎకరాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పలు శాఖలకు సంబంధించిన కార్యక్రమాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ వెల్లడించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 83.6 శాతం పోలింగ్ సాధించి దేశంలోనే ఉత్తమమైన పోలింగ్‌గా నమోదైందన్నారు. మహిళా ఓటర్ల శాతం కూడా పెరిగిందన్నారు. ఎస్సీ కార్పోరేషన్‌కు సంబంధించి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 29 కోట్ల రూపాయల సబ్సిడీ నిధులు కేటాయిస్తే, అందులో జిల్లాలోనే 11.2 కోట్లు ఇచ్చామన్నారు.ఆధార్ సీడింగ్‌లో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ఆసుపత్రుల్లో ఆర్ఓ ప్లాంట్లు... జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నీటి వసతి ఉన్నచోట్ల ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆపరేషన్ థియేటర్లు ఉన్నచోట్ల పూర్తి స్థాయిలో పరుపులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు జిల్లాలో ఉన్నాయని, వాటితో రెసిడెన్షియల్ హాస్టల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ సంతృప్తి చాలు... జిల్లా కలెక్టర్‌గా ఉన్న తనను ఇటీవల కురిచేడు నుంచి అద్దంకిలోని మారుమూల ప్రాంతాలకు చెందిన రైతులు చీకట్లో వచ్చి తనను అభినందించిన తీరు ఎంతో సంతృప్తినిచ్చిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం మారింది, పార్టీ మారింది అయినప్పటికీ మీరు మాత్రం సమన్యాయం చేస్తున్నరంటూ వారు అనడం ఆశ్చర్యం కలిగించిందని, అదే సమయంలో సంతృప్తి కలిగిందన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో అర్జీల సంఖ్య తగ్గుతుందన్నారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాశిం, ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి పాల్గొన్నారు. -
డైరీ...
డిసెంబర్ 24 బుధవారం సాయంత్రం హైదరాబాద్ పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం మినీహాల్లో కోడూరి విజయకుమార్ తాజా కవితా సంపుటి ‘ఒక రాత్రి మరొక రాత్రి’ ఆవిష్కరణ. కె.శివారెడ్డి, పసునూరు శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొంటారు.రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారానికి 2014 సం.కుగాను జూపాక సుభద్ర ‘రాయక్క మాన్యమ్’ కథాసంపుటి ఎంపికైంది. జనవరిలో జరిగే కార్యక్రమంలో నగదు, జ్ఞాపికతో రచయిత్రిని సత్కరిస్తారు. కొలకలూరి పురస్కారాలకు ఆహ్వానం: 2015 సంవత్సరానికి కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం నాటకం/నాటికకు ఇవ్వనున్నారు. బహుమతి రూ.10 వేలు. జనవరి 2012 నుంచి డిసెంబర్ 2014 మధ్య ప్రచురితమైన నాటకం/నాటికా సంపుటులను మూడేసి కాపీలు పంపాల్సి ఉంటుంది. ఇదే సంవత్సరానికి కొలకలూరి భాగీరథీ పురస్కారం కవితా సంపుటికి ఇవ్వనున్నారు. బహుమతి రూ.10 వేలు. జనవరి 2012 నుంచి డిసెంబర్ 2014 మధ్య ప్రచురితమైన కవితా సంపుటాలను మూడేసి కాపీలు పరిశీలనకు పంపాలి. వివరాలకు: 94402 43433 తెలంగాణ రాష్ట్ర అవతరణ, నవ నిర్మాణాలపై కె.శ్రీనివాస్ రాసిన వ్యాసాల సంపుటి ‘జూన్ 2’ ఆవిష్కరణ. తేది: డిసెంబర్ 21. వేదిక: హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ప్రాంగణంలో సాయంత్రం 6 గం.లకు. పాశం యాదగిరి, అల్లం నారాయణ తదితరులు పాల్గొంటారు. -
