Deccan Chargers
-
గిల్క్రిస్ట్కే సలహాలు ఇచ్చేవాడు! రోహిత్.. కెప్టెన్ కావాలనుకున్నాడు.. కానీ!
IPL - Rohit Sharma: ‘‘2009లో.. తొలిసారి తన బ్యాటింగ్ పవరేంటో చూశాను. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిచే సత్తా కలవాడు. తనతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నపుడు నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తన నిలకడైన ఆటకు గల కారణం గురించి వివరిస్తూ.. మనం బరిలోకి దిగిన ప్రతిసారీ ప్రత్యర్థి జట్టు కెప్టెన్లా ఆలోచించాలని చెప్పేవాడు. 2010 తర్వాత తను దక్కన్ చార్జర్స్ కెప్టెన్ కావాలని భావించాడు. నిజానికి 2010 తర్వాత వేలం జరగాల్సి ఉన్న సమయంలో ఫ్రాంఛైజీ అతడిని కెప్టెన్ చేస్తామని మాట కూడా ఇచ్చింది. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆ ఏడాది ఫ్రాంఛైజీ అందరు ఆటగాళ్లను వదిలేసింది. అప్పుడే మాకు ఫ్రాంఛైజీకి సంబంధించిన అన్ని విషయాలు తెలిశాయి. తర్వాత రోహిత్, నేను, సైమండ్స్.. మేమంతా ముంబై ఇండియన్స్‌కు వచ్చేశాం’’ అని హైదరాబాద్ మాజీ బ్యాటర్ తిరుమలశెట్టి సుమన్ అన్నాడు. చార్జర్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర రోహిత్ శర్మ దక్కన్ చార్జర్స్ కెప్టెన్ కావాలని బలంగా కోరుకున్నాడని.. కానీ అలా జరుగలేదని పేర్కొన్నాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్(2008) నుంచి 2010 వరకు రోహిత్ వర్మ దక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఆడం గిల్‌క్రిస్ట్ సారథ్యంలో 2009లో ట్రోఫీ గెలిచిన చార్జర్స్ జట్టులో రోహిత్ సభ్యుడు కూడా! 2009లో చివరగా చార్జర్స్‌కు ఆడిన రోహిత్.. ఆ సీజన్లో 362 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన రోహిత్‌కు కెప్టెన్ కావాలన్న కోరిక ఉండేదట. అయితే, ఆ కల తీరకుండానే హిట్‌మ్యాన్ జట్టును వీడటం.. ఆ ఫ్రాంఛైజీ కనుమరుగైపోవడం జరిగింది. ముంబై సారథిగా సూపర్‌హిట్ ఈ క్రమంలో 2011లో ముంబై ఇండియన్స్ రోహిత్‌ను కొనుగోలు చేసింది. అతడిలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి 2013లో జట్టు పగ్గాలు అప్పజెప్పింది. ఇక తర్వాత జరిగిన పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన సీజన్లోనే ముంబైని చాంపియన్‌గా నిలిపిన రోహిత్.. ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. ఆదివారం(ఏప్రిల్ 30) పుట్టినరోజు జరుపుకొంటున్న రోహిత్..ఈ ఏడాదితో ముంబై కెప్టెన్‌గా పది వసంతాలు పూర్తి చేసుకున్నాడు కూడా! గిల్లీకి సలహాలు ఇచ్చేవాడు ఈ నేపథ్యంలో దక్కన్ చార్జర్స్ మాజీ ప్లేయర్, గతంలో రోహిత్‌తో కలిసి ఆడిన తిరుమలశెట్టి సుమన్ ఇండియా టుడేతో ముచ్చటిస్తూ.. ఈ మేరకు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రోహిత్ తనను తాను సారథిగా భావించే వాడని, గిల్లీ(గిల్‌క్రిస్ట్)కి కూడా సలహాలు ఇచ్చేవాడని పేర్కొన్నాడు. మొదటి నుంచే తను కెప్టెన్ మెటీరియల్ అని.. సారథిగా తనను తాను ఇప్పటికే నిరూపించుకున్నాడని రోహిత్‌ను ప్రశంసించాడు. వందకు వంద మార్కులు వేస్తా ‘‘ఈ ఏడాది రోహిత్‌కు మరింత ప్రత్యేకం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ కూడా ఆడాల్సి ఉంది. సారథిగా తన కెరీర్లో ఇవి అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీలు. కెప్టెన్‌గా రోహిత్ స్టామినా ఏంటో అందరికీ తెలుసు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. నేనేతే కెప్టెన్‌గా రోహిత్‌కు వందకు వంద మార్కులు వేస్తాను’’ అని తిరుమలశెట్టి సుమన్.. హిట్‌మ్యాన్‌ను ఆకాశానికెత్తాడు. కాగా రోహిత్ ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: ముంబై ఇండియన్స్‌లోకి ఇంగ్లండ్ స్టార్ బౌలర్.. ఎవరంటే? IPL 2023: కోహ్లిలానే శుభ్‌మన్ గిల్.. గణాంకాలు అదే చెబుతున్నాయి..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ సొమ్ము పాపిష్టిది.. అదే మా రిలేషన్‌ను చెడగొట్టింది..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో క్రికెటర్లకు పేరు, హోదాతో పాటు ఆర్ధిక స్థిరత్వాన్ని అందించిన క్యాష్ రిచ్ లీగ్‌పై ఈ వివాదాస్పద ఆటగాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో లభించిన సొమ్ము పాపిష్టిదని, దాని వల్లే తన ఆప్తమిత్రుడు, ఆసీస్ మాజీ సారధి మైఖేల్ క్లార్క్ తనకు దూరమయ్యాడని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ (2008)లో డెక్కన్ ఛార్జర్స్ తనను రూ.5.4 కోట్లకు కొనుగోలు చేసిందని, అదే క్లార్క్‌తో తన స్నేహం శత్రుత్వంగా మారడానికి కారణమయ్యిందని వ్యాఖ్యానించాడు. ఇదే సందర్భంగా సైమండ్స్ మరో బాంబు పేల్చాడు. ఐపీఎల్లో తనకు భారీ ధర పలకడం చూసి క్లార్క్ ఈర్ష్య (జెలసీ) పడ్డాడని, అందుకే నేనంటే అతనికి నచ్చేది కాదని, ఈ విషయాన్ని మాథ్యూ హేడెన్ తనతో చెప్పాడని పేర్కొన్నాడు. ఆప్తమిత్రులుగా ఉన్న తమ మధ్య ఐపీఎల్ డబ్బే చిచ్చు పెట్టిందని, మొత్తంగా మా రిలేషన్ దెబ్బ తినడానికి ఐపీఎలే కారణమైందని అన్నాడు. ఇప్పటికీ క్లార్క్ అంటే నాకు గౌరవం ఉందని, అందుకే అన్ని విషయాలు బయటపెట్టలేకపోతున్నానని బ్రెట్ లీ పోడ్కాస్ట్తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఆసీస్ 2007 వన్డే ప్రపంచ కప్ గెలవడంలో ఆండ్రూ సైమండ్స్, నాటి ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కీలకపాత్ర పోషించారు. వీరిద్దరు మంచి స్నేహితులుగా ఉండి ఆసీస్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. అయితే, 2008లో ఓ వన్డే మ్యాచ్‌కి సైమండ్స్ తాగేసి వచ్చాడని క్లార్క్ ఆరోపించడంతో వీరిద్దరి మధ్య రగడ మొదలైంది. ఇందుకు కౌంటర్‌గా సైమండ్స్ సైతం పోటాపోటీ ప్రెస్మీట్లు పెట్టి క్లార్క్ కెప్టెన్సీపై దుమ్మెత్తిపోశాడు. ఈ ఇద్దరి మధ్య విభేదాలు అప్పట్లో సంచలనం క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే, నిత్యం వివాదాలతో కెరీర్‌ను కొనసాగించిన సైమండ్స్.. ఆస్ట్రేలియా తరఫున 26 టెస్ట్‌లు, 198 వన్డేలు ఆడాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: IPL 2022: నిర్లక్ష్యపు షాట్లు.. అదే మా కొంప ముంచింది: రోహిత్ శర్మ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రూ. 4800 కోట్లు: బీసీసీఐకి బాంబే హైకోర్టులో భారీ ఊరట
