Data Scientist
-
కంప్యూటర్ కమాండర్.. సిద్ధార్థ
తెనాలి: ఈ చిన్నోడు సామాన్యుడు కాదు. కంప్యూటర్ లాంగ్వేజెస్, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో దిట్ట. కంప్యూటర్ సైంటిస్టులకే పాఠాలు చెబుతాడు. ఐఐటీ విద్యార్థులకు (IIT Students) రోల్ మోడల్. కంప్యూటర్ ప్రపంచం మెచ్చిన డేటా సైంటిస్ట్ (Data Scientist). పన్నెండేళ్ల వయసులో ఏడో తరగతి చదువుతూ సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం చేసిన ఘనుడు. ప్రపంచంలో అతి పిన్న వయస్కుడైన డేటా సైంటిస్ట్‌గా గూగుల్‌తోనే చెప్పించుకున్న తెనాలి చిన్నోడు. పేరు పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్ (Siddharth Srivastav Pilli). ఇప్పుడు వయస్సు 17 ఏళ్లు. చదువుతున్నది ఇంటర్మిడియట్ ద్వితీయ సంవత్సరం. హైదరాబాద్ ఐఐటీలో (Hyderabad IIT) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరుగానూ పని చేస్తున్నాడు. వారంలో మూడు రోజులు చదువు.. మూడు రోజులు ఉద్యోగం. ఏడో తరగతి నుంచి ఇదే పని. చిన్నప్పటి నుంచే కంప్యూటర్‌పై పట్టు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రియమానస, రాజ్‌కుమార్ దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థ. తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో సిద్ధార్థకు చిన్నతనం నుంచీ కంప్యూటర్‌పై బలమైన అభిరుచి కలిగింది. కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి నాలుగో తరగతి నుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్ నేర్పించారు. నాలుగైదేళ్లు గడిచేసరికి సిద్ధార్థకు కంప్యూటర్‌పై పట్టు చిక్కింది. అడ్వాన్స్ లెవెల్‌కు చేరుకోగలిగాడు.సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులూ చేయటంతో ఆత్మవిశ్వాసం కలిగింది. అప్పుడే ఉద్యోగం చేస్తానని తండ్రితో చెప్పాడు. తండ్రి పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. మరింత పరిజ్ఞానం కోసం తండ్రి అతడిని ఓ కంప్యూటర్ సంస్థలో చేర్చాలని తీసుకెళ్లగా.. బాలుడన్న కారణంతో చేర్చుకోలేదు. దీంతో తండ్రి ఆన్లైన్ కోర్సుల్లో చేర్పించారు. ఇలా వీడియోలు చూస్తూ స్వయంగా అధ్యయనం ప్రారంభించిన సిద్ధార్థ వాటిపై గట్టి పట్టు సాధించాడు. ఉద్యోగ సాధన ఉద్యోగం చేస్తానని మరోసారి చెప్పినా భారత్‌లో సాధ్యం కాదని తండ్రి చెప్పేశారు. పట్టువదలని సిద్ధార్థ తనే ఓ రెజ్యూమె తయారు చేసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. కొన్ని కంపెనీలు ఫోన్లో సంప్రదించాయి. అతడి కంప్యూటర్ పరిజ్ఞానానికి అబ్బురపడుతూనే.. వయసు, చదువు తక్కువన్న భావనతో పట్టించుకోలేదు. సుదీర్ఘ ఇంటర్వ్యూ చేసిన మోంటెగ్న్ కంపెనీ సీఈవో ‘నీతో వండర్స్ చేయిస్తా’ అంటూ ఉద్యోగం ఇచ్చారు. చదువుకు ఆటంకం కలగకూడదని తండ్రి షరతు విధించడంతో మూడు రోజులు ఉద్యోగానికి ఓకే చేశారు. పాఠశాల యాజమాన్యం సహకారంతో ఏడో తరగతిలోనే ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల జీతంతో చేరాడు.