Contract work
-
తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్స్టర్లే
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన స్కామ్.. సీమన్స్, అమరావతి భూకుంభకోణాల దారులన్నీ ఒకే చోటుకు చేరుతున్నాయని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న వ్యక్తులే.. సీమన్స్, అమరావతి అసైన్డ్ భూకుంభకోణాల్లో ప్రధానపాత్ర పోషించారని సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. ఈ కుంభకోణాల మూలాలు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ల వద్దే ఉన్నాయని చెప్పారు. తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్స్టర్లేనన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములు చేతులు మార్చే క్రమంలో పెద్ద స్కామ్ జరిగిందని గతంలోనే సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. అమరావతి పేరుతో జరిగిన స్కామ్లన్నింటిలో డొల్ల కంపెనీలు పెట్టి, వాటిద్వారా తండ్రీకొడుకులు ముడుపులు పుచ్చుకున్న విషయాలు ఇప్పటికే సీఐడీ విచారణలో రట్టయిందని ఎత్తిచూపారు. డొల్ల కంపెనీలతో డబ్బును జేబులో వేసుకోవడం.. హవాలా ద్వారా తండ్రీకొడుకులకు చేరవేయడంలో ఈ మధ్య కూడా మరో స్కామ్ బయటకొచ్చిందని చెప్పారు. అమరావతిలో రాజధాని కడతానని, ప్రతి ఇటుకకు డబ్బులివ్వండని.. మనల్ని అందర్నీ తాకట్టు పెట్టి బాండ్స్ ఇష్యూచేసి చంద్రబాబు తెచ్చిన డబ్బులు ఆయా కంపెనీలకు ఇచ్చారని తెలిపారు. ఆ కంపెనీల ద్వారా నిధులు డొల్ల కంపెనీలకు మళ్లించారని, ఐటీ శాఖ నోటీసులు చూస్తే.. చంద్రబాబు మొత్తం రూ.160 కోట్ల రూపాయలు కొట్టేశారని తేలిందని చెప్పారు. లోకేశ్ మిత్రుడు రాజేశ్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా అమరావతి పేరుతో జనం సొమ్మును కొట్టేశారన్నారు. ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్న తరహాలోనే.. ఇప్పటికే సీఐడీ విచారణలో తేలిన స్కిల్ స్కాం, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం, కాంట్రాక్ట్ పనుల్లో అక్రమాలు, ఫైబర్నెట్ స్కామ్లలోను ఈ వ్యక్తుల ద్వారా ఇదే విధమైన రూటింగ్ జరిగిందని చెప్పారు. ఎంవీపీ, పీఏ శ్రీనివాస్, రాజేశ్ తదితరులు ఆ కుంభకోణాల్లోను ప్రధానపాత్ర పోషించారన్నారు. ఐదేళ్లలో రకరకాల స్కీమ్ల పేరుతో స్కామ్లు చేసిన చంద్రబాబు వేలకోట్ల రూపాయలు దోచుకుని హైదరాబాద్లో దాచుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు. ప్రజాధనాన్ని దోచేసిన తండ్రీకొడుకులను వలేసి భలే పట్టుకున్నారని ఐటీ శాఖను ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేటని చెప్పారు. తండ్రీకొడుకులు ఏయే పాపాలు చేశారని నాలుగేళ్లుగా చెబుతున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా ఆధారాలతో దొరుకుతున్నాయని తెలిపారు. కచ్చితంగా చంద్రబాబు పాపం పండే రోజు వచ్చింది.. అవినీతి బట్టబయలైంది.. పరిహారం చెల్లించాల్సిన రోజు వస్తుంది.. అని పేర్ని నాని చెప్పారు. -
కాంట్రాక్టు పనులకు జీఎస్టీ ‘ఊరట’
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు పనులకు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తీపి కబురు అందింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్లు లాంటి పథకాలకు అవసరమయ్యే లేబర్ కాంపొనెంట్పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించే అవకాశాలున్నాయని కేంద్రం నుంచి సమాచారం అందిందని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 6న ఢిల్లీలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాస్తవానికి కాంట్రాక్టు పనులపై జీఎస్టీని 18 శాతంగా కేంద్రం తొలుత నిర్ధారించింది. గతంలో కాంట్రాక్టు పనులపై 5 శాతం వ్యాట్ ఉండగా, అది 18 శాతానికి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం షాక్కు గురైంది. దీనిపై సీఎం కేసీఆర్తో పాటు ఆర్థిక మంత్రి ఈటల, మంత్రి కేటీఆర్, వాణిజ్య పన్నుల అధికారులు కేంద్రానికి అనేక వినతులు పంపారు. దీంతో జీఎస్టీని 12 శాతానికి తగ్గించింది. ఆ తర్వాత జరిగిన కౌన్సిల్ సమావేశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలను గట్టిగానే వినిపించింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తాజాగా లేబర్ కాంపొనెంట్ విషయం తెలియడంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్టయింది. లేబర్ కాంపొనెంట్పై జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో రూ.2 వేల నుంచి 3 వేల కోట్ల వరకు ఉపశమనం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో అధికారిక ప్రకటన కోసం గంపెడాశతో ఎదురుచూస్తోంది. -
5 శాతమే.. ఎజెండా!
- కాంట్రాక్టు పనుల జీఎస్టీపై ప్రభుత్వ తాజా ప్రతిపాదన - వచ్చే నెలలో జరిగే కౌన్సిల్ సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా - కసరత్తు చేస్తున్న అధికారులు.. - పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా పడే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. కాంట్రాక్టు పనులకు 18 శాతంగా విధించిన జీఎస్టీని 12 శాతానికి తగ్గించడంలో సఫలీకృతమైన ఉత్సాహంతో దీన్ని మరింత తగ్గించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు వచ్చే నెల 9న తొలిసారి హైదరాబాద్లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలనే వేదికగా చేసుకోవాలని నిర్ణయించింది. కాంట్రాక్టు పనులపై 12 శాతం విధించిన జీఎస్టీని 5 శాతానికి తగ్గించే ప్రతిపాదనే ప్రధాన ఎజెండాగా పెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం వాణిజ్య పన్నులు, సాగు నీటి శాఖ అధికారులు, బోర్డ్ ఆఫ్ ఇంజనీర్ల బృందం ఇప్పటికే పని మొదలుపెట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలతో కూడిన నివేదికను సిద్ధం చేస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు ఇతర రాష్ట్రాల మద్దతు ఎలా ఉంటుందన్నది ఆసక్తి కలిగి స్తోంది. గతంలో 18 శాతం నుంచి 12 శాతా నికి తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన కు పశ్చిమబెంగాల్ రాష్ట్రం మాత్రమే అండ గా నిలిచింది. మరో రాష్ట్రం కొంత మద్దతిచ్చి నా కేవలం తెలంగాణ, పశ్చిమబెంగాల్ ప్రతినిధుల ఒత్తిడి మేరకు కేంద్రం 12 శాతానికి తగ్గించింది. అప్పుడు మిగిలిన రాష్ట్రాలన్నీ మౌనంగా ఉండగా, ఇప్పుడు ఈ 5 శాతం ప్రతిపాదనకు ఎన్ని రాష్ట్రాలు మద్దతిస్తాయో వేచిచూడాల్సిందే. ప్రగతిభవన్లో సీఎం విందు జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి తొలిసారి ఆతిథ్యం ఇస్తున్నందున ఏర్పాట్లు భారీగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కౌన్సిల్ చైర్మన్ హోదాలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు ఈ సమావేశానికి రానున్నారు. నోవాటెల్ వేదికగా జరగనున్న ఈ సమావేశం ముందు, తర్వాత ప్రతినిధులకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేసే బాధ్యతను వాణిజ్య పన్నుల శాఖ తీసుకుంది. ఇందుకోసం అనేక కమిటీలను ఏర్పాటు చేసుకుని కౌన్సిల్ సమావేశానికి సిద్ధమవుతోంది. మరోవైపు జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి వచ్చే అన్ని రాష్ట్రాల ప్రతినిధులకు ప్రగతి భవన్లో విందు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వచ్చేనెల 9న ఈ విందును ఏర్పాటు చేస్తున్నారని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు వెల్లడించాయి.