croud
-
అభిమాన హీరోని కడసారి చూసేందుకు పోటెత్తిన ఫ్యాన్స్
-
మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో
సాధారణంగా మెట్రో సౌకర్యం ఉన్న నగరాలలోని ప్రజలు.. తమ ప్రయాణానికి మెట్రోకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో ఒక్కోసారి మెట్రో రైలులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కనీసం నిల్చోవటానికి ఖాళీ స్థలం కూడా దొరకని సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాం? మహా అయితే అక్కడ ఉండే రోప్‌ను పట్టుకుని పడిపోకుండా నిల్చుంటాం. కానీ ఇక్కడో యువకుడు మాత్రం తనకు మెట్రో రైలులో సీటు దొరకలేదని వింతగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒక యువకుడు మెట్రో రైలు ఎక్కాడు. ట్రైన్ అంతా చాలా రద్దీగా ఉంది. నిల్చోవటానికి తప్ప కూర్చోవటానికి ఎక్కడా చోటు లేదు. చాలా సేపు నిలబడినందుకు కాళ్లు నొప్పిపెట్టాయో లేదా ఇంకేం అయిందో తెలీదుగానీ వెంటనే నిల్చున్న చోట మూర్ఛ వచ్చినట్టు వణకిపోయాడు. దీంతో అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు ఆందోళనపడ్డారు. వెంటనే ఒక మహిళ లేచి అతడు కూర్చోవడానికి తన సీటు ఇచ్చింది. మరో మహిళ అతని టోపి కింద పడిపోతే అది తీసి సీటు పైన పెట్టింది. ఈ క్రమంలో, అతగాడు.. సీటుపై కూర్చున్న మరోసారి షాక్ కొట్టినట్లు వణికాడు. కానీ, ఈసారి తోటి ప్రయాణికులు సదరు యువకుడి ప్రవర్తన పట్ల కాస్త అనుమానంగా చూశారు. బహుషా.. ఇది ప్రాంక్ ఏమో.. అనుకున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్న చూసిన నెటిజన్లు.. ‘ఏం.. తెలివి భయ్యా.. నీది’, ‘తోటి వారిని ఫుల్స్ చేశావ్ గా..’, ‘ అయినా.. ఇలా చేయడం సరైన పనికాదు, ‘ మొత్తానికి సీటు సంపాదించావ్ ’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: స్తంభంపైకి ఎక్కిన ఎలుగుబంటి.. విద్యుత్ అంతరాయం.. -
ధోనీకి వాంఖడే సలాం
ముంబై: ప్రత్యర్థి అయితేనేమి ఎన్నో ఏళ్లుగా దేశానికి అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్‌ను అందించాడనేమో.. వాంఖడే మైదానంలోని ప్రేక్షకులు మహేంద్ర సింగ్ ధోనీకి అద్భుత స్వాగతం పలికారు. చెన్నై, ముంబై జట్ల మధ్య బుధవారం వాంఖడే మైదానంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరున్న ధోని.. ఐపీఎల్లో చెన్నై కెప్టెన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన బుధవారం బ్యాటింగ్ చేసేందుకు గ్రౌండ్లోకి అడుగుపెడుతున్నప్పుడు.. ప్రత్యర్థి ఆటగాడని కూడా మర్చిపోయి ముంబై అభిమానులు చప్పట్లు, కేకలు, విజిళ్లతో ధోనీకి స్వాగతం పలికారు. చెన్నై ఓపెనర్లు అంబటి రాయుడు, షేన్ వాట్సన్‌లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడం, రైనా కొద్దిసేపటికే వెనుదిరగడంతో ధోని త్వరగానే బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. డ్రెస్సింగ్ రూం నుంచి ధోని బ్యాట్ అందుకుని మైదానంలోకి వస్తుంటే వాంఖడేలోని ప్రేక్షకులు ధోని.. ధోని.. అంటూ, చిరకాలంగా ఎదురుచూస్తున్న వరల్డ్‌కప్ విజయాన్ని (ఏప్రిల్ 2, 2011) తమకు అందించిన మాజీ భారత సారథికి జేజేలు పలికారు. ఈ మ్యాచ్‌లో ముంబై చేతిలో 37 పరుగుల తేడాతో ఓడిపోయిన చెన్నై.. తన తర్వాతి మ్యాచ్‌లో అశ్విన్ సారథ్యంలోని పంజాబ్‌తో తలపడుతుంది. -
సేకరణ సేవ
సాటి మనిషికి సాయమంటే ముందుండేవాడు. ఆపదవచ్చిందంటే ఆసరా అందించేందుకు వెనుకాడనివాడు.దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల సమయంలో రక్తమోడుతున్న బాధితులను ఆసుపత్రులకు తరలించినవాడు. అలాంటి మంచికుర్రాడికి విధి పరీక్ష పెట్టింది. అనారోగ్యాన్ని అంటగట్టింది. నీకెవరు సాయమొస్తారో చూస్తానంటోంది. కొన్ని నెలలుగా మంచానికి పరిమితమైన ఆ కుర్రాడి వైద్య ఖర్చుల నిమిత్తం అంతర్జాతీయ క్రౌడ్ ఫండింగ్ సంస్థ ‘ఇంపాక్ట్ గురు’ విరాళాలు సేకరిస్తోంది. ఇప్పుడు అతనొక్కడే కాదు... అతని లాంటి మరెందరికో ఇలాంటి సంస్థల ద్వారా చేయూతఅందుతోంది. సాక్షి, సిటీబ్యూరో :2013లో హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ల సమయంలో ఇమ్మాన్యుయేల్ స్వచ్ఛందంగా బాధితులను అంబులెన్స్‌లో తరలించడంలో చురుకైన సేవలందించాడు. అక్కడ విరిగిన ఎముకలు, శరీర భాగాలున్నా అతనేమాత్రం సంశయించలేదు. ‘మొదటి నుంచీ మా అబ్బాయిది కష్టంలో ఉన్న వారిని ఆదుకునే మనస్తత్వం’ అని చెప్పారు శామ్యూల్. ఆయన ఓ చర్చి పాస్టర్. ప్రస్తుతం ఈయన కుమారుడు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుల్లియన్ బార్రె సిండ్రోమ్ (జీబీఎస్) అనే ఓ అరుదైన న్యూరాలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పటి వర కు ‘ఇంపాక్ట్ గురు’ దాతలందించిన సాయంతో రూ.8లక్షలకు పైగానే అందించింది. ‘రోజుకి దాదాపు రూ.లక్ష వ్యయమవుతోంది. దీనికి ఇంపాక్ట్ గురు అందిస్తున్న సహకారం కొంతమేర ఆసరా అవుతోంద’ని చెప్పారు శామ్యూల్. ఏమిటీ క్రౌడ్ ఫండింగ్? దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి కొన్ని ప్రభుత్వ పథకాలున్నాయి. అలాగే ధనవంతులకు వ్యయాన్ని భరించే స్థోమత ఉండొచ్చు. ఈ రెండింటికీ చెందని మధ్య, దిగువ మధ్యతరగతి వారికి మాత్రం తీవ్రమైన వ్యాధులు వస్తే ఆ కుటుంబం మొత్తానికి అది జీవన్మరణ సమస్యగా మారుతోంది. ఎన్జీఓలు, చారిటీ సంస్థల విరాళాల సేకరణ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) సంప్రదింపులు నెలల తరబడి సాగే ప్రయాసభరిత వ్యవహారం. ఇంత చేసినప్పటికీ వచ్చేవి అరకొర నిధులే అయి ఉంటాయి. ఇవి బాధితుల అన్ని రకాల అవసరాలను తీర్చేవిగా ఉండవు. ఈ పరిస్థితుల్లోనే అందుబాటులోకి వచ్చింది ఆన్లైన్ ఆధారంగా కొన్ని సంస్థలు సాగించే నిధుల సేకరణ ‘క్రౌడ్ ఫండింగ్’. ఈ ఫండింగ్‌కు కేవలం స్నేహితులు, వారి బంధువులు, సహోద్యోగుల నుంచి మాత్రమే కాకుండా అపరిచితుల నుంచి కూడా సాయం అందుతోంది. ఆసుపత్రులతో అనుసంధానం... రెండు మూడేళ్లుగా మన దేశంలో క్రౌడ్ ఫండింగ్ వేదికలకు ఆదరణ బాగా పెరిగింది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆసుపత్రులతో అనుసంధానమవుతున్నాయి. తద్వారా అవసరార్థులను గుర్తించి సాయాన్ని అందించగలుగుతున్నాయి. అయితే క్రౌడ్ ఫండింగ్ సంస్థలు చెబతున్న ప్రకారం దీర్ఘకాలం పాటు చికిత్స అవసరమైన, మందులు వాడాల్సిన వాటితో పోలిస్తే... అవయవాల మార్పిడి లాంటి అత్యవసర చికిత్సలకు దాతల స్పందన ఎక్కువగా ఉంటోంది. అదే విధంగా 0–17 ఏళ్ల లోపు ఉన్న వారికి వచ్చే లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్ వంటి శస్త్ర చికిత్స సందర్భాల్లోనూ మంచి స్పందన లభిస్తోంది. దుర్వినియోగానికీ ఆస్కారం.. ఈ సంస్థలకు సంబంధించిన సమాచారం ఇంకా పూర్తిగా ప్రజలకు చేరకముందే వీటి చేయూతను దుర్వినియోగం చేస్తున్నవారు కూడా ఉండడం విషాదకరమైన విషయం. నగరానికి చెందిన సామియా అబ్దుల్ హఫీజ్ (22) అనే మహిళ గతేడాది ఏప్రిల్‌లో కేన్సర్ రోగి అవతారమెత్తి ఒక ఫండ్ రైజింగ్ ఫేస్బుక్ పేజీని సృష్టించింది. తద్వారా రూ.22లక్షలు కొల్లగొట్టింది. అయితే ఈ విషయం బయటపడడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 2014లో ప్రారంభం... ‘మెడికల్ క్రౌడ్ ఫండింగ్ బాడీగా ‘ఇంపాక్ట్ గురు’ను 2014లో స్థాపించాం. నాలుగేళ్లలోనే ఎంతో విస్తరించింది. ప్రస్తుతం వైద్య ఖర్చుల నిమిత్తం ఆధారపడదగ్గ భారతదేశ అతిపెద్ద వేదిక ఇది. పేద రోగులు, తీవ్రమైన అనారోగ్యంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నవారు