crop collapse
-
కన్నీళ్లు మిగిల్చిన సాగు: తట్టుకోలేక 20 ఏళ్లు నిండని యువరైతు
తానూరు (ముధోల్): పంటకు నష్టం వాటిల్లడంతో మనస్తాపానికి గురైన యువకుడు వాగులోదూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం వెలుగుచూసింది. కుభీర్ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని బెల్‌తరోడా గ్రామానికి చెందిన పూరంశెట్టి శివకుమార్ (20) తన తండ్రికి సంబంధించిన రెండెకరాల వ్యవసాయ భూమిలో కూరగాయాల సాగు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటకు నష్టం వాటిల్లింది. దీంతో శివకుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. (చదవండి: రైతు ‘ఐడియా’ అదిరింది.. సమస్య తీరింది) శనివారం సాయంత్రం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం వెతకడం ప్రారంభించగా కుభీర్ మండలం లింగి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం, చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చి జాలర్లతో వాగులో గాలించారు. దీంతో శివకుమార్ మృతదేహం బయటపడింది. కుభీర్ ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి పూరంశెట్టి నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో -
మిడతల దాడి.. పొంచి ఉన్న ముప్పు
-
ముంచుకొస్తున్న కొత్త విపత్తు..
కరోనా మహమ్మారితో అలుపెరగని యుద్ధం చేస్తుండగానే ‘ఉంఫన్’ రాష్ట్రంలో అలజడి రేపింది. తుపాను విపత్తును సమర్థంగా ఎదుర్కొని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే రాష్ట్రానికి కొత్త విపత్తు సంకేతాలు వస్తున్నాయి. పంటలకు అపార నష్టం కలిగించే మిడతల దండు రాష్ట్రం వైపు దూసుకు వస్తోంది. మిడతల దండు దాడితో వ్యవసాయ ఉత్పాదనలు భారీగా దెబ్బ తింటాయి. దీంతో రాష్ట్ర సమగ్ర ఆర్థిక పురోగతిపై తీవ్ర ప్రభావం పడుతుంది. రబీ సాగు పూర్తయి పంట సిద్ధంగా ఉంది. త్వరలో ఖరీఫ్ సాగు ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితుల్లో మిడతల దండు రాక..పంటలకు అపాయమని నిపుణులు అభిప్రాయ పడుతుండడంతో రైతాంగం బెంబేలెత్తుతోంది. భువనేశ్వర్: రాష్ట్రానికి మరో కొత్త విపత్తు ముంచుకొస్తోంది. మిడతల దండు దాడి చేసి పంటల్ని నాశనం చేసే ముప్పు పొంచి ఉంది. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో మిడతలు విజృంభిస్తాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మిడతల దాడిని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన క్రిమి సమూహ దాడిగా పరిగణిస్తున్నారు. తూర్పు ఆఫ్రికా నుంచి పాకిస్థాన్ మీదుగా మిడతల దండు ప్రయాణం ప్రారంభమైంది. దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో పంటలకు అపారంగా నష్టం కలిగించాయి. ఢిల్లీ దిశగా మిడతల దండు పయనిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆ సమూహం చొరబడే ప్రమాదం పొంచి ఉన్నట్లు సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వణికిస్తున్న రాకాసి మిడతలు వృక్ష సంపదకు ప్రమాదం గాలిలో ఎగిరే క్రిమి జాతి మిడతల సమూహం. సాధారణంగా ఏటా జులై నుంచి అక్టోబరు మధ్య వీటి ప్రయాణం ప్రారంభమవుతుంది. వేగవంతమైన గాలులతో నిత్యం 150 కిలోమీటర్ల దూరం నిరవధికంగా ఎగురుతాయి. దారి పొడవునా లభించే