డైరీ... | Diary | Sakshi
Sakshi News home page

డైరీ...

Published Fri, Dec 19 2014 11:13 PM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

Diary

డిసెంబర్ 24 బుధవారం సాయంత్రం హైదరాబాద్ పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం మినీహాల్‌లో కోడూరి విజయకుమార్ తాజా కవితా సంపుటి ‘ఒక రాత్రి మరొక రాత్రి’ ఆవిష్కరణ. కె.శివారెడ్డి, పసునూరు శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొంటారు.రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారానికి 2014 సం.కుగాను జూపాక సుభద్ర ‘రాయక్క మాన్యమ్’ కథాసంపుటి ఎంపికైంది. జనవరిలో జరిగే కార్యక్రమంలో నగదు, జ్ఞాపికతో రచయిత్రిని సత్కరిస్తారు.
     
కొలకలూరి పురస్కారాలకు ఆహ్వానం: 2015 సంవత్సరానికి కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం నాటకం/నాటికకు ఇవ్వనున్నారు. బహుమతి రూ.10 వేలు. జనవరి 2012 నుంచి డిసెంబర్ 2014 మధ్య ప్రచురితమైన  నాటకం/నాటికా సంపుటులను మూడేసి కాపీలు పంపాల్సి ఉంటుంది. ఇదే సంవత్సరానికి కొలకలూరి భాగీరథీ పురస్కారం కవితా సంపుటికి ఇవ్వనున్నారు. బహుమతి రూ.10 వేలు. జనవరి 2012 నుంచి డిసెంబర్ 2014 మధ్య ప్రచురితమైన కవితా సంపుటాలను మూడేసి కాపీలు పరిశీలనకు పంపాలి. వివరాలకు: 94402 43433

తెలంగాణ రాష్ట్ర అవతరణ, నవ నిర్మాణాలపై  కె.శ్రీనివాస్ రాసిన వ్యాసాల సంపుటి ‘జూన్ 2’ ఆవిష్కరణ. తేది: డిసెంబర్ 21. వేదిక: హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ప్రాంగణంలో సాయంత్రం 6 గం.లకు. పాశం యాదగిరి, అల్లం నారాయణ తదితరులు పాల్గొంటారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement