పుట్టపర్తి పర్యాటక అభివృద్ధికి చర్యలు
పుట్టపర్తి అర్బన్: ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో పుట్టపర్తి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేషన్ హెచ్ఓడీలు అనిల్ కె.గుప్తా, కన్నన్ పేర్కొన్నారు. పుట్టపర్తికి మంగళవారం విచ్చేసిన వారు ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు, కార్యదర్శి ప్రసాద్‌రావును కలిశారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై వారు చర్చించారు. అనంతరం సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియం, శిల్పారామంను సందర్శిం చారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్ల ప్యాకేజీని అందించే అవకాశం ఉందన్నారు. ఇందులో రాయల సీమ టూరిజం స ర్యూట్కు రూ.100 కోట్లు కేటాయించే అవకాశం ఉందన్నా రు. అనంతరం వా రు సత్యసాయి మ హా సమాధిని ద ర్శించుకున్నారు. కార్యక్రమంలో టెక్నికల్ మేనేజర్ శ్రీధర్, డివిజనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శనరావు, డీఈ ఈశ్వరయ్య పాల్గొన్నారు.