Darmapuri case
-
14 రోజుల రిమాండుకు డీఎస్ కుమారుడు సంజయ్
-
డీఎస్ కుమారుడు సంజయ్ అరెస్టు
నిజామాబాద్ అర్బన్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఎట్టకేలకు పోలీసు విచారణకు హాజరయ్యారు. మూడు గంటలపాటు విచారించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఆదివారం రాత్రి జిల్లా జైలుకు తరలించారు. సంజయ్‌ను రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. వారు వేసిన రిమాండ్ పిటిషన్లను ఇద్దరు న్యాయమూర్తులు కొట్టి వేసినప్పటికీ.. తమ ప్రయత్నాలను కొనసాగించడంతో రాత్రి 11 గంటల వరకు హైడ్రామా కొనసాగింది. చివరకు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో సంజయ్‌ను జిల్లా జైలుకు తరలించారు. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంజయ్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్పీసీ 41 ఏ ప్రకారం నోటీసులు జారీ చేసి ఆయన్ను విచారించాలని కోర్టు ఆదేశించింది. ఈలోపే పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రెండ్రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. సక్రమంగా లేని అభియోగాలు.. అజ్ఞాతంలో ఉన్న సంజయ్ ఆదివారం ఉదయం 11 గంటలకు తన న్యాయవాదులతో కలసి నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించిన పోలీసులు.. ఆయన్ను రిమాండ్‌కు పంపేందుకు నివేదికను సిద్ధం చేసుకొని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ్నుంచి తీసుకువెళ్లి గంగాస్థాన్‌లో నివాసముండే మొదటి అదనపు జడ్జి మేరి సార దానమ్మ ఎదుట హాజరు పరిచారు. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టుపై మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. రిమాండ్ రిపోర్టు సక్రమంగా లేదని తోసిపుచ్చారు. సీఆర్పీసీ 41 ఏ ప్రకారమే విచారణ జరపాలని హైకోర్టు స్పష్టం చేయడంతో పోలీసులు ఆయన్ను రిమాండ్‌కు తరలించే అవకాశం లేకపోయింది. ఇదే అంశాన్ని సంజయ్ తరఫు న్యాయవాదులు గట్టిగా వాదించారు. మరోవైపు హైకోర్టు ఆదేశాల తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. రిమాండ్‌కు తరలించే కారణాలు బలంగా లేవంటూ పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో ఏసీపీ సుదర్శన్ రిమాండ్ రిపోర్టులోని తప్పులను సవరించి మరో సారి మొదటి అదనపు జడ్జి ముందుంచారు. దీన్ని పరిశీలించిన జడ్జి సంజయ్‌ని రిమాండ్‌కు పంపకుం డా ఒకరోజు పోలీసుల అదుపులోనే ఉంచుకొని, సోమవారం కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. చివరికి ఫ్యామిలీ కోర్టుకు.. మొదటి అదనపు జడ్జి రిమాండ్ పిటిషన్‌ను తిరస్కరించడంతో పోలీసులు.. ప్రగతినగర్‌లో నివాసం ఉండే మరో జడ్జి సూర్యచంద్రకళ వద్దకు సంజయ్‌ను తీసుకెళ్లారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. సంజయ్ రిమాండ్‌ను తిరస్కరించారు. మొదటి అదనపు న్యాయమూర్తి లేవనెత్తిన అంశాలనే ప్రస్తావించారు. అయినా పట్టు వదలని పోలీసులు.. వినాయక్‌నగర్‌లో గల ఫ్యామిలీ కోర్టు జడ్జి సుదర్శన్ ఎదుట సంజయ్‌ను ప్రవేశపెట్టారు. రాత్రి 11 గంటలకు విచారణ కొనసాగింది. చివరకు న్యాయమూర్తి.. సంజయ్‌కి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. -
