cyberattack
-
‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు..
నిత్యం కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైళ్లను వినియోగిస్తుంటారు. ఇందులో ప్రధానంగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్లుంటాయి. అసలు వేర్ అంటే ఏమిటో తెలుసా.. సాధనమని అర్థం. కంప్యూటర్లో మానిటర్, సీపీయూ, కీబోర్డు, మౌజ్ వంటి భాగాలన్నీ హార్డ్వేర్లు. ఈ హార్డ్వేర్లను పనిచేయించేవి సాఫ్ట్వేర్లు. ఈ సాఫ్ట్‌వేర్‌ల్లో చాలారకాలు ఉంటాయి. వీటిల్లో మంచి చేసేవే కాదు, హాని చేసేవీ ఉంటాయి. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. రాన్సమ్వేర్ ఇది హానికర సాఫ్ట్వేర్. పీసీలో ఇన్స్టాల్ అయ్యి, లోపలి భాగాలను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. పరికరాన్ని, డేటాను తిరిగి వినియోగించుకోనీయకుండా చేస్తుంది. రాన్సమ్ అంటే డబ్బులు తీసుకొని, విడుదల చేయటం. పేరుకు తగ్గట్టుగానే ఇది డబ్బులు చెల్లించాలంటూ సందేశాన్ని తెర మీద కనిపించేలా చేస్తుంది. డబ్బులు చెల్లిస్తే గానీ డేటాను వాడుకోనీయదు. మనకు సంబంధించిన ఏ వివరాలు కనిపించవు. రాన్సమ్వేర్లలో చాలా రకాలున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం, నాణ్యమైన యాంటీవైరస్/ యాంటీ మాల్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా దీని బారినపడకుండా చూసుకోవచ్చు. స్పైవేర్ ఇదొక మాల్వేర్. ఒకసారి కంప్యూటర్లో ఇన్స్టాల్ అయితే చాలు. మన అనుమతి లేకుండానే, మనకు తెలియకుండానే ఆన్లైన్ వ్యవహారాలన్నింటినీ పసిగడుతుంది. ప్రకటనకర్తలు, మార్కెటింగ్ డేటా సంస్థలు సైతం ఇంటర్నెట్ వాడేవారి తీరుతెన్నులను తెలుసుకోవటానికి దీన్ని ఉపయోగిస్తుంటాయి. మార్కెటింగ్, ప్రకటనల కోసం తోడ్పడే స్పైవేర్లను ‘యాడ్వేర్’ అంటారు. ఇవి డౌన్లోడ్ లేదా ట్రోజన్ల ద్వారా పీసీలో ఇన్స్టాల్ అవుతాయి. ఈమెయిల్ ఐడీలు, వెబ్సైట్లు, సర్వర్ల వంటి వివరాలను పీసీ నుంచి సేకరించి, ఇంటర్నెట్ ద్వారా థర్డ్ పార్టీలకు చేరవేస్తాయి. కొన్ని స్పైవేర్లు లాగిన్, పాస్‌వర్డ్‌ల వంటి వాటినీ దొంగిలిస్తాయి. ఈ సాఫ్ట్వేర్లను ‘కీలాగర్స్’ అని పిలుచుకుంటారు. సీపీయూ మెమరీని, డిస్క్ స్టోరేజినీ, నెట్వర్క్ ట్రాఫిక్‌నూ వాడుకుంటాయి. నాగ్వేర్ ఒకరకంగా దీన్ని వేధించే సాఫ్ట్వేర్ అనుకోవచ్చు. ఆన్లైన్లో ఏదైనా పని చేస్తున్నప్పుడో, ఫీచర్‌ను ప్రయత్నిస్తున్నప్పుడో పాపప్, నోటిఫికేషన్ మెసేజ్‌లతో లేదా కొత్త విండో ఓపెన్ చేస్తుండడం దీని ప్రత్యేకత. ఉదాహరణకు- వెబ్‌పేజీ లేదా ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నామనుకోండి. ఏదో యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని న్యూవిండోలో అడగొచ్చు. ప్రోగ్రామ్‌ను లోడ్ చేస్తున్నప్పుడు లైసెన్స్ కొనమనీ చెబుతుండొచ్చు. దీని ద్వారా వచ్చే మెసేజ్‌లు చాలా చిరాకు పుట్టిస్తుంటాయి. ఆగకుండా అలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సాఫ్ట్‌వేర్‌ను అన్ఇన్స్టాల్ చేయటం ఉత్తమం. ఇదీ చదవండి: పేటీఎంపై నిషేధం.. ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు క్రాప్వేర్ ఇది కొత్త పీసీతో వచ్చే సాఫ్ట్వేర్. కంప్యూటర్లో ముందే ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఇవి ప్రయోగ పరీక్షల కోసం ఉద్దేశించినవి. కాబట్టి వీటితో మనకు నేరుగా ఉపయోగమేమీ ఉండదు. గడువు తీరిన తర్వాత పోతాయి. కొన్నిసార్లు అప్లికేషన్లను పరీక్షించటానికి తయారీదారులు క్రాప్వేర్ను ఇన్స్టాల్ చేయిస్తుంటారు. ఇందుకోసం థర్డ్ పార్టీలు డబ్బు కూడా చెల్లిస్తుంటాయి. దీంతో పీసీల ధరా తగ్గుతుంది. డిస్క్ స్పేస్‌ను వాడుకున్నా క్రాప్వేర్ హాని చేయదు. -
ఆంక్షలున్నా ఆగని ఉత్తరకొరియా
న్యూయార్క్: ఉత్తరకొరియా తన అణ్వాయుధ క్షిపణి పరీక్షా కార్యక్రమాలను కొనసాగిస్తూనేఉందని ఐరాస నిపుణులు ఒక నివేదికలో వెల్లడించారు. తాజాగా అణ్వాయుధాలకు అవసరమైన సామగ్రిని కూడా ఉత్తరకొరియా సంపాదించిందని తెలిపారు. దీంతో ఆ దేశం క్షిపణి పరీక్షలను వేగవంతం చేసిందని, జనవరిలో పలు పరీక్షలు జరిపిందని నివేదిక తెలిపింది. అణ్వస్త్రాలకు అవసరమైన సాంకేతికతను సైబర్ మార్గంలో సంపాదిస్తోందని తెలిపింది. ఇందుకు కావాల్సిన ఆర్థిక సంపత్తిని సైబర్అటాక్స్తో సంపాదిస్తోందని వెల్లడించింది. -
ర్యాన్సమ్ వేర్ ప్రభావం ఎలా ఉందంటే..
-
ర్యాన్సమ్ వేర్ ప్రభావం ఎలా ఉందంటే..
ప్రపంచ దేశాలకు పెను ముప్పుగా, ఆధునిక టెక్నాలజీ భద్రతకు సవాలు విసురుతూ ఉద్భవించిన వనాక్రై ర్యాన్సమ్ వేర్ బాధితుల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే ఈ సైబర్ దాడి 150 దేశాల్లో బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. జపాన్ ప్రస్తుతం జపాన్ లోని అతిపెద్ద మోటార్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ కు చెందిన కొన్ని యూనిట్లను వనాక్రై టార్గెట్ చేసిందని ఆ కంపెనీ ధృవీకరించింది. కానీ తమ బిజినెస్ లపై అంతపెద్ద ప్రభావమేమీ పడలేదని పేర్కొంది. హిటాచి అధికార ప్రతినిధి కూడా తమ ఫైల్స్ ఓపెన్ కావడం లేదని, ఈ-మెయిల్స్ వ్యవస్థ స్తంభించిందని, అసలు డెలివరీ కావడం లేదని పేర్కొన్నారు. చైనా చైనాలో ప్రభుత్వ ఏజెన్సీలతోసహా దాదాపు 30వేల సంస్థలపై ర్యాన్సమ్వేర్ ప్రభావం తీవ్రంగా పడినట్లు తెలిసింది. లక్షల సంఖ్యలో కంప్యూటర్లలో వనా క్రై చొచ్చుకుపోయిందని చైనా సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలు, పరిశోధన కేంద్రాలు, ఏటీఎంలు, ఆసుపత్రులకు సంబంధించిన కంప్యూటర్ వ్యవస్థలకు నష్టం జరిగిందని.. క్విహూ360 అనే చైనా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ సంస్థ స్పష్టం చేసింది. శనివారం సాయంత్రం ఈ సైబర్ దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలిపింది. చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఈ వైరస్ విస్తరిస్తోంది. అయితే విస్తరణ వేగం తగ్గిందని ఆ సంస్థ వెల్లడించింది. రష్యా రైల్వే వ్యవస్థలోని ఐటీ కంప్యూటర్లు వైరస్ అటాక్ గురయ్యాయని స్థానికి మీడియా తెలిపింది. అయితే దీని ప్రభావం ఆపరేషన్స్‌పై పడలేదని వెల్లడించింది. దీంతోపాటూ ఇంటీరియర్ మినిస్ట్రీ, టెలీకమ్యూనికేషన్ సంస్థ మెగాఫోన్‌కు చెందిన సిస్టమ్స్ కూడా ఈ వైరస్ బారిన పడ్డాయని