తిరుపతి గాంధిరోడ్డు : కాపు బలిజ ప్రజా ప్రతినిధులకు అభినంద సన్మాన మహోత్సవాన్ని తిరుపతి నగరంలో ఆదివారం ఘనంగా నిర్వహించనున్నట్లు కాపుబలిజ నాయకుడు వూకా విజయకుమార్ తెలిపారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు కాపు, బలిజ నేతలు విశేష కృషి చేశారన్నారు.
ప్రజా సంక్షేమ పాలనకు సహకరిస్తున్న కాపు, బలిజ ప్రజాప్రతినిధులను సత్కరించాలనే సంకల్పంతో ఈ అభినందన సన్మాన మహోత్సవాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తిరుచానూరు రోడ్డులోని అర్బన్ హాట్‌లో మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులను ఘనంగా సన్మానించనున్నట్టు తెలిపారు. శనివారం ఉదయం శ్రీకృష్ణదేవరాయ విగ్రహం నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు.
తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మాట్లాడుతూ శిల్పారామంలో ఆదివారం వూకా విజయకుమార్ అధ్యక్షతన ప్రజాప్రతినిధులను సన్మానానించడం అభినందనీయమన్నారు. కాపు, బలిజ సంక్షేమాన్ని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వారికి సీట్లు కేటాయించడంతో పాటు ముఖ్యమైన పదవులిచ్చి గౌరవించారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్లు, మునిశేఖర్, పీసీ రాయల్, కోడూరు బాలసుబ్రమణ్యం, కత్తుల సుధాకర్, కేఎం.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రేపు బలిజ ప్రజాప్రతినిధులకు సన్మానం
Published Sat, Aug 2 2014 4:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM
Advertisement
Advertisement