యావజ్జీవంగా దర్మపురి కేసు
* ఉరి రద్దు! * ముగ్గురు నిందితులకు శిక్ష తగ్గింపు * విద్యార్థినుల కుటుంబాల ఆవేదన సాక్షి, చెన్నై : ధర్మపురిలో బస్సు దగ్ధం, ముగ్గురు విద్యార్థినుల సజీవ దహనం కేసులో ముగ్గురికి విధించిన ఉరి శిక్ష రద్దు అయింది. యావజ్జీవంగా శిక్షను మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ విద్యార్థినుల కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అవినీతి కేసులో అన్నాడీఎం కే అధినేత్రి జె జయలలితకు 2000 సంవత్సరంలో ఏడాది జైలు శిక్ష పడ్డ విషయం తెలిసిందే. ఈ తీర్పుతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆక్రోశం రగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాల బయలు దేరాయి. ఈ సమయంలో ధర్మపురి సమీపంలో అన్నాడీఎంకే వర్గాల వీరంగం రాష్ట్రాన్నే కుదిపి వేసింది. తమ అమ్మకు జైలు శిక్ష పడ్డ వీరావేశంతో అన్నాడీఎంకే వర్గాలు కోయంబత్తూరుకు చెందిన వ్యవసాయ కళాశాల బస్సుకు నిప్పు పెట్టారు. ఎంతో ఆనందంగా విహార యాత్రను ముగించుకుని తిరుగు పయనంలో ఉన్న విద్యార్థినుల్ని మంటలు చుట్టుముట్టడంతో బయట పడేందుకు తీవ్రంగా శ్రమించారు. కొందరు గాయాలతో బయట పడగా, కోకిల వాణి, గాయత్రి, హేమలత సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో రాష్ట్రంలో పెను కలకలం బయలు దేరింది. ఈకేసులో ముఫ్పై మంది వరకు అరెస్టు అయ్యారు. వీరిలో అన్నాడీఎంకేకు చెందిన ధర్మపురి నాయకులు నెడుంజెలియ న్, రవీంద్రన్, మునియప్పన్లకు ఉరి శిక్ష విధిస్తూ సేలం కోర్టు 2007లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును మద్రాసు హైకోర్టు ధ్రువీకరించింది. తదుపరి సుప్రీం కోర్టు సైతం తీర్పును ధ్రువీకరించడంతో సేలం కేంద్ర కారాగారంలో శిక్షను ఈ ముగ్గురు అనుభవిస్తున్నారు. తమకు క్షమాభిక్ష పెట్టాలని రాష్ర్టపతికి చేసుకున్న వి న్నపం పెండింగ్‌లో ఉంది. ఈ పరిస్థితుల్లో రాజీవ్ హ త్య కేసు నిందితుల ఉరి శిక్ష యావజ్జీవంగా మారడం తో ఈ ముగ్గురు మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఉరి రద్దు..యావజ్జీవం: తమకు విధించిన ఉరి శిక్ష తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రంజన్ గోగయ్, అరుణ్ మిశ్రలతో కూడిన బెంచ్ విచారిస్తూ వస్తున్నది. విచారణ గత వారం రోజులుగా వేగం పెరిగింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు హాజరై వాదనల్ని విన్పించారు. ఈ ముగ్గురు పథకం ప్రకారం బస్సుకు నిప్పు పెట్టి, ముగ్గురు విద్యార్థినుల మృతి కారణం కాలేదని, ఆవేశంతో జరిగిన తప్పు మాత్రమేనంటూ వాదనల్ని విన్పించారు. అలాగే, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులకు విధించిన ఉరి శిక్ష యావజ్జీవంగా మారి ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వాదనల అనంతరం ఆవేశ పూరితంగా చేసిన ఘటన కావడంతో ఉరిశిక్షను రద్దు చేస్తున్నట్టు బెంచ్ ప్రకటించింది. ఉరి శిక్షను యావజ్జీవంగా మారుస్తూ తీర్పు వెలువడడంతో కోకిల వాణి, గాయత్రి, హేమలత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డల మృతికి కారణమైన వాళ్లను ఇప్పటికే ఉరి తీసి ఉండాలని, అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.