ఎన్ఫోర్స్మెంట్లో మరికొంతమంది ఇంటి దొంగలు
ఎస్ఐ అరెస్ట్‌తో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో గుబులు సీఐడీ విచారణలో అధికారులు కర్ణాటక, గోవా గ్యాంగ్‌లతో వీరి సంబంధాలపై ఆరా పలమనేరు: జిల్లాలోని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో మరికొంత మంది ఇంటి దొంగలు ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతిలోని ఐఎంఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్ డిపో)కు చెందిన ఓ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, అతని బావమరిది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ విజయకుమార్‌ను సీఐడీ (సిట్) రెండ్రోజుల క్రితం తిరుపతిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరితో పాటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు చెం దిన మరో ఎస్ఐతో పాటు హెడ్‌కానిస్టేబుల్ కూడా ఇంటి దొంగల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పలమనేరు సమీపంలో సెప్టెంబర్ 15న భారీగా నకిలీ మద్యం బయటపడిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంగా రంగంలోకి దిగిన పలమనేరు పోలీసులు మునినాథ్ అనే అంతర్రాష్ట్ర స్పిరిట్ స్మగ్లర్‌ను పట్టుకున్నారు. ఇతనికి బెంగళూరు, గోవాకు చెందిన ఆర్ఎస్ (రెక్టిఫైడ్ స్పిరిట్) స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రతినెలా మునినాథ్ ఇక్కడి అధికారులకు స్మగ్లర్ల నుంచి భారీగా మామూళ్లు ఇప్పించేవాడని తెలిసింది. ఇదే సమయంలో సెప్టెంబర్ 18న సాక్షి దినపత్రికలో మునినాథ్కు ఎన్ఫోర్స్మెంట్తోనూ లింకులు అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ప్రస్తుతం సాక్షి కథనం అక్షర సత్యమైంది. సాధారణ ఎన్నికలకు మూడ్రోజుల ముందు పలమనేరు నియోజకవర్గంలోని వి.కోట వద్ద కర్ణాటక సరిహద్దులో భారీగా దాచి ఉన్న గోవా మద్యాన్ని కేజీఎఫ్, బంగారుపేట్, బేతమంగల్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఇదే లిక్కర్ జిల్లాలోని పలుచోట్ల పట్టుబడింది. ఒకే గ్యాంగ్ ఎన్నికలకు మద్యం సరఫరా చేసినట్టు ఉన్నతాధికారులు నిర్ధారణకొచ్చారు. ఇప్పుడు మునినాథ్ నోరు విప్పడంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి బదిలీ చేయడంతో ప్రత్యేక విచారణ చేపట్టారు. ఫలితంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని కొందరు ఇంటి దొంగలు ప్రస్తుతం బయటపడ్డారు. ఏదేమైనా సీఐడీ విచారణతో ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
కలల బాటసారి విజ్జన్న యాది...
జర్నలిస్టుల గురువుకి నివాళి కరీంనగర్ చరిత్ర పొడవునా ఏ కొత్త కల కంటే ఆ కల వెంట నడిచిన బాటసారి విజ్జన్న గురించి మాట్లాడటమంటే విద్యార్థుల, బుద్ధిజీవుల కలల ప్రపంచం గురించి మాట్లాడటమే. తెలంగాణలో మామూలు మనుషులు మహా మనుషులైన, ఒక చరిత్ర క్రమం గురించి మాట్లాడటమే. ముందరి లాకప్ గది లో చేతులు పైకి కట్టేసి, లాకప్ పదమూడు సలాకలకు వేలాడదీసిన ఒక మనిషి. ఆ మనిషి నిద్రపోకుండా ఉండేందుకు లాకప్ ముందర నీళ్ల బకెట్. ఆ మనిషి కనురెప్పలు మూతబడితే ముఖం మీద