Food company
-
సఫైర్ ఫుడ్స్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఓమ్ని చానల్ రెస్టారెంట్ల నిర్వాహక కంపెనీ సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్‌లో రెండు ప్రమోటర్ సంస్థలు తాజాగా 5.9 శాతం వాటాను విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా సమర క్యాపిటల్ పార్ట్నర్స్ ఫండ్–2.. 4,49,999 షేర్లు(0.71 శాతం వాటా), సఫైర్ ఫుడ్స్ మారిషస్ 33,37,423 షేర్లు(5.24 శాతం) అమ్మివేశాయి. బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం ఒక్కో షేరుకి రూ. 1,400 సగటు ధరలో విక్రయించిన వాటా విలువ రూ. 530 కోట్లు. కేఎఫ్‌సీ, పిజ్జా హట్, టాకో బెల్ తదితర యమ్ బ్రాండ్ల అతిపెద్ద ఫ్రాంచైజీగా సఫెర్ ఫుడ్స్ వ్యవహరిస్తోంది. తాజా లావాదేవీల తదుపరి కంపెనీలో మారిషస్ ప్రమోటర్ వాటా 29.28 శాతం నుంచి 24.04 శాతానికి తగ్గింది. ఇక సమర క్యాపిటల్ పార్ట్నర్స్ ఫండ్–2.. కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగినట్లయ్యింది. సింగపూర్ ప్రభుత్వం 10.05 లక్షల షేర్లు, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ 22 లక్షల షేర్లు కొనుగోలు చేశాయి. కాగా.. ఈ నెల మొదట్లో మరో ప్రమోటర్ సంస్థ అరింజయ మారిషస్.. రూ. 378 కోట్లకు సఫైర్ ఫుడ్స్‌లో 4.2 శాతం వాటాను విక్రయించిన విషయం విదితమే. వాటా విక్రయం నేపథ్యంలో సఫైర్ ఫుడ్స్ షేరు బీఎస్ఈలో 0.26 శాతం నీరసించి రూ. 1,403 వద్ద ముగిసింది. ఆర్కియన్ కెమ్‌లో వాటా అమ్మకం స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్‌లో ఇండియా రిసర్జెన్స్ ఫండ్ స్కీ మ్–1, స్కీమ్–2, పిరమల్ నేచురల్ రిసోర్సెస్ ఉమ్మడిగా 3.4% వాటాకు సమానమైన 42 లక్షల షేర్లను విక్రయించాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 600–601 సగటు ధరలో విక్రయించిన వాటా విలువ రూ. 252 కోట్లు. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ 14.06 లక్షల షేర్లు, డీఎస్పీ ఎంఎఫ్ 10 లక్షల షేర్లు, గోల్డ్‌మన్ శాక్స్ 6.23 లక్షల షేర్లు చొప్పున సొంతం చేసుకున్నాయి. వాటా విక్రయం నేపథ్యంలో ఆర్కియన్ కెమికల్స్ షేరు ఎన్ఎస్ఈలో 3.3% పతనమై రూ. 610 దిగువన ముగిసింది. ప్రైకోల్లో వాటా విక్రయం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఆటో విడిభాగాల కంపెనీ ప్రైకోల్లో పీహెచ్‌ఐ క్యాపిటల్ సొల్యూషన్స్ 14,40,922 షేర్లను విక్రయించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం 1.2 శాతం వాటాకు సమానమైన వీటిని షేరుకి రూ. 347 సగటు ధరలో అమ్మివేసింది. డీల్ విలువ రూ. 50 కోట్లుకాగా.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్ వీటిని కొనుగోలు చేసింది. తాజా లావాదేవీల తదుపరి కంపెనీలో పీహెచ్‌ఐ క్యాపిటల్ వాటా 5.73 శాతం నుంచి 4.55 శాతానికి తగ్గింది. వాటా విక్రయం నేపథ్యంలో ప్రైకోల్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ. 344 దిగువన ముగిసింది. -
తండ్రి రోజు కూలీ...కొడుకు వేల కోట్ల కంపెనీకి....