కొద్దికాలంలోనే అదే హోదాతో మరో సంస్థకు మారాడు. నెలకు రూ.45 వేల వేతనంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వినూత్నమైన గేమ్ డిజైనింగ్‌లో కృషి చేశాడు. మూడురోజులు స్కూలుకు, మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేస్తూనే, అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్ క్లాసులూ నిర్వహించాడీ బాల మేధావి. అవార్డులు, అవకాశాలు.. సిద్ధార్థ ప్రతిభను గుర్తించిన బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ బుడతడిని స్వయంగా ఆహ్వానించి భూకంపాలను ముందుగానే గుర్తించే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును అప్పగించింది. పదో తరగతి తర్వాత హైదరాబాద్‌లోనే గటిక్ కాలేజిలో ఇంటర్లో చేరాడు. మరోవైపు అక్కడి ట్రిపుల్ ఐటీలో రీసెర్చ్ ఇంజినీరుగానూ పరిశోధన కొనసాగించాడు. ఇంకోవైపు కోడింగ్ క్లాసులూ చెబుతున్నాడు. అక్కడితో ఆగకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనా ఫ్రీలాన్సర్‌గా చేయసాగాడు. ఇవన్నీ గమనించిన ఐఐటీ–హైదరాబాద్ అతడికి ఆర్టిఫిషియల్ ఇంజినీరుగా ఉద్యోగాన్నిచ్చింది.చదవండి: అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’ప్రస్తుతం సిద్థార్థ ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూనే.. ఏడాదిగా ఐఐటీలో ఏఐ, మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల శాంసంగ్ కంపెనీ జాతీయస్థాయిలో నిర్వహించిన ‘సాల్వ్ ఫర్ టుమారో’ పోటీలో టాప్ టెన్‌లో ఒకడిగా వచ్చాడు. కృత్రిమ మేధలో అతడి నవీన ఆలోచన అందులో ఎంపికైందని సిద్థార్థ తండ్రి రాజ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. 2022–23లో ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డునూ సిద్ధార్థ అందుకున్నాడు. ‘సాక్షి’ మీడియా చైర్పర్సన్ వైఎస్ భారతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. జాతీయస్థాయి న్యూస్ ఛానల్స్ ఇతని ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి.ఇదే లక్ష్యం.. తల్లిదండ్రుల ప్రోత్సాహం, జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్‌ల జీవిత చరిత్రలు, బిల్ గేట్స్ మాటలు, స్టీవ్ జాబ్స్ పనితీరుతో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నట్టు సిద్ధార్థ చెప్పాడు. ప్రపంచ టాప్ ఫైవ్‌లోని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం కంపెనీల్లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగాల్లో ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉండాలని, మంచి గేమ్ డిజైన్ చేయాలనేది తన ఆకాంక్ష అని చెప్పాడు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా చేస్తానని, వీలైతే మైక్రోసాఫ్ట్ లాంటి అప్లికేషన్‌కు రూపకల్పన చేయాలనే ఆశయంతో ప్రతి క్షణం కష్టపడుతున్నట్టు తెలిపాడు. -
16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
తెనాలి: తెనాలికి చెందిన 16 ఏళ్ల పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్ చిరు ప్రాయంలోనే ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఇంజనీర్‌గా అరుదైన ప్రతిభ సాధించాడు. అయితే గతంలోనే ఇతడు ఆసియాలోనే అతి పిన్నవయసు డేటా సైంటిస్ట్‌గా గుర్తింపు పొందాడు. హైదరాబాద్ ఐఐటీలో కొత్తగా ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బాధ్యతలు స్వీకరించాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రియమానస, రాజ్‌కుమార్ దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థ. చిన్నతనం నుంచి కంప్యూటర్‌పై మక్కువ చూపడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నాలుగో తరగతి నుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. నాలుగైదేళ్లు గడిచేసరికి అడ్వాన్స్ లెవెల్‌కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేస్తూ, ఆన్లైన్ కోర్సులతో సిద్ధార్థ వాటిపై పట్టు సాధించాడు. మోంటెగ్న్ కంపెనీ సీఈవో సిద్ధార్థకు ఉద్యోగానికి ఆఫర్ చేశారు. ఆవిధంగా ఏడో తరగతిలో ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల వేతనంతో చేరాడు. తర్వాత ఇనిఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్‌గా నెలకు రూ.45 వేల వేతనం అందుకుంటూ, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్లో వినూత్న గేమ్ డిజైనింగ్‌లో కృషిచేస్తున్నాడు. వారంలో మూడురోజులు పాఠశాలకు, మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేస్తూనే, అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్ క్లాసులు నిర్వహించాడీ బాలమేధావి.మార్చిలో జూనియర్ ఇంటర్ పూర్తిచేసిన సిద్ధార్థను బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి భూకంపాలను ముందుగానే గుర్తించడమనే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుకూ పనిచేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఐఐటీ కొత్తగా ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఆరంభించింది. గత వారం నిర్వహించిన ఇంటర్వ్యూలో మెషీన్ లెరి్నంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరుగా సిద్ధార్థకు అవకాశం కల్పించింది. -
ఆసియాలోనే అతి పిన్నవయసు డేటా సైంటిస్ట్
అతనో అద్భుతం.. అసాధ్యాలను సుసాధ్యం చేయగల బాలనగధీరుడు. అంతర్జాతీయ స్థాయిలో అసమాన ప్రతిభాపాటవాలను చాటి అబ్బురపరిచిన జ్ఞానయోధుడు.. 15 ఏళ్లకే ఆసియాలోనే అతిపిన్న వయసున్న డేటా సైంటిస్టుగా గుర్తింపు పొందిన శక్తిమాన్.. తెలంగాణ ప్రభుత్వమూ అతని మహత్తర ప్రజ్ఞకు ముగ్ధురాలైంది. భూకంపాల రాకను ముందుగానే గుర్తించే ప్రాజెక్టు రూపకల్పన బాధ్యతను అప్పగించింది. ఈ బృహత్తర ఆవిష్కరణను భుజానికెత్తుకున్న బాలమేధావి ఎవరో కాదు.. పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్. స్వస్థలం తెనాలి. తెనాలి: ప్రియ మానస, రాజ్‌కుమార్ దంపతుల ముద్దుల కొడుకు పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్. సిద్ధార్థకు చిన్ననాటి నుంచి కంప్యూటర్ అంటే మక్కువ ఎక్కువ. అతడి ఆసక్తిని గుర్తించిన తండ్రి నాలుగో తరగతినుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్‌ను నేర్పిస్తూ వచ్చారు. నాలుగైదేళ్లు గడిచేసరికి సిద్ధార్థకు కంప్యూటర్‌పై పట్టు చిక్కింది. అడ్వాన్స్ లెవెల్‌కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేశాడు. ఉద్యోగం చేస్తానని తండ్రిని కోరాడు. కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కంప్యూటర్ సంస్థలో అతడిని చేర్చాలని తీసుకువెళ్లగా బాలుడన్న కారణంతో తిరస్కరించారు. చేసేదిలేక రాజ్‌కుమార్ ఆన్లైన్ కోర్సులను కొనిచ్చారు. ఆ వీడియోలు చూస్తూ స్వయం అధ్యయనం ప్రారంభించిన సిద్ధార్థ వాటిపై కమాండ్ సాధించాడు. సడలని సంకల్పం ఉద్యోగం చేయడం భారత్‌లో సాధ్యం కాదని తండ్రి నిరాశపరిచినా సిద్ధార్థ పట్టు సడలలేదు. స్వయంగా రెజ్యూమ్ తయారుచేసుకుని ప్రముఖ కంపెనీలకు