సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు వివిధ అభివృద్ధి పనుల్లో పని చేసే కూలీలకు రోజువారీ వేతనం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 169 వేతనాన్ని రూ. 180కి పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయి. కూలీల వేతనంతో పాటు వివిధ పనులకు సంబంధించిన గ్రామీణ ప్రామాణిక రేట్లు (రూరల్ స్టాండర్డ్ రేట్స్) పెంచుతూ షెడ్యూలును ప్రభుత్వం విడుదల చేసింది.