చుట్టూ వెలుతురు కనిపించినంత కటిక చీకటి అయిన చిన్న అగ్గిపుల్ల వెలుగు మొత్తం చీకటిని తరిమేయగలదు. అలాగే ఎంతటి కటిక దారిద్యం అయినా గెలవాలన్న కసి, పట్టుదల, డెడికేషన్ ఉంటే అందనంత శిఖరాలకు చేరుకోవచ్చు అని నిరూపించాడు ఓ కూలి కొడుకు. తండ్రి సంపదన రోజుకి జస్ట్ రూ. 10లే. కనీసం కుటుంబ పోషణకు సరిపడని సంపాదన. కడుపు నిండ తిండలేని దారుణ స్థితిలో పెరిగిన వ్యక్తి. కానీ అతను నా జీవితం ఇంతే అనుకుని రాజీపడలేదు. గెలిచేందుకు మార్గాలు అన్వేషించాడు. ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చిన వెనకడుగువేయలేదు. ఈసారి కాకపోయిన మరోసారైనా గెలవగలను అనుకుంటూ సాగిపోయాడు. నేడు ఏకంగా రూ. 3 వేల కోట్ల ఫుడ్ కంపెనీకి సీఈవో అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచాడు!. అతడే ఐడీ ఫ్రెష్ ఫుడ్ చీఫ్ ఎగ్జిక్యూటివివ్ ఆఫీసర్(సీఈవో) ముస్తాఫా పీసీ. ఆయన ఇటీవల జరిగిన ది నియన్ షో పోడోకాస్ట్లో తన బాల్య జీవితం ఎలా సాగిందో షేర్ చేసుకున్నారు. తాను కేరళలో ఓ మారుమూల గ్రామంలో జన్మించానని, తన తండ్రి రోజూ వారి కూలి అని చెప్పారు. ఆయన రోజుకు జస్ట్ రూ. 10 సంపాదించడమే చాలాకష్టంగా ఉండేదని చెప్పుకొచ్చారు. అది తమ కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో తన తోబుట్టువులంతా ఆదాయం కోసం 'అల్లం' పొలంలో పనిచేయడం, కట్టెలు అమ్మడం వంటి చిన్న చితక పనులు చేసి డబ్బులు కూడబెట్టేవాళ్లమని చెప్పారు. అలా తమ కుటుంబం ఓ మేకును కొనుగోలు చేసే స్థాయికి చేరుకోగలిగిందని అన్నారు. అదే మా తొలి ఆస్తి అని కూడా చెప్పొచ్చన్నారు. అయితే అది తినేందుకు కాదని చెప్పారు. ఆ తర్వాత తమ కుటుంబం క్రమక్రమంగా పురోగతి సాధించడం ప్రారంభించింది. అలా ఆ మేకను అమ్మి ఆవును కొనుగొలు చేసే స్థాయికి చేరుకున్నాం. దీంతో తమ కుటుంబ సభ్యులంతా రెండు పూట్ల కడుపు నిండా భోజనం చేయగలిగే స్థాయికి చేరుకున్నామంటూ.. నాటి రోజులు గుర్తు చేసుకున్నారు. అలా కష్టాలను దాటుకుంటూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదవుకోగలిగే స్థాయికి చేరుకున్నాను అన్నారు. ఆ తర్వాత వెంటనే ఐటీ ఉద్యోగం రావడంతో కొన్నాళ్లపాటు అందులో కొనసాగినట్లు తెలిపారు. సరిగ్గా 2006లో ఐడీ ఫ్రెష్ ఫుడ్ అనే కంపెనీని ఏర్పాటు చేశాను. ఒక చిన్న గదిలో వండిన ఆహారాన్ని ప్యాక్ చేసి విక్రయించానని తెలిపారు. అయితే భారతీయ వినయోగదారులకు ప్యాక్ చేసిన ఇడ్లీ, దోస పిండిని పరిచయం చేయడం చాలా సవాలుగా మారింది. మొదట్లో ప్యాక్ చేసిన ఆహారం వినియోగించమని తీవ్రంగా వ్యతిరేకించేవారు. పైగా ప్యాక్ చేసిన ఆహారం అనారోగ్యకరమైనదిగా భావించి కొనడానికి