Cop Killed
-
‘నీ త్యాగం ఎందరినో కాపాడింది’
శ్రీనగర్ : కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమిత్ షా తొలిసారి జమ్ము కశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన పోలీసు అధికారి అర్షద్ అహ్మద్ ఖాన్ కుటుంబ సభ్యులను ఆయన గురువారం పరామర్శించారు. అనంతనాగ్‌లో ఈ నెల 12న పారామిలటరీ బలగాలపై ఉగ్రవాదులు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో వీరమరణం పొందిన అర్షద్ కుటుంబం నగరంలోని బాల్‌గార్డెన్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో అమిత్ షా అర్షద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశ రక్షణ కోసం అర్షద్ చేసిన త్యాగం ఎంతోమంది జీవితాలను కాపాడింది. అర్షద్ ఖాన్ ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తోంది’ అన్నారు. అర్షద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. అర్షద్ ఖాన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలిద్దరూ చాలా చిన్నవారు. వీరిలో ఒకరికి నాలుగేళ్లు కాగా మరొకరు ఏడాది నిండిన చిన్నారి. Visited the home of inspector Arshad Khan, SHO Anantnag in Srinagar, who was martyred in a terror attack & offered my condolences to the bereaved family. His sacrifice for the security of our nation has saved many lives. Entire nation is proud of Arshad Khan‘s valour & courage. pic.twitter.com/eByqlVubo6 — Amit Shah (@AmitShah) June 27, 2019 జమ్ముకశ్మీర్‌లో జూన్ 12న భద్రతాబలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో అర్షద్ కుడా ఉన్నారు. తీవ్ర గాయాలపాలైన అర్షద్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. -
ప్రధాని ర్యాలీకి వెళ్లొస్తున్న వారిపై రాళ్ల దాడి
లక్నో: ప్రధాని మోదీ సభకు హాజరైన ప్రజలపై ఆందోళనకారులు చేసిన దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఘాజీపూర్‌లో మోదీ సభకు వెళ్లివస్తున్న ప్రజలపై రాష్ట్రీయ నిషాద్ పార్టీకి చెందిన కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా తలపై ఓ రాయి బలంగా తలగడంతో కానిస్టేబుల్ సురేశ్ వత్స్(48) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషయమై ఘాజీపూర్ సూపరింటెండెంట్ యశ్వీర్ సింగ్ మాట్లాడుతూ.. నిషాద్ పార్టీ మద్దతుదారుల్ని అధికారులు ప్రధాని సభకు వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. దీంతో సభనుంచి తిరిగివస్తున్న వాహనాలను వీరు అడ్డుకుని రాళ్లదాడి చేశారన్నారు. ఈ ఘటనకు సంబంధించి 15 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరోవైపు సురేశ్ భార్యకు రూ.40 లక్షలు, తల్లిదండ్రులకు రూ.10 లక్షల నష్టపరిహారాన్ని యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రకటించారు. -
‘చరిత్ర గురించి అడిగితే భూగోళ శాస్త్రం గురించి చెప్తున్నారు’
ముంబై : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నగరాల పేర్లు మారుస్తూ బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో జరిగే సంఘటనల గురించి ఆయనకు పెద్దగా పట్టదంటూ శివసేన పార్టీ విమర్శలు చేసింది. రాష్ట్రంలోని బులందషహర్ పట్టణంలో జరిగిన దాడులను ఉద్దేశిస్తూ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో.. ‘జవాన్లు, పోలీసులకు మతం ఉండదు. అలాగే, అధికారంలో ఉన్నవారు మతాలకతీతంగా తమ బాధ్యతలను నిర్వర్తించడంపై దృష్టి పెట్టాలి. యోగి పాలనలో అల్లర్లు చెలరేగుతున్నాయి. బులందషహర్ ఘటనలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి వరకూ ఆ కుటుంబాన్ని పరామర్శించేంత తీరిక యోగికి చిక్కలేదు. ఎందుకంటే ఆయన నగరాల పేర్లు మార్చడంలోనే తీరిక లేకుండా ఉన్నారంటూ’ శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ బీజేపీ తరఫున రాష్ట్రంలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యోగి తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ‘యోగి హైదరాబాద్ పేరు మారుస్తానని చెప్పుకొంటున్నారు.. కానీ, తన సొంత రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాత్రం ఆయన నోరువిప్పడం లేదు. యోగి ముందు చరిత్రకు సంబంధించిన ఓ ప్రశ్న ఉంది. కానీ, ఆయన భౌగోళిక అంశాలకు సమాధానాలు ఇస్తున్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా ఎప్పుడు మారుస్తారు? అన్నది ఇప్పుడు ఆయన ముందున్న ప్రశ్న కాదు. అయోధ్యలో రామ మందిరం ఎప్పుడు నిర్మిస్తారన్నదే ప్రశ్న. ఇది చరిత్రకు సంబంధించిన ప్రశ్న’ అని శివసేన విమర్శించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ దుకాణం మూసేసిందని ఆ పార్టీ విమర్శించింది. ‘కేంద్ర మంత్రులందరూ తమ దుకాణాన్ని మూసేసి, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ హామీలు ఇవ్వడంలో బిజీ అయిపోయారు’ అని ఎద్దేవా చేసింది. -
డార్జిలింగ్‌లో ఉద్రిక్తత
-
ఆగని హింసాత్మక ఘటనలు..