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి బాంబే హైకోర్టులో బుధవారం భారీ ఊరట దక్కింది. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీగా వ్యవహరించిన దెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి 4800 కోట్ల రూపాయలు చెల్లించాలన్న ఆదేశాలను తోసివేస్తూ ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. కాగా 2008లో ప్రారంభమైన క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగంగా బీసీసీఐ, వివిధ ఫ్రాంఛైజీలతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీసీహెచ్ఎల్ (దెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్) దెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ పేరిట జట్టును బరిలోకి దింపింది. ఈ సందర్భంగా... బీసీసీఐ, డీసీహెచ్ఎల్ మధ్య పదేళ్ల పాటు ఒప్పందం కుదిరింది. అయితే, బోర్డు నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలతో బీసీసీఐ 2012 సెప్టెంబరులో దెక్కన్ చార్జర్స్‌ను లీగ్ నుంచి తొలగించింది. అంతేగాక ఈ జట్టులోని ఆటగాళ్ల కాంట్రాక్టులు రద్దు చేసి వారిని వేలంలో నిలిపింది. ఈ క్రమంలో తమకు అన్యాయం జరిగిందంటూ డీసీహెచ్ఎల్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ సీకే థక్కర్ సమక్షంలో ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ థక్కర్.. గతేడాది డీసీహెచ్ఎల్కు సానుకూలంగా తీర్పునిస్తూ... రూ. 4800 కోట్లు చెల్లించాల్సిందిగా బీసీసీఐని ఆదేశించారు. ఈ అంశంపై తాజాగా విచారణ చేపట్టిన జీఎస్ పటేల్ ధర్మాసనం.. బీసీసీఐకి ఊరట కల్పిస్తూ ఆర్బిట్రేటర్ ఆదేశాలను తోసివేస్తూ తీర్పునిచ్చింది. ఇక 2009లో ఆడం గిల్‌క్రిస్ట్ సారథ్యంలోని దక్కన్ చార్జర్స్ హైదరాబాద్ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెల్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టు హైదరాబాద్ నుంచి ఐపీఎల్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. చదవండి: WTC Final: భారత జట్టు ఇదే.. వారికి నిరాశే! -
చార్జర్స్‌కు రూ. 4,800 కోట్లు చెల్లించండి...
ముంబై: ఐపీఎల్ నుంచి దక్కన్ చార్జర్స్ (డీసీ) జట్టును తొలగించడంపై ముంబై హైకోర్టు నియమించిన ఆర్బిట్రేటర్ శుక్రవారం ఇచ్చిన తీర్పు బోర్డుకు ప్రతికూలంగా వెలువడింది. నష్టపరిహారంతో పాటు ఇతర ఖర్చుల కింద డీసీ యాజమాన్యానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ. 4,800 కోట్లు చెల్లించాలని హైకోర్టు మధ్యవర్తి రిటైర్డ్ జస్టిస్ సీకే ఠక్కర్ ఆదేశించారు. 2012 నుంచి సాగిన ఈ వివాదంలో చివరకు హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ పైచేయి సాధించింది. ఈ ఉత్తర్వులను బీసీసీఐ హైకోర్టులో సవాల్ చేసే అవకాశముంది. నేపథ్యమిది... ఐపీఎల్లో 2008 నుంచి 2012 వరకు ఐదేళ్ల పాటు దక్కన్ చార్జర్స్ జట్టు కొనసాగింది. 2009లో టీమ్ చాంపియన్‌గా కూడా నిలిచింది. దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) కంపెనీ ఈ టీమ్‌ను ప్రమోట్ చేసింది. అయితే 2012లో రూ.100 కోట్ల బ్యాంకు గ్యారంటీని చూపించడంలో విఫలమైందంటూ బీసీసీఐ షోకాజ్ నోటీసు ఇవ్వడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాతి పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. వివరణ కోసం చార్జర్స్‌కు 30 రోజుల గడువు ఇచ్చినా అది పూర్తి కాకముందే టీమ్‌ను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఆ తర్వాత ఇదే జట్టు స్థానంలో 2013 సీజన్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. కోర్టుకెక్కిన చార్జర్స్... తమ జట్టును రద్దు