Dachepalli Rape Case
-
మదరసాలో కీచకపర్వం
సాక్షి, దాచేపల్లి: మదరసాలో చదువుకునేందుకు వచ్చిన బాలికపై మదరసా నిర్వాహకుడు కన్నేశాడు. బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. గుంటూరు జిల్లా దాచేపల్లిలోని చాపలగడ్డ మదరసాలో జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకొచ్చింది. విషయం తెలుసుకున్న ముస్లిం మతపెద్దలు, నాయకులు మదరసా వద్ద ఆందోళనకు దిగారు. స్థానికులు, ముస్లిం నేతల కథనం ప్రకారం.. ఆలిం కోర్సు చదివేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60 మంది బాలికలు మదరసాలో చేరారు. షేక్ ముఫ్తీ అబ్దుల్ సత్తార్ దీనిని పర్యవేక్షిస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. మదరసాలోని 17 ఏళ్ల బాలికపై ఆయన కన్నేసి.. కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి బాలిక, సత్తార్ కలిసి ఉండటాన్ని మిగతా విద్యార్థినులు గమనించి నిలదీశారు. ఈ విషయం ముస్లిం మతపెద్దలు, నాయకుల దృష్టికెళ్లడంతో వారంతా శుక్రవారం మదరసా వద్దకు వచ్చి అబ్దుల్ సత్తార్, అతని కుటుంబ సభ్యులను నిలదీశారు. వారం కిందటే తాను బాలికను వివాహం చేసుకున్నట్లు అబ్దుల్ సత్తార్ చెప్పాడు. మత సంప్రదాయాలకు విరుద్ధంగా, మైనార్టీ కూడా తీరని బాలికను ఎలా వివాహం చేసుకున్నావంటూ వారు నిలదీయటంతో అక్కడ నుంచి ఉడాయించాడు. పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఈ విషయంపై ముస్లిం మతపెద్దలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. మదరసా ఖాళీ చేయాలని డిమాండ్ చేయడంతో అబ్దుల్ సత్తార్ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తల్లిదండ్రులను పిలిపించి మదరసా నుంచి పిల్లలను పంపించారు. అబ్దుల్ సత్తార్ కుటుంబ సభ్యులను బయటకు పంపేలా.. మదరసా నిర్వహణకు సహకారం అందించే ముస్లింలతో పాటు మతపెద్దలు తీర్మానం చేశారు. గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ కోటేశ్వరరావు కూడా మదరసాను సందర్శించి జరిగిన వ్యవహారం గురించి ఆరా తీశారు. అంగన్వాడీ కార్యకర్తల సమక్షంలో బాధిత బాలిక వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అబ్దుల్ సత్తార్ తనను బెదిరించి లైంగిక దాడి చేసి.. బలవంతంగా వివాహం చేసుకున్నాడని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
గుంటూరులో మరో దారుణం: ఏడేళ్ల చిన్నారిపై..
సాక్షి, గుంటూరు: మొన్నటి దాచేపల్లి ఘటనను మర్చిపోకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. మోదుకూరులో ఏడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 'ఆడబిడ్డకు రక్షగా కదులుదాం' అంటూ టీడీపీ ప్రభుత్వం చైతన్యర్యాలీలు చేపట్టినరోజే మరో కీచకపర్వం వెలుగులోకి రావడం గమనార్హం. ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్న ఈ కేసు వివరాలివి.. గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరుకు చెందిన ఏడేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల నాగుల్‌మీరా అనే యువకుడు అత్యాచారం జరిపాడు. పాపకు బావ వరసయ్యే నిందితుడు.. ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో చాక్లెట్లు కొనిపెడతా రమ్మంటూ తీసుకెళ్లి ఘోరానికి ఒడిగట్టాడు. సాయంత్రానికి ఇంటికొచ్చిన తల్లిదండ్రులు పాప పరిస్థితి చూసి కంగారుతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి చెప్పిన వివరాలను బట్టి నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. కాగా, వారం రోజుల కిందట ఇదే గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ చిన్నారిపై లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఘటన తర్వాత నిందితుడు సుబ్బయ్య ఉరివేసుకుని చనిపోయాడు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతున్నదని, సాక్షాత్తూ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నా పోలీసులు మిన్నకుండిపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
దౌర్భాగ్య పాలనలో మహిళల రక్షణ కరవు
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు అంతులేకుండా పోతుందని, గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు మహిళలు నడవలేని దౌర్భపాలనలో ఉన్నామని వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గత నాలుగు నెలల్లో 281 మంది అత్యాచారాలకు గురయ్యారన్నారు. గుంటూరులోనే నెలరోజుల వ్యవధిలో ఏడుగురు మహిళలు అత్యాచారాలకు గురయ్యారంటే చంద్రబాబు పాలన దారుణంగా ఉందో స్పష్టమవుతుందన్నారు. ఆడపడుచులకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమైన టీడీపీ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్న ఎమ్మెల్యే రోజాపై అవాకులు చేవాకులు పేలుతున్నారన్నారు. తోటి మహిళా ఎమ్మెల్యే గుండు గీయిస్తానంటూ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అగౌరవంగా మాట్లాడి మహిళలపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారన్నారు. గతంలో దళిత మహిళను వివస్త్ర చేసిన బండారు సత్యనారాయణకు మహిళలే బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ మరో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ఈయన మాటలు మహిళలు వింటే వెంకన్నను చెప్పుతో కొడతారన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్లో బుద్దా పాత్ర ఉందని తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారన్నారు. కాల్‌మనీ, నారాయణ కాలేజీలో విద్యార్థినుల ఆత్మహత్యల విషయంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించిందన్నారు. దాచేపల్లి మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో వారి అండగా ఎమ్మెల్యే రోజా పోరాటం వృథా పోలేదన్నారు. రోజా టీడీపీలో ఉన్నప్పడు చేసే పోరాటాలు ప్రజాపోరాటాలు అంటూ పొగిడిన నేతలు నేడు వైఎస్సార్సీపీ తరుపున చేస్తే రాజకీయాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రోజాకు ఎమ్మెల్యే బండారు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న క్షమాపణలు చెప్పకుంటే మహిళల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు. సమావేశంలో నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, రాష్ట్ర అధికార ప్రతనిధి ఎం.శ్రీదేవి, రాష్ట్ర జనరల్ సెక్రటరీలు శ్రీదేవి వర్మ, మళ్ల ధనలత, మహిళా నాయకులు శ్రీదేవి, ఎ.వి.రమణి, శిరిష తదితరులు పాల్గొన్నారు. -
అధికారం అండతోనే టీడీపీ కార్యకర్తలు అఘాయిత్యాలు
-
బాబు పాలనలో పెరిగిన అఘాయిత్యాలు
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడి పాలనలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అమాయక బాలికలు, మహిళల మీద దాడులు జరుగుతున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దాచేపల్లి లాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాచేపల్లి ఘటన నిందితుడు టీడీపీలో క్రియాశీలక వ్యక్తి అని, అధికారం ఉందనే అండతోనే టీడీపీ కార్యకర్తలు దారుణాలు పాల్పడుతున్నారని విమర్శించారు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు ఉన్నా అమలు కావడం లేదని తెలిపారు. గత మూడేళ్లలో 2 వేల మంది మీద అత్యాచారాలు జరిగాయని, అయినా కూడా 15 మందికి మాత్రమే శిక్ష పడిందని గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను చంద్రబాబు సర్వ నాశనం చేశారని ధ్వజమెత్తారు. -
ఇదేం సంస్కారం?
-
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ
-
48గంటలు దాచేపల్లిలో మకాం వేసిన ఎస్పీ
గుంటూరు,దాచేపల్లి: దాచేపల్లిలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారంతో గ్రామంలో మూడు రోజులపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు నిందితుడు అన్నం సుబ్బయ్య ఉరేసుకుని మృతి చెందడంతో ప్రజలు శాంతించారు. బాలికపై అత్యాచారం చేశాడన్న సమాచారంతో రగిలిపోయిన గ్రామస్తులు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చారు. ఆందోళనకు సిద్ధమయ్యారు. వీరికి వైఎస్సార్ సీపీ నేతలు అండగా నిలిచారు. రాకపోకలు స్తంభించిపోయాయి. మూడు రోజులపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని ఉరి తీయాలని ప్రజల నుంచి డిమాండ్ రాగా చివరకు సుబ్బయ్య ఉరేసుకుని మృతి చెందాడు. బాలిక కుటుంబానికి అండగా... బుధవారం రాత్రి 9గంటల సమయంలో బాలికపై అత్యాచార ఘటన వెలుగుచూసింది. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రతి గుండె రగిలిపొయింది. బాలికకు, కుటుంబసభ్యులకు అండగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కదిలారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10గంటల నుంచి నిరసన హోరు ప్రారంభమైంది. దాచేపల్లి, నడికుడి జంట గ్రామాలకు చెందిన పలువురు మహిళలతోపాటుగా, యువకులు, చిన్నారులు, పలు రాజకీయ పార్టీ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం బాధితులకు అండగా ఉండేందుకు ప్రయత్నించడంతో వారి తీరు పట్ల ప్రజలు మండిపడ్డారు. దాచేపల్లి, నారాయణపురం ఆర్అండ్బీ బంగ్లా వద్ద బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జరిగిన రాస్తారోకోలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. బాధిత కుటుంబసభ్యులను మొదటిగా వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాధితురాలి కుటుంబసభ్యుల వెన్నంటి ఉండి సహాయ సహకారాలు అందించాలని నేతలను ఆదేశించారు. బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి కూడా ఎప్పటికప్పుడు నేతలతో మాట్లాడుతూ బాలిక ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి, కన్వీనర్లు షేక్ జాకీర్‌హుస్సేన్, మునగా పున్నారావు, జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు అంబటి శేషగిరిరావు, కొప్పుల సాంబయ్య, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మందపాటి రమేష్‌రెడ్డి, సర్పంచ్ బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డితో పాటుగా నేతలు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొని బాధితురాలికి న్యాయం చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గురు, శుక్రవారాల్లో జరిగిన ఆందోళనలో వైఎస్సార్సీపీ నేతలు బాధిత కుటుంబసభ్యుల వెంటే ఉన్నారు. పలువురు ప్రజాసంఘాల నేతలు, కమ్యూనిస్ట్ పార్టీల నేతలు కూడా బాధితుల పక్షాన పోరాటం చేశారు. 