తెలిపింది. అయితే చాలా తక్కువ శాతం సిస్టమ్స్ ఈ వైరస్ బారిన పడ్డాయని పేర్కొంది. కాగా, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వనా క్రై వైరస్ విషయంలో రష్యాకు సంబంధం లేని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలే దీన్ని సృష్టించి ఉంటాయని విమర్శించారు. అయితే వైరస్ ప్రభావం రష్యాపై పెద్దగా లేదని.. అయినా సైబర్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని పుతిన్ తెలిపారు. స్పెయిన్ : స్పెయిన్ టెలిఫోన్ దిగ్గజం టెలిఫోనికా(టీఈఎఫ్)ని వనాక్రై టార్గెట్ చేసిందని ఆ కంపెనీ ధృవీకరించింది. యూకే : నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్)కు చెందిన 6 ఆర్గనైజేషన్స్లు దాడికి గురైనట్టు సంస్థ తెలిపింది. పరిస్థితులను సమీక్షించడానికి యూకే ప్రభుత్వం క్రైసిస్ రెస్పాన్స్ కమిటీ(కోబ్రా)ను సమావేశపరిచింది. జర్మనీ : రైల్వే వ్యవస్థ(డట్చ్ బాహ్న్)పై ర్యాన్సమ్వేర్ ప్రభావంతో ప్యాసింజర్ల వివరాలు మారినట్టు గుర్తించారు. భారత్ : భారత్‌పై వనా క్రై ర్యాన్సమ్వేర్ పెద్దగా ప్రభావం చూపలేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. కేరళ, ఆంధ్రప్రదేశ్ మినహా పెద్ద నష్టమేమీ జరగలేదని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నడిచే కంప్యూటర్లన్నీ వైరస్ ప్రభావం లేకుండా సాఫీగా పనిచేస్తున్నట్లు వివరించారు. విద్యుత్, జీఎస్టీఎన్ సహా పలు ప్రభుత్వ విభాగాలు కూడా తమ వ్యవస్థలు భద్రంగానే ఉన్నాయని స్పష్టం చేశాయి. -
ర్యాన్సమ్ వేర్ బారిన మరో ప్రముఖ దేశం
టోక్యో : ప్రపంచ దేశాలకు పెను ముప్పుగా, ఆధునిక టెక్నాలజీ భద్రతకు సవాలు విసురుతూ ఉద్భవించిన వనాక్రై ర్యాన్సమ్ వేర్ బాధిత దేశ జాబితాలో జపాన్ కూడా వచ్చి చేరింది. ఇప్పటికే ఈ సైబర్ దాడి 150 దేశాల్లో బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జపాన్ లోని అతిపెద్ద మోటార్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ కు చెందిన కొన్ని యూనిట్లను వనాక్రై టార్గెట్ చేసిందని ఆ కంపెనీ ధృవీకరించింది. కానీ తమ బిజినెస్ లపై అంతపెద్ద ప్రభావమేమీ పడలేదని పేర్కొంది. హిటాచి అధికార ప్రతినిధి కూడా తమ ఫైల్స్ ఓపెన్ కావడం లేదని, ఈ-మెయిల్స్ వ్యవస్థ స్తంభించిందని, అసలు డెలివరీ కావడం లేదని పేర్కొన్నారు. దీనికి కారణం ర్యాన్సమ్ వేర్ అటాకేనని తాము నమ్ముతున్నట్టు, అయితే ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్లు ఆ అటాకర్ల నుంచి రాలేదని చెప్పారు. ఇప్పటికే జపాన్ లో 600 ప్రాంతాల్లో 2000 కంప్యూటర్లు ఈ బారిన పడినట్టు జపాన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కో-ఆర్డినేటర్ సెంటర్ రిపోర్టు చేసింది. కొంతమంది వ్యక్తిగతంగా కూడా తాము ఈ సైబర్ దాడిన పడినట్టు చెప్పినట్టు వెల్లడించింది. ఆధునిక టెక్నాలజీ భద్రతకు సవాల్ విసురుతూ ఊహించనిరీతిలో హ్యాకర్లు విరుచుకుపడ్డారు. యూరప్, లాటిన్ అమెరికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు ఈ ర్యాన్సమ్ వేర్ మాల్వేర్ బారినపడ్డాయి. భారత్‌లోని కొన్ని కంపెనీలు దీని ప్రభావానికి గురయ్యాయి.