చేయడం అక్రమమని డీసీహెచ్ఎల్ ముంబై హైకోర్టును ఆశ్రయించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన జట్లను జరిమానావంటి స్వల్ప శిక్షలతో సరిపెట్టిన బోర్డు చిన్న తప్పుకే తమ జట్టును తొలగించడం అన్యాయమని వాదించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఒప్పందం ప్రకారం బాంబే హైకోర్టు ఆదేశాలతో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీకే ఠక్కర్ మధ్యవర్తిగా వాదనలు మొదలయ్యాయి. నష్టపరిహారం, వడ్డీ, ఇతర ఖర్చుల కింద తమకు రూ. 8 వేల కోట్లు చెల్లించాలని దక్కన్ చార్జర్స్ కోరింది. అయితే ఫ్రాంచైజీ ఫీజు కింద మిగిలిన ఐదేళ్లకు కలిపి రూ. 214 కోట్లు డీసీ తమకు చెల్లించాలని బోర్డు కౌంటర్ వేసింది. చివరకు శుక్రవారం ఆర్బిట్రేటర్ తుది తీర్పు వినిపించారు. జట్టును రద్దు చేయడం సరైంది కాదంటూ నష్టపరిహారంగా రూ. 4,814.67 కోట్లతో పాటు ఆర్బిట్రేషన్ మొదలైన 2012నుంచి ఏడాదికి 10 శాతం వడ్డీ, ఖర్చులకు మరో రూ. 50 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. భారీ మొత్తం కాబట్టి బీసీసీఐ హైకోర్టుకు వెళ్లనుంది. తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ సీఈఓ హేమంగ్ అమీన్ స్పష్టం చేశారు. -
సచిన్ వికెట్ పడగొట్టు.. గిఫ్ట్ పట్టు
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆటను ఆస్వాదించిన వారు కొందరైతే.. అతడి ఆటతో స్పూర్థి పొంది క్రికెట్‌నే వృత్తిగా ఎంచుకున్న వారు మరికొంత మంది ఉన్నారు. అలా స్పూర్తి పొంది క్రికెట్లో అడుగుపెట్టిన ఏ బౌలర్‌కైనా సచిన్ వికెట్‌ను పడగొడితే ఆ ఆనందం టన్నుల్లో ఉంటుంది. ప్రత్యర్థి వ్యూహం, ప్రతీ బౌలర్ టార్గెట్ సచిన్‌ను ఔట్ చేయడమే ప్రధానంగా ఉండేది. ఇక సచిన్ వికెట్ పడగొడితే సహచర క్రికెటర్లు, అభిమానుల నుంచి అభినందనలే కాదు బహుమతులు కూడా రావడం విశేషం. ఇలా సచిన్ వికెట్ పడగొట్టి బహుమతి తీసుకున్నానని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా చెప్పుకొచ్చాడు. (క్రికెట్లో నెపోటిజమ్ రచ్చ.. చోప్రా క్లారిటీ) దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్-2009 సందర్భంగా డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఓజా ప్రాతినిథ్యం వహించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఆ సీజన్లో డర్బన్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ వికెట్ పడగొట్టిన విషయాన్ని ఓజా గుర్తుచేసుకున్నాడు. ‘ముంబైతో మ్యాచ్‌కు ముందు రోజు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా డెక్కన్ ఛార్జర్స్ ఓనర్ వచ్చి సచిన్ వికెట్ పడగొడితే స్పెషల్ గిఫ్గ్ ఇస్తానన్నాడు. అప్పుడు సచిన్ వికెట్ పడగొడితే నాకు వాచ్ గిఫ్ట్‌గా కావాలని కోరాను. అయితే ఆ మ్యాచ్‌లో సచిన్ వికెట్ పడగొట్టడంతో నాకు వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. సచిన్ వికెట్ తీసిన ఆనందం మాటల్లో చెప్పలేను. ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతి అది’ అంటూ ఓజా పేర్కొన్నాడు. ఇక టీమిండియా తరుపున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20ల్లో పాల్గొన్న ఓజా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. (వారే విఫలమైతే నా పరిస్థితి ఏమిటి?) -
ఫుల్ చార్జింగ్...
