confuse
-
మర్చిపోయారా? లేక తొలగించారా? కన్ఫ్యూజ్ చేస్తున్న రైనా..!
-
చెక్‌డ్యామ్‌ల దారెటు?
రాష్ట్ర పరివాహకంలో కురిసే ప్రతి నీటిబొట్టు ఒడిసిపట్టేందుకు గోదావరి, కృష్ణా నదులపై చేపడుతున్న ప్రాజెక్టుల కాల్వల పరిధిలో నీటి నిల్వలు పెంచేలా చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని నిర్ణయించినా అడుగు మాత్రం ముందుకు పడలేదు. మహారాష్ట్ర మాదిరి చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో నీటి నిల్వలను పెంచి గరిష్ట ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యం కాస్తా నిధుల్లేక నీరసించి పోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నదులు, ఉపనదులు, వాగులు, వంకలపై కలిపి మొత్తంగా 1,200 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని నిర్ణయించి పరిపాలనా అనుమతులు ఇచ్చినా పనులు మాత్రం ముందుకు సాగక చతికిల పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ నిధుల్లేక నీరసం రాష్ట్రానికి ప్రధాన నీటి వనరులైన కృష్ణా నది కింద 299 టీఎంసీలు, గోదావరిలో 954 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశముంది. ఇందులో చిన్న నీటివనరుల కింద కృష్ణాలో 89 టీఎంసీలు, గోదావరిలో 165 టీఎంసీల కేటాయింపులున్నాయి. అయితే కృష్ణా బేసిన్లో ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు ప్రవాహాలులేని కారణంగా దిగువన తెలంగాణలో వాటా మేర నీటి వినియోగం జరగడం లేదు. దీనికితోడు కృష్ణానీటి కట్టడికి మహారాష్ట్ర ఏకంగా వందల సంఖ్యలో చెక్‌డ్యామ్‌ల నిర్మా ణం చేయడంతో దిగువకు నీటి కష్టాలు తప్పడం లేదు. గోదావరిలోనూ 165 టీఎంసీల మేర కేటాయింపులున్నా.. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ధ్వంసం కావడంతో అనుకున్న మేర అవి నిండటం లేదు. ఈ నేపథ్యంలో గోదా వరి బేసిన్లో ప్రధాన ఉపనదులైన మంజీరా, మానేరు, తాలిపేరు, లెండి, పెన్‌గంగ, కిన్నెరసాని వంటి వాగులు, కృష్ణాలో మూసీ, ఊకచెట్టువాగు, పెద్దవాగు, డిండి వాగు, పాలేరు, తుంగపాడు వంటి వాగులపై 1,200 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని నిర్ణయించింది. వీటికి రూ.3,826 కోట్ల మేర నిధులకు ఏప్రిల్‌లో పరిపాలనా అను మతి సైతం ఇచ్చింది. పనులు మొదలు పెట్టిన 6 నెలల్లో వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మాంద్యం ఉండటంతో సాగునీటి శాఖకు బడ్జెట్ తగ్గింది. ఈ పనులకు నిధుల కొరత లేకుండా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రుణాలు తీసుకునేలా నిర్ణయించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో కేవలం 80 చెక్‌డ్యామ్‌లకు మాత్రమే సాంకేతిక అనుమతులిచ్చిన అధికారులు మిగతావాటికి నిధుల్లేక నిలిపివేశారు. సాంకేతిక అనుమతులు ఇచ్చిన చెక్‌డ్యామ్‌ల్లోనూ టెండర్లు పిలిచిన చెరువులు కేవలం పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చెక్‌డ్యామ్‌లపై ఎలా ముందుకు వెళ్లాలన్న అయోమయం నెలకొంది. ప్రస్తుతం సాగునీటి శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తుండటంతో ఆయనే వీటిపై మార్గదర్శనం చేస్తే కానీ పనులు ముందుకు కదిలే అవకాశం లేదు. -
కన్ఫ్యూజన్లో విమానం కూల్చారు
