Data collection
-
నిన్న రాజంపేట.. నేడు నెల్లూరు 'పచ్చ' మూకల డేటా చౌర్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా ఇప్పటి నుంచే టీడీపీ బరితెగిస్తోంది. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతోనూ, ఓటర్ల జాబితాలో ఓటు ఉందో, లేదో తెలుసుకునే పేరుతోనూ ప్రతి ఇంటికీ వెళ్తున్న టీడీపీ డేటా దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తోంది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వివరాలు, ఓటీపీ వంటి అత్యంత సున్నిత సమాచారాన్ని ఈ ముఠా సేకరిస్తోంది. కొద్ది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా రాజంపేటలోనూ ఈ పచ్చ మూకల దండు ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపైన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీదకొచ్చి పడుతోందని.. పట్టపగలే ఇళ్లలోకి చొరబడుతోందని.. ఆ ముఠా చేసే తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇంతలోనే రాజంపేట కోవలోనే తాజాగా నెల్లూరులోనూ టీడీపీ దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించింది. నెల్లూరులో నారాయణ గ్యాంగ్ బరితెగింపు.. నెల్లూరులో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ గ్యాంగ్ శనివారం పట్టపగలే ప్రజల ఇళ్లలోకి చొరబడింది. ఇంటింటికీ తిరిగి ఓటర్ల వ్యక్తిగత సమాచారం సేకరించింది. ఓట్ల తనిఖీ కోసం వచ్చామంటూ సున్నిత వ్యక్తిగత సమాచారం రాబట్టింది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు నంబర్లు, మొబైల్ ఫోన్ నంబర్, దానికి వచ్చిన ఓటీపీ వివరాలు చెప్పాలని అడగడంతో నెల్లూరులో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. నెల్లూరు నగరంలోని మూలాపేట డివిజన్లో ఓ ఇంటికి వెళ్లి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న టీడీపీ ముఠా సభ్యుడ్ని స్థానికులు అడ్డుకున్నారు. తమ సున్నిత వ్యక్తిగత సమాచారం మీకెందుకంటూ నిలదీశారు. దీంతో ఆ డేటా దొంగ పరార్ కావడానికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తన విద్యాసంస్థల్లో పనిచేసే చిరుద్యోగులను ముఠాగా ఏర్పాటు చేసి నారాయణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. నెల్లూరు నగర నియోజకర్గంలో దాదాపు 75 వేల కుటుంబాలు ఉన్నాయి. 2.35 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరందరి సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు నారాయణ తన ముఠాను రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారాయణకు రూ.కోట్లు కుమ్మరించినా ఓటమి తప్పలేదు. తన విద్యాసంస్థల ఉద్యోగులు, అధ్యాపకులను రంగంలోకి దింపి విచ్చలవిడిగా కోట్ల రూపాయలు వెదజల్లినా ఓటర్లు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో తాను నమ్మిన వాళ్లే ఓటుకు నోటు సక్రమంగా చేర్చలేదన్న అభిప్రాయంతో ఉన్న నారాయణ ఈ ధపా వారిని నమ్మకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాలను సేకరించి వారి బ్యాంకు ఖాతాల్లోకే డబ్బు జమ చేయడానికి కుట్ర పన్నారని చెబుతున్నారు. పచ్చ దొంగల డేటా తస్కరణ ఇలా.. టీడీపీ పచ్చ దొంగల ముఠా ప్రతి ఇంటికి వెళ్లి ఓట్ల తనిఖీ కోసం వచ్చామంటూ చెబుతున్నారు. ఆ ఇంటి ఓటర్ల పేర్లు చదువుతున్నారు. ఆపై వారిని మాటల్లో పెట్టి సున్నిత వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తున్నారు. ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఆ కుటుంబం వైఎస్సార్సీపీ మద్దతుదారులైతే వారి ఓట్లు తొలగింపు ఫారం–7 నమోదు చేసి మీ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వచ్చిందని.. దాన్ని చెప్పాలని దబాయిస్తున్నారు. కొందరు అమాయకులు ఓటీపీ చెబుతుండటంతో వారి ఓట్లు తొలగింపునకు ఫారం–7 నమోదవుతుంది. దాంతో పాటు ఓటర్ల బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే మాత్రం టీడీపీ నేత నారాయణ మీ ఖాతాలో నగదు జమ చేస్తాడని చెబుతూ మాయ చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన పథకాల నగదు కూడా జమ అవుతుందని పచ్చి అబద్ధాలకు దిగుతున్నారు. ఓటీపీ క్లిక్ చేస్తే అంతే సంగతులు పట్టపగలే దొంగల్లా ప్రజల ఇళ్లల్లోకి చొరబడుతున్న టీడీపీ దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని తమ దగ్గర ఉన్న ఒక యాప్‌లో నమోదు చేస్తున్నారు. మొబైల్ నంబర్‌కు ఓటీపీ, మేసేజ్ వస్తే దాన్ని క్లిక్ చేయమంటున్నారు. క్లిక్ చేస్తే ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ అంటూ కార్డు వస్తోంది. ఆ కార్టులో.. ‘ఐదేళ్లలో రూ.2.40 లక్షలు పొందేందుకు మీరు అర్హత సాధించారు.. మీకు అభినందనలు.. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమవుతుంది’ అంటూ కనిపిస్తోంది. ఇటీవల అన్నమయ్య జిల్లా రాజంపేటలో మర్రి మౌనిక అనే మహిళను ఇలాగే టీడీపీ దొంగల ముఠా బురిడీ కొట్టించింది. అంతటితో ఆగటంలేదు.. చంద్రబాబు సంతకం చేశారంటూ ఒక గ్యారెంటీ పత్రాన్ని సైతం ఇస్తుండటం ఈ ముఠా బరితెగింపుకు నిదర్శనం. ఆలూ లేదు.. సూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు చంద్రబాబే అధికారంలోకి వచ్చేసినట్లు ప్రతిజ్ఞ చేస్తూ సంతకం చేసి మరీ ఇస్తుండటం వీరి పైత్యానికి పరాకాష్ట. ఎల్లో మీడియా తీరు మారదా? రాష్ట్రంలో పచ్చ ముఠా ఇళ్లలోకి చొరబడి ఓటర్ల వ్యక్తిగత సమాచారం తస్కరిస్తూ అడ్డంగా దొరికిపోతున్నా.. ఎల్లో మీడియా మాత్రం ఓటర్ల సవరణలు, చేర్పులు, తొలగింపుల్లో వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తప్పుడు రాతలు రాస్తోంది. ఇటీవల సర్వేపల్లిలో టీడీపీ ముఠా వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు ఫారం–7 నమోదు చేసి అడ్డంగా దొరికినా ఎల్లో మీడియా పచ్చ కళ్లకు కనిపించడం లేదు. -
ఆ ఫోన్ల డేటానే ఎక్కువ సేకరిస్తున్న గూగుల్
గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి ఎక్కువ డేటాను సేకరిస్తోందని ఒక పరిశోధనలో తేలింది. ఈ డేటా సేకరణ ఆపిల్ ఫోన్ల కంటే అధికంగా ఉందని పేర్కొన్నారు. ఐర్లాండ్‌లోని ట్రినిటీ కాలేజీకి చెందిన పరిశోధకులు గూగుల్ పిక్సెల్ ఫోన్ తో షేర్ చేసిన డేటాను, ఆపిల్ ఐఫోన్ డేటాతో పోల్చారు. గూగుల్ ఆపిల్ కంటే 20 రెట్లు ఎక్కువగా హ్యాండ్సెట్ డేటాను సేకరిస్తుందని కనుగొన్నారు. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజ్‌కు చెందిన డగ్లస్ జె. లీత్ , అతని బృందం మొబైల్ హ్యాండ్సెట్ గోప్యతపై పరిశోధన నిర్వహించారు. కాగా ఏ తయారీదారు ఎక్కువగా యూజర్ డేటాను సేకరిస్తుందో చూడటానికి పిక్సెల్, ఐఫోన్ మోడల్స్ పై పరిశోధనను చేపట్టగా, పిక్సెల్, ఐఫోన్ మోడల్స్ రెండూ సగటున ప్రతి 4.5 నిమిషాలకు ఆయా తయారీదారులతో డేటాను పంచుకుంటున్నాయని పరిశోధకులు కనుగొన్నారు.సేకరించిన డేటాలో ఐఎమ్ఈఐ నంబర్, హార్డ్‌వేర్ సీరియల్ నంబర్, సిమ్ సీరియల్ నంబర్ ,ఐఎంఎస్ఐ, హ్యాండ్సెట్ ఫోన్ నంబర్ మరిన్ని, టెలిమెట్రీ డేటా కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్లలో యూజర్ సిమ్‌ను వేసినప్పుడు, గూగుల్, ఆపిల్ కంపెనీలకు రెండింటికి వివరాలు వెళ్తాయి. అంతేకాకుండా ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ అడ్రస్‌లను, జీపీఎస్ లోకేషన్‌ను ఆపిల్‌కు పంపుతుందని తెలిసింది. ఆపిల్ లాగిన్ కానప్పుడు కూడా యూజర్ లోకేషన్‌ను, అలాగే స్థానిక ఐపీ అడ్రస్‌ను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌ల నుంచి యూజర్లు వైదొలిగినప్పటికీ కూడా టెలిమెట్రీ డేటాను పంపుతాయని తేలింది. ఫోన్ ఆన్ చేసిన 10 నిమిషాల్లోనే గూగుల్ 1 ఏంబీ డేటాను సేకరిస్తుంది, ఆపిల్ 42కేబీ డేటాను సేకరిస్తుందని తెలిపారు. అయితే ఈ పరిశోధనను గూగల్ కొట్టివేసింది. పరిశోధన చేయడానికి సరైన కొలమానాలను తీసుకొలేదని గూగుల్ ప్రతినిధి వాదించారు. చదవండి: యూట్యూబ్ కొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ వార్కి చెక్ పెట్టనుందా? -
గోప్యత డొల్లేనా!
సాక్షి, హైదరాబాద్: ఫేస్బుక్ ఇటీవల ‘పోర్టల్’గాడ్జెట్ ప్రవేశపెట్టింది.. వీడియో కాలింగ్ కోసం వినియోగిస్తారు దీన్ని.. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.. ఎన్నో ప్రత్యేకతలు.. ఎన్నో వివాదాలు కూడా.. ఇంతకీ ఈ పోర్టల్ ఏమిటి? దాని వెనుక ఉన్న వివాదం ఏంటి..? మీరెప్పుడైనా వీడియో కాల్ చేశారా? చేసే ఉంటారులెండి. దీంతో చిక్కేమిటంటే.. వీడియో కెమెరా స్థిరంగా ఉంటుంది. పక్కన ఉన్నవాళ్ల మాట వినిపిస్తుందేమో గానీ.. ముఖం మాత్రం కనపడదు. ఇంకా బోలెడన్ని సమస్యలున్నాయి. వీటన్నింటికీ తాము ‘పోర్టల్’తో చెక్ పెట్టామని ఫేస్బుక్ వారం రోజుల కింద ప్రకటించింది. ఓ ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, 360 డిగ్రీ కెమెరా.. అలెక్సా లాంటి పర్సనల్ అసిస్టెంట్లతో తయారైన ఈ సూపర్ గాడ్జెట్‌లో ప్రత్యేకతలు ఎన్ని ఉన్నా.. వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందన్న ఒకే కారణంతో వివాదం మొదలైంది. ఎన్నో ప్రత్యేకతలు.. వీడియో కాలింగ్ కోసం ప్రత్యేకంగా ఓ గాడ్జెట్ తయారు కావడం పోర్టల్ మొదటి ప్రత్యేకత అని చెప్పాలి. ఇంట్లో ఓ మూలన ఇది ఉందనుకోండి. ఇంటర్నెట్ ఆధారంగా ఎవరికైనా వీడియోకాల్ చేయొచ్చు. కృత్రిమ మేధతో పనిచేసే వీడియో కెమెరా ఉండటం వల్ల