Counselling to students
-
ఆ కాలేజీలకు ‘ఈడబ్ల్యూఎస్’ షాక్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కాలేజీలపై ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా ప్రభావం పడనుంది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్ల పెరుగుదల సాధారణ కాలేజీలకు నష్టదాయకం కానుండగా, టాప్ కాలేజీలకు మేలు చేకూర్చనుంది. ప్రవేశాల్లో విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది టాప్ కాలేజీలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో ఈడబ్ల్యూఎస్ కోటాలో టాప్ కాలేజీల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యే అవకాశం ఉండగా, సాధారణ కాలేజీల్లో ఆ మేరకు ప్రవేశాల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం నెలకొంది. కౌన్సెలింగ్ కసరత్తు షురూ.. రాష్ట్రంలో 2020–21 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ఇప్పటికే ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు అంచనాల్లో పడ్డాయి. తమ కాలేజీలకు ఉన్న డిమాండ్ ప్రకారం తమకు ఎంత మేలు చేకూరుతుంది.. ఎవరికి నష్టం చేకూరుతుందన్న లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు యాజమాన్యాల వారీగా, కోర్సుల వారీగా 10 శాతం సీట్ల పెంపుతో ఎలా కౌన్సెలింగ్ నిర్వహించాలన్న కసరత్తును ప్రవేశాల క్యాంపు కార్యాలయం ప్రారంభించింది. ఆన్లైన్ ప్రోగ్రామింగ్ రూపకల్పనకు చర్యలు చేపట్టింది. 40 నుంచి 50 కాలేజీల్లోనే 100% ప్రవేశాలు రాష్ట్రంలో 205 ఇంజనీరింగ్ కాలేజీలుండగా, గతేడాది కన్వీనర్ కోటాలో 183 కాలేజీల్లోని 65,544 సీట్లలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వ హించారు. మరికొన్ని మైనారిటీ కాలేజీల్లో ఆయా యాజమాన్యాలే సొంత ప్రవేశాలను చేపట్టాయి. కన్వీనర్ కోటాలో చేపట్టిన ప్రవేశాల్లో 44 కాలేజీల్లోనే సీట్లు 100% భర్తీ అయ్యాయి. ఒక్క విద్యార్థి చేరని కాలేజీలు 3 ఉండగా, అన్ని బ్రాంచీల్లో కలిపి 10 లోపే ప్రవేశాలు వచ్చిన కాలేజీలు 90కి పైగా ఉన్నాయి. ఒక్కో కాలేజీలో 200 మందికి మించి విద్యార్థులు చేరిన మరికొన్ని కాలేజీల్లోనే 45 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. ఆయా కాలేజీల్లోనే 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 4,500కుపైగా సీట్లు పెరుగనున్నాయి. దీంతో విద్యార్థులు కూడా టాప్ కాలేజీల్లో పెరిగిన సీట్లలో చేరేందుకు ఆసక్తి చూపనున్నారు. 100 లోపే ప్రవేశాలు వచ్చిన 90కి పైగా కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% సీట్లు పెరిగినా పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు. ఎంబీఏ, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఎడ్, ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీ (ఈసెట్) వంటి ఇతర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లోనూ ఇదే ప్రభా వం ఉండనుంది. వాటిల్లోనూ టాప్ కాలేజీల్లో పెరిగే సీట్లలోనే విద్యార్థులు చేరేందుకు మొగ్గు చూపనున్నారు. ఇక ఎంబీఏను తీసుకుంటే గతే డాది 276 కాలేజీల్లో 22,434 సీట్లను భర్తీ చేశా రు. అయితే అందులో 184 కాలేజీల్లోనే 100% సీట్లు భర్తీ అయ్యాయి. మరో 92 కాలేజీల్లో 100% సీట్లు భర్తీ కాలేదు. అందులో తక్కువ అడ్మిషన్లున్న కాలేజీలు 65కు పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ అడ్మిషన్లు ఉన్న కాలేజీలకు సీట్లు పెరిగినా పెద్దగా ప్రయోజనం లేకపోగా, ఎక్కువ డిమాండ్ ఉన్న కాలేజీల్లో పెరిగే సీట్లలో చేరేందుకే సాధారణ కాలేజీల్లో చేరాల్సిన విద్యార్థులే వెళ్లే అవకాశముంది. -
ఆకతాయిల ఆట కట్
