చుట్టూ వెలుతురు కనిపించినంత కటిక చీకటి అయిన చిన్న అగ్గిపుల్ల వెలుగు మొత్తం చీకటిని తరిమేయగలదు. అలాగే ఎంతటి కటిక దారిద్యం అయినా గెలవాలన్న కసి, పట్టుదల, డెడికేషన్ ఉంటే అందనంత శిఖరాలకు చేరుకోవచ్చు అని నిరూపించాడు ఓ కూలి కొడుకు. తండ్రి సంపదన రోజుకి జస్ట్ రూ. 10లే. కనీసం కుటుంబ పోషణకు సరిపడని సంపాదన. కడుపు నిండ తిండలేని దారుణ స్థితిలో పెరిగిన వ్యక్తి. కానీ అతను నా జీవితం ఇంతే అనుకుని రాజీపడలేదు. గెలిచేందుకు మార్గాలు అన్వేషించాడు. ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చిన వెనకడుగువేయలేదు. ఈసారి కాకపోయిన మరోసారైనా గెలవగలను అనుకుంటూ సాగిపోయాడు. నేడు ఏకంగా రూ. 3 వేల కోట్ల ఫుడ్ కంపెనీకి సీఈవో అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచాడు!.
అతడే ఐడీ ఫ్రెష్ ఫుడ్ చీఫ్ ఎగ్జిక్యూటివివ్ ఆఫీసర్(సీఈవో) ముస్తాఫా పీసీ. ఆయన ఇటీవల జరిగిన ది నియన్ షో పోడోకాస్ట్‌లో తన బాల్య జీవితం ఎలా సాగిందో షేర్ చేసుకున్నారు. తాను కేరళలో ఓ మారుమూల గ్రామంలో జన్మించానని, తన తండ్రి రోజూ వారి కూలి అని చెప్పారు. ఆయన రోజుకు జస్ట్ రూ. 10 సంపాదించడమే చాలాకష్టంగా ఉండేదని చెప్పుకొచ్చారు. అది తమ కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో తన తోబుట్టువులంతా ఆదాయం కోసం 'అల్లం' పొలంలో పనిచేయడం, కట్టెలు అమ్మడం వంటి చిన్న చితక పనులు చేసి డబ్బులు కూడబెట్టేవాళ్లమని చెప్పారు.
అలా తమ కుటుంబం ఓ మేకును కొనుగోలు చేసే స్థాయికి చేరుకోగలిగిందని అన్నారు. అదే మా తొలి ఆస్తి అని కూడా చెప్పొచ్చన్నారు. అయితే అది తినేందుకు కాదని చెప్పారు. ఆ తర్వాత తమ కుటుంబం క్రమక్రమంగా పురోగతి సాధించడం ప్రారంభించింది. అలా ఆ మేకను అమ్మి ఆవును కొనుగొలు చేసే స్థాయికి చేరుకున్నాం. దీంతో తమ కుటుంబ సభ్యులంతా రెండు పూట్ల కడుపు నిండా భోజనం చేయగలిగే స్థాయికి చేరుకున్నామంటూ.. నాటి రోజులు గుర్తు చేసుకున్నారు. అలా కష్టాలను దాటుకుంటూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదవుకోగలిగే స్థాయికి చేరుకున్నాను అన్నారు. ఆ తర్వాత వెంటనే ఐటీ ఉద్యోగం రావడంతో కొన్నాళ్లపాటు అందులో కొనసాగినట్లు తెలిపారు.
సరిగ్గా 2006లో ఐడీ ఫ్రెష్ ఫుడ్ అనే కంపెనీని ఏర్పాటు చేశాను. ఒక చిన్న గదిలో వండిన ఆహారాన్ని ప్యాక్ చేసి విక్రయించానని తెలిపారు. అయితే భారతీయ వినయోగదారులకు ప్యాక్ చేసిన ఇడ్లీ, దోస పిండిని పరిచయం చేయడం చాలా సవాలుగా మారింది. మొదట్లో ప్యాక్ చేసిన ఆహారం వినియోగించమని తీవ్రంగా వ్యతిరేకించేవారు. పైగా ప్యాక్ చేసిన ఆహారం అనారోగ్యకరమైనదిగా భావించి కొనడానికి కూడా ఇష్టపడేవారు కాదు. దీంతో తాము మార్కెట్లోకి 100 ప్యాకెట్లు పంపిస్తే అందులో 90 ప్యాకెట్లు వెనకొచ్చేసివి. ఏం చేయాలో పాలుపోయేది కాదు. అప్పుడే అర్థమయ్యింది ఫుడ్ వ్యాపారాన్ని నడపడం అంత ఈజీ కాదు అని.
తాజా ఆహార వ్యాపారాన్ని నిర్వహించడం ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన పని అని తనకు క్లియర్‌గా తెలిసిందన్నారు. ప్రారంభంలో ఎదుర్కొన్న చాలా ఎదురదెబ్బల సాయంతో నేర్చుకున్న మెళుకువలను అన్ని ఉపయోగించి సమర్థవంతంగా తాజా ఆహారాన్ని అందించడమే కాకుండా తన బ్రాండ్‌కి ఓ నమ్మకం ఏర్పడేలే చేసుకున్నాను. నేడు నా ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీలో ఆహారానికి ఢోకా ఉండదు తాజాగా అందిస్తారు అనే ఓ ముద్ర(బ్రాండ్) పడేలా చేసుకున్నాను. అలా నా వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించేలా అభివృద్ధి చేశానంటూ తన కంపెనీ విజయం ప్రస్థానం గురించి వివరించారు ముస్తఫా. ప్రపంచంలో ఉన్న ప్రతిఒక్కరూ అద్భుతాలు చేయగలరన్నారు. ఇక్కడ కేవలం సడలని నమ్మకం, నిబద్ధత ఉంటే అనుకున్నదీ ఏదైనా సాధించొచ్చుని ఆత్మవిశ్వాసంగా చెప్పారు ముస్తఫా.
(చదవండి: 19 ఏళ్లకే సర్పంచ్ ఆమె!..మద్యానికి బానిసైన తండ్రి, కటిక దారిద్యం..)
Comments
Please login to add a commentAdd a comment