చిమ్మే నీళ్లు. అదొక చిత్ర హింస రూపం. అత్యయిక స్థితి. దేశమే జైలయిన కాలం. ఈ కాలాన్ని కంటి రెప్పల కింద పొదువుకొని కాపాడుకున్న వాడే భాగ్యనగరి విజయకుమార్. ఆరోపణ నక్సల్బరీ. కొట్టీ కొట్టీ విసిగిపోయి లాక ప్‌కు వేలాడదీసి చిత్రహింసలు పెట్టారు. కానీ తను చెప్పేందుకేమీ లేదు. ఎదురుగా లాకప్‌లో వెన్ను మీద పోలీసులు కాల్చిన నెత్తుటి గాయంతో చిన్న (నారదాసు) లక్ష్మణ్‌రావు, పోరెడ్డి వెంకటరెడ్డి, మల్లా రాజిరెడ్డి, పున్నయ్య, జి. నారాయణరెడ్డి, శని గరం వెంకటేశ్వరు, అల్లం నారాయణ. విజయ్‌కు మార్ కరీంనగర్ చిన్నాపెద్దలకు విజ్జన్న. జిల్లా రాజ కీయాల కేంద్ర బిందువు. అది 1976 నాటి మాట. కాలం మారింది. తొమ్మిదేళ్ల తర్వాత కరీంనగర్ శాస్త్రి రోడ్డు చివర పాత బజారు చౌరస్తాలో ఓ మూ లన ఒక గూనకప్పటిల్లు. లోపల నాలుగు టేబుళ్లు, న్యూస్‌ప్రింట్ రఫ్ ప్యాడ్లు. సాయంత్రానికల్లా ఆ ఇల్లు కలకలలాడేది. అప్పుడదొక కరీంనగర్ సాం స్కృతిక కేంద్రం. రాజకీయాల అడ్డా. అంతర్జాలా లేవీ లేకుండానే అంగుటిలో అంతర్జాతీయ భావజా లాల నుంచి భావి భారతాల దాకా చర్చలు. ఛాయ్ లు. అది విజ్జన్న స్థాపించిన జీవగడ్డ దినపత్రిక కార్యాలయం. ఆ ఆఫీసు ఇప్పటికీ అట్లాగే ఉన్నది. కరీంనగర్ విస్తరించింది. కానీ దాని పాతదనం అట్లాగే ఉన్నది. ఇప్పుడా మనిషి కరీంనగర్ కొత్త కలల నిర్మాత. ప్రత్యేక తెలంగాణ నుంచి ఎగసి వచ్చిన చైతన్యాన్ని నక్సల్బరీలో కొనసాగించి విప్ల వాల కలలుగన్న క్రాంతిదర్శి, జిల్లాలో ఇప్పటి పేరు గాంచిన జర్నలిస్టుల గురువు. పెన్నుపట్టి రాయిం చిన పెద్ద మనిషి. కరీంనగర్ చరిత్ర పొడవునా ఏ కొత్త కల కంటే ఆ కల వెంట నడిచిన బాటసారి మొ న్న కూలిపోయాడు. ఆరేళ్లుగా పార్కిన్సన్తో మాట లు దాటి రాక, పెదాల మధ్య శబ్దాలు వెలికిరాక, నిశ్శబ్దంగా బతికిన ఆ అమ్మ చెట్టు కూలిపోయింది. విజ్జన్న మహా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయాడు. వర్తమానం. ప్రెస్ భవన్. కలెక్టర్ భవనం ముందరి ఆ ప్రెస్ భవన్‌కు ఆయన పునాదులేశాడు. తన రెండురెక్కల కష్టాన్ని కూడా చేర్చి పూర్తి చేశాడు. ఎన్నో తలపోతలకు, కలెబోతలకు, తండ్లాటలకు తెలంగాణ మలి ఉద్యమ మహాగర్జనలకు వేదికగా నిలిచిన ప్రెస్ భవన్ హాలులో స్టేజి మీద ఒంటరిగా పరుండి ఉన్నాడు విజ్జన్న. మొఖం నిర్మలంగా ఉన్న ది. సబితా టీచర్ ఏడుస్తున్నది. ఇల్లులేని తనం. చివరకు తాను కట్టిచ్చిన ప్రెస్భవనే విజ్జన్న ఆఖరి మజిలీ వేదికైంది. చాలదా దుక్కానికి. జర్నలిస్టు ప్రపంచాని ఓనమాలు దిద్దించిన వాడు. జర్నలిస్టు ఉద్యమానికి దారులు వేసినవాడు. గతంలో ఇల్లు, ప్రింటింగ్ ప్రెస్ కలిగి ఉన్నవాడు. చివరికిలా ఒక నిర్వాసితుని మాదిరి, ఇల్లు కూడా లేని ఒక అతి సామాన్యుని మాదిరి. అదే విజయ్‌కుమార్ జీవితం. అదే ఆయన పాటించిన విలువ. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదటిసారి విఫ లమైన తర్వాత నక్సల్బరీ రాజకీయాలను కరీం నగర్‌కు తెచ్చిన వాడు విజయ్‌కుమార్. విద్యుల్లత విజ్జన్న నడిపిన మొదటి పత్రిక. అది సృజనకన్నా పాపులర్ అయిన కాలం ఒకటుండేది. వరవరరావు అప్పటి నుంచీ ఆయన గురువే. గోపు లింగారెడ్డి, వెంకట్‌రెడ్డి, నల్ల మల్లారెడ్డి, ముప్పాళ్ల నర్సింహా రావు మొట్టమొదటి కథల సంకలనం ‘బద్లా’ గానం చేశారు. తిరుగుబాటు కథల చరిత్ర అక్కడే ప్రారంభమైంది. అప్పుడు నిషేధించిన ‘మార్స్’ కవి తా సంకలనం, సాహసంతో అచ్చువేసిన వాడు విజ య్‌కుమార్. ఏంజెలో కాట్రొచ్చీచ్చీ ‘ది బిగినింగ్ ఆఫ్ ఎండ్’ను శ్రీశ్రీ ‘రెక్కవిప్పిన రెవల్యూషన్’గా అను వదిస్తే అచ్చువేసిన వాడూ ఆయనే. ఆ రకంగా విప్ల వోద్యమ సాహిత్యం, విరసం ఏర్పడిన తర్వాత సృజనతోపాటు విద్యుల్లతయైన తొలినాళ్ల సాహిత్యో ద్యమ సారథి విజయ్‌కుమార్. అందుకాయన చిత్ర హింసలు అనుభవించాడు. ఉన్న ప్రింటింగ్ ప్రెస్ నూ అమ్ముకున్నాడు. ఎమర్జెన్సీ చీకటి రోజులనూ అనుభవించాడు. ఆ తర్వాత బహిరంగ జీవితంలో ఉంటూనే తన పరిమితుల్లో ప్రగతిశీల గామిగా, ప్రజాస్వామ్య వాదిగా, స్నాప్నికునిగా జర్నలిస్టు ఉద్యమ నిర్మాతగా బహుముఖంగా విస్తరించిన విజ్జన్న అందరికీ కావలసిన వాడు. తొలి తెలంగాణ నుంచి మలి తెలంగాణ దాకా ఉద్యమ కేతనం అయిందీ ఆయనే. నిజంగానే కరీంనగర్ చరిత్రతో, అది నడిచిన అన్ని దారులతో, అది ఎదిగిన అన్ని రకాల ప్రభావాలతోనూ జీవగడ్డ విజయ్‌కుమార్ సజీవంగా ఉంటాడు. కరీంనగర్ జీవగడ్డ విజ్జన్న యాది చిరకాలం ఉంటుంది. కమాన్ మీద పేరై నిలుస్తుంది. నిజమే. విజ్జన్న మరి లేడు. ఆయన జ్ఞాపకం ఉంది. ఉండాలి. నిలబడాలి. ఈ నాలుగక్ష రాల భిక్ష పెట్టిన విజ్జన్నకు కన్నీటి నివాళి. వ్యాసకర్త రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్) -అల్లం నారాయణ -
పోలీసులు స్పందిస్తే నాన్న బతికేవారు
ఎస్పీ ఎదుట కృష్ణారావు కుమారుడి ఆవేదన ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ గొట్టుముక్కల(కంచికచర్ల) :‘పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే మా నాన్న బతికేవాడు..’ అంటూ గొట్టుముక్కల ఉప సర్పంచిఆలోకం కృష్ణారావు కుమారుడు జిల్లా ఎస్పీ విజయకుమార్ ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించారు. కృష్ణా జిల్లాలో గొట్టుముక్కలలో ఆదివారం అర్ధరాత్రి కృష్ణారావు హత్య గురించి తెలియడంతో సోమవారం ఉదయం ఎస్పీ గ్రామానికి వచ్చారు. కృష్ణారావు కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. తమ ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ వర్గీయులు మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నారని కంచికచర్ల పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా వారు సకాలంలో రాలేదని శ్రీనివాసరావు ఎస్పీకి వివరించారు. ఎన్నికల ముందు నుంచి టీడీపీ వర్గీయులు గ్రామంలో విచ్చలవిడిగా రెచ్చిపోతూ వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడులు చేస్తున్నారని చెప్పారు. అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఇరువర్గాలపై కేసులు నమోదు చేస్తున్నారని, దాడులు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. కంచికచర్ల పోలీసుస్టేషన్ రూరల్ సీఐ, ఎస్ఐ టీడీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని, వెంటనే వారిని సస్పెండ్ చేయాలని కృష్ణారావు కుటుంబ సభ్యులు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కృష్ణారావును హత్య చేసిన వారిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నందిగామ డీఎస్పీ చిన్న