తొలి ఐపీఎల్లో చివరి స్థానాల్లో నిలిచిన రెండు జట్లు మరుసటి ఏడాదే ఫైనల్లో తలపడటం 2009 ఐపీఎల్‌కు సంబంధించి చెప్పుకోదగ్గ విశేషం. గిల్‌క్రిస్ట్ నాయకత్వంలోని హైదరాబాద్ టీమ్ డెక్కన్ చార్జర్స్ విజేతగా నిలిచింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాకు తరలించడంతో ఇండియన్ లీగ్ కాస్తా ‘సఫారీ లీగ్’గా మారిపోయింది. ఈ టోర్నీ లో తొలిసారి ఒక్కో ఇన్నింగ్స్‌లో పది ఓవర్ల తర్వాత ఏడున్నర నిమిషాల టైమ్ ఔట్ విరామ నిబంధనను తెచ్చారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ టోర్నీ విశేషాలను చూస్తే... కుంబ్లే శ్రమ వృథా... జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఫైనల్లో చార్జర్స్ 6 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. తొలుత చార్జర్స్ 6 వికెట్లకు 143 పరుగులు చేసింది. కుంబ్లే 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు 9 వికెట్లకు 137 పరుగులే చేసింది. వివాదం... అతి చెత్త ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈసారి ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే దానికంటే ‘ఫేక్ ఐపీఎల్ ప్లేయర్’ పేరుతో బ్లాగ్‌లో వచ్చిన కథనాలు వివాదం రేపాయి. టీమ్ లోగుట్టు విషయాలు ఇందులో బయటకు వచ్చాయి. దక్షిణాఫ్రికా నుంచి టోర్నీ మధ్యలోనే పంపించిన ఆకాశ్ చోప్రా, సంజయ్ బంగర్లు దీని వెనక ఉన్నారని వినిపించింది. లీగ్‌లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. బెంగళూరు తరఫున మనీశ్ పాండే 114 నాటౌట్ పరుగులు చేయగా, ఢిల్లీ తరఫున డివిలియర్స్ 105 నాటౌట్ పరుగులు చేశాడు. వీరు గుర్తున్నారా! దక్కన్ చార్జర్స్ విన్నింగ్ టీమ్‌లో గిల్‌క్రిస్ట్, సైమండ్స్, గిబ్స్, వాస్, డ్వేన్ స్మిత్, ర్యాన్ హారిస్, స్టయిరిస్, ఫిడేల్ ఎడ్వర్డ్స్ విదేశీ ఆటగాళ్లు కాగా, లక్ష్మణ్, రోహిత్, ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ భారత్ తరఫున తమ సత్తా చాటినవారు. వై. వేణుగోపాలరావు కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా... దేశవాళీ ఆటగాళ్లు తిరుమలశెట్టి సుమన్, డీబీ రవితేజ, అజహర్ బిలాఖియా, షోయబ్ అహ్మద్, జస్కరణ్ సింగ్, హర్మీత్ సింగ్‌లకు టీమిండియా తరఫున ఆడే అవకాశం ఎప్పుడూ రాలేదు. ►మ్యాన్ ఆఫ్ ద సిరీస్: గిల్‌క్రిస్ట్ (చార్జర్స్–495 పరుగులు, 10 క్యాచ్‌లు+8 స్టంపింగ్‌లు) ►అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్): మాథ్యూహేడెన్ (చెన్నై–572) ►అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్): ఆర్పీ సింగ్ (దక్కన్ చార్జర్స్–23) -
డెక్కన్ చార్జర్స్ ఆశలు
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి బయటకు వెళ్లిపోయిన జట్టు డె క్కన్ చార్జర్స్ మళ్లీ పునరాగమనంపై ఆశలు పెంచుకుంది. ఈ జట్టుకు బీసీసీఐకి మధ్య ఉన్న కేసును ఆర్బిట్రేటర్ ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. ఈ నెలాఖరులో ఆర్బిట్రేటర్ తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల కొచ్చి టస్కర్స్ విషయంలో ఆర్బిట్రేటర్ ఐపీఎల్ జట్టుకు అనుకూలంగా తీర్పు ఇచ్చి రూ.550 కోట్లు పరిహారం ఇవ్వాలని బీసీసీఐని ఆదేశించారు. కాబట్టి తమ జట్టు విషయంలో కూడా తీర్పు అనుకూలంగానే ఉంటుందని డీసీ జట్టు వర్గాలు భావిస్తున్నాయి. ఏమాత్రం అవకాశం దొరికినా పునరాగమనం చేయాలని భావిస్తున్నారు. 2009 లో డెక్కన్ చార్జర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవగా.. మూడు సంవత్సరాల అనంతరం 2012 లో ఆర్థికపరమైన ఇబ్బందులతో ఐపీఎల్ నుంచి బహిష్కరణకు గురైంది. కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌కు వేరే జట్టు ఉన్నందున... మరో నగరం నుంచి అయినా సరే డెక్కన్ చార్జర్స్‌ను నడపాలనేది ఆలోచన. మరి వీళ్ల అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. -
