రద్దీ వేళల్లో చలానాలు వద్దు
జంక్షన్‌కు 200 మీటర్ల దూరంలోనే రాయండి
ట్రాఫిక్ జామ్ కాకుండా చూడండి
అధికారులకు అదనపు సీపీ జితేందర్ ఆదేశం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రద్దీ సమయాల్లో ట్రాఫిక్ పోలీసులు చలానా రాయడానికి స్వస్తి చెప్పనున్నారు. రద్దీ వేళల్లో వా హనాలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోకుండా చూడడంపై అధికారులు, సిబ్బంది దృష్టి సారించనున్నారు. ఈ మేరకు నగర ట్రాఫి క్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ అ ధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చే శారు.
బుధవారం తన కార్యాలయంలో ట్రాఫిక్ అధికారులు, సిబ్బం దితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని 25 ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలోని జంక్షన్లు, సిగ్నల్ వ్యవస్థ, ఆల్ఫా న్యూమెరి కల్ టైమర్లు, ట్రాఫిక్ సమస్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో తమ ఇబ్బందులను ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు జితేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ట్రాఫిక్ పోలీసులు చలానా రాసేందుకే కాదని, సాఫీగా వాహనాలు నడిచేందుకు కృషి చేస్తున్నారనే భావన వచ్చేలా విధులు నిర్విహంచాల న్నారు. నిబంధనలఉల్లంఘనులపై దృష్టి సారించాలన్నారు.
200 మీటర్ల దూరంలోనే తనిఖీలు
ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా వాహనాల తనిఖీలు, చలానా రా యడం వంటివి చేపట్టాలని జితేందర్ సూచించారు. జంక్షన్‌కు 200 మీ టర్ల దూరంలో వాహనాలు తనిఖీ చేయడం వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందు లు ఉండవన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం 9 నుంచి 11.30 గం టలు, తిరిగి సాయంత్రం 5 నుంచి 7.30 గంటల సమయాలలో త నిఖీలు, చలానాలు రాయవద్దని స్పష్టం చేశారు. మిగతా వే ళల్లోనూ ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా వాహనాల తనిఖీ చేపట్టాలని, ఆ సమయంలో ప్రత్యేక బారికేడ్లను పెట్టుకోవాలని ఆయన సూచించారు. చౌరస్తాకు 100 మీటర్ల దూరంలో రహదారులపై పార్కింగ్, షాపింగ్ సెంటర్ల సైన్‌బోర్డులు, ప్రకటనబోర్డులు అడ్డంగా ఉండకుండా చూడాలన్నారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
సమన్వయంపై దృష్టి
ఎక్కడైనా భారీ వాహనం ప్రమాదానికి గురై, ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే స్పందించాలని జితేందర్ ఆదేశించారు. చుట్టు పక్కల ట్రాఫిక్ ఠాణాల అధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఠాణాల ఎస్హెచ్ఓలు (ఇన్స్పెక్టర్లు) ఎక్కువ సమయం రహదారుల పైనే విధులు నిర్వహించాలని, ప్రజలు, వాహనదారుల సహకారం తీసుకోవాలని సూచించారు.