అధిక విలువ చెక్కుల చెల్లింపుల్లో జాగ్రత్త: ఆర్బీఐ
ముంబై: అధిక విలువ చెక్కులకు సంబంధించి చెల్లింపుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచించింది. చెక్కు సంబంధిత మోసాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో ఆర్బీఐ ఈ విషయంలో బ్యాంకులను అప్రమత్తం చేసింది. ఫోన్ కాల్ ద్వారా అకౌంట్ హోల్డర్లను అలర్ట్ చేయాలని, నాన్ హోమ్ చెక్కుల విషయంలో బేస్ బ్రాంచ్ని సంప్రదించాలని కూడా సూచించింది.
2 లక్షల పైబడిన చెక్కుల చెల్లింపు విషయంలో చెక్కు ఇచ్చిన వారికి, సంబంధిత సొమ్ము తీసుకునే వారికి ఎస్ఎంఎస్ అలర్ట్ చేయాలని పేర్కొంది. యూవీ ల్యాంప్ కింద చెక్కును క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొంది. రూ.5 లక్షల పైబడిన చెక్కు చెల్లింపుల్లో బహుళ స్థాయిలో చెకింగ్ ప్రక్రియ అవసరమని పేర్కొంది. పూర్తి అప్రమత్తం ద్వారా మోసాలను అరికట్టడానికి తగిన ప్రయత్నాలు చేయాలని పేర్కొంది.