కాల్ నాణ్యత బాగా ఉండటంతో పాటు జూమ్ ఇన్.. జూమ్ అవుట్లు కూడా వాటంతట అవే జరిగిపోతాయి. ఎవరు మాట్లాడుతున్నారో గుర్తించి కెమెరాను వారి వైపు ఫోకస్ చేయడం.. వ్యక్తులు కదిలితే అందుకు తగ్గట్టు కెమెరా యాంగిల్ మార్చడం వంటివన్నీ పోర్టల్ ప్రత్యేకతల్లో కొన్ని. ఇది రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఒకటేమో 15 అంగుళాల స్క్రీన్ ఉన్న ట్యాబ్లెట్‌తో కూడుకున్నదైతే.. రెండోది 10 అంగుళాల స్క్రీన్ సైజు ఉండేది. రెండింటిలోనూ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ ఉంటుంది. చిన్నదాని ఖరీదు 200 డాలర్లు కాగా.. కొన్ని అదనపు ఫీచర్లున్న పెద్దసైజు పోర్టల్ రెట్టింపు ధర పలుకుతోంది. ఇదీ వివాదం.. ఫేస్బుక్ ద్వారా వినియోగదారుల సమాచారం సేకరించడం.. దాన్ని మార్కెటింగ్ సంస్థలకు అమ్ముకోవడం ఫేస్బుక్ చాలాకాలంగా చేస్తున్న పనే. ఈ కారణంగానే మనం ఏదైనా ఒక పోస్ట్ లేదా ప్రకటనపై క్లిక్ చేస్తే చాలు.. కొంత సమయం వరకూ ఆ ప్రకటన, పోస్టులోని అంశాల ప్రకటనలే కనిపిస్తుంటాయి. వ్యక్తిగత అభిరుచులను గుర్తించి వాటికి అనుగుణమైన ప్రకటనలు గుప్పించడమూ ఫేస్బుక్ చాలాకాలంగా చేస్తోంది. ఇలా వినియోగదారుల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇతర దేశాల ప్రభావం పడిందన్న ఆరోపణలు రావడం.. ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్ అమెరికా ప్రభుత్వం ముందు ఈ విషయాన్ని ఒప్పుకోవడం ఇటీవలి పరిణామాలే. అయితే ఆ తర్వాత అయినా ఫేస్బుక్ తన పద్ధతులు మార్చుకుంటుందని ఆశించారు. పోర్టల్ ద్వారా తాము సమాచారం సేకరించబోమని ఆ సంస్థ కూడా నమ్మబలికింది. అయితే వారం రోజులు గడిచాయో లేదో.. అసలు విషయం బయటకు వచ్చేసింది. కొన్ని వెబ్సైట్లు పంపిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పోర్టల్ ద్వారా కూడా సమాచార సేకరణ సాధ్యమేనని పరోక్షంగానైనా అంగీకరించింది. వీడియో కాల్ ఎంత సేపు నడిచింది.. ఎవరికి ఎవరు ఎన్నిసార్లు వీడియో కాల్ చేశారు.. అలెక్సా సాయంతో ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నారు? ఉపయోగించిన యాప్‌లు ఎలాంటివి.. వంటి వివరాలను సేకరించే సామర్థ్యం పోర్టల్‌కు ఉందని ఫేస్బుక్ అంగీకరించింది. ప్రస్తుతానికి తాము ఈ అంశాన్ని ప్రకటనల కోసం వాడట్లేదని తెలిపింది. వాట్సాప్‌కు పోటీగా ఫేస్బుక్ సిద్ధం చేసిన చాటింగ్ అప్లికేషన్ ‘మెసెంజర్’ప్లాట్‌ఫారంపైనే పోర్టల్ కూడా పనిచేస్తుందని వివరించింది. -
దేశంలో పెరుగుతున్న డిటెక్టివ్‌ల బిజినెస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఎవరి ఫోన్ డేటాను సేకరించవద్దని, అసలు ఫోన్ డేటానే కోరవద్దని, అలా చేసినట్లయితే సంఘంలో సభ్యత్వం రద్దవుతుందని ‘అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ డిటెక్టివ్స్ అండ్ ఇన్వెస్టిగేటర్స్–ఇండియా’ ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న తమ సభ్యులను హెచ్చరించింది. కాల్‌డేటా రికార్డులను అక్రమంగా సేకరించి వాటిని విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ముంబైలో