daily wage
-
తండ్రి రోజు కూలీ...కొడుకు వేల కోట్ల కంపెనీకి....
చుట్టూ వెలుతురు కనిపించినంత కటిక చీకటి అయిన చిన్న అగ్గిపుల్ల వెలుగు మొత్తం చీకటిని తరిమేయగలదు. అలాగే ఎంతటి కటిక దారిద్యం అయినా గెలవాలన్న కసి, పట్టుదల, డెడికేషన్ ఉంటే అందనంత శిఖరాలకు చేరుకోవచ్చు అని నిరూపించాడు ఓ కూలి కొడుకు. తండ్రి సంపదన రోజుకి జస్ట్ రూ. 10లే. కనీసం కుటుంబ పోషణకు సరిపడని సంపాదన. కడుపు నిండ తిండలేని దారుణ స్థితిలో పెరిగిన వ్యక్తి. కానీ అతను నా జీవితం ఇంతే అనుకుని రాజీపడలేదు. గెలిచేందుకు మార్గాలు అన్వేషించాడు. ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చిన వెనకడుగువేయలేదు. ఈసారి కాకపోయిన మరోసారైనా గెలవగలను అనుకుంటూ సాగిపోయాడు. నేడు ఏకంగా రూ. 3 వేల కోట్ల ఫుడ్ కంపెనీకి సీఈవో అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచాడు!. అతడే ఐడీ ఫ్రెష్ ఫుడ్ చీఫ్ ఎగ్జిక్యూటివివ్ ఆఫీసర్(సీఈవో) ముస్తాఫా పీసీ. ఆయన ఇటీవల జరిగిన ది నియన్ షో పోడోకాస్ట్లో తన బాల్య జీవితం ఎలా సాగిందో షేర్ చేసుకున్నారు. తాను కేరళలో ఓ మారుమూల గ్రామంలో జన్మించానని, తన తండ్రి రోజూ వారి కూలి అని చెప్పారు. ఆయన రోజుకు జస్ట్ రూ. 10 సంపాదించడమే చాలాకష్టంగా ఉండేదని చెప్పుకొచ్చారు. అది తమ కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో తన తోబుట్టువులంతా ఆదాయం కోసం 'అల్లం' పొలంలో పనిచేయడం, కట్టెలు అమ్మడం వంటి చిన్న చితక పనులు చేసి డబ్బులు కూడబెట్టేవాళ్లమని చెప్పారు. అలా తమ కుటుంబం ఓ మేకును కొనుగోలు చేసే స్థాయికి చేరుకోగలిగిందని అన్నారు. అదే మా తొలి ఆస్తి అని కూడా చెప్పొచ్చన్నారు. అయితే అది తినేందుకు కాదని చెప్పారు. ఆ తర్వాత తమ కుటుంబం క్రమక్రమంగా పురోగతి సాధించడం ప్రారంభించింది. అలా ఆ మేకను అమ్మి ఆవును కొనుగొలు చేసే స్థాయికి చేరుకున్నాం. దీంతో తమ కుటుంబ సభ్యులంతా రెండు పూట్ల కడుపు నిండా భోజనం చేయగలిగే స్థాయికి చేరుకున్నామంటూ.. నాటి రోజులు గుర్తు చేసుకున్నారు. అలా కష్టాలను దాటుకుంటూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదవుకోగలిగే స్థాయికి చేరుకున్నాను అన్నారు. ఆ తర్వాత వెంటనే ఐటీ ఉద్యోగం రావడంతో కొన్నాళ్లపాటు అందులో కొనసాగినట్లు తెలిపారు. సరిగ్గా 2006లో ఐడీ ఫ్రెష్ ఫుడ్ అనే కంపెనీని ఏర్పాటు చేశాను. ఒక చిన్న గదిలో వండిన ఆహారాన్ని ప్యాక్ చేసి విక్రయించానని తెలిపారు. అయితే భారతీయ వినయోగదారులకు ప్యాక్ చేసిన ఇడ్లీ, దోస పిండిని పరిచయం చేయడం చాలా సవాలుగా మారింది. మొదట్లో ప్యాక్ చేసిన ఆహారం వినియోగించమని తీవ్రంగా వ్యతిరేకించేవారు. పైగా ప్యాక్ చేసిన ఆహారం అనారోగ్యకరమైనదిగా భావించి కొనడానికి కూడా ఇష్టపడేవారు కాదు. దీంతో తాము మార్కెట్లోకి 100 ప్యాకెట్లు పంపిస్తే అందులో 90 ప్యాకెట్లు వెనకొచ్చేసివి. ఏం చేయాలో పాలుపోయేది కాదు. అప్పుడే అర్థమయ్యింది ఫుడ్ వ్యాపారాన్ని నడపడం అంత ఈజీ కాదు అని. తాజా ఆహార వ్యాపారాన్ని నిర్వహించడం ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన పని అని తనకు క్లియర్‌గా తెలిసిందన్నారు. ప్రారంభంలో ఎదుర్కొన్న చాలా ఎదురదెబ్బల సాయంతో నేర్చుకున్న మెళుకువలను అన్ని ఉపయోగించి సమర్థవంతంగా తాజా ఆహారాన్ని అందించడమే కాకుండా తన బ్రాండ్‌కి ఓ నమ్మకం ఏర్పడేలే