సెంటిమెంట్ కలిసొస్తుందా
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో ప్రస్తుతం ఉన్న జట్లలో అందరికంటే జూనియర్ సన్‌రైజర్స్ హైదరాబాద్. డెక్కన్ చార్జర్స్ స్థానంలో గత ఏడాది లీగ్‌లో అడుగుపెట్టింది. అయితే రెండో సీజన్ నగరానికి చెందిన జట్టుకు కలిసొస్తుందనేది ఓ సెంటిమెంట్. దీనికి రెండు కారణాలు. చార్జర్స్ తాము ఆడిన రెండో సీజన్లో గెలిచింది. పైగా... ఆ సీజన్లో మ్యాచ్ లు భారత్ బయట జరిగాయి. ఈసారి కూడా కొన్ని మ్యాచ్‌లు భారత్ బయట (యూఏఈలో) జరుగుతుండటం, తమకు ఇది రెండో సీజన్ కావడంతో సెంటిమెంట్ పరంగా సన్‌రైజర్స్ ఆశావహంగా ఉంది. స్వదేశీ కెప్టెన్ తొలి సీజన్లో కొన్ని మ్యాచ్‌లు మినహాయిస్తే హైదరాబాద్ జట్టుకు విదేశీ ఆటగాళ్లే కెప్టెన్లుగా వ్యవహరించారు. కానీ సన్‌రైజర్స్ మాత్రం స్వదేశీ ఆటగాడు శిఖర్ ధావన్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. కొత్త లుక్‌తో 2013 సీజన్లో అరంగేట్రం చేసిన ‘సన్ గ్రూప్’ ప్లే ఆఫ్ దశకు చేరడంతో పాటు చాంపియన్స్ లీగ్ ఆడింది. ఇక ఈ సారి జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తున్నాడు. తనతో పాటు స్టెయిన్‌ను మాత్రమే రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్... ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి మంచి ఆటగాళ్లను కొనుక్కుంది. ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేసింది. స్పిన్నర్ అమిత్ మిశ్రాను రూ. 4.75 కోట్లకు, ఆరోన్ ఫించ్‌ను రూ. 4 కోట్లకు దక్కించుకుంది. స్యామీ లాంటి బీభత్సమైన ఆల్‌రౌండర్‌ను తీసుకుంది. మొత్తానికి భారత క్రికెటర్లు, విదేశీ ప్లేయర్లు, దేశవాళీ ఆటగాళ్లతో సమతూకంతో, పటిష్టంగా కనిపిస్తోంది. బలాలు... డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, ఆరోన్ ఫించ్లతో టాప్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. డారెన్ స్యామీ, ఇర్ఫాన్ పఠాన్, మొయిస్ హెన్రిక్స్ అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సత్తా చాటగలరు. బ్రెండన్ టేలర్, నమన్ ఓజా రూపంలో ధాటిగా బ్యాటింగ్ చేయగల వికెట్ కీపర్లు జట్టులో ఉన్నారు. మెరుపు బంతులతో చెలరే గే స్పీడ్ గన్ డేల్ స్టెయిన్, స్పిన్ మ్యాజిక్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించే అమిత్ మిశ్రా బౌలింగ్‌లో ప్రధాన ఆయుధాలు. బలహీనతలు... లోయర్ ఆర్డర్లో జట్టుకు అండగా నిలిచే బలమైన దేశవాళీ బ్యాట్స్‌మెన్ లేకపోవడం సన్‌రైజర్స్ బలహీనత.. ఇది మినహా జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్లు: శిఖర్ ధావన్ (కెప్టెన్), అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్, నమన్ ఓజా, వేణుగోపాల్‌రావు. విదేశీ క్రికెటర్లు: డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా), వార్నర్, ఫించ్, హెన్రిక్స్ (ఆస్ట్రేలియా), స్యామీ, హోల్డర్ (వెస్టిండీస్), టేలర్ (జింబాబ్వే). భారత దేశవాళీ క్రికెటర్లు: పర్వేజ్ రసూల్, కరణ్ శర్మ, లోకేశ్ రాహుల్, ప్రశాంత్ పరమేశ్వరన్, అమిత్ పౌనికర్, ఆశిష్‌రెడ్డి, అనిరుద్ధ శ్రీకాంత్, రికీ భుయ్, సీవీ మిలింద్, మన్‌ప్రీత్ జునేజా.