సాక్షి, కఠ్మాండు : నేపాల్ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి కొత్త విషయం తెలిసింది. సాంకేతిక సమస్యవల్ల ఆ ప్రమాదం జరగలేదని సమాచార బదిలీ విషయంలో అస్పష్టత ఏర్పడి చోటు చేసుకున్నట్లు తెలిసింది. కన్ఫ్యూజన్లో పైలెట్ విమానాన్ని కూల్చినట్లు స్పష్టమైంది. విమానం దింపే సమయంలో పక్కకు తిప్పాలని చెప్పినప్పటికీ తన వాయిస్ సరిగా వినకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చెప్పాడు. కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి 67 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, తొలుత సాంకేతిక సమస్య ఇందుకు కారణం అని అనుకున్నారు. అయితే, వాస్తవానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, పైలట్‌కు మధ్య సంభాషణలో తికమకే అంతమంది ప్రాణాలుపోవడానికి కారణమని తెలిసింది. రేడియో ద్వారా జరిగిన వారి సంభాషణ చాలా కన్ఫ్యూజ్గా సాగిందంటూ ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ సంస్థ వెబ్సైట్లో పేర్కొంది. అందులో పేర్కొన్న ప్రకారం విమానం సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయంలో మాత్రమే పైలట్ తాము దిగొచ్చా అని అడిగాడు. అప్పటికే ఆలస్యం అయింది. అది చూసిన కంట్రోలర్ వణికిపోతున్న స్వరంతో వెంటనే వెనక్కు తిప్పాలని ఆదేశించాడు. ఆ వెంటనే ఫైర్ సిబ్బంది కూడా రన్‌వే వైపు ఫాస్ట్‌గా వెళ్లాలని ఆదేశించాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. 'రన్‌వేకి తగినట్లు విమానం రాలేదు. అప్పటికీ ఎయిర్ కంట్రోల్ టవర్ నుంచి పైలట్‌ను ఈ విషయంపై పలుసార్లు చెప్పినా అతడు మాత్రం అంతా బాగానే ఉందని, అన్నింటికీ యస్ అంటూ బదులిచ్చాడు' అని జనరల్ మేనేజర్ రాజ్‌కుమార్ చేత్రి చెప్పారు. కాగా, అమెరికా-బంగ్లా ఎయిర్‌లైన్స్ సీఈవో ఇమ్రాన్ అసిఫ్ మాత్రం ఢాకాలో మాట్లాడుతూ 'ఇదే స్పష్టమైన కారణం అని మేం చెప్పలేం.. కానీ, కచ్చితంగా కఠ్మాండు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ మా పైలట్లను రన్ వే విషయంలో తప్పుదారి పట్టించింది. పైలట్లకు, టవర్‌కు మధ్య జరిగిన సంభాషణ విన్న తర్వాత మా పైలట్ల నిర్లక్ష్యం లేదని స్పష్టమైంది' అని అన్నారు. -
మా బతుకులు ఆగం చేయెుద్దు
గోడు వెల్లబోసుకున్న మేడిగట్ట రైతులు గ్రామస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే పుట్ట మధు ఆదుకుంటామని భరోసా మంథని : ‘అయ్యా.. తెలంగాణకు నీళ్లిచ్చే మేడిగడ్డ ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు. మావి అత్యంత విలువైన నల్ల రేగడి భూములు. ఒక రైతు సగటున ఎకరాకు కోటి రూపాయలు సంపాదించుకుంటడు. ఇంత విలువైన భూములను కూడా ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ మా బతుకులను ఆగం చేయొద్దు. మమ్మల్ని బజారున పడేయకండి’ అని మేడిగడ్ట రైతులు ఎమ్మెల్యే పుట్ట మధు ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. మంథని గ్రామపంచాయతీ కార్యాలయంలో మేడిగడ్డ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులతో ఎమ్మెల్యే శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను వివరించారు. ఆధారం కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఎకరాకు రూ.20 లక్షలు పరిహారం, చదువుకున్న యువకులకు ఉపాధి, భూములు కోల్పోతున్న వారికి ఉపాధి కల్పించాలని విన్నవించారు. న్యాయం చేస్తారనే నమ్మకంతోనే భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడిగడ్డ గ్రామస్తులు తెలంగాణలోని లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చే గొప్ప వ్యక్తులని వారిని