కూడా ఇష్టపడేవారు కాదు. దీంతో తాము మార్కెట్లోకి 100 ప్యాకెట్లు పంపిస్తే అందులో 90 ప్యాకెట్లు వెనకొచ్చేసివి. ఏం చేయాలో పాలుపోయేది కాదు. అప్పుడే అర్థమయ్యింది ఫుడ్ వ్యాపారాన్ని నడపడం అంత ఈజీ కాదు అని. తాజా ఆహార వ్యాపారాన్ని నిర్వహించడం ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన పని అని తనకు క్లియర్‌గా తెలిసిందన్నారు. ప్రారంభంలో ఎదుర్కొన్న చాలా ఎదురదెబ్బల సాయంతో నేర్చుకున్న మెళుకువలను అన్ని ఉపయోగించి సమర్థవంతంగా తాజా ఆహారాన్ని అందించడమే కాకుండా తన బ్రాండ్‌కి ఓ నమ్మకం ఏర్పడేలే చేసుకున్నాను. నేడు నా ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీలో ఆహారానికి ఢోకా ఉండదు తాజాగా అందిస్తారు అనే ఓ ముద్ర(బ్రాండ్) పడేలా చేసుకున్నాను. అలా నా వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించేలా అభివృద్ధి చేశానంటూ తన కంపెనీ విజయం ప్రస్థానం గురించి వివరించారు ముస్తఫా. ప్రపంచంలో ఉన్న ప్రతిఒక్కరూ అద్భుతాలు చేయగలరన్నారు. ఇక్కడ కేవలం సడలని నమ్మకం, నిబద్ధత ఉంటే అనుకున్నదీ ఏదైనా సాధించొచ్చుని ఆత్మవిశ్వాసంగా చెప్పారు ముస్తఫా. (చదవండి: 19 ఏళ్లకే సర్పంచ్ ఆమె!..మద్యానికి బానిసైన తండ్రి, కటిక దారిద్యం..) -
కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న విప్రో!
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ ఫుడ్, మసాలా దినుసుల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రయివేట్ రంగ కంపెనీ విప్రో కన్జూమర్ కేర్ తాజాగా వెల్లడించింది. ఇందుకు వీలుగా సుగంధ ద్రవ్యాల కంపెనీ నిరాపరాను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. కేరళలో అత్యధికంగా విక్రయమవుతున్న సంప్రదాయ ఆహార బ్రాండ్ల సంస్థ నిరాపరాను సొంతం చేసుకునేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు డాబర్, ఇమామీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఐటీసీ సరసన చేరనున్నట్లు పేర్కొంది. 1976లో ప్రారంభమైన నిరాపరా మిశ్రమ మసాలా దినుసులకు పేరొందింది. ఈ బ్రాండు పలు రకాల మిశ్రమ దిసుసులతోపాటు.. విభిన్న అప్పడాల తయారీలో వినియోగించే బియ్యపు పిండినీ రూపొందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ బిజినెస్ కేరళలో 63 శాతం, గల్ఫ్ దేశాల నుంచి 29 శాతం నమోదవుతున్నట్లు విప్రో ఎంటర్ప్రైజెస్ ఈడీ వినీత్ అగర్వాల్ వెల్లడించారు. ఈ వార్తల నేపథ్యంలో విప్రో షేరు యథాతథంగా రూ. 390 వద్ద ముగిసింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
3.30 నిమిషాల్లో పాస్తా ఉడకలేదని రూ.40 కోట్లు దావా..