చేసుకున్నాను. నేడు నా ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీలో ఆహారానికి ఢోకా ఉండదు తాజాగా అందిస్తారు అనే ఓ ముద్ర(బ్రాండ్) పడేలా చేసుకున్నాను. అలా నా వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించేలా అభివృద్ధి చేశానంటూ తన కంపెనీ విజయం ప్రస్థానం గురించి వివరించారు ముస్తఫా. ప్రపంచంలో ఉన్న ప్రతిఒక్కరూ అద్భుతాలు చేయగలరన్నారు. ఇక్కడ కేవలం సడలని నమ్మకం, నిబద్ధత ఉంటే అనుకున్నదీ ఏదైనా సాధించొచ్చుని ఆత్మవిశ్వాసంగా చెప్పారు ముస్తఫా. (చదవండి: 19 ఏళ్లకే సర్పంచ్ ఆమె!..మద్యానికి బానిసైన తండ్రి, కటిక దారిద్యం..) -
భార్య కళ్లేదుటే ఘోరం..చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ..
సాక్షి, రాజేంద్రనగర్: ‘మరో నెల రోజుల్లో ఇంటికి వస్తా. అక్కడే ఏదో ఒక పని చేసి బతుకుదాం.. పిల్లాపాపలతో అందరం హాయిగా ఉందాం’ అని చెప్పిన భర్త.. తన కళ్ల ముందే అసువులు బాయడంతో ఆ ఇల్లాలు విలపించిన తీరు అందరి గుండెలను కదిలించింది. ఒంటి నిండా తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్న భర్తను కాపాడాలని కనిపించిన వారి కాళ్లా వేళ్లా పడింది. కానీ.. కట్టుకున్న వాడి ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఈ హృదయ విదారక ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లా సేడం మండలానికి రతన్ (35), మంజూల (32) భార్యభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. స్థానికంగా పనులు లేకపోవడంతో.. ఏడాది క్రితం బతుకుదెరువు కోసం రతన్ నగరానికి వలస వచ్చాడు. పాండురంగానగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ స్థానికంగా కూలీ పని చేస్తున్నాడు. ప్రతి నెలా సొంతూరికి వెళ్లి భార్యకు డబ్బులు ఇచ్చి వచ్చేవాడు. కూలీ పనులు దొరక్కపోవడంతో రెండు నెలలుగా గ్రామానికి వెళ్లడం లేదు. దీంతో ఆయన భార్య మంజుల మూడు రోజుల క్రితం భర్త వద్దకు వచ్చింది. రెండు రోజులు భర్తతో ఉండి అప్పటి వరకు జమ చేసిన డబ్బులు తీసుకుని సోమవారం ఉదయం స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమైంది. మరో నెల రోజులు ఇక్కడే పని చేసి వచి్చన డబ్బుతో తానే వస్తానని భార్యకు చెప్పాడు. ఇక్కడ అంతగా పని దొరకడం లేదని గ్రామానికి వచ్చి పని చేసుకుని మీతోనే ఉంటానన్నాడు. దూసుకు వచ్చి మృత్యువు.. సోమవారం ఉదయం భార్యభర్తలు ఇదే విషయం మాట్లాడుకుని హైదర్‌గూడలోని బస్టాప్ వద్దకు చేరుకున్నారు. బస్టాప్ వద్ద ఉదయం 6 గంటలకు నిలుచుని ఉన్నారు. ఇదే సమయంలో ఆరాంఘర్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న టస్కర్ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ వేగంగా దూసుకువచ్చింది. బస్టాప్‌లో నిలుచున్న దంపతులిద్దరినీ ఢీకొట్టింది. టస్కర్ చక్రాల కింద నలిగిన రతన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంజులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి వరకు తనతో నెల రోజుల్లో గ్రామానికి వస్తానన్న భర్త తన కళ్లెదుటే తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ఆమె కన్నీరుమున్నీరుగా రోదించింది. భర్త బతికే ఉన్నాడనుకుని కాపాడండంటూ అక్కడ ఉన్నవారిని ప్రాధేయపడింది. ఆమె అభ్యర్థనలు అతడి ప్రాణాలను కాపాడలేకపోయాయి. ప్రమాదానికి కారకుడైన టస్కర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది. (చదవండి: చిన్నపాటి గొడవ..పూలు కట్ చేసే బ్లేడ్‌తో యువకుడిని..) -