కచ్చితంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. భూములు కోల్పోయే రైతులకు పరిహారంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులతోపాటు ముఖ్యమంత్రి దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లి ఆదుకుంటామని తెలిపారు. సమావేశంలో అంబట్పల్లి సర్పంచ్ మాధవరావు, మహదేవపూర్, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాసరావు, ఆకుల కిరణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మేడిగడ్డ రైతులను భయపెట్టొద్దు మేడిగడ్డ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న మంథని డివిజన్లోని మహదేవపూర్,కాటారం, కమాన్‌పూర్ మండలాల్లోని రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. మండలంలోని బొమ్మాపూర్, సూరారం గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేపట్టడాన్ని తాము తప్పుపట్టడం లేదన్నారు. ఈ నిర్మాణంతో వేల ఎకరాల భూములు ముంపుకు గురవుతాయని తెలిపారు. దళితులకు పంచేందుకు మహదేవపూర్ మండలం అంటబ్పల్లి గ్రామంలో ప్రభుత్వమే ఎకరానికి రూ.5.15 లక్షలు చెల్లించి భూమి కొనుగోలు చేసిందని తెలిపారు. అదే గ్రామంలో ముంపునకు గురయ్యే అసైన్డ్ భూమికి మాత్రం కేవలం రూ.3 లక్షలే ఇస్తామనడం అన్యాయమన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అందరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. యువ రైతులను సర్వే అధికారులు, పోలీసులు భయపెడుతున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లాకు నీటిని తరలించడానికే సీఎం కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మేడిగడ్డ, సూరారం, కన్నేపల్లి, అన్నారం, సుందిళ్ల, దామెరకుంట, తదితర గ్రామాల రైతులు తమ విలువైన పంట భూములను కోల్పోనున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నీళ్లతో ఉత్తర తెలంగాణ రైతుల కాళ్లు కడుగుతామని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ కింద భూమి పోతుందనే బెంగతో ఆత్మహత్య చేసుకున్న సూరారం మహిళా రైతు చల్లా స్వరూప కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీధర్‌బాబు వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి, కాంగ్రెస్ నాయకులు గోమాస శ్రీనివాస్, విలాస్‌రావు, గుడాల కృష్ణమూర్తి, కామిడి శ్రీనివాసరెడ్డి, షకీల్, రాణీబాయి, వరప్రసాద్, ప్రభాకర్‌రెడ్డి, రవిచందర్, గోగుల మధు, కృష్ణమోహన్ ఉన్నారు. -
డైలమాలో ’హస్తం’
-
దారి తప్పిన హీరోయిన్
నెల్లూరు, సిటీ: జిల్ ఫేమ్ రాశిఖన్నా సోమవారం నెల్లూరులోని ఓ మొబైల్ షోరూమ్ ప్రారంభోత్సవానికి వెళుతూ కారు డ్రైవర్ తప్పిదంతో దారి తప్పడం వల్ల ఆలస్యంగా హాజరైందని సమాచారం. నగరంలోని లాట్ మొబైల్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. హీరోయిన్ రాశిఖన్నా ముఖ్య అతిథిగా హాజరై దీనిని ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం రాశి హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడినుంచి ఓ ట్రావెల్స్‌కు చెందిన కారులో నెల్లూరుకు పయనమైంది. అయితే, డ్రైవర్ పొరపాటున నెల్లూరు వైపునకు బదులు వేలూరు వైపు తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో 11.45 నిమిషాలకు షోరూమ్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరు కావాల్సి ఉండగా 2 గంటలకు వచ్చారు. ఈ విషయాన్ని షోరూమ్ యాజమాన్యం గోప్యంగా ఉంచింది.