పంపాడు. కొన్ని కంపెనీలు ఫోన్లో సంప్రదించాయి. అతడి కంప్యూటర్ పరిజ్ఞానానికి అబ్బురపడినా వయసు తెలిసి మిన్నకున్నాయి. ఈ విషయం మోంటెగ్న్ కంపెనీ సీఈఓ వరకు వెళ్లడంతో ఆయన సిద్ధార్థను స్వయంగా పిలిపించుకుని సుదీర్ఘ ఇంటర్వ్యూ చేశారు. ‘నీతో వండర్స్ చేయిస్తా’నంటూ ఉద్యోగ ఆఫర్ ఇచ్చారు. చదువుకు ఆటంకం కలగరాదన్న తండ్రి షరతుతో వారంలో మూడురోజుల ఉద్యోగానికి సిద్ధార్థ ఓకే చేశాడు. పాఠశాల యాజమాన్యం సహకారంతో ఏడో తరగతిలోనే ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల జీతంతో చేరాడు. ప్రస్తుతం ఇనిఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్‌గా నెలకు రూ.45 వేల వేతనం అందుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వినూత్నమైన గేమ్ డిజైనింగ్‌లో కృషి చేస్తున్నాడు. చదువుకు ఆటంకం కలగకుండానే.. స్వస్థలం తెనాలి అయినా సిద్ధార్థ కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటోంది. సిద్ధార్థ హైదరాబాద్‌లోని శ్రీచైతన్యలో పదోతరగతి చదువుతున్నాడు. వారంలో మూడురోజులు స్కూలుకు వెళ్లే అతను మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో ఉద్యోగానికి వెళ్తాడు. అంతేకాకుండా అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’తరపున అక్కడి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కోడింగ్ క్లాసులనూ నిర్వహిస్తున్నాడు. అందుకే సిద్ధార్థను బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. బృహత్తర బాధ్యత ఈ నేపథ్యంలో సిద్ధార్థకు తెలంగాణ ప్రభుత్వం బృహత్తర బాధ్యతను అప్పగించింది. భూకంపాల రాకను ముందుగానే గుర్తించే కేంద్రప్రభుత్వ రీసెర్చ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని కోరింది. తెలంగాణ ఐటీ మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ స్వయంగా సిద్ధార్థను ఆహ్వానించి ఈ ప్రాజెక్టును అప్పగించారు. సిద్ధార్థ పరిశోధనలు ఫలిస్తే ఆ పరిజ్ఞానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారని అతడి తండ్రి రాజ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో ఈ ప్రాజెక్టు రీసెర్చ్ కొనసాగిస్తున్న సిద్ధార్థ.. మరోవైపు కోడింగ్ క్లాసులు చెబుతూ ఉద్యోగం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పైనా ఫ్రీలాన్సర్‌గా చేస్తున్నాడు. (క్లిక్: పుష్పపై ‘ఫైర్’.. స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి..) లక్ష్యాల సాధనకు ప్రతిక్షణం కష్టపడతా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్‌ల జీవితచరిత్రలు, బిల్‌గేట్స్ మాటలు, స్టీవ్‌జాబ్స్ పనితీరు నాకు ఆదర్శం. వారి ప్రేరణతోనే నా కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నా. ప్రపంచ టాప్ ఫైవ్‌లోని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం కంపెనీల్లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో భాగస్వామిని కావాలని ఉంది. మంచి గేమ్ డిజైన్ చేయాలనేది నా లక్ష్యం. ప్రజోపయోగ ప్రాజెక్టులు చేయాలనేది ధ్యేయం. వీలైతే మైక్రోసాఫ్ట్ లాంటి అప్లికేషన్ రూపొందించాలని ఉంది. నా లక్ష్యాల సాధనకు ప్రతిక్షణం కష్టపడతా. – పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్, డేటా సైంటిస్టు -
స్టార్టప్‌ల్లో వీరిదే హవా..