వాషింగ్టన్: ‘రెండు నిమిషాల్లో రెడీ.. 3 నిమిషాల్లో రెడీ..’ అని ఇన్స్టంట్ ఫుడ్ ప్యాకెట్స్‌పై వివరాలు ఇస్తుంటాయి కంపెనీలు. వాటిని ఉడికించబోతే చెప్పిన సమయం కంటే ఎక్కువే తీసుకుంటాయి. అది మామూలేలే.. అని మనం పట్టించుకోం. కానీ.. ఫ్లోరిడాకు చెందిన ఈ మహిళ ఊరుకోలేదు. చెప్పిన టైమ్‌లో పాస్తా ఉడకలేదని ఫుడ్ కంపెనీపై రూ.40కోట్లు దావా వేసింది. ఫ్లోరిడాకు చెందిన అమాండా రెమీరేజ్... క్రాఫ్ట్ హీంజ్ కంపెనీకి చెందిన వెల్వెటా షెల్స్ పాస్తా అండ్ ఛీజ్‌ను కొనుగోలు చేసింది. దాన్ని మైక్రోవేవ్‌లో ఉడికిస్తే.. మూడున్నర నిమిషాల్లో రెడీ అయిపోతుందని ప్యాక్‌పై రాసి ఉంది. కానీ అందులో వివరించినట్టుగా మూడున్నర నిమిషాల్లో పాస్తా అండ్ ఛీజ్ ఉడకలేదని, ప్యాక్‌పై ఉన్న వివరాలు వినియోగదారులను పక్కదారి పట్టించే విధంగా ఉందని అమాండా ఆరోపించింది. పరిహారం కింద రూ.40 కోట్లు, జరిగిన నష్టానికి రూ.80 లక్షలు చెల్లించాలని కోర్టులో కేసు వేసింది. చదవండి: మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం.. అది గ్రహాంతరవాసిదా! -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్: బడా కంపెనీల కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో బడా ఎఫ్ఎంసీజీ కంపెనీలు చిన్నపాటి టెట్రా ప్యాక్‌లలో విక్రయించే పండ్ల రసాలు, పాల ఉత్పత్తులకు పేపర్ స్ట్రాలు (పుల్లలు) జోడించడం మొదలు పెట్టాయి. పార్లే ఆగ్రో, డాబర్, అమూల్, మథర్ డెయిరీ ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రవేశపెట్టాయి. రీసైక్లింగ్ బెవరేజ్ కార్టన్స్ అలియన్స్ (ఏఏఆర్‌సీ) మాత్రం.. ప్లాస్టిక్ స్ట్రాలను మార్చే విషయంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ఇది సరఫరాలపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్ఎంసీజీ కంపెనీల స్టాకిస్టుల వద్ద నిల్వలు అడుగంటాయని.. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవి పేపర్ స్ట్రాలు లేదా ఇతర ప్రత్యామ్నాయలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని ఏఏఆర్‌సీ తెలిపింది. పేపర్ స్ట్రాల తయారీ ఫ్రూటీ, అపీ ఫిజ్ పేరుతో పెద్ద మొత్తంలో పండ్ల రసాలను విక్రయించే ప్రముఖ సంస్థ పార్లే ఆగ్రో బయో డీగ్రేడబుల్ (ప్రకృతిలో కలసిపోయే/పర్యావరణ అనుకూల) స్ట్రాలను తన ఉత్పత్తులకు జోడిస్తోంది. ప్రభుత్వం విధించిన గడువు నాటికి నిబంధనలను పాటించే లక్ష్యంతో పేపర్ స్ట్రాలను దిగుమతి చేసుకున్నట్టు పార్లే ఆగ్రో సీఈవో షానా చౌహాన్ తెలిపారు. పేపర్స్ట్రాల నుంచి పీఎల్ఏ స్ట్రాలకు మారిపోతామని చెప్పారు. పీఎల్ఏ స్ట్రాలు అన్నవి మొక్కజొన్న గంజి, చెరకుతో తయారు చేస్తారు. తమ వ్యాపార భాగస్వాములు పీఎల్ఏ స్ట్రాలను తయారు చేసే వరకు, కొన్ని నెలలపాటు పేపర్ స్ట్రాలను వినియోగిస్తామన్నారు. మథర్ డైరీ సైతం దిగుమతి చేసుకున్న పేపర్ స్ట్రాలను జూలై 1 నుంచి తయారు చేసే తన ఉత్పత్తులకు జోడిస్తున్నట్టు ప్రకటించింది. రియల్ బ్రాండ్‌పై పండ్ల రసాయాలను విక్రయించే డాబర్ ఇండియా సైతం టెట్రా ప్యాక్‌లతోపాటు పేపర్ స్ట్రాలను అందించడాన్ని మొదలు పెట్టినట్టు తెలిపింది. నిబంధనల అమలుకు కట్టుబడి ఉంటామని డాబర్ ఇండియా ఈడీ షారూక్‌ఖాన్ స్పష్టం చేశారు. పాత నిల్వలపై ప్రభావం ఏఏఆర్‌సీ సీఈవో ప్రవీణ్ అగర్వాల్ మాట్లాడుతూ.. జూన్ 30 నాటికి నిల్వలున్న రిటైలర్లకు తాజా పరిణామాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయని చెప్పారు. పంపిణీదారులు, రిటైలర్ల వద్ద ఉన్న ఉత్పత్తులు అమ్ముడుపోయే వరకు కొంత కాలం పాటు ఉపశమనం కల్పించాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. -
ఇకపై అంతా పచ్చిబియ్యమే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణపై భారత ఆహార సంస్థ కొత్త కొర్రీలు పెడుతోంది. దేశవ్యాప్తంగా పచ్చిబియ్యం (రా రైస్)కు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఇకపై దాన్ని మాత్రమే సేకరిస్తామని అంటోంది. వానాకాలం, యాసంగి సీజన్లలోనూ ఇకపై పచ్చిబియ్యం మాత్రమే తమకు అందించాలని లేని పక్షంలో తామేమీ చేయలేమని చేతులెత్తేస్తోంది. ఈ వానాకాలానికి సంబంధించి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ముందుకు వచ్చి న ఎఫ్‌సీఐ పూర్తి పచ్చిబియ్యాన్ని మాత్రమే తీసుకోనుంది. పచ్చి బియ్యమే.. పరమాన్నం రాష్ట్రం నుంచి అధికంగా ఉప్పుడు బియ్యాన్ని సేకరించి పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసే ఎఫ్‌సీఐ... గతేడాది యాసంగి నుంచి తన విధానాన్ని మార్చుకుంటూ వస్తోంది. బాయిల్డ్ రైస్ వినియోగం అధికంగా ఉండే తమిళనాడు, కేరళ నుంచి డిమాండ్ తగ్గడం, వినియోగం లేక ఎఫ్‌సీఐ వద్ద నిల్వలు పెరుగుతుండటంతో డిమాండ్ అధికంగా ఉన్న రా రైస్ ఇవ్వాలని ఎఫ్‌సీఐ షరతులు పెట్టింది. గత యాసంగిలో 1.32 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా ఇందులో 80.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించింది. ఈ ధాన్యాన్ని మర పట్టించడం ద్వారా 55లక్షల మె ట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి ఉంటుందని అంచనా వేసిం ది. మర పట్టించి ఇచ్చిన బియ్యంలో ఏటా 95 శాతం వరకు ఉప్పుడు బియ్యాన్నే ఎఫ్‌సీఐ సేకరిస్తూ రాగా గత సీజన్లో రా రైస్ మాత్రమే ఇవ్వాలని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతులకు నష్టం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా 80 శాతం బాయిల్డ్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవాలని ఎఫ్‌సీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినప్పటికీ దాన్ని పట్టించుకోని ఎఫ్‌సీఐ 60 శాతం మేర రా రైస్ ఇవ్వాలని కోరింది. 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 24.75 లక్షల మెట్రిక్ టన్నులే బాయిల్డ్ కింద ఇవ్వాలని మిగతా 30.