హుస్సేన్, నందిగామ, నందిగామ రూరల్ సీఐలు భాస్కరరావు, రామ్‌కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. నిందితులను పట్టుకుంటాం : ఎస్పీ నందిగామ: కృష్ణారావు హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ విజయకుమార్ తెలిపారు. గొట్టుముక్కల గ్రామంలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన నందిగామ డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గొట్టుముక్కలలో టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్న స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని, పూర్తిస్థాయిలో విచారించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను ఇటీవలే ఎస్పీగా బాధ్యతలు స్వీకరించానని, ఈ గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెప్పించుకుంటానని తెలిపారు. నందిగామలో కూడా సీసీఎస్ స్టేషన్ ఏర్పాటుపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు. నేరాల విచారణకు సీసీఎస్ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నందిగామలో పోలీస్ క్వార్టర్స్ విషయంలో కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎస్పీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు కృష్ణారావుకు కుమారుడు శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నాయకులు అక్కారావు, గుదే వెంకటేశ్వరరావు (బుజ్జీ), మరికొందరు నాయకులు ఎస్పీని కలిసి గ్రామంలో పరిస్థితులు వివరించి రక్షణ కల్పించాలని కోరారు. పోలీస్స్టేషన్ల ముందే దాడులకు పాల్పడుతున్నా టీడీపీ కార్యకర్తలను ఎస్ఐ, సీఐలు ఏమీ చేయలేకపోయారని చెప్పారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఫోన్ ద్వారా తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగిస్తామని తెలిపారు. -
రేపు బలిజ ప్రజాప్రతినిధులకు సన్మానం
తిరుపతి గాంధిరోడ్డు : కాపు బలిజ ప్రజా ప్రతినిధులకు అభినంద సన్మాన మహోత్సవాన్ని తిరుపతి నగరంలో ఆదివారం ఘనంగా నిర్వహించనున్నట్లు కాపుబలిజ నాయకుడు వూకా విజయకుమార్ తెలిపారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు కాపు, బలిజ నేతలు విశేష కృషి చేశారన్నారు. ప్రజా సంక్షేమ పాలనకు సహకరిస్తున్న కాపు, బలిజ ప్రజాప్రతినిధులను సత్కరించాలనే సంకల్పంతో ఈ అభినందన సన్మాన మహోత్సవాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తిరుచానూరు రోడ్డులోని అర్బన్ హాట్లో మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులను ఘనంగా సన్మానించనున్నట్టు తెలిపారు. శనివారం ఉదయం శ్రీకృష్ణదేవరాయ విగ్రహం నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మాట్లాడుతూ శిల్పారామంలో ఆదివారం వూకా విజయకుమార్ అధ్యక్షతన ప్రజాప్రతినిధులను సన్మానానించడం అభినందనీయమన్నారు. కాపు, బలిజ సంక్షేమాన్ని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వారికి సీట్లు కేటాయించడంతో పాటు ముఖ్యమైన పదవులిచ్చి గౌరవించారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్లు, మునిశేఖర్, పీసీ రాయల్, కోడూరు బాలసుబ్రమణ్యం, కత్తుల సుధాకర్, కేఎం.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.