దినసరి కూలీకి దిమ్మతిరిగే షాక్! ఏకంగా రూ. 14 కోట్లు చెల్లించమన్న ఐటీ శాఖ
దినసరి కూలీకి ఆదాయపు పన్ను శాఖ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏకంగా రూ. 14 కోట్లు ట్యాక్స్ చెల్లించాలంటూ ఆ కూలీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఐతే నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులు సైతం అతడి పరిస్థితిని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బిహార్‌లోని రోహ్తాస్ జిల్లాలోని యాదవ్ అనే దినసరి కూలీకి ఆదాయపు పన్ను శాఖ ఏకంగా రూ. 14 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న అతడి కుటుంబం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. తాను దినసరి కూలీనని, తన ఆస్తి మొత్తాన్ని పలుమార్లు విక్రయించిన కూడా అంత మొత్తం చెల్లించలేనని అధికారులకు తెలియజేశాడు. యాదవ్‌కి నోటీసులు జారీ చేసేందుకు వచ్చిన అధికారులు సైతం అతడి స్థితిని చూసి ఆశ్చర్యపోయారు. ఐతే యాదవ్ గతంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో వివిధ ప్రదేశాల్లో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసినట్లు అధికారులకు తెలిపాడు. ఆ తర్వాత 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా బిహార్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చేసినట్లు తెలిపాడు. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో అక్కడ అధికారులు తన ఆధార్, పాన్‌కార్డుల కాపీలను తీసుకున్నట్లు వెల్లడించాడు. బహుశా వారే ఆదాయపు పన్ను నుంచి తప్పించుకునేందుకు ఇలా తన పేరిట నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరిపి ఉండవచ్చని ఐటీ అధికారులకు వివరించాడు. ఆ దినసరి కూలీ యదవ్కి ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యాలయం నుంచే నేరుగా నోటీసులు పంపినట్లు ఐటీ అధికారి సత్యభూషణ్ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా, యాదవ్ సోమవారం తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో ఎక్కడికో వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. (చదవండి: షాకింగ్ ఘటన:రెస్టారెంట్లోకి దూసుకొచ్చిన టెంపో..ముగ్గురికి గాయాలు) -
రూ. రెండు వేల కోసం ప్రాణం తీశాడు
ఖానాపూర్: తీసుకున్న డబ్బులు రూ. రెండు వేలు ఇవ్వలేదని తోటి వలస కూలీ హన్మంతరావును పథకం ప్రకారమే బాపూజి హత్య చేశాడని ఖానాపూర్ సీఐ శ్రీధర్‌గౌడ్ తెలిపారు. బుధవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వలస కూలీ హత్య కేసు వివరాలను సీఐ వెల్లడించారు. పట్టణానికి చెందిన మేస్త్రీ నవీన్‌వద్ద పనిచేసేందుకు ప్రకాశం జిల్లా ఇంకోలుకు చెందిన కడియాల హన్మంతురావు(38), బాపూజిలు వారం క్రితం ఖానాపూర్‌కు వచ్చారు. గతంలోనూ వీరిద్దరు కలిసి పనిచేశారు. విద్యానగర్‌లోని ఓ ఇంట్లో వీరిద్దరు అద్దెకు ఉంటున్నారు. ఆదివారం విద్యానగర్‌లోని వైన్స్‌లో మద్యం సేవించే సమయంలో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. తదనంతరం ఇంటికి వెళ్లాక కూడా గొడవ జరగ్గా హన్మంతుపై పగ పెంచుకున్న బాపూజి రాడుతో తలపై పలుమార్లు బాది హతమార్చాడు. అనంతరం నిందితుడు మృతదేహాన్ని బయట పడేసి గ్రామ శివారు ప్రాంతానికి పారిపోయాడు. దాడి సమయంలో నవీన్ సోదరుడు ప్రేమ్ కూడా అక్కడే ఉన్నాడని సీఐ వివరించారు. రూ. 