Deepak huda
-
ఐర్లాండ్‌కు చుక్కలు చూపించిన భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
డబ్లిన్: ఐర్లాండ్ గడ్డపై భారత్ శుభారంభం చేసింది. వర్షంతో 12 ఓవర్లకు కుదించిన తొలి టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని భారత్ 9.2 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి ఛేదించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. మరో ఓపెనర్ దీపక్ హుడా (29 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్సర్లు) భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. హుడా, పాండ్యా మూడో వికెట్‌కు చకచకా 64 పరుగులు జోడించారు. హార్దిక్ అవుటయ్యాక దినేశ్ కార్తీక్ (5 నాటౌట్)తో కలిసి హుడా మిగతా లాంఛనాన్ని పూర్తిచేశాడు. అంతకుముందు టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా... తొలుత ఐర్లాండ్ నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. భారత సీమర్లు హార్దిక్, భువనేశ్వర్, అవేశ్ టాపార్డర్‌పై తలా ఒక దెబ్బ వేశారు. దీంతో ఓపెనర్లు స్టిర్లింగ్ (4), బల్బిర్నీ (0) సహా గ్యారెత్ (8) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అలా ఐర్లాండ్ 22 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో హ్యారీ టెక్టర్ (33 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరిగా పోరాటం చేశాడు. టక్కర్ (18; 2 సిక్సర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. అనంతరం డాక్ రెల్ (4)తో కలిసి జట్టు స్కోరును వంద దాటించాడు. భారత బౌలర్లలో భువీ, పాండ్యా, అవేశ్, చహల్ తలా ఒక వికెట్ తీశారు. రేపు రెండో టి20 మ్యాచ్ ఇక్కడే జరుగుతుంది. -
రవి బిష్ణోయ్‌కు బంపరాఫర్.. తొలి వన్డేకు రాహుల్ దూరం
ముంబై: స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టి20ల కోసం భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ బుధవారం రాత్రి ప్రకటించింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌గా మారి జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు. కోహ్లి తప్పుకున్న తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్‌కు ఇదే తొలి సిరీస్ కానుంది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలి వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. రెండో వన్డే నుంచి అతను జట్టుతో కలుస్తాడు. బుమ్రా, షమీలకు విశ్రాంతినిచ్చినట్లు ప్రకటించిన సెలక్షన్ కమిటీ... రవీంద్ర జడేజా గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతని పేరును పరిశీలించలేదని స్పష్టం చేసింది. 18 మంది సభ్యుల చొప్పున రెండు జట్లను ప్రకటించారు. సిరీస్ భారత్‌లోనే ఉండటంతో స్టాండ్‌బైలను ఎంపిక చేయలేదు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఎలాంటి విరామం కోరుకోకుండా రెండు సిరీస్‌లకు అందుబాటులో ఉండటం విశేషం. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడిన వెంకటేశ్ అయ్యర్‌పై వేటు వేసి టి20లకే పరిమితం చేశారు. వాషింగ్టన్ సుందర్ జట్టులోకి పునరాగమనం చేశాడు. సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్‌కు రెండు టీమ్‌లలోనూ చోటు దక్కకపోగా... భువనేశ్వర్‌ను వన్డేల నుంచి తప్పించి టి20ల్లోకి మాత్రమే ఎంపిక చేశారు. ఆశ్చర్యకరంగా గత కొంత కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ లేకపోయినా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. రెండు జట్లలోనూ చూస్తే పూర్తిగా కొత్త ఆటగాళ్లు ముగ్గురు ఎంపికయ్యారు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అవేశ్ ఖాన్, ఆల్‌రౌండర్ దీపక్ హుడాలకు భారత జట్టు తరఫున ఇదే తొలి అవకాశం. భారత్, విండీస్ మధ్య ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్‌లో మూడు వన్డేలు... ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో కోల్‌కతాలో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శిఖర్ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా. టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, శార్దుల్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, అక్షర్ పటేల్, సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్. -