సాక్షి, న్యూఢిల్లీ : స్టార్టప్‌ల్లో గత ఏడాది అత్యధిక వేతన పెంపును అందుకున్న వారిలో డేటా సైంటిస్టులు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్లు ముందువరుసలో ఉన్నారు. 2017లో వీరు అంతకుముందు ఏడాదితో పోలిస్తే సగటున 25 శాతం మేర వేతన వృద్ధిని పొందారు. హైరింగ్ కంపెనీ బిలాంగ్ గణాంకాల ప్రకారం డేటా సైంటిస్టులకు మెరుగైన డిమాండ్ నెలకొంది. వ్యాపార మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలను సమాచారాన్ని కంప్యూటింగ్ విధానాల ద్వారా సేకరించి, విశ్లేషించి క్రోడీకరించే క్రమంలో డేటా సైంటిస్టుల పాత్ర కీలకం. వీరికి గణితశాస్త్రం, కంప్యూటర్ సైన్స్‌ల్లో పట్టుతో పాటు ప్రస్తుత ట్రెండ్స్‌పై అవగాహన ఉండాలి. దేశంలోని 40 ప్రముఖ స్టార్టప్‌ల్లో మూడు నుంచి ఐదేళ్ల అనుభవం కలిగిన డేటా సైంటిస్టుల వార్షిక వేతనం గత ఏడాది రూ 25-29 లక్షల వరకూ పెరిగింది. కృత్రిమ మేథ రాకతో పలు కంపెనీలు పెద్ద సంఖ్యలో డేటా అనాలిసిస్ టీమ్‌లను బలోపేతం చేస్తున్నాయని బిలాంగ్ సహవ్యవస్ధాపకులు రిషబ్ కౌల్ చెప్పారు. మరోవైపు యూజర్లకు, బ్యాకెండ్ ప్రోగ్రామర్లకు మధ్య వారధిలా వ్యవహరించే ఫ్రంట్ ఎండ్ డవలపర్లకూ గత ఏడాది భారీగా వేతన పెంపు నమోదైంది. వీరు ప్రస్తుతం సంవత్సరానికి రూ 18 లక్షల నుంచి 22 లక్షల వరకూ ఉంది. 2014లో వీరి వార్షిక వేతనం కేవలం రూ 10 లక్షల నుంచి రూ 13 లక్షల మధ్య ఉండేది. ఇక సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ల వంటి సైబర్ సెక్యూరిటీ విభాగ సిబ్బంది వేతనాలు సైతం గత ఏడాది భారీగా పెరిగాయి. -
డేటా సైంటిస్ట్..నవ యువ కెరీర్..
కార్పొరేట్ కెరీర్‌గా ఐదేళ్ల క్రితం ఆవిర్భవించి... ఆకాశమే హద్దుగా అవకాశాలు కల్పిస్తూ.. నేటి యువత.. ‘హాట్ ఫేవరెట్ జాబ్స్’ జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తున్న ఉద్యోగం.. డేటా సైంటిస్ట్. అంకెలు, సంఖ్యల పట్ల ఆసక్తి, విశ్లేషణ నైపుణ్యం.. విభిన్న గణాంకాలను క్రోడీకరించే సామర్థ్యం ఉన్నవారికి ఉన్నత శిఖరాలు అధిరోహిం చేందుకు వీలు కల్పించే కెరీర్. ‘డేటా సైంటిస్ట్’.. ఈ పదం వినడానికి, చదవడానికి కొంత గంభీరంగా ఉన్నప్పటికీ సాధారణ గ్రాడ్యుయేట్లు సైతం ఉజ్వలమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఇంటర్నెట్ యుగంలో ఆన్లైన్ వినియోగం విస్తృతమైన ప్రస్తుత పరిస్థితుల్లో.. సంస్థలకు తప్పనిసరిగా మారి, యువతకు పుష్కల అవకాశాలు కల్పిస్తున్న ‘డేటా సైంటిస్ట్’ కెరీర్‌పై ఫోకస్.. డేటా సైంటిస్ట్ అంటే? కార్పొరేట్ ప్రపంచంలో వందల సంఖ్యలో సంస్థలు, ఆయా కంపెనీల నుంచి లెక్కకు మించి ఉత్పత్తులు. అన్నిటిలక్ష్యం ఒక్కటే. అదే.. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వస్తు, సేవలు అందించడం ద్వారా వారి మనసులు గెలుచుకోవడం! ఇందుకోసం విభిన్న వర్గాల వినియోగదారులు, మారుతున్న వారి అవసరాలు, అభిరుచులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి,క్రోడీకరించి, వర్గీకరించడం.. వీటి ఆధారంగా విశ్లేషణలు, సూచనలు, సలహాల తో కూడిన నివేదికలను రూపొందించి సంస్థకు అందించడం.. ఇవి స్థూలంగా డేటా సైంటిస్ట్ ప్రధాన విధులు. ఈ-కామర్స్‌కు కీలకంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ జోరు కొన సాగుతోంది. వినియోగదారుల్లో అధిక శాతం మంది ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ-కామర్స్ సంస్థలకు కస్టమర్ల గురించి నేరుగా తెలుసుకునే అవకాశం ఉండదు. ఆయా సంస్థల వెబ్సైట్లలో వినియోగదారులు స్వయంగా వెల్లడించే వివరాలు మాత్రమే సేవలందించే క్రమంలో కంపెనీలకు అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలోనే డేటా సైంటిస్ట్ సేవలు ఈ-కామర్స్ సంస్థలకు ఎంతో కీలకంగా మారాయి. డేటా సైంటిస్ట్‌లు వినియోగదారులు నమోదు చేసిన వివరాలను పరిశీలిస్తూ.. వాటి ఆధారంగా సంస్థకు అవసరమైన సమాచారాన్ని విశ్లేషించి అందిస్తారు. కస్టమర్స్‌ను కేటగిరీలుగా వర్గీకరించి ప్రతి కస్టమర్‌కు సంబంధించి సానుకూల, ప్రతికూల అంశాలను తెలియజేస్తారు. అంతేకాకుండా ఆన్లైన్ షాపింగ్‌లో వారు అనుసరిస్తున్న అన్ని అంశాలను పరిశీలిస్తారు. పేమెంట్ విధానాలు, చెల్లింపుల పరంగా గతంలో చేసిన పొరపాట్లు వంటివి. ఉదాహరణకు.. క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తున్న వినియోగదారులు చేస్తున్న తప్పులు, వాటివల్ల సంస్థకు కలిగే పర్యవసానాలను అంచనా వేస్తారు. లక్షల్లో కొలువులు ప్రపంచవ్యాప్తంగా డేటా సైంటిస్ట్ కొలువులు లక్షల్లోనే ఉన్నట్లు అంచనా. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా 2016 నాటికి బిగ్ డేటా మార్కెట్ విలువ 23.8 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. మన దేశంలో వచ్చే పదేళ్లు ప్రస్తుతం కంటే 60 రెట్లు పెరగనుంది. మానవ వనరుల కోణం లోనూ దేశంలో వచ్చే రెండేళ్లలో లక్షల్లో డేటా సైంటిస్ట్‌ల అవసరం ఏర్పడనుంది. మెకిన్సే నివేదిక ప్రకారం- 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.4 మిలియన్ డేటా సైంటిస్ట్‌ల అవసరం ఉంది. భారత్‌లో ఆ సంఖ్య రానున్న రెండేళ్లలో రెండు లక్షలకు పైమాటే. జిగ్వాస్ అకాడమీ రిపోర్ట్ ప్రకారం- భారీ వేతనాలతోపాటు ఎంట్రీ లెవల్లోనే 12 లక్షల వార్షికాదాయం అందుకోవచ్చు. ఇప్పటికే ఈ విభాగంలో మానవ వనరుల డిమాండ్-సప్లయ్ మధ్య ఎంతో వ్యత్యాసం నెలకొంది. మొత్తం అవసరాల్లో 20 శాతం మంది మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. అన్ని రంగాలు.. విభాగాల్లోనూ అవసరం డేటా సైంటిస్ట్‌ల అవసరం కేవలం టెక్నికల్ విభాగానికి లేదా వినియోగదారుల సమాచారం తెలుసుకోవడానికే పరిమితం కాదు. ఆయా సంస్థల్లో అంతర్గత విభాగాల్లో (ఉదా:హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్) కూడా డేటా సైంటిస్ట్‌ల అవసరం ఉంటుంది. కంపెనీల్లో ఉద్యోగుల వివరాలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన సమాచార క్రోడీకరణ, విశ్లేషణలో కూడా డేటా సైంటిస్ట్లదే కీలక పాత్ర. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలోనూ ఇటీవల కాలంలో డేటా సైంటిస్ట్‌లు ప్రాధాన్యతను పొందుతున్నా రు. అంతేకాకుండా జాతీయస్థాయిలో సాగుతున్న ఆధార్ నమోదులోనూ డేటా సైంటిస్ట్‌లు ప్రధాన పాత్ర పోషించారు. నమోదు చేసుకున్న వ్యక్తుల వివరాలను విభిన్న కేటగిరీలుగా(పాన్ కార్డ్ నెంబర్లు, రేషన్ కార్డ్ నెంబర్లు తదితర) ఒక చోట సంక్షిప్తం చేయడంలో విశేషంగా పనిచేశారు. అంటే.. వినియోగదారుల సంఖ్య అధికంగా ఉండే ప్రతి రంగంలో, విభాగంలో డేటా సైంటిస్ట్‌ల అవసరం ఉంటోంది. లక్షల్లో వేతనాలు డేటా సైంటిస్ట్లకు వేతనాలు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి. ఇతర ఐటీ ఉద్యోగాలతో పోల్చితే డేటా సైంటిస్ట్‌లు సగటున 30 నుంచి 40 శాతం మేర అధికంగా జీతాలు అందుకుంటున్నారు. ప్రారంభంలో డేటా సైంటిస్ట్‌గా కనీసం రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వార్షిక వేతనం ఖాయం. అకడమిక్ అర్హతలివే డేటా సైంటిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడానికి అకడమిక్‌గా మూడు ముఖ్యమైన అర్హతలు అవసరం. అవి.. మ్యాథమెటికల్ స్కిల్స్, స్టాటిస్టికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ స్కిల్స్. అంతమాత్రాన ఇవి.. ఆయా విభాగాల్లో పీజీ, ఆపై స్థాయి డిగ్రీలు చేసినవారికే అనే అభిప్రాయం కూడా అపోహే. ఈ అంశాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయి నైపుణ్యాలతోనూ డేటా సైంటిస్ట్‌గా కెరీర్ సొంతం చేసుకోవచ్చు. అయితే అడ్వాన్స్డ్ డిగ్రీలు ఉంటే.. వేతనాలపరంగా కొంత ముందంజలో ఉంటారు. ఈ క్రమంలో పీజీ స్థాయిలో మ్యాథమె టిక్స్, స్టాటిస్టిక్స్ వంటి స్పెషలైజేషన్లు చేయడం ఉపయుక్తం అనేది నిపుణుల అభిప్రాయం. వీటితోపాటు స్టాటిస్టికల్ అనాలిసిస్ సిస్టమ్, ఏ్చఛీౌౌఞ వంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లలో శిక్షణ పొందితే మరింత మెరుగైన కెరీర్ సొంతం చేసుకోవచ్చు. పెరుగుతున్న అవగాహన జాబ్ మార్కెట్ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని అకడమిక్ స్థాయిలో పలు ఇన్స్టిట్యూట్లు డేటా సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి. ఐఐఎంలు మొదలు మరెన్నో ప్రముఖ ఇన్స్టిట్యూట్లు డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ సంబంధిత కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. అవి.. ఐఐఎం - రాంచీ (http://www.iimranchi.ac.in) కోర్సు: ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఐఐఎం- కోల్‌కతా (https://www.iimcal.ac.in) కోర్సు: ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. ఐఎస్బీ- హైదరాబాద్ (http://www.isb.edu) కోర్సు: బిజినెస్ అనలిటిక్స్. ఐఐఎస్సీ- బెంగళూరు, (http://www.iisc.ernet.in) కోర్సు: బిజినెస్ అనలిటిక్స్‌లో పీజీ. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, (http://vit.ac.in) కోర్సు: విస్టా-డేటా సైంటిస్ట్ (విప్రోతో కలిసి సంయుక్తంగా) మనదేశంలోని కొన్ని డేటా సైన్స్ శిక్షణ సంస్థల వివరాలు.. జిగ్వాస్ అకాడమీ- బెంగళూరు వెబ్సైట్: www.jigsawacademy.com ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ - హైదరాబాద్ వెబ్సైట్: www.insofe.edu.in/ ఎడ్వాన్సర్ ఎడ్వెంచర్స్ - ముంబై వెబ్సైట్: www.edvancer.in అనలిటిక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - బెంగళూరు వెబ్సైట్: www.analyticstraining.in స్టాటిస్టిక్స్ అనుభవంతో మరిన్ని అవకాశాలు ప్రస్తుత సమాచార విప్లవం నేపథ్యంలో ప్రతి సంస్థలోనూ డేటా సైంటిస్ట్‌ల ఆవశ్యకత నెలకొంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా డిజిటలైజేషన్ దిశగా కదులుతున్న నేపథ్యంలో రానున్న రెండు, మూడేళ్లలో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రాను న్నాయి. స్టాటిస్టిక్స్‌లో పరిజ్ఞానం, విశ్లేషణ నైపుణ్యాలు ఉంటే డేటా సైంటిస్ట్‌గా కెరీర్లో అద్భుతంగా రాణించొచ్చు. అన్నిటి కంటే ముఖ్యంగా కంప్యూటరైజేషన్ ద్వారా గిగా బైట్లలో ఉండే సమాచారం నుంచి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా కచ్చితమైన సమాచారాన్ని అన్వేషించి, క్రోడీకరించే క్రమంలో ఎంతో ఓర్పు అవసరం. ఈ లక్షణాలు ఉంటే డేటా సైంటిస్ట్ కెరీర్ బాగుంటుంది. - ప్రొఫెసర్ ఎ. అప్పారావు, డెరైక్టర్, సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సేవారంగంలో పుష్కల అవకాశాలు డేటా సైంటిస్ట్లకు బ్యాంకింగ్, ఈ-కామర్స్, టెలికాం, బీపీఓ తదితర కస్టమర్ సర్వీస్ సెక్టార్లలో పుష్కల అవకాశాలు లభిస్తున్నాయి. కారణం.. వీటన్నిటి కార్యకలాపాలు వినియోగ దారుల అభిరుచులకు చెందినవి కావడం. ఆ క్రమంలో వారికి సంబంధించిన విస్తృత సమాచారాన్ని వర్గీకరించి, క్లుప్తంగా క్రోడీకరించడం సంస్థ మనుగడకు ఎంతో ముఖ్యమైనది. వాటిపై శిక్షణ పరంగా నైపుణ్యాలు అందించే కోర్సులు, ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు డేటా సైన్స్‌లో ఉంటాయి. ప్రస్తుతం చాలా ఇన్స్టిట్యూట్లు బిజినెస్ అనలిటిక్స్‌లో భాగంగా డేటా సైన్స్‌లో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. కానీ స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ విషయంలో డేటా సైన్స్‌ను కోర్ సబ్జెక్ట్‌గా శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది. -డాక్టర్ క్రాంతి మిత్ర అడుసుమిల్లి, సీనియర్ ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్