2 వేల కూలీ డబ్బులు ఇవ్వలేదని, తాగడానికి బీడీలు కూడా ఇవ్వలేదని దాడిచేసి హత్యచేశాడని సీఐ తెలిపారు. బుధవారం తర్లపాడ్ క్రాస్‌రోడ్డు వద్ద నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశామన్నారు. ఇంటి యజమాని భారతీ వీరకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కాగా విచారణకు కృషిచేసిన ఎస్సై రామునాయక్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ తుకారం, ఐడీపార్టీ కానిస్టేబుల్ ఉషన్న, హోంగార్డు శ్రీనివాస్‌లను సీఐ అభినందించారు. -
నాడు అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్.. నేడు కూలీ
భువనేశ్వర్ : తాను బరువులెత్తి దేశం పరువు పెంచాడు ఆ ఆదివాసీ యువకుడు. ప్రభుత్వం సహకరిస్తే మరింత ముందుకు సాగి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయాలనుకున్నాడు. అయితే బంగారు పళ్లానికైనా గోడ చేర్పు ఉండాలన్న సామెతలా తయారైంది ఓ అంతర్జాతీయ క్రీడాకారుడి పరిస్థితి. ఆ క్రీడాకారుడు ఎంతటి ప్రతిభ సాధించినప్పటికీ ప్రోత్సాహం లభించక మరుగున పడిపోతున్నాడు. ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించి దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన క్రీడాకారుడికి ప్రభుత్వ ప్రోత్సాహం, ఆదరణ లేకపోవడంతో ప్రస్తుతం రోజుకూలీగా మారి జీవనం సాగిస్తున్నాడు. నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ సమితి తెలరి గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు అరుణ శాంత దేశం తరఫున అంతర్జాతీయ పోటీలలో మూడు సార్లు పాల్గొని రెండు గోల్డ్‌మెడల్స్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాడు. అంతే కాకుండా రాష్ట్ర, జాతీయ అనేక పతకాలు గెలుపొంది ఖ్యాతి గడించాడు. దేశం కోసం ఆడి గౌరవం తెచ్చిపెట్టిన అరుణ శాంత నేడు రోజు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఒలంపిక్స్‌లో పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్న అరుణశాంతకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఒలంపిక్స్ ఆకాంక్ష కలగానే మిగిలిపోయింది. ఆర్థిక ఇబ్బందులు, పేదరికం కారణంగా నేడు భుజాన గొడ్డలి వేసుకుని కూలి పనికి వెళ్తున్నాడు. కూలి దొరికిన రోజున కుటుంబం ఆకలి తీరుతుంది. లేనప్పుడు అర్ధాకలితో ఉండాల్సిందే. అరుణ శాంత ఉమ్మరకోట్‌లో 7 వ తరగతి వరకు చదివి అనంతరం బరంపురం స్పోర్ట్స్ స్కూల్లో చేరి వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందాడు. ప్రభుత్వం గుర్తిస్తే మరిన్ని విజయాలు శిక్షణ అనంతరం రాష్ట్ర , జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటూ అనేక విజయాలు సాధిస్తూ వచ్చాడు. 2012లో మయన్మార్‌లో జరిగిన ఏషియన్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని బంగారు పతకం సాధించాడు. అదే ఏడాది జరిగిన ఆసియా దేశాల కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం గెలిచి సత్తా చాటాడు. అలాగే జాతీయ స్థాయిలో ఢిల్లీ, బెంగళూరు, మహారాష్ట్రలలో జరిగిన పోటీలలో పాల్గొని అనేక బహుమతులు సాధించాడు. బహుళ ఆదివాసీ ప్రాంతంలో పుట్టి వెయిట్ లిఫ్టర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అరుణ శాంతకు ఇప్పటికైనా ప్రభుత్వం చేయూత అందిస్తే మరెన్నో విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలడనడంలో సందేహం లేదు. ఒలంపిక్స్‌లో విజయం లక్ష్యం ఒలంపిక్స్ పోటీలలో ఆడి దేశానికి పేరు తేవాలని ఉంది. అయితే అందుకు అవకాశాలు కనిపించడం లేదు. నన్ను ప్రభుత్వం గుర్తించక పోవడం విచారకరం. వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆశక్తి వల్ల ఎక్కువగా చదువుకోలేకపోయాను. ప్రభుత్వం తగిన సహాయం అందిస్తే ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ఉంది. –అరుణ శాంత, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు -
పెరగనున్న ఉపాధి వేతనం
వీరఘట్టం : ఉపాధి హామీ పనులకు సంబంధించి జీఓ15 ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఒక్కో వేతనదారుడికి గరిష్టంగా రూ.307 వేతనం వచ్చే అవకాశముందని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం వెల్లడించారు. వీరఘట్టం మండలం వండువ సమీపంలో జరుగుతున్న చెరువు పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి వేతనం 30 శాతం పెరగనున్నాయని చెప్పారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనులు నిర్వహించాలని సూచించారు. విరామ సమయంలో వేతనదారులందరికీ మజ్జిగ అందజేయాలని సిబ్బందికి సూచించారు. కూలి డబ్బులను మద్యపానానికి వినియోగించకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. తోటల్లో పంట సంజీవని కుంటలు తవ్వించాలని సూచించారు. అనంతరం వీరఘట్టంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు ఏపీడీ లోకేష్, ఎంపీడీఓ శంకరరావు, ఏపీఓ జి.సత్యంనాయుడు, డిప్యూటీ తహసీల్దార్ బి.సుందరరావు, ఆర్ఐ రమేష్, మేజరు పంచాయతీ ఈఓ విశ్వనాథం తదితరులు ఉన్నారు. అయ్యవారు వస్తే అన్నీ హంగులే.. ఇన్నాళ్లూ ఉపాధి పనుల వద్ద కనిపించని ప్రథమ చికిత్స కిట్టు కలెక్టర్ వస్తున్నారని తెలియడంతో ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. పనులు జరిగిన ప్రదేశంలో టెంట్లు వేయడంతో పాటు స్టీలు బిందెలతో తాగునీరు అందుబాటులో ఉంచారు. దీంతో ఉపాధి వేతనదారులు ముక్కున వేలేసుకున్నారు. ఇన్నాళ్లూ తాము ఎండలో మగ్గిపోతున్నా పట్టించుకోని సిబ్బంది అధికారులు వస్తున్నారని తెలిసి హడావుడి చేయడంపై విస్మయం చెందుతున్నారు. ఈ కిట్లు మిగతా రోజుల్లో ఏమవుతున్నాయనేదానికి అధికారుల వద్ద సమాధానం దొరకడం లేదు. -
వెతలు
♦ జీతాలు పెరగక ఎన్ఎంఆర్ ఉద్యోగుల అవస్థలు చివరగా 2013లో పెంపు ♦ ఈ ఉత్తర్వులు రెండేళ్లకే పరిమితం ♦ తాజా ఉత్తర్వుల కోసం 15 నెలలుగా నిరీక్షణ సత్వరం పెంచాలని విజ్ఞప్తి ♦ పట్టించుకోని అధికారులు సంగారెడ్డి టౌన్: వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే దినసరి వేతన జీవుల జీతాలు పెరగక అవస్థలు పడుతున్నారు. జీతాలు పెంచుతూ 2013లో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు రెండేళ్లకే పరిమితం. గడువు ముగిసి 15 నెలలు దాటినా తాజా ఉత్తర్వులు రావడం లేదు. ప్రస్తుత ధరలను సమీక్షించి అందుకు అనుగుణంగా కొత్తగా వేతనాలు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎన్ఎంఆర్ ఉద్యోగులు కోరుతున్నారు. ఇందుకోసం కార్మిక శాఖ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జీతాల పెంపుకోసం ఎదురు చూపులతో కాలం గడుపుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో దినసరి వేతనంతో పనిచేస్తోన్న నాన్ మస్టర్ రోల్ స్టాఫ్ (ఎన్ఎంఆర్) ఉద్యోగులు జీతాలు పెరగక ఇబ్బందులు పడుతున్నారు. జీతాల పెంపునకు సంబంధించిన అప్పటి కలెక్టర్, డిప్యూటీ లేబర్ కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కార్మిక శాఖ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా లాభం లేకపోయింది. నాటి ధరలకు అనుగుణంగా 2013లో అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నిత్యావసర ధరలు రెండేళ్లలో పదింతలు పెరిగాయని, జీతాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంపు ఉత్తుర్వుల కోసం గత 15 నెలలుగా ఎదురు చూస్తున్నామన్నారు. ప్రభుత్వం శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచారని, తమ జీతాలు కూడా పెంచాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. పాత ఉత్తర్వులు కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లాలో మొత్తం ఎంతమంది ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఉన్నారో తమ వద్ద సమాచారం అందుబాటులో లేదని చెప్పడం గమనార్హం. చివరిసారిగా 2013 నవంబరులో ఉత్తర్వులు... ఎన్ఎంఆర్ ఉద్యోగులకు సంబంధించిన కమిటీకి కలెక్టర్ చైర్మన్, కన్వీనర్‌గా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. డిసెంబర్ 2011లో ఈ ఉద్యోగుల జీతాలు పెంచారు. ఆపై రెండేళ్లకోసారి అప్పటి నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతాలు పెంచుతూ 19 నవంబర్ 2013న అప్పటి కలెక్టర్ ఆదేశాలతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఉత్తర్వులు నం.సి/1393/2013 విడుదల చేశారు. ఈ ఉత్తర్వులు మార్చి 2015 వరకు అమలులో ఉంటుందని అందులో సూచించారు. ఆ ఉత్తర్వుల గడువు అయిపోయి 15 నెలలుగడిచింది. దాంతో సదరు ఉద్యోగులు జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. 2013లో నిర్ణయించిన రోజువారి వేతనాలు.. అన్‌స్కిల్డ్ ఉద్యోగులైన మజ్దూర్, చౌకీదార్, అటెండర్, స్వీపర్, క్యాజువల్ లేబర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 245, పట్టణ ప్రాంతంలో రూ. 255గా నిర్ణయించారు. సెమీ స్కిల్డ్ ఉద్యోగుల రికార్డ్ అసిస్టెంట్, మిల్క్ రికార్డర్, మిల్క్ మ్యాన్, మిల్కర్, ఇతరులకు గ్రామీణ ప్రాంతంలో రూ. 295, పట్టణం ప్రాంతంలో 305, స్కిల్డ్ ఉద్యోగులైన కార్పెంటర్, క్లర్క్, టైపిస్ట్, స్టెనో, ఎలక్ట్రిషియన్, డ్రైవర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 330, పట్టణ ప్రాంతాల్లో రూ. 345గా నిర్ణయించారు. ఇప్పటికీ ఇవే వేతనాలను చెల్లిస్తున్నారు. పాత ఉత్తర్వులే అమల్లో.. ఇప్పటికీ పాత ఉత్తర్వులే కొనసాగుతున్నాయి. ఈ ఉత్తర్వులు 2013లో జారీ అయ్యాయి. జిల్లాలో ఎంతమంది ఎన్ఎంఆర్ ఉద్యోగులు పనిచేస్తున్నారో పూర్తి వివరాలు మా దగ్గర ఉండవు. - కోటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్మిక కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం... గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాలం చెల్లింది. 15 నెలలు దాటినా కొత్తగా ఉత్తర్వులు జారీ కాలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్తగా జీతాలు నిర్ణయించాలని పలుమార్లు అధికారులకు విన్నవించాం. కార్మిక శాఖ అధికారులను చాలాసార్లు కలిసాం. అయినా పట్టించుకోవడం లేదు. - శివకుమార్, ఎన్ఎంఆర్ ఉద్యోగి -