పంజాబ్ ఆటగాడిపై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానం.. బీసీసీఐ సీరియస్
-
సంజూ ఔట్... పంజాబ్ విన్
అయ్యయ్యో ప్రేక్షకులు! మాయదారి కరోనా వల్ల మంచి మ్యాచ్‌లను మైదానంలో చూడలేకపోతున్నారు! లేదంటే సోమవారం నాటి మ్యాచ్‌లో దంచిన సిక్సర్లు ప్రేక్షకుల గ్యాలరీలో ఎంతమంది చేతుల్లో పడేవో! ఏదైతేనేం టీవీల్లో బోలెడంత వినోదాన్ని పంచిన మ్యాచ్‌లో కొండంత స్కోరు, సిక్సర్ల హోరు ఆఖరిదాకా ఇదే జోరు ఉత్కంఠ రేకెత్తించింది. చివరి బంతికి తేలిన ఫలితంలో రాజస్తాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకుంది. ముంబై: ఐపీఎల్లో అదిరిపోయే బొమ్మ పడింది. భారీస్కోర్లతో అభిమానులకు మజా పంచింది. ఆఖరిదాకా ఉత్కంఠ పెంచింది. చివరకు ఓ అసాధారణ పోరాటం (సంజూ సామ్సన్) బౌండరీ లైన్ దగ్గర దీపక్ హుడా చేతికి చిక్కింది. దీంతో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 200 పైచిలుకు పరుగులు చేసి కూడా... పంజాబ్ కింగ్స్ 4 పరుగులతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్ (63 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) ఐపీఎల్ చరిత్రలో చిరస్మరణీయ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (50 బంతుల్లో 91; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... దీపక్ హుడా (28 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) హైలైట్స్ చూపించాడు. చేతన్ సకారియా 3, క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసి ఓడిపోయింది. రాహుల్, హుడా ఎడాపెడా... పంజాబ్ ఇన్నింగ్స్‌లో మయాంక్ (14) ఎక్కువ సేపు నిలువలేదు. గేల్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పదో ఓవర్ పూర్తికాకముందే ఔటయ్యాడు. సగం ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 89/2. ఆ తర్వాత 10 ఓవర్లలో పంజాబ్ ఏకంగా 132 పరుగులు చేసింది. స్కోరు 17.1వ ఓవర్లలోనే 200 పరుగుల్ని అవలీలగా దాటేసింది. ఇన్నింగ్స్ 13, 14 ఓవర్లయితే ప్రత్యర్థి బౌలర్లకు కాళరాత్రిని మిగిల్చాయి. దూబే 13వ ఓవర్లో రాహుల్ సిక్స్ కొట్టి 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంటే... హుడా రెండు సిక్స్‌లు బాది విధ్వంసానికి తెగబడ్డాడు. ఈ 12 బంతుల వ్యవధిలో అరడజను సిక్సర్లు వచ్చాయి. స్కోరేమో కొండంత అయ్యింది. కేవలం 20 బంతుల్లోనే దీపక్ హుడా అర్ధసెంచరీని అధిగమించాడు. సెంచరీకి చేరువైన రాహుల్ చివరి ఓవర్లో ఔటయ్యాడు. సామ్సన్ సూపర్... కొండంత లక్ష్యాన్ని చూసి రాజస్తాన్ రాయల్స్ జడిసిపోలేదు. హిట్టర్ స్టోక్స్ (0) తొలి ఓవర్లో డకౌటైనా కంగారు పడిపోలేదు. దిమ్మదిరిగే బదులిచ్చేందుకు రాజస్తాన్ పరుగూ పరుగూ పోగేసింది. బౌండరీలనూ జతచేసింది. సిక్సర్లతో వేగం పెంచుకుంది. ఈ క్రమంలో కెప్టెన్ సామ్సన్‌కు వచ్చిన రెండు లైఫ్‌లు లక్ష్యాన్ని దించేందుకు దోహదం చేశాయి. 12 పరుగుల వద్ద కీపర్ రాహుల్ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తయ్యాక ఎల్బీగా వెనుదిరగాల్సిన సంజూ రివ్యూతో బతికిపోయాడు. బట్లర్ (25; 5 ఫోర్లు), శివమ్ దూబే (23; 3 ఫోర్లు) వేగంగా ఆడినా... ఎక్కువసేపు నిలువలేదు. ఆ తర్వాత రియాన్ పరాగ్ (11 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు)తో కలిసి సామ్సన్ ప్రత్యర్థి బౌలర్లను చావబాదాడు. ఐదో వికెట్‌కు వీరిద్దరి మధ్య చకచకా సాగిన 52 పరుగుల భాగస్వామ్యం జట్టులో ఆశల్ని కసికసిగా పెంచింది. చివరకు సామ్సన్ 54 బంతుల్లోనే సాధించిన సెంచరీ గెలుపుదారిలో పడేసింది. కానీ ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 13 పరుగులు అవసరమైన దశలో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అర్‡్షదీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి సామ్సన్‌కు పరుగు రాలేదు. రెండో బంతికి సామ్సన్... మూడో బంతికి మోరిస్ సింగిల్స్ తీశారు. నాలుగో బంతిని సామ్సన్ సిక్సర్‌గా మలిచాడు. దాంతో