పింఛన్‌కు అర్హత 65 ఏళ్లా?
ఎంతో మంది ప్రాణ త్యాగం, ఉద్యమ త్యాగాలతో తెలంగా ణ సాధించుకున్న తర్వాత రైతులు, వృద్ధులు, కులవృత్తిదారు లు, నిరుద్యోగ విద్యావంతులు, విద్యార్థులు ఎన్నో భవిష్యత్ కలలతో టీఆర్ఎస్ను గెలిపించారు. కానీ రుణ మాఫీ, పెన్షన్, ఉద్యోగాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పాత ప్రభుత్వాల మాదిరిగానే వ్యవహరిస్తోంది. విక లాంగ, వృద్ధాప్య, వితంతు పెన్షన్లను పెంచామ ని చెబుతూనే వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సు 65 ఏళ్లుగా నిర్ణయించడం విచారకరం. 65 ఏళ్ల వరకు బతికుండి పెన్షన్లు తీసుకోవడం అంటే మూడు కుర్చీల ఆట పెట్టినట్లు కనిపిస్తుంది. ఎన్నికలలో ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేర్చాలి కాని, గత ప్రభుత్వా లు ఇచ్చిన సంక్షేమ పథకాలకన్నా మేం ఎక్కువ ఇస్తున్నాం అని మాయ మాటలు, గారడీ లెక్కలు ప్రజలకు అవసరం ఉండదు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనే కొనసాగిస్తే కాలగర్భంలో కలిసిపోక తప్పదన్న సత్యాన్ని గ్రహించి సమగ్ర సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాలను ఆలస్యం చేయకుండా అమలు చేయడానికి తగిన చర్యలు చేపట్టాలి.
- డీబీ పతి, ఘట్కేసర్ రంగారెడ్డి జిల్లా