అలాగే కేన్సర్, డయాలసిస్, ప్రీమెచ్యూర్ బేబీకేర్ తదితర ఖరీదైన దీర్ఘకాల చికిత్సల కోసం తమ వద్దనున్న సొమ్మంతా ఖర్చు చేసేసినా సరిపోని మధ్యతరగతి వర్గాలు... వీరి అవసరాలే లక్ష్యంగా ఈ క్రౌడ్ ఫండింగ్ వేదిక ఆవిర్భవించింది. ఏ మార్గమూ లేని వీరికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా తిరిగి తీర్చనవసరం లేని రుణం అందుతుంది. హెల్త్‌కేర్‌ను అందరికీ అందుబాటులోకి తేవాలని, వీలైనన్ని జీవితాలను రక్షించాలనేది మా లక్ష్యం’ అని చెప్పారు నిర్వాహకులు. పలువురికి సాయం... సిటీలో చాలా మందికి సాయమందించాం. లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్న షణ్ముఖ అనే 11నెలల చిన్నారికి గ్లోబల్ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స నిమిత్తం కేవలం వారం రోజుల్లో రూ.10లక్షలు సేకరించగలిగాం. అదే విధంగా మల్టీపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో బాధపడుతూ లిటిల్‌స్టార్స్ చిల్డ్రన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ శంకర్ అనే రెండేళ్ల బాలుడికి ఆర్ధిక సాయం అందించగలిగాం. ఇలా మరెంతో మందికి సాయం చేశాం.ఈ విధానంపై సిటీజనుల్లో అవగాహన పెరిగి మరింత మందికి మా వేదిక ఉపయోగపడాలనికోరుకుంటున్నాం. – పీయూష్ జైన్, సీఈఓ, కో–ఫౌండర్,ఇంపాక్ట్ గురు -
జనసంద్రంగా మారిన ఇంద్రకీలాద్రి
సాక్షి, విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. మాల విరమణకు చివరిరోజు కావడంతో దుర్గమ్మ కొండపై భక్తుల రద్దీ పెరిగింది. భవానీ దీక్షల విరమణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు విజయవాడకు చేరుకుంటున్నారు. బుధవారం రాత్రి నుంచే స్నాన ఘాట్లు, క్యూలైన్లు, గిరి ప్రదక్షణ ప్రాంతం భవానీ భక్తులతో కిక్కిరిసి ఉన్నాయి. భవానీల సంఖ్య అనూహ్యంగా పెరడగంతో గురువారం తెల్లవారుజామున ఒకటిన్నరకే ఆలయం తెరిచారు. ఎక్కువసేపు క్యూలైన్లలో వేచిచూసే ఇబ్బంది తొలగేలా త్వరగా దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానంతరం మహామండపం వద్ద ఏర్పాటుచేసిన హోమగుండాల్లో నేతి కొబ్బరికాయలు వేసి భవానీలు మొక్కులు తీర్చుకుంటున్నారు. గురుభవానీల సమక్షంలో దీక్ష విరమిస్తున్నారు. ఈరోజు జరిగే పూర్ణాహుతితో భవానీ దీక్షలు లాంఛనంగా పరిసమాప్తి అవుతాయి. అధికారుల నిబంధనలతో భక్తుల ఇక్కట్లు అయితే ఇంద్రకీలాద్రిపై అధికారులు పెట్టిన నిబంధనలతో భవానీ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు పోలీసులు పార్కింగ్ ప్రదేశాన్ని చూపలేదు. లడ్డూ ప్రసాదాలను ఇచ్చే కౌంటర్లు మూడే ఉండడంతో ప్రసాదాల కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉంటున్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలః తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. కాలినడకన వచ్చే భక్తులకు,. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. ఆదివారం శ్రీనివాసుని 87,891 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,001 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
వేములవాడలో భక్తుల రద్దీ
వేములవాడ : వేములవాడ రాజన్నను సోమవారం 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వరుస సెలవులు రావడంతో రద్దీ బాగా పెరిగిపోయింది. దీంతో ఆలయ అధికారులు గర్భగుడి దర్శనం నిలిపివేశారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు కోడె మొక్కులు చెల్లించున్నారు. ఏర్పాట్లను ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు ఉమారాణి, గౌరినాథ్, హరికిషన్, దేవేందర్‌లు పరిశీలించారు. ఎస్సై సైదారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.