రాజస్తాన్ గెలుపునకు 2 బంతుల్లో 5 పరుగులు అవరసమయ్యాయి. ఐదో బంతిని సామ్సన్ లాంగ్‌ఆఫ్ వద్దకు ఆడగా... మోరిస్ సింగిల్ కోసం వచ్చాడు. కానీ సామ్సన్ సింగిల్ వద్దనడంతో మోరిస్ వెనక్కి వెళ్లిపోయాడు. దాంతో చివరి బంతికి రాజస్తాన్ గెలుపునకు 5 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆరో బంతిని సామ్సన్ కవర్స్‌లో కొట్టిన భారీ షాట్ బౌండరీ దాటకుండా పంజాబ్ ఫీల్డర్ దీపక్ హుడా చేతికి చిక్కింది. దాంతో చేజారిందనుకున్న మ్యాచ్‌లో పంజాబ్ విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) తెవాటియా (బి) సకారియా 91; మయాంక్ (సి) సంజూ సామ్సన్ (బి) సకారియా 14; గేల్ (సి) స్టోక్స్ (బి) పరాగ్ 40; దీపక్ హుడా (సి) పరాగ్ (బి) మోరిస్ 64; పూరన్ (సి) సకారియా (బి) మోరిస్ 0; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 6; జే రిచర్డ్సన్ (సి) మోరిస్ (బి) సకారియా 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–22, 2–89, 3–194, 4–201, 5–220, 6–221. బౌలింగ్: చేతన్ సకారియా 4–0–31–3, ముస్తాఫిజుర్ 4–0–45–0, మోరిస్ 4–0–41–2, శ్రేయస్ గోపాల్ 3–0–40–0, స్టోక్స్ 1–0–12–0, తెవాటియా 2–0–25–0, రియాన్ పరాగ్ 1–0–7–1, దూబే 1–0–20–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: స్టోక్స్ (సి అండ్ బి) షమీ 0; వొహ్రా (సి అండ్ బి) అర్‡్షదీప్ సింగ్ 12; సంజూ సామ్సన్ (సి) హుడా (బి) అర్‡్షదీప్ సింగ్ 119; బట్లర్ (బి) రిచర్డ్సన్ 25; శివమ్ దూబే (సి) హుడా (బి) అర్‡్షదీప్ సింగ్ 23, పరాగ్ (సి) రాహుల్ (బి) షమీ 25; తెవాటియా (సి) రాహుల్ (బి) మెరెడిత్ 2; మోరిస్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–0, 2–25, 3–70, 4–123, 5–175, 6–201, 7–217. బౌలింగ్: షమీ 4–0–33–2, రిచర్డ్సన్ 4–0–55–1, అర్‡్షదీప్ సింగ్ 4–0–35–3, మెరెడిత్ 4–0–49–1, మురుగన్ అశ్విన్ 4–0–43–0. ఐపీఎల్లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్ X ముంబై ఇండియన్స్ వేదిక: చెన్నై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
భారత కుర్రాళ్ల శుభారంభం
విశాఖపట్టణం, న్యూస్‌లైన్: దీపక్ హుడా (55 బంతుల్లో 83 నాటౌట్; 5 ఫోర్లు; 5 సిక్స్‌లు, 2/37)ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో అండర్-19 నాలుగు దేశాల వన్డే సిరీస్‌లో భారత కుర్రాళ్లు శుభారంభం చేశారు. సోమవారం స్థానిక వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జింబాబ్వేతో జరిగిన ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో రాణించిన భారత్ 148 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఓపెనర్ అంకుశ్ బెయిన్స్ (62 బంతుల్లో 49; 7 ఫోర్లు; 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (55 బంతుల్లో 55; 4 ఫోర్లు; 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ఆరో నంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన హుడా జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు. ప్రతీ బౌలర్‌పై ఎదురుదాడికి దిగడంతో చివర్లో స్కోరు బోర్డు పరుగులెత్తింది. రికీ భుయ్ (19)తో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించిన హుడా... 15 ఏళ్ల సర్ఫరాజ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 35 బంతుల్లోనే 72 పరుగులు జత చేశాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన జింబాబ్వే 41.2 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటయ్యింది. బుర్ల్ (55 బంతుల్లో 46; 4 ఫోర్లు; 1 సిక్స్) ఒక్కడే ఆకట్టుకున్నాడు. కుల్దీప్ యాదవ్‌కు నాలుగు వికెట్లు దక్కగా హుడా బౌలింగ్‌లోనూ రాణించి రెండు వికెట్లు సాధించాడు. సోమవారమే జరిగిన మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అండర్ -19 జట్టు 17 పరుగుల తేడాతో ఆసీస్ అండర్-19 జట్టును ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 44 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత ఆసీస్ 44.2 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసి ఓడింది.