ఇటీవల ప్రైవేట్ డిటెక్టివ్‌లను వరుసగా పోలీసులు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అసోసియేషన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. దేశంలో తొలి మహిళా ప్రైవేటు డిటెక్టివ్ రజనీ పండిత్‌ను, కంగనా రనౌత్, నవాజుద్దీన్ సిద్ధికీ లాంటి బాలీవుడ్ తారలను క్లైంటులుగా కలిగిన లాయర్ రిజ్వాన్ సిద్ధికీని ఇవే ఆరోపణలపై పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. భారత దేశంలో ప్రైవేటు డిటెక్టివ్ వ్యవస్థ రోజు రోజుకు పుంజుకుంటోంది. ఏడాదికి 30 శాతం చొప్పున పెరుగుతోంది. 2020 నాటికి ఈ వ్యవస్థ 1700 కోట్ల రూపాయలకు చేరుకుంటుందన్నది ఓ అంచనా. దేశంలో పోలీసు వ్యవస్థతోపాటు పలు దర్యాప్తు సంస్థలు ఉన్నప్పటికీ ప్రైవేటు డిటెక్టివ్‌ల అవసరం ఎందుకు పెరుగుతోంది? ఈ డిటెక్టివ్లు టార్గెట్ వ్యక్తులను అనుసరించి వారు ఎక్కడెక్కడికి వెళుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వారి ఫోన్ కాల్స్ సమాచారాన్ని సేకరించడం నేరమా? వ్యక్తుల ఫోన్ కాల్స్ సమాచారాన్ని వారి అనుమతి లేకుండా సేకరించడం మాత్రం చట్ట ప్రకారం నేరమే. క్రిమినల్ కేసుల్లో, అది డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి ఆదేశంతో పోలీసులు ఫోన్ కాల్స్ డేటాను సేకరించవచ్చు. ప్రైవేటు డిటెక్టివ్లకు ఆ అనుమతిలేదు. అయినా వారు తమ పలుకుబడిని ఉపయోగించి లేదా టెలికమ్ కంపెనీల ఉద్యోగులను ప్రలోభపెట్టి కాల్ డేటాను సేకరిస్తుంటారు. ఎవరు, ఎవరితో మాట్లాడారు? ఎక్కడి నుంచి మాట్లాడారు? ఎంత సేపు మాట్లాడారు? ఎక్కడి నుంచి మాట్లాడారు? అన్న సమాచారం టెలికమ్ సంస్థల వద్ద రికార్డయి ఉంటుంది. సాధారణంగా పోలీసులు టేకప్ చేయని కేసులను ఈ ప్రైవేట్ డిటెక్టివ్లు టేకప్ చేస్తారు. భార్య లేదా భర్త ఎవరెవరితో తిరుగుతున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఎవరెవరితో మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో, వారి మధ్య అక్రమ సంబంధం ఉందా, లేదా? అన్న విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ మంది ప్రైవేటు డిటెక్టివ్‌లను ఆశ్రయిస్తారు. పెళ్లి చేసుకోబోయే యువకుడు లేదా యువతి నడతను తెలుసుకునేందుకు కూడా వీరు ఉపయోగపడుతున్నారు. కాలేజీ కెళుతున్న తమ పిల్లలు ఏ సమయానికి, ఏం చేస్తున్నారో, వారి స్నేహితులు ఎలాంటి వారు? వారికి చెడు అలవాట్లు ఏమైనా అబ్బాయా? అన్న అంశాలను తెలుసుకోవడానికి ఈ మధ్య తల్లిదండ్రులు తమ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని ముంబైలోని మరాఠా డిటెక్టివ్ ఏజెన్సీ అధిపతి జిగ్నేష్ ఛెడ తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు ఏమైనా మోసం చేస్తున్నారా? ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారు? అన్న విషయాలతోపాటు వివిధ రకాల ప్రాజెక్టుల్లో ఎవరి ఎంత బిడ్డింగ్ వేస్తున్నారో కూపీ లాగడం కోసం కూడా డిటెక్టివ్‌ల సేవలను ఉపయోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. వ్యక్తులను ఫాలో అవడం, వారి ఫొటోలను తీయడం, వారి కాల్ డేటాను సేకరించడం చట్ట విరుద్ధం కాదా ? అని ప్రశ్నించగా, పోలీసులు టేకప్ చేయని కేసులే తమ వద్దకు వస్తాయని, ఆ కేసులను పరిష్కరించడంలో తాము ఈ పద్ధతులను అనుసరించక తప్పదని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఢిల్లీ డిటెక్టివ్ ఒకరు చెప్పారు. క్లైంట్ భార్య లేదా భర్తకు అక్రమ సంబంధం ఉందని రుజువు చేయాలంటే ఫొటోలు, వారి కాల్‌డేటా అవసరం అవుతుందని ఆయన అన్నారు. కొందరు కాబోయే భార్య లేదా భర్త మెడికల్ హిస్టరీని తెలుసుకునేందుకు కూడా వీరి సేవలను వాడుకుంటున్నారు. దేశంలో ప్రైవేటు డిటెక్టివ్‌ల ఏజెన్సీలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 2007లో ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. అయితే దాన్ని ఇంతవరకు ఆమోదించకుండా పక్కన పడేసింది. పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా భారత్‌లో బలమైన ‘ప్రైవసీ’ చట్టాలు లేవుగానీ, ఉంటే డిటెక్టివ్‌ల ఏజెన్సీల మనుగడ ఉండేది కాదు. తమ ప్రొఫెషన్‌ను క్రమబద్ధీకరించేందుకు ఓ చట్టం ఉండాలని హైదరాబాద్‌లోని ‘థర్డ్ ఐ ఇన్వెస్టిగేషన్’ సీఈవో పీ. దామోదర్ అభిప్రాయపడ్డారు. -
ఈసారైనా పరిహారం అందేనా?
-
ఈసారైనా పరిహారం అందేనా?
గతేడాది 2.72 లక్షల హెక్టార్లలో పంట నష్టం నేటికీ అందని ఇన్పుట్ సబ్సిడీ ఈ ఏడు అతివృష్టితో భారీగా పంటనష్టం మెదక్: రెండేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు రెక్కలు తెగిన పక్షుల్లా విలవిల్లాడుతున్నారు. గతేడాది తీవ్ర కరువుతో నష్టపోయిన రైతులకు నేటికి పైసా పరిహారం అందలేదు. ఈ యేడు అనేక నష్టాలకోర్చి సాగు చేసిన కొద్దిపాటి పంటలు చేతికందే సమయంలో అతివృష్టితో కొట్టుకుపోయాయి. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. మెదక్ జిల్లాలో గత సంవత్సరం తీవ్రకరువు కారణంగా అధికారిక లెక్కల ప్రకారం 2 లక్షల 73 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు, సోయాబిన్ తదితర పంటలు ఎండి పోయాయి. దీంతో జిల్లా రైతాంగానికి రూ. 197.7 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులే లెక్కలు కట్టారు. కాగా నేటికి యేడాది గడిచిపోతున్నా రైతులకు పైసా పరిహారం (ఇన్పుట్) సబ్సిడీ అందలేదు. గత సంవత్సరం పంట నష్టపోయిన రైతులు బతుకు దెరవు కోసం పట్టణాలకు వలస వెళ్లారు. ఈ క్రమంలో ఈ యేడు ఖరీఫ్‌లో మళ్లీ పంటలు సాగు చేసేందుకు పల్లెటూర్లకు చేరుకున్నారు. ఖరీఫ్ప్రారంభంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు మెట్టప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేయగా కొద్దో, గొప్పో నీరువచ్చే బోరుబావుల ఆధారంగా వరి, సోయాబిన్లాంటి పంటలను 3.5 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. అయితే ముందు మురిపించిన వర్షాలకు మొక్కజొన్న ఏపుగా ఎదిగినా గింజదశకు వచ్చిన ఆగస్టు నెలలో చుక్కవర్షం పడలేదు. దీంతో వర్షాధార పంటలైన మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోయాయి. కాగా బోరుబావుల ఆధారంగా సాగు చేసిన వరి ఇటీవల కురిసిన