ఆకులు, పువ్వులు, పండ్లు, గింజలు, చెట్టు బెరడు అత్యంత వేగంగా ఆరగించి అక్కడనే ముసురుకుని బసచేస్తాయి. దీంతో వృక్ష సంపద, ఉద్యాన పంటలు అపారంగా దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంది. వీటి సంతతి వృద్ధి చెందితే మానవాళి తీవ్రంగా ప్రభావితమవుతుంది. పగటి పూట ఇవి గాలితో పయనిస్తాయి. సాయంత్రం పంట పొలాల గమ్యానికి చేరుతాయి. ప్రధానంగా కోతకు సిద్ధమైన పంటల్ని ప్రధాన ఆహారంగా స్వీకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. (జైపూర్‌లో మిడతల దండు) మిడతల దాడితో ముప్పు రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు మిడతల దాడి జరిగిన దాఖలాలు లేనట్లు ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ (ఓయూఏటీ) డీన్ లలిత్ మోహన్ గొడొనాయక్ తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మిడతల సమూహం దాడి చేసే ఆస్కారం ఉండడంతో ముందస్తు జాగ్రత్త అవసరమని ఆయన హితవు పలికారు. మిడతల దాడి రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. పరోక్షంగా ఆర్థిక రంగం బలహీన పడుతుంది. స్థానిక ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విపత్తు నుంచి బయట పడేందుకు కొన్ని ముందస్తు నివారణ జాగ్రత్తలు జారీ చేసింది. మిడతల దాడి నుంచి పంటలకు నష్టం వాటిల్లకుండా చేసేందుకు అనుబంధ వర్గాల నిపుణులు రాష్ట్ర రైతాంగానికి అనుక్షణం సముచిత సలహాలు, సంప్రదింపులతో మార్గదర్శకంగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సాధికారత విభాగం మంత్రి డాక్టర్ అరుణ్ కుమార్ సాహు పిలుపునిచ్చారు. ఓయూఏటీ జారీ చేసిన సూచనలు 5 శాతం వేప గింజల గుజ్జుతో (ఎన్ఎస్కేఈ) 200 లీటర్ల ద్రవ మిశ్రమం పిచికారీ చేయడం ప్రాథమిక నివారణ చర్య. 1 ఎకరం విస్తీర్ణంలో 1 లీటరు వేప గింజల గుజ్జు–300 పీపీఎస్ 200 లీటర్ల నీటిలో కలిపి మద్యాహ్నం పిచికారీ చేయాలి. 200 లీటర్ల నీటిలో 400 మిల్లీ లీటర్ల ప్రొఫెనోఫాస్ 50 ఈసీ కలిపిన మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. డబ్బాలు, పాత్రలు వాయించి చప్పుడు చేయడం మిడతల దాడి నివారణకు మరో ఉపాయం. ముళ్ల కంచెతో రువ్వుతూ మిడతల సమూహాన్ని పారదోలాలి. చెట్లకు చుట్టుముట్టిన మిడతల సమూహం తొలగింపుకు చెట్ల కింద పాలిథిన్ షీటు పరిచి కొమ్మల్ని ఊపడంతో నేల రాలతాయి. వీటిని కిరసనాయిలు మిశ్రమ నీటిలో పోసి దూరంగా పారబోయాలి. తరచూ జారీ చేసే వ్యవసాయ సూచనల్ని క్రమం తప్పకుండా ఆచరించాలి. -
వణికిస్తున్న రాకాసి మిడతలు
రాకాసి మిడతలు విశ్వరూపం దాల్చుతున్నాయి. ఇథియోపియా, సోమాలియా వంటి తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి పెద్ద గుంపులు గుంపులుగా ఖండాలు దాటి వస్తూ పంటలకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. మిడతల దండును ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ఫిబ్రవరిలోనే ఎమర్జెన్సీ ప్రకటించింది. అక్కడి నుంచి మిడతల దండు మన దేశంలోకి ప్రవేశించాయి. రాజస్థాన్, గుజరాత్, పంజా»Œ లతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కూడా పంటలను నమిలేస్తున్నాయి. రాజస్థాన్‌లోని 18 జిల్లాల్లో, మధ్యప్రదేశ్‌లో 12 జిల్లాల్లో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లోనే 2.05 