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రా రైస్‌గా ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌లో 15 లక్షల టన్నుల సేకరణ పూర్తి చేసింది. మిగతా సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తంగా 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ సేకరణ తర్వాత మిగతా బియ్యాన్ని సేకరిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎఫ్‌సీఐ సేకరించని పక్షంలో రాష్ట్రానికి ఇక్కట్లు తప్పేలా లేవు. ఇక ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ అవసరం ఉంటుందని అంచనా వేస్తుండగా ఇందులో గత సీజన్లను అనుసరించి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని అంటోంది. దీనికి సంబంధించి పూర్తిగా పచ్చి బియ్యాన్ని ఇవ్వాలని కోరింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుత సీజన్లోనూ దొడ్డు రకాల సాగు ఎక్కువగా జరిగిన నేపథ్యంలో పచ్చి బియ్యం ఎలా ఇవ్వగలమన్నది ప్రశ్నగా మారింది. ఎఫ్‌సీఐ కొర్రీల దృష్ట్యానే సన్న రకాల సాగు పెంచాలని ప్రభుత్వం కోరినా గిట్టుబాటు ధరలు రాని దృష్ట్యా ఈ సీజన్లో దొడ్డు రకాల సాగు ఎక్కువగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. -
ఐస్‌క్రీమ్ బాక్సుల్లో కరోనా
బీజింగ్: కరోనా వైరస్ జాడలున్న 4,800 ఐస్‌క్రీం బాక్సులను చైనా అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందరికి వ్యాపించింది? అనే విషయాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. ఈ ఘటన చైనా ఈశాన్య ప్రాంతంలోని టియాన్జియాన్ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానిక టియాన్జిన్ డకియావోడావో ఫుడ్ కంపెనీలో తయారైన ఐస్‌క్రీం శాంపిళ్లను పరీక్షించగా కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో బట్వాడా కాని 2,089 ఐస్‌క్రీం బాక్సులను కంపెనీ స్టోర్ రూంలోనే సీల్ వేసి ఉంచారు. మిగతా, 1,812 ఐస్‌క్రీం బాక్సులు వివిధ ప్రావిన్సులకు, 935 బాక్సులు స్థానిక మార్కెట్‌కు పంపిణీ కాగా అందులో 65 మాత్రం అమ్ముడు పోయినట్లు తేలింది. సరఫరా అయిన ప్రాంతాల్లో విచారణ చేపట్టి, వాటి ద్వారా ఎవరికైనా వైరస్ సోకిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. దీంతోపాటు ఆ ఐస్‌క్రీం ఫ్యాక్టరీలోని 1,662 మంది ఉద్యోగులను సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలని ఆదేశించారు. ఆ కంపెనీ ఐస్‌క్రీం తయారీలో వాడిన పాలపదార్థాలు ఉక్రెయిన్, న్యూజిల్యాండ్ నుంచి వచ్చినట్లు గుర్తించిన ఆరోగ్య శాఖ అధికారులు..అవి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాక్సుల్లో వైరస్ ఘటనపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని యూకేలోని లీడ్స్ యూనివర్సిటీ వైరాలజిస్టు గ్రిఫ్ఫిన్ అన్నారు. -
ఆహార సంస్థల లెసైన్స్‌ల గడువు మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ: ఆహార కంపెనీలను యధేచ్ఛగా నడుపుకునేందుకు లెసైన్స్ తప్పనిసరి. దీన్ని పొందేందుకు కంపెనీలకు మరో మూడు నెలలు గడువు పొడిగించింది భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ). ఈ మేరకు గడువును ఆగస్టు 4 వరకు పొడిగిస్తున్నట్లు తాజా ప్రకటనలో తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖకు వచ్చిన పలు అభ్యర్థనల మేరకు ఇప్పటికే గడువును 8 సార్లు సవరించారు. చివరిసారిగా మే 4తో గడువు ముగిసింది.