సిద్దిపేటటౌన్: వినోద్(పేరు మార్చాం) కాలేజీకి వెళ్లకుండా జులాయిగా తిరుగుతుంటాడు. అతని గ్రామం మీదుగా రోజు సిద్దిపేటకు బస్సులో వేళ్లే కాలేజీ అమ్మాయిని ఆటపట్టించే వాడు. రోజురోజుకు వినోద్ అల్లరి ఎక్కువ కావడంతో బాధితురాలు భరించలేక.. ఓ రోజు ఇంట్లో వాళ్లకు విషయం చెప్పంది. వెంటనే సదరు అమ్మాయి వాళ్ల నాన్న తనకు తెలిసిన వాళ్ల ద్వారా షీ టీం బృందానికి విషయం చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన షీ టీం బృందం సాధారణ ప్రయాణికుల మాదిరిగా రెండు రోజులు బస్సులో ప్రయాణం చేసి.. వినోద్ ఆటపట్టించడాన్ని పూర్తిగా వీడియో తీశారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతని తల్లిదండ్రులను పిలిపించి.. వారికి అమ్మాయిని ఆట పట్టించిన వీడియో చూపించారు. అనంతరం వారి తల్లిదండ్రుల సమక్షంలో సీఐ నేతృత్వంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మొదటి అవకాశంగా కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెడుతున్నామని, బుద్ధిగా ఉండాలని హెచ్చరించి వదిలేశారు. అప్పటి నుంచి వినోద్ బుద్ధిగా కాలేజీకి వెళ్లడం ప్రారంభించారు. ఈ ఒక్క సంఘటనలోనే కాదు.. అమ్మాయిలను, మహిళలను వేధించే వారిని వదిలిపెట్టకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది షీ టీం బృందం. సిద్దిపేటలో షీ టీం ఏర్పాటు తర్వాత అమ్మాయిలకు వేధింపులు చాలా వరకు తగ్గాయి. 2015లో షీ టీం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలు, అమ్మాయిల భద్రత కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం షీ టీం బృందాలను ఏర్పాటు చేసింది. మొట్టమొదటి సారిగా ప్రయోగాత్మకంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌లో ఈ షీటీం బృందాలు విజయవంతంగా విధులు నిర్వహిస్తుండటంతో మిగతా జిల్లాల్లోనూ బృందాలను ఏర్పాటుచేశారు. అలా 2015 ఫిబ్రవరి 9న ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్పటి ఎస్సీ సుమతి ఆధ్వర్యంలో సిద్దిపేటలో షీ టీం బృందం ఏర్పాటైంది. షీ టీం బృందం విధులు షీ టీం మహిళలు, అమ్మాయిలను ఆకతాయిల బారి నుంచి రక్షించి.. ఆటపట్టించే వారిని పట్టుకుని వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పని ప్రదేశాలలో మహిళలు, కాలేజీ అమ్మాయిలు.. అబ్బాయిల నుంచి ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గిస్తారు. ఉపాధి పనులకు వెళ్లే మహిళలకు పని ప్రదేశాలలో ఎదురయ్యే వేధింపులను ఎలా ఎదుర్కొవాలి, వేధింపుల నుంచి ఎలా రక్షణ పొందాలి అనే అంశాలను వివరించనున్నారు. కాలేజీల్లో అమ్మాయిలకున్న రక్షణ చట్టాలపై అవగాహన కలిగించడం, కేసు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తారు. ఆట పట్టిస్తూ షీ టీం బృందానికి పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు మళ్లీ ఎలాంటి పొరపాటు చేయకుండా సంజాయిషీ లెటర్ తీసుకుని విడిచి పెడుతారు. అమ్మాయిలు, మహిళలపై జరిగే వేధింపుల రకాలను కళాజాత బృందాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కల్పిస్తారు. చైల్డ్ అబ్యూజింగ్ జరగకుండా చూడటం, మొబైల్ ఫోన్ ద్వారా అభ్యంతరకర మెసేజ్‌లు చేసే వారిని, రాంగ్ కాల్స్ చేసి ఇబ్బంది పెట్టే వారి గురించి కేసు పెడితే.. వెంటనే వారిని అరెస్టు చేసి, వారిని హెచ్చరిస్తారు. లేడీస్ హాస్టల్స్, మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మహిళలకు, అమ్మాయిలకు అవగాహన కలిగిస్తారు. బస్టాండ్లలో గస్తీ షీ టీం బృందంలో ఒక కానిస్టేబుల్, ముగ్గురు లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు. ఇలా రెండు టీంలు ఉదయం, సాయంత్రం బస్టాండ్, ప్రధాన చౌరస్తాల వద్ద గస్తీ ఉండి అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించేవారిని గుర్తించడంతో పాటు వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు ఒక టీం, సాయంత్రం 4 నుంచి 7.30 గంటల వరకు మరో టీం విధులు నిర్వహిస్తారు. సామాజిక మాధ్యమాల ద్వారా.. షీ టీం బృందాలు ఇకపై కమిషనరేట్ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రయాణ ప్రాంగణాలు, ప్రధాన చౌరస్తాలలో విద్యార్థులను, యువతులను, మహిళలను అప్రమత్తం చేసేలా విస్తృత ప్రచారం చేస్తారు. ఆకతాయిలు మహిళలను, యువతులను వేధింపులకు గురి చేస్తే తక్షణమే 100 నెంబర్‌కు, ఫేస్బుక్, ఈమెయిల్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మహిళలు ఉన్న చోట