48గంటలు దాచేపల్లిలో మకాం వేసిన ఎస్పీ జిల్లా రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు 48 గంటలు దాచేపల్లిలోనే మకాం వేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించారు. ఆందోళన ఉధృతం కావటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జిల్లా రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు గురువారం ఉదయం 8గంటల సమయంలో దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసి, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆందోళన చేస్తున్న వారితో కూడా చర్చలు జరిపి శాంతింపజేశారు. ప్రజల ఆందోళనతో ప్రభుత్వం కూడా దిగివచ్చింది. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అయితే శుక్రవారం సుబ్బయ్య ఉరేసుకుని మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రజల ఆగ్రహావేశాలు చల్లబడ్డాయి. అయినప్పటికీ ఎస్పీ శనివారం ఉదయం వరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉండి శాంతిభద్రతలను పర్యవేక్షించారు. దాచేపల్లి పాతబస్టాండ్ సెంటర్, లైబ్రరీ సెంటర్, మసీద్ సెంటర్, నారాయణపురం ఆర్అండ్ బీ బంగ్లా సెంటర్, నడికుడి మార్కెట్‌యార్డు వద్ద ప్రస్తుతం పికెట్ ఏర్పాటు చేశారు. జంట గ్రామాల్లో పోలీసులు నిఘా ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేస్తున్నారు. -
చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం: దాచేపల్లి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. అందుకే విపక్షంపై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. శనివారం విశాఖపట్నంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గు చేటు... దాచేపల్లి ఘటనపై ఈ ఉదయం మీడియాతో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. ‘నెల వ్యవధిలో గుంటూరులో ఎన్నో అత్యాచార ఘటనలు జరిగాయి. ఎవరినైనా చంద్రబాబు పరామర్శించారా? వైసీపీ పోరాటం చెయ్యటం వల్లే ఇవాళ సీఎం దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే బాధితురాలిని పరామర్శించారు. మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బాధితులను పక్కన కూర్చోబెట్టుకున్నారు. కానీ, బాధితురాలి వివరాలు చెప్పకూడదన్న నిబంధనలు కూడా తెలియదా?. పైగా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షంపైకి నెడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు సిగ్గు చేటు. 55 ఏళ్ల వృద్ధుడ్ని పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం మీది. సుబ్బయ్యకు టీడీపీ సభ్యత్వం ఇచ్చింది. స్వయంగా మీ ఎమ్మెల్యేనే అతనికి ఇంటికి కేటాయించారు. వీటికి ఏం సమాధానం చెబుతారు’ అని రోజా ప్రశ్నించారు. ఇది కొత్తేం కాదు... ‘రిషితేశ్వరి కేసులో సెటిల్ మెంట్ చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతలు ఉండటంతో ఆ కేసును నీరుగార్చారు. గుంటూరు జడ్ఫీ చైర్పర్సన్ జానీమూన్‌కు అన్యాయం చేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసులో స్వయంగా సీఎం రంగంలోకి దిగి సెటిల్మెంట్లు చేశారు. ఐపీఎస్ అధికారి సుబ్రహ్మణ్యంపై దాడి కేసు ఏమైంది? ఏడీఆర్ రిపోర్ట్‌లో ఐదుగురు టీడీపీ ప్రజా ప్రతినిధుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే 800 కేసులకు పైగా కొట్టేశారు. ఇంక ప్రజలకు రక్షణ ఏది?’ అని ఆమె నిలదీశారు. టీడీపీ నేతల సంస్కారం ఏది? ‘ఆదాయం కోసం ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా బెల్ట్ షాపులు పెట్టేశారు. వాటి మూలంగానే నేరాలు పెరిగిపోతున్నాయి. వైజాగ్‌లో బికినీ షో పెడితే వైసీపీ అడ్డుకుంది. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇప్పుడు హోం మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే నాపై కొందరు టీడీపీ మహిళా నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదేనా వాళ్ల సంస్కారం?.. ముందు మహిళలను గౌరవించటం టీడీపీ నేతలు నేర్చుకోవాలి. అధికారంలోకి మద్యపాన నిషేధం అమలు చేస్తానని వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఆయన అధికారంలోకి వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుంది’ అని ఎమ్మెల్యే రోజా చెప్పారు. -
చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత ఉందా?
-
ఇదేం రాజకీయం...?
-
నిందితుడు సుబ్బయ్య చివరి ఫోన్ కాల్