భారీవర్షాలకు వాగులు, వంకలు పొంగి కొట్టుకుపోయింది. దీంతో సుమారు లక్ష ఎకరాలల్లో పంట దెబ్బతినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇంకా పలు మండలాల్లో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంటనష్టం వివరాలను సేకరిస్తున్నారు. కాగా గతేడాది అనావృష్టితో పంటలు నష్టపోయిన రైతులకు నేటికి పైసా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. కనీసం ఈ సారైనా సకాలంలో బాధితరైతులకు పరిహారం ఇస్తారో లేదో అంటూ పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వరుస విపత్తులతో సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గతేడాది కూడా పరిహారం ఇవ్వలేదు గతేడాది మూడెకరాల్లో మొక్కజొన్న వేశా. వర్షాలు పడక పంట ఎండిపోయింది. అధికారులు వచ్చి రాసుకు పోయారు. కాని నేటికీ పరిహారం అందలేదు. ఈయేడు కూడా మొక్కజొన్న వేయగా అది ఎండిపోయాక వర్షం పడింది. ఈయేడైనా పరిహారం అందిస్తారో లేదో? - కెతావత్ శ్రీను, బ్యాతోల్తండా -
పుట్టగానే ఆధార్, బర్త్ సర్టిఫికెట్స్
శిశువు పుట్టగానే బర్త్, ఆధార్ సర్టిఫికెట్ల జారీ ఇక ప్రత్యేకంగా దరఖాస్తు అవసరం లేదు ఆస్పత్రి నుంచే అన్ని వివరాల సేకరణ డిజిటల్ లాకర్లో నిక్షిప్తం త్వరలో నగరంలో అమలుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు సిటీబ్యూరో : తల్లి గర్భం నుంచి శిశువు భూమ్మీదకొచ్చి కళ్లు తెరవగానే బర్త్ సర్టిఫికెట్..ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లకుండానే ఒక ఆధార్ నెంబర్. పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలేవైనా ఉంటే.. వాటి నమోదు కూడా... - అవును ఇది నిజమే...తల్లిదండ్రులకు శుభవార్తే. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుల కోసం కాళ్లరిగేలా తిరిగే పనిలేకుండా సులువైన పద్ధతిలో ఆస్పత్రి నుంచే ఈ రెండు పనులు పూర్తయ్యేలా జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేస్తోంది. శిశువు జన్మించిన ఆస్పత్రి నుంచే కావాల్సిన వివరాలను సేకరించి ఆయా సర్టిఫికెట్లు జారీ చేసేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. బర్త్ సర్టిఫికెట్ల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయాలు, మీ- సేవ కేంద్రాలకు వెళ్లకుండా ఎక్కడి నుంచైనా ప్రజలు ఆన్లైన్నుంచే డౌన్లోడ్ చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లలో మునిగిన జీహెచ్ఎంసీ.. ఐటీని మరింత విస్తృతంగా వినియోగించుకోవడం ద్వారా ఈ అదనపు సౌకర్యాలను కూడా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లో శిశువులు పుట్టగానే...