అవగాహన కాలేజీలు, ఇతర సంస్థలు, స్థలాలలో మహిళలు, అమ్మాయిలు ఎక్కువ సంఖ్యలో ఒకే దగ్గర ఉండే అవకాశం ఉంది. అలాంటి చోట అభ్యంతరకర చర్యలను ఎలా ఎదుర్కొవాలి? వాటిని ఎలా తిప్పికొట్టాలి? అనే అంశాలను, చట్టాల ద్వారా ఎలా రక్షణ పొందాలి అనే విషయాలను నెలలో ఒకరోజు అవగాహన కల్పిస్తున్నాం. అమ్మాయిలు, మహిళలు, వృద్ధుల మీద హింస, అభ్యంతరకర ప్రవర్తన ఏ రూపంలో ఉన్నా చర్యలు తీసుకుంటున్నాం. – పద్మ, సీఐ, ఉమెన్ పోలీస్‌స్టేషన్, సిద్దిపేట సక్రమ మార్గంలో నడిచేలా.. అమ్మాయిలను చూసి అబ్బాయిలు, అబ్బాయిలను చూసి అమ్మాయిలు ఆకర్షితులు అవ్వడం యుక్త వయస్సులో సహజం. కానీ, దాని గురించి విడమరిచి చెప్పకపోతే అది తీవ్రరూపం దాల్చి విపరీత ధోరణికి దారితీస్తుంది. ఏది మంచి? ఏది చెడు? అనే విషయాలను వారికి తెలియజేయాలి. – ఉమాపతి, సైకాలజిస్ట్, ఉమెన్ పీఎస్, సిద్దిపేట అద్భుతంగా పని చేస్తున్నారు.. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీం బృం దాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఉదయం, సా యంత్రం ప్రధాన చౌరస్తా వద్ద ఉంటూ ఆకతాయిలను పట్టుకుని వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. – జోయల్ డేవిస్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ -
ప్రియమైన అమ్మా నాన్నా..
* తల్లిదండ్రులు ఓటు వేసేవిధంగా పిల్లలతో కౌన్సెలింగ్ * ఓటింగ్ శాతం పెంచడానికి స్కూలు విద్యార్థులను ఆశ్రయించిన ఈసీ * సంకల్ప పత్రాలపై సంతకాలు పెట్టించి తీసుకురావాలని సూచన సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూసేందుకు ఎన్నికల కమిషన్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆశ్రయించింది. తమ తల్లిదండ్రులతో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించాల్సిన బాధ్యతను వారిపై ఉంచింది. పిల్లల భవిష్యత్తు కోసం ఫిబ్రవరి 7న ఓటు వేస్తామని ప్రతిజ్ఞ పత్రంపై తల్లిదండ్రులతో సంతకం చేయించి తీసుకురావాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు విద్యాశాఖ స్కూలు విద్యార్థులను కోరింది. ‘ప్రియమైన అమ్మా నాన్నా ... మీరు నన్ను ఎంతో ప్రేమిస్తారని, నా భవిష్యత్తును ఉజ్వలంగా ఉంచడం కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తారని నాకు తెలుసు. నా భవిష్యత్తు పటిష్టమైన ప్రజాస్వామ్యంతో గట్టిగా ముడిపడిఉంది. అందుకే మీరు ఫిబ్రవరి 7న ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయాలని నేను కోరుతున్నాను. మీరు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారన్న నమ్మకం నాకుంది..’ అని రాసి ఉన్న సంకల్పపత్రాలను విద్యాశాఖ విద్యార్థులకు పంచింది. విద్యార్థులు వీటి పై తల్లిదండ్రులతో సంతకం చేయించి స్కూలు టీచర్లకు తిరిగి ఇవ్వవలసి ఉంది. ఢిల్లీ సర్కార్, ఎమ్సీడీ, ఎన్డీమ్సీ , ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు నడిపే స్కూళ్లలో ఇటువంటి సంకల్ప పత్రాలను విద్యార్థులకు పంచినట్లు జాయింట్ చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్ రాజేష్ గోయల్ తెలిపారు. ఈ పత్రాలను పిల్లలకు ఇచ్చి వారి తల్లిదండ్రులతో సంతకం చేసిన తర్వాత వాటిని తిరిగి ఫిబ్రవరి 5 వరకు పిల్లల నుంచి సేకరించవలసిన బాధ్యతను విద్యాశాఖ స్కూలు అధికారులకు అప్పగించింది. పిల్లలు ఈ పత్రాలను ఇంటికి తీసుకుపోవడం వల్ల కుటుంబసభ్యుల మధ్య కొంత చర్చ జరుగుతుందని, దాని వల్ల ఓటింగ్‌పై అవగాహన పెరుగుతుందని ఎన్నికల కమిషన్ ఆశిస్తోంది. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం పిల్లలకు కూడా కల్పించడం వల్ల ఓటింగ్ శాతం పెరగడంతో పాటు రాజకీయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే అవకాశం కూడా పిల్లలకు లభిస్తుందని స్కూలు ప్రిన్సిపాళ్లు అంటున్నారు. గత ఎన్నికల సమయంలోనూ తల్లి దండ్రులతో ఓటు వేయించాలని పిల్లలను కోరినప్పటికీ సంకల్పపత్రాలను పంచి తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించడం మాత్రం ఇదే మొదటిసారని వారు అంటున్నారు.