క్రమశిక్షణ కలిగిన యువతతోనే దేశాభివృద్ధి
ఖమ్మం జెడ్పీసెంటర్: క్రమశిక్షణ కలిగిన యువత ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇంపాక్ట్-2016 ముగింపు సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో లక్ష్య ఇంజనీరింగ్ కళాశాల, మైడ్యూటీ టు ద సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంపాక్ట్-2016 సదస్సు ముగింపు కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులకు, యువతకు చదువుతో పాటు క్రమశిక్షణ ముఖ్యమన్నారు.
ప్రతిఒక్కరూ సామాజిక సేవతోపాటు విజ్ఞాన వికాసాన్ని అలవర్చుకుని దేశ ప్రతిష్టతను పెంపొందించాలని, ఏ కష్టాన్ని అయినా జయిచేందుకు సిద్ధం కావాలని సూచించారు. మై డ్యూటీ టు ద సొసైటీ ఫౌండేషన్ చైర్మన్ కొప్పురావూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంపాక్ట్-2016 ద్వారా యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, పట్టభద్రులు, ఆయా రంగాల్లో నైపుణ్యాలను సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు నాగిరెడ్డి మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా తన బాధ్యతను కచ్చితంగా నిర్వహిస్తాడో అనుకున్న లక్ష్యాన్ని సులువుగా సాధిస్తాడని పేర్కొన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు జేసీ నర్సింహారావు మాట్లాడుతూ శోధించి సాధించి పనిచేస్తే ఎంతటి కఠినమైన పని అయినప్పటికీ సులువుగా చేసుకోవచ్చన్నారు. నల్లమోతు శ్రీధర్ మాట్లాడుతూ సత్పవ్రర్తన కలిగి ఉంటే మంచి గుర్తింపును సాధిస్తారన్నారు.
జేఎస్ పెద్దిరాజు మాట్లాడుతూ విద్యార్థులకు చిత్రపటాల నేర్పించాలని చెప్పారు. సినీ ప్రముఖుడు, రచరుుత, దర్శకుడు, నటుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు కేవీ ప్రదీప్ మాట్లాడుతూ చదువు, డబ్బు ఎవరి పక్కన రావని, క్యారెక్టర్ మాత్రమే ఎల్లప్పుడూ ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో లక్ష్మీపురం వేణుగోపాల్, మై డ్యూటీ టు ద సొసైటీ ఫౌండర్ కొప్పూరావూరి ఆంజనేయులు, సభ్యులు రత్నకుమారి, మంజుల, సంకీర్త్, సుమంత్, రామకృష్ణ, ప్రిన్సిపాల్ రఘురాం, మల్లికార్జున్, మురళీకృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు.