3న డాక్ అదాలత్
– పోస్టల్ సూపరింటెండెంట్
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మార్చి 3వ తేదీన బీక్యాంప్‌లోని తపాలా కార్యాలయంలో డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తపాలా సేవల్లో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఫిర్యాదులు ఉంటే 3వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు బీ.క్యాంప్‌లోని పీఎంజీ కార్యాలయంలో పోస్టల్ డైరెక్టర్ సమక్షంలో పరిష్కరించుకోవాలన్నారు. ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను, ఇబ్బందులను పోస్టల్ ఎన్వలప్/ కవర్లో పెట్టి పంపాలని, కవరుపై ‘డాక్ అదాలత్’ అని స్పష్టంగా రాయాలని సూచించారు.