ప్రధాని ర్యాలీకి వెళ్లొస్తున్న వారిపై రాళ్ల దాడి | Cop killed as Nishad Party workers pelt stones after PM rally | Sakshi
Sakshi News home page

ప్రధాని ర్యాలీకి వెళ్లొస్తున్న వారిపై రాళ్ల దాడి

Published Sun, Dec 30 2018 3:46 AM | Last Updated on Sun, Dec 30 2018 3:46 AM

Cop killed as Nishad Party workers pelt stones after PM rally - Sakshi

లక్నో: ప్రధాని మోదీ సభకు హాజరైన ప్రజలపై ఆందోళనకారులు చేసిన దాడిలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఘాజీపూర్‌లో మోదీ సభకు వెళ్లివస్తున్న ప్రజలపై రాష్ట్రీయ నిషాద్‌ పార్టీకి చెందిన కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా తలపై ఓ రాయి బలంగా తలగడంతో కానిస్టేబుల్‌ సురేశ్‌ వత్స్‌(48) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషయమై ఘాజీపూర్‌ సూపరింటెండెంట్‌ యశ్వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. నిషాద్‌ పార్టీ మద్దతుదారుల్ని అధికారులు ప్రధాని సభకు వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. దీంతో సభనుంచి తిరిగివస్తున్న వాహనాలను వీరు అడ్డుకుని రాళ్లదాడి చేశారన్నారు. ఈ ఘటనకు సంబంధించి 15 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరోవైపు సురేశ్‌ భార్యకు రూ.40 లక్షలు, తల్లిదండ్రులకు రూ.10 లక్షల నష్టపరిహారాన్ని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement