అందరూ చూస్తుండగా కిడ్నాప్
నోయిడా: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో పట్టపగలే జరిగిన కిడ్నాప్ సంచలనం రేపింది. గ్రేటర్ నోయిడాలో ఈ నెల 14న ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని కొంత మంది దుండగులు పట్టపగలు కిడ్నాప్ చేశారు. అందరూ చూస్తుండగా అతడిని లాక్కెళ్లి కారులో పరారయ్యారు.
అక్కడున్న వారిలో ఎవరూ కూడా కిడ్నాపర్లను ప్రతిఘటించలేదు. కళ్లెదుటే ఒక వ్యక్తిని దుండగులు లాక్కెళుతున్నా చూస్తుండి పోయారేగానీ, ఒక్కరూ అడ్డుచెప్పలేదు. కిడ్నాప్ అయిన వ్యక్తి తర్వాత రోజు శవపై కనిపించాడు. అతడిని కిడ్నాప్ చేస్తుండగా తీసిన వీడియోను ఇంటర్నెట్ లో పెట్టడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగివుంటుందని అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు వెల్లడి కాలేదు.