‘ఉపాధి’ కూలీ పెంపు ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు వివిధ అభివృద్ధి పనుల్లో పని చేసే కూలీలకు రోజువారీ వేతనం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 169 వేతనాన్ని రూ. 180కి పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయి. కూలీల వేతనంతో పాటు వివిధ పనులకు సంబంధించిన గ్రామీణ ప్రామాణిక రేట్లు (రూరల్ స్టాండర్డ్ రేట్స్) పెంచుతూ షెడ్యూలును ప్రభుత్వం విడుదల చేసింది. -
చీకటి బతుకులు
* కాంట్రాక్ట్ కార్మికులు, దినసరి కూలీల మీద తీవ్ర ప్రభావం * ఆర్డర్లు రద్దవుతున్నాయంటూ యాజమాన్యాల ఆందోళన * ఉపాధి కోల్పోతున్న కార్మికులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కరెంటు కోతలు కార్మికుల ఉపాధికి వాతలు పెడుతున్నాయి. వారి జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. పవర్ హాలీడేతో నెలలో 10 రోజుల పాటు పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీంతో యాజమాన్యాలు కాంట్రాక్ట్ కార్మికులను, దినసరి కూలీలను తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి వెతుక్కుంటూ పల్లె నుంచి పట్నం వచ్చి బడుగు జీవుల బతుకులు రోడ్డున పడుతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాకు రోజుకు 22.80 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. కానీ ఇప్పటికీ 2001 లెక్కల ఆధారంగానే రోజుకు 17.51 మిలియన్ యూనిట్ల విద్యుత్‌నే అధికారులు కేటాయించారు. ఇందులో 9.40 మిలియన్ యూనిట్లు పరిశ్రమల కోసం వినియోగిస్తున్నట్లు టాన్స్‌కో రికార్డులు చెప్తున్నాయి. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో అధికారులు పరిశ్రమలకు రెండు రోజుల పవర్ హాలీడే ప్రకటించారు. వారానికి రెండు రోజులతో పాటు, మధ్యమధ్యలో కరెంటు కోతలు విధిస్తున్నారు. దీంతో నెలకు కనీసం 10 నుంచి 12 రోజుల పాటు పరిశ్రమలు నడవడం లేదు. ఈ నేపథ్యంలో అనుకున్న లక్ష్యంలో దాదాపు 40 శాతం ఉత్పత్తులు ఆగిపోతున్నాయి. జిల్లాలోని చాలా పరిశ్రమల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సమయానికి ఉత్పత్తులు ఇవ్వడం లేదన్న కారణంతో బయ్యర్లు ముందస్తు ఆర్డర్లను తిరస్కరించి, మరో రాష్ట్రం కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఉత్పత్తులు నిలిచిపోవడంతో ఆదాయ వ్యయాల్లో తీవ్ర వ్యత్యాసం వస్తోంది. దీంతో ఉద్యోగులు, కార్మికుల వేతనాల చెల్లింపులు కూడా పరిశ్రమల యాజమాన్యాలకు కష్టంగా మారుతోంది. జిల్లాలో ఒక్కొక్క భారీ పరిశ్రమలో కనీసం 350 నుంచి 500 వరకు కార్మికులు పనిచేస్తున్నారు. దినసరి కూలీల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. మధ్య, చిన్నతరహా పరిశ్రమల్లో సగటున 50 నుంచి 100 మంది కూలీల పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రత్యక్షంగా దాదాపు 2 లక్షల మంది కార్మికులు, పరోక్షంగా మరో లక్ష మంది పరిశ్రమల మీద ఆధారపడి బతుకుతున్నారు. నెలకు 10 రోజుల పాటు పరిశ్రమల ఆగిపోవడం వల్ల అందులో పని చేసే కార్మికుల జీతాల్లో యాజమాన్యం కోత పెడుతోంది. ఇంకొన్ని పరిశ్రమలు సిబ్బందిని కుదించుకుంటున్నాయి. దీంతో దినసరి కూలీలు, కాంట్రాక్టు కార్మికుల ఆర్థిక పరిస్థితి భారంగా మారుతోంది. కాంటాక్ట్ కార్మికుల మీద ప్రభావం... డిమాండ్‌కు తగినంతగా విద్యుత్‌ను సరఫరా లేకపోవడంతో పరిశ్రమల్లో ఉత్పుత్తులు ఆగిపోతున్నాయి. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలీడే ప్రకటించడంతో ఈ ప్రభావం నేరుగా దినసరి కూలీల మీద పడుతోంది. ప్రస్తుతం సరఫరా అవుతున్న విద్యుత్తులో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుండటంతో పరిశ్రమలకు వారానికి కనీసం 2 రోజుల పవర్ హాలీడే ప్రకటించాల్సి వచ్చింది. జిల్లాలో భారీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అధికంగానే ఉన్నాయి. 11 కేవీ విద్యుత్‌తో నడిచే భారీ పరిశ్రమలు దాదాపు 1,500 వరకు ఉన్నాయి. 10 కేవీ విద్యుత్తుతో నడిచే అంటే మధ్యతరహా, చిన్న పరిశ్రమలు 7,500 వరకు ఉన్నాయి. ప్రస్తుతం బొల్లారం పారిశ్రామిక వాడలో సోమవారం, మంగళవారం, జిల్లాలోని మిగిలిన పారిశ్రామిక వాడల్లో బుధ, గురువారాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఈ పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోతోంది. ఫార్మా, ఐరన్, స్టీల్, బాయిల్డ్, విత్తన, జౌళి పరిశ్రమలపై విద్యుత్ కోతల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఐరన్, బాయిల్డ్ పరిశ్రమల్లో బాయిలర్స్ వేడెక్కాలంటే దాదాపు 1000 ిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. ఇందుకోసం దాదాపు 5 నుంచి 10 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని పరిశ్రమల యాజమాన్యాలు చెబుతున్నాయి. కరెంటు కోతల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగాా హైటెన్షన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన జనరేటర్లు ప్రస్తుతం అందుబాటులో లేవని, ఒకవేళ అందుబాటులో ఉన్నప్పటికీ అంత ఖర్చు భరించి పరిశ్రమలు నడపటం సాధ్యం కాదని యాజమాన్యాలు అంటున్నాయి. విధిలేని పరిస్థితిలోనే పవర్ హాలీడే ప్రకటించిన రెండు రోజులు ఉత్పత్తి నిలిపివేస్తున్నామని వారు చెప్తున్నారు. మిగిలిన 5 దినాల్లో కూడా నిరంతరాయంగా కరెంటు రావడం లేదని, మధ్యమధ్యలో కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటు సరఫరా నిలిచిపోతున్నట్లు పరిశ్రమల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని వర్గాల మీదా ప్రభావం... రసాయన పరిశ్రమలు 24 గంటలు 365 రోజులు నడవాల్సిందే. కెమికల్ జోన్లో రసాయన గుణాన్ని బట్టి 24 గంటలు, 36 గంటల ప్రతిచర్యలు (రియాక్షన్స్) ఉంటాయి. కరెంటు కోతలతో రసాయనిక ప్రతి చర్యలు ఆగిపోయి ఉత్పత్తులు తగ్గడం, నాసిరకం ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఇలాంటి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండటం లేదు. ఫలితంగా భారీగా నష్టపోవాల్సి వస్తోంది. పరిశ్రమల ఆగటంతో యాజమాన్యం, కార్మికులు మాత్రమే కాదు.. పారిశ్రామిక ఉత్పత్తులను తరలించడం..విక్రయించడం.. వాటిని వివిధ రూపాల్లోకి మార్చే అనేక వర్గాల మీద ప్రభావం చూపుతుంది. రవాణ వాహనాలు, డ్రైవర్లు, ఏజెన్సీలు, డీలర్లు, దుకాణదారులు, మధ్యవ ర్తులు ఇలా ప్రతి వారి మీదా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కాంట్రాక్టు కార్మికులు, దినసరి కూలీల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. -అంజిరెడ్డి, ఎస్సార్ కెమికల్స్, ఎస్సార్ ట్రస్టు అధినేత