-
ఆగని హింసాత్మక ఘటనలు..
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ ఇంకా అట్టుడుకుతూనే ఉంది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్మన్ వాని ఎన్ కౌంటర్ లో మృతి చెందిన అనంతరం పోలీసులకు ఆందోళన కారులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అనంత్ నాగ్ జిల్లాలో ఆందోళన కారులు పోలీసు వాహనాన్ని జీలం నదిలోకి తోసేయడంతో డ్రైవర్ ఫిరోజ్ అహ్మద్ మృతి చెందారు. (చదవండి: భగ్గుమన్న కశ్మీరం) ముందు జాగ్రత్త చర్యగా జమ్ముతో పాటు పాటు మరో నాలుగు జిల్లాల్లో రెండో రోజూ కర్ఫూ అమల్లో ఉంది. మెబైల్, ఇంటర్ నెట్ సేవలపైనా నిషేధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో 17 మంది మృతి చెందారు. 96 మంది భద్రతా సిబ్బందితో సహా 126 మంది గాయపడ్డారు. ఆందోళన కారుల సమ్మెతో దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పెట్రోల్ బంకులు తెరుచుకోకపోవడంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మనోవేదనను కల్గిస్తున్నాయి జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర శోకాన్ని కలిగిస్తున్నాయని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆవేదనవ్యక్తం చేశారు. అసమాన శక్తి సామర్థ్యాలు ఉపయోగించి ఆందోళనను అదుపుచేయాలని భద్రతా సిబ్బందిని ఆమె కోరారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్మన్ వాని తమపై దాడి చేయడానికి ప్రయత్నించినందుకే అతన్ని హతమార్చాల్సి వచ్చిందని ఆర్మీ అధికారులు తెలిపారు. అమర్ నాథ్ యాత్ర పున:ప్రారంభం: జమ్ముకశ్మీర్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో17 మంది మృతి, 200 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో అమర్ నాథ్ యాత్ర పై విధించిన నిషేధాన్ని తొలగించారు. సీఎం మెహబూబా ముఫ్తీతో ఫోన్లో మాట్లాడి శాంతి భద్రతలపై పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హాన్ ముజాఫర్ వానిని భద్రతా బలగాలు హతమార్చిన నేపథ్యంలో జరిగిన అల్లర్లలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు. -
‘విధి’ బలి తీసుకుంది..
న్యూఢిల్లీ: పోలీస్ ఉద్యోగమంటేనే సవాళ్లతో కూడుకున్నది.. శాంతిభద్రతల పరిరక్షణలో ఎంతోమంది సంఘ విద్రోహశక్తులతో పోరాడాల్సి ఉంటుంది.. ఒక్కోసారి విధినిర్వహణలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి ఉంటుంది.. అయినా ఆ శాఖలో పనిచేసేందుకు ఎవరూ భయపడటం లేదంటే ఆశ్చర్యంలేదు. కాగా, ఈ ఏడాది ఢిల్లీ పోలీస్‌శాఖలో విధుల్లో అశువులు బాసినవారి సంఖ్య 16కు చేరింది. ఇందులో నలుగురు తుపాకీ కాల్పుల్లో మృతిచెందగా, మిగిలినవారు డ్యూటీలో ఉండగానే రోడ్డుప్రమాదాల్లో, గుండెపోటుతో మరణించారు. గత సోమవారం రాత్రి మద్యం వ్యాపారులు ఒక కానిస్టేబుల్‌ను కాల్చి చంపగా, మంగళవారం ఉదయం ట్రక్ ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళుతున్న కానిస్టేబుల్ మృతిచెందాడు. 2011లో ఒకరు, 2012లో నలుగురు, 2013లో ఒక పోలీస్ అధికారి సంఘ విద్రోహ శక్తులు జరిపిన కాల్పుల్లో మృత్యువాత పడ్డారు. కాగా, సంఘ విద్రోహశక్తులు వాడుతున్న మారణాయుధాలు అధునాతనమైనవి కాగా, పోలీసు శాఖ ఇప్పటికీ పాతకాలం నాటి తుప్పుపట్టిన ఆయుధాలనే వినియోగిస్తోంది. దీంతో విద్రోహులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పోలీసు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, మృత్యువాత పడిన పోలీస్ సిబ్బందితో పాటు గాయాలపాలైన వారికి సైతం పోలీస్ శాఖ నష్టపరిహారం అందిస్తోందని ఢిల్లీ పోలీస్ అధికారప్రతినిధి రజన్ భగత్ తెలిపారు. ‘విద్రోహులను ఎదుర్కోవడంలో పోలీసులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఎప్పటికప్పుడు సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. బ్యాచుల వారీగా నిర్ణీత కాలం శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించాం.. ఒక్కో బ్యాచ్‌లో 20-25 మంది ఉంటారు. ఈ శిక్షణ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.. దీనికోసం ప్రతి జిల్లాలోనూ ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నాం. రోడ్డు నిబంధనల ఉల్లంఘనలు, వాహనాలు, ఆయుధాల తనిఖీలు చేపట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ సమయంలో సిబ్బందికి తగిన అవగాహన కల్పిస్తాం..’అని పోలీస్ జాయింట్ కమిషనర్ (ఉత్తర పరిధి) ఆర్.ఎస్.కృష్ణ వివరించారు.