ప్రధాన పోర్టుల్లో కస్టమ్స్ క్లియరెన్స్ కమిటీలు
న్యూఢిల్లీ: కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియను సులభతరం చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రధాన ఓడ రేవులు, విమానాశ్రయాల్లో అత్యున్నత స్థాయి కస్టమ్స్ క్లియరెన్స్ ఫెసిలిటేషన్ కమిటీ (సీసీఎఫ్సీ)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఒక సర్క్యులర్లో తెలిపింది. సీసీఎఫ్సీకి ఆయా పోర్టుల్లోని కస్టమ్స్ చీఫ్ కమిషనర్ లేదా ఇంచార్జ్ కమిషనర్ సారథ్యం వహిస్తారు.
దిగుమతయ్యే, ఎగుమతయ్యే వస్తువులను పర్యవేక్షించడం, సకాలంలో క్లియరెన్సులు ఇవ్వడం మొదలైనవి సీసీఎఫ్సీ విధులు. కనీసం వారానికోసారి సీసీఎఫ్సీ సమావేశమవుతుంది.