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం రాకాసి మిడతల దండు దాడికి గురైనట్లు అంచనా. రాజస్థాన్‌లోనే 5 లక్షల హెక్టార్లలో పంటలను మిడతలు స్వాహా చేస్తున్నాయి. ముందుకు విస్తరిస్తున్నాయి. ఈ రాష్ట్రాలకు మిడతల తాకిడి కొత్తేమీ కాదు. అయితే, ఈ ఏడాది సాధారణంగా కన్నా కొన్ని వారాలు ముందుగానే విరుచుకుపడటంతో చేతికి వచ్చే దశలో రబీ పంటలు ధ్వంసమయ్యాయి. గత 27 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువ బెడద ఇప్పుడు ముంచుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. పళ్లాలు, ఇతర పాత్రలు, డబ్బాలను మోగించడం, పెద్దగా శబ్దాలు చేస్తూ మిడతల దండును పారదోలి పొలాల్లోని పంటలను కాపాడుకోవాల్సిందిగా అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ట్రాక్టర్ స్ప్రేయర్లతో, అగ్నిమాపక యంత్రాలతో ప్రభుత్వాలు పురుగుమందులు పిచికారీ చేయిస్తున్నాయి. అయితే, 2.5–3 కిలోమీటర్ల పొడవైన కోట్లాది మిడతల గుంపు పంటల మీద దాడి చేస్తున్నందున డ్రోన్లను రంగంలోకి దింపడం అవసరమని కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్లాంట్ ప్రొటెక్షన్ క్వారంటైన్ అండ్ స్టోరేజ్ డైరెక్టరేట్‌కు మిడతల దండు నియంత్రణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దేశంలో ఇప్పటి వరకు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడం చట్టవిరుద్ధం. అయితే, మిడతల విపత్తును ఎదుర్కొనేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తూ కేంద్ర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మిడతలు పగటి పూట ప్రయాణం చేసి రాత్రి పూట చెట్లు చేమలు పంటలపై వాలుతాయి. ఆ సమయంలో పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. మన దేశంలోకి సాధారణంగా పాకిస్తాన్ మీదుగా మిడతల దండు దాడి చేస్తూ ఉంటుంది. అయితే, ఈ సంవత్సరం తీవ్రత చాలా రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో రెండో వైపు నుంచి కూడా మిడతల ముప్పు ఉండొచ్చని భావిస్తున్నారు. తూర్పు ఆఫ్రికా నుంచి హిందూమహా సముద్రం మీదుగా నేరుగా భారత ద్వీపకల్పంలోని తెలుగు రాష్ట్రాలు సహా అనేక ఇతర రాష్ట్రాలపైనా మిడతల దండు దాడికి దిగవచ్చని అధికారవర్గాలు హెచ్చరిస్తున్నాయి. జూలైలోగా భారత్ వైపు మరిన్ని మిడతల గుంపులు కదిలి వచ్చే అవకాశం ఉందని ఆహార వ్యవసాయ సంస్థ సూచిస్తోంది. -
కుక్కనే పులిగా మార్చేసి ... వాటిని తరిమేశాడు..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఓ రైతు తన తోటను కోతుల బారి నుంచి కాపాడుకునేందుకు వినూత్నమైన మార్గం ఎంచుకున్నాడు. సంగతేంటంటే.. ఆ రైతు కష్టించి పండించిన పంటను కోతులు గత కొంతకాలంగా నాశనం చేస్తున్నాయి. అనేక విధాలుగా ఆలోచించిన ఆ రైతుకు తట్టిన ఓ వినూత్న ఆలోచన మంచి ఫలితాన్నిచ్చింది. ఆ రైతు పంటను కాపాడుకోవటానికి తన పెంపుడు కుక్కను పులిలా తయారుచేశాడు. ఆ రైతు ఈ పని చేసింది సరదా కోసం కాదు. తన తోటను రక్షించుకోడానికి. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని నాలూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ పంటను కోతులు గత కొంతకాలంగా నాశనం చేస్తుండేవి. దీంతో నాలుగేళ్ల కిందట ఓ పులి బొమ్మను తోటలో పెట్టాడు. చదవండి: వైరల్ : ఫైన్ వేశారని నానా రభస చేశాడు అప్పటి నుంచి కోతులు అటువైపు రావడం దాదాపు తగ్గిపోయాయి. దీంతో ఆశ్చర్యపోయిన శ్రీకాంత్ మరో తోటలో కూడా పులిబొమ్మను ఏర్పాటు చేశాడు. అది మంచి ఫలితం ఇవ్వడంతో తన కుక్కనే పులిగా మార్చేశాడు. ఆ కుక్క తోటలో తిరుగుతుంటే కోతులు తోట వైపు రావడం మానేశాయి. అలా శ్రీకాంత్ గౌడ తన తోటను కాపాడుకుంటున్నాడు. కెమికల్ రంగులు వేయడం వల్ల కుక్క చర్మం పాడవుతుందని హెయిర్ డై వేస్తూ.. దాని ఆరోగ్యం పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇది చూసిన గ్రామంలోని ఇతర రైతులు కూడా శ్రీకాంత్ గౌడలా కుక్కలకు రంగులు వేయాలని భావిస్తున్నారట. కాగా.. పులిలా డిజైన్ చేసిన ఈ కుక్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
వర్షార్పణం..!
వజ్రపుకొత్తూరు రూరల్ శ్రీకాకుళం : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఓవైపు వరద నీటితో నువ్వలరేవు ఉప్పుటేరు పొంగుతుంటే, మరో వైపు గెడ్డలు సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వజ్రపుకొత్తూరు మండలంలోని వజ్రపుకొత్తూరు, బెండి, నగరంపల్లి, తాడివాడ, కిడిసింగి, గుళ్లలపాడు, సీతాపురం, పెద్దబొడ్డపాడుతో పాటు మరో 10 గ్రామాల్లో సుమారు 800 ఎకరాల్లో వరి పంట వర్షార్పణమైంది. కళ్లముందే పంటంతా నీటిలో మునిగి కుళ్లిపోతుంటే ఏంచేయాలో తోచక రైతులు ఆందోళన చెంందుతునన్నారు. నువ్వలరేవు, పరిసర ప్రాంతాల్లో పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమకు సష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. రైతుల సంక్షేమం పట్టదా? నువ్వలరేవులో ఏర్పడిన పొగురుతో వేలాది ఎకరాల్లో పంట నీట మునుగుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయమని వైఎస్సార్ సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలో వజ్రపుకొత్తూరు వద్ద ముంపునకు గురైన పంట పొలాలను మంగళవారం ఆయన పరిశీలించి ఆరా తీశారు. తక్షణమే సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ సీపీ మండల అధ్యక్షోఉడు పి.గుర్రయ్యనాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు డి.మధుకేశ్వరరావు, నాయకులు మర డ భాస్కరరావు, బి.మోహన్‌రావు, శ్యాం, భీమారావు, రఘు, పురుషోత్తం తదితరులు ఉన్నారు. -
'అధైర్య పడవద్దు..అన్నివిధాలా ఆదుకుంటాం'
భువనగిరి: అకాల వర్షానికి నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. రైతులు అధైర్య పడవద్దని, తర్వలోనే కేంద్రం నుంచి త్వరలోనే పరిహారం అందుతుందన్నారు. తెలంగాణలో అకాల వర్షాల వల్ల పంటలను నష్టపోయిన జిల్లాల్లో బీజేపీ నేతలు పర్యటిస్తున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి నియోజవర్గంలో వర్షాలకు నష్టపోయిన పంటలను బుధవారం కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, మోహన్‌బాయ్ కంధారియా పరిశీలించారు. నియోజకవర్గం రేవులపల్లి, శివారెడ్డిగూడెం గ్రామాలలో పంటలను వారు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. చేతికొచ్చిన పంటను అకాల వర్షాలు ధ్వంసం చేశాయని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే పనికి రాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఈ సందర్భంగా మంత్రులు వారికి భరోసా ఇచ్చారు.