వారి జనన వివరాల నమోదుతో బర్త్ సర్టిఫికెట్‌ను డిజిటల్ లాకర్లో ఉంచుతారు. దాంతోపాటే శిశువు ఫొటోను తీసి ఒక ఆధార్ నెంబర్‌ను కేటాయిస్తారు. ఆధార్ నమోదుకు ఫింగర్‌ప్రింట్స్, ఐరిస్ తదితరమైనవి పిల్లలు ఎదిగాక తీయాల్సి ఉన్నందున, తాత్కాలికంగా శిశువు ఫొటో తీసి, శిశువు తల్లి లేదా తండ్రి ఆధార్‌నెంబర్‌కు అనుసంధానం చేసి డిజిటల్ లాకర్లో ఉంచుతారు. శిశువు పుట్టిన కొన్ని గంటల్లోనే వీటిని డిజిటల్ లాకర్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకుగాను ఆధార్ నమోదుకు వివరాలు సేకరించే నిపుణులను ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతారు. తొలుత ప్రయోగాత్మకంగా కోఠి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. దశల వారీగా వివిధ ఆస్పత్రులకు ఈ పథకాన్ని విస్తరింపచేయాలని యోచిస్తున్నారు. దీని ద్వారా ఇకపై పిల్లల బర్త్ సర్టిఫికెట్ల కోసం జీహెచ్ఎంసీ , మీసేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటి కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన పనీ లేదు. దరఖాస్తు కూడా చేసుకోకుండానే బర్త్ సర్టిఫికెట్, ఆధార్‌నమోదు, డిఫెక్ట్ సర్టిఫికెట్(పుట్టుకతో లోపాలున్న వారికి)లు సిద్ధం కానున్నాయి. ‘తెలంగాణ ప్రభుత్వ శిశు ఆధార్ ప్రాజెక్ట్’ (టీ శాప్)ను వినియోగించుకొని జీహెచ్ఎంసీ ఈ ఏర్పాట్లు చేయనుంది. ఇది నిజంగా కాబోయే తల్లిదండ్రులకు ఎంతో ఉపయుక్తమైన అంశంగా చెప్పొచ్చు. -
నేటి నుంచి వాహనాలకు ఆధార్ సీడింగ్
విజయవాడ : నగరంలోని ఐదు పెట్రోలు బంకుల ద్వారా బుధవారం నుంచి వాహనదారుల ఆధార్ సీడింగ్ నమోదు ప్రక్రియను అధికారి కంగా ప్రారంభిస్తున్నామని జిల్లా రవాణా కమిషనర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. స్టేట్ గెస్ట్‌హౌస్ ఆవరణలో మెప్మా కార్యాలయంలో డేటా సేకరణకు నియమితులైన ఔత్సాహిక యువతకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ప్రతి వాహనదారుడి ఆధార్ నంబర్ సేకరించి కంప్యూటరీకరిస్తామని చెప్పారు. ఇందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ వివరాలను అందజేయాలని కోరారు. ఈ ఆధార్ అనుసంధాన ప్రక్రియలో భాగంగా నిరుద్యోగ యువతతో నెల రోజుల్లో డేటా సేకరణ పూర్తిచేస్తామన్నారు. విజయవాడలో 4.50 లక్షల వాహహ హనాలు అధికారికంగా రోడ్లపై తిరుగుతున్నాయని డీటీసీ తెలి పారు. ప్రతి వాహన చోదకుడు తన వాహనం రిజిస్ట్రేషన్, లెసైన్స్, ఆధార్లకు సంబంధించిన పత్రాల జిరాక్స్ కాపీలను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. బెంజిసర్కిల్‌లో ఐవోసీ, చెన్నుపాటి, సీతారాంపురం, ఐలాపురం, గారపాటి, స్వగృహఫుడ్ ప్రాంతాల్లోని పెట్రోలు బంక్‌ల్లో ఈ కాపీలను అందించాలని కోరారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు వివరాలు సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో కూడా ప్రత్యేకంగా ఒక బాక్స్ ఏర్పాటు చేసి, వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఆధార్ నమోదు చేసే ప్రతి బంక్‌ను ఒక మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సిబ్బంది సమన్వయం చేసుకుంటారని ఆయన తెలిపారు. మోప్మా ప్రాజెక్టు డెరైక్టర్ వి.హిమబిందు మాట్లాడుతూ ప్రథమంగా వికలాంగ సమాఖ్య సభ్యులను ఆధార్ సీడింగ్ నమోదుకు ఎంపిక చేశామని తెలిపారు. రవాణాశాఖ సిబ్బంది ఎం.శ్రీనివాస్, టి.వి.ఎన్.సుబ్బారావు, మెప్మా సిబ్బంది సిహెచ్.మాధవి, ఎం.దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.