constitutional violation
-
Rahul Gandhi: వాళ్లది దాడి తంత్రం.. మాది పరిరక్షణ మంత్రం
జగ్దల్పూర్/భండారా: రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పాటుపడుతుంటే దానిని నచ్చినట్లు సవరించే కుట్రకు బీజేపీ బరితెగించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. లోక్‌సభ సమరంలో విజయం సాధించి అధికారం చేపట్టగానే దేశవ్యాప్త కులగణనకు శ్రీకారం చుడతామని రాహుల్ పునరుద్ఘాటించారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని బస్తర్ గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఈసారి జరుగుతున్న ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ విధ్వంసక సిద్ధాంతాల మధ్య పోరాటం. ఓవైపు కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’కూటమి రాజ్యాంగ పరిరక్షణకు ప్రయత్నం చేస్తుంటే మరోపక్క మోదీ, అదానీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. గిరిజన మహిళ అని కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇది బీజేపీ ఆలోచనాధోరణికి అద్దంపడుతోంది’’ అని రాహుల్ ఆరోపించారు. షెడ్యూల్ తెగలకు కేటాయించిన బస్తర్ ఎంపీ స్థానంలో బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మాకు మద్దతుగా రాహుల్ ఈ సభకు వచ్చి మాట్లాడారు. ఆదివాసీ.. వనవాసీ ‘‘ ఆదివాసీ పదాన్నే ప్రధాని వాడుక నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మేం ఆదివాసీ అంటే బీజేపీ వాళ్లు వనవాసీ అంటున్నారు. రెండు పదాల అర్ధాల్లో చాలా బేధముంది. ఆదివాసీ అంటే అడవితో మమేకమైన వాళ్లు అని అర్థం. ఆ పదం మీకు జలం, జంగిల్(అడవి), జమీన్(భూమి)పై మీకున్న హక్కులను ఎలుగెత్తి చాటుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనప్రాంతాల్లో స్వయంపాలనకు బాటలువేస్తూ గ్రామసభలకు అనుమతినిస్తూ పంచాయతీ చట్టాన్ని తెచ్చాయి. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ గిరిజనుల మత విశ్వాసాలు, సిద్ధాంతాలు, చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటవీ భూములను అదానీ లాంటి వాళ్లకు బీజేపీ ధారాదత్తం చేస్తోంది. ఇప్పటికే దేశంలో అడవులు కుచించుకుపోతున్నాయి’’ అని రాహుల్ అన్నారు. మేమొస్తే రైతు రుణమాఫీ మహారాష్ట్రలోని భండారా జిల్లా సకోలీ పట్టణంలో పార్టీ ర్యాలీలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘‘అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీచేస్తాం. నిరుద్యోగం, అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న సాధారణ జనం జీఎస్టీ కడుతున్నారు. కోట్లు గడిస్తున్న వాళ్లూ అంతే జీఎస్టీ కడుతున్నారు. మోదీ హయాంలో 22 మంది బడా పారిశ్రామికవేత్తల వద్ద పోగుబడిన సంపద 70 కోట్ల మంది భారతీయుల ఆస్తితో సమానం. ఈ విషయం వదిలేసి మోదీ ఎప్పుడూ మతం గురించే మాట్లాడతారు’’ అని రాహుల్ అన్నారు. -
కొత్త జిల్లాల పేరుతో రాజ్యాంగ ఉల్లంఘన
సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి, గవర్నర్ల విశేషాధికారాలను అతిక్రమిస్తూ కొత్త జిల్లాల పేరుతో సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేత ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వీటిని చూస్తూ గవర్నర్ ఊరుకుంటే ఆయనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. కొత్త జిల్లాలపై సీఎం తీసుకొచ్చే ఆర్డినెన్స్‌ను గవర్నర్ తిప్పి పంపాలన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటులో వివక్ష, ఆదివాసీ హక్కులకు భంగం, జోనల్ వ్యవస్థను భగ్నం చేయడం, నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు అణగారిపోయేలా కొత్త ప్రాంతాల ఏర్పాటు వంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు. 31 జిల్లాల వల్ల అసెంబ్లీ నియోజకవర్గాలు డీలిమిటేషన్లో రిజర్వేషన్లన్నీ తారుమారు అవుతాయన్నారు. -
బిల్లు దహనం.. రాజ్యాంగ ఉల్లంఘనే
టీ ముసాయిదా బిల్లు దహనంపై తెలంగాణ నేతల ఆగ్రహం వారిని అరెస్టు చేయాలి: హరీష్‌రావు దేశబహిష్కరణ చేయాలి: శ్రీనివాస్‌గౌడ్ రాజ్యాంగాన్ని కాల్చినట్లే: దిలీప్‌కుమార్ విభజన గీత గీయాల్సిందే: గౌరీశంకర్ న్యూస్‌లైన్ నెట్వర్క్: సీమాంధ్ర నేతలు తెలంగాణ ముసాయిదా బిల్లును భోగి మంటల్లో వేసి తగులబెట్టడంపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలను అవమానపర్చడంతో పాటు రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కె.దీలీప్‌కుమార్, టీఆర్ఎల్డీ సెక్రటరీ జనరల్ చెరుకూరి శేషగిరిరావులు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బిల్లును కాల్చడం.. రాజ్యాంగాన్ని కాల్చడమే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, పోరాట ఫలితాన్ని కాల్చి బూడిద చేసిన సీమాంధ్ర నేతలను వెంటనే అరెస్టు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ బిల్లును భోగిమంటల్లో దహనం చేసి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని అవమానించిన అక్కడి నేతలు ఇప్పుడు పండుగను కూడా అపవిత్రం చేశారన్నారు. వారు తమ విచక్షణను, జ్ఞానాన్ని కూడా అదే భోగి మంటల్లో కాల్చి బూడిద చేసుకున్నారని వ్యాఖ్యానించారు. బిల్లు ప్రతులను దహనం చేసిన వారిని వెంటనే దేశ బహిష్కరణ చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌లో డిమాండ్ చేశారు. ఇది సీమాంధ్రుల దురహంకారానికి నిదర్శనమన్నారు. ఒక ప్రాంత ప్రజల ఆంక్షాలను కాల్చివేసి కలిసుందాంరా అనే సమైక్య నినాదం పైశాచికత్వంగా కనిపిస్తుందని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జూలూరు గౌరిశంకర్ ఒక ప్రకటనలో ఖండించారు. భోగి మంటల సాక్షిగా రెండు ప్రాంతాల మధ్య విభజన గీతలు గీయాల్సిందేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన అశోక్‌బాబుపై తెలంగాణ సాధన సమితి అధ్యక్షుడు వెంకటనారాయణ నల్లగొండ జిల్లా కోదాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బిల్లును తగులబెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.