Defects
-
ఈవీ ప్రమాదాలు.. డీఆర్డీవో నివేదికలో షాకింగ్ విషయాలు
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా జరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు.. వాహనదారుల్లో ఆందోళన రెకెత్తిస్తోంది. మరణాలు సైతం సంభవించడంతో.. కేంద్రం సైతం విషయాన్ని సీరియస్‌గా పరిగణించి దర్యాప్తులకు ఆదేశించింది. ఈ తరుణంలో.. ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై డీఆర్డీవో నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధమవుతుండడం వెనక.. ఎండాకాలం సీజన్ కారణం కావొచ్చంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి తొలుత. అయితే కారణం అది కాదని డీఆర్డీవో తన నివేదికలో వెల్లడించింది. బ్యాటరీ లోపాలు కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఓ నివేదిక రూపొందించింది. బ్యాటరీ ప్యాక్స్ డిజైన్లు, సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే బ్యాటరీ బండ్లను మార్కెట్లోకి రిలీజ్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తన నివేదికలో డీఆర్డీవో స్పష్టం చేసింది. అంతేకాదు.. ఖర్చు తగ్గించుకునేందుకు లో-గ్రేడ్ మెటీరియల్‌ను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించడం.. ప్రమాదాలకు కారణమైందని డీఆర్డీవో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ-మోటర్‌సైకిల్‌ల వినియోగాన్ని 2030 నాటికి 80 శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వరుస ప్రమాదాలు, కంపెనీల వైఖరి ఆ లక్ష్యాన్ని అందుకుంటుందో.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే సమయంలో.. కంపెనీల వైఖరి బయటపడడంపై మంత్రి నితిన్ గడ్కరీ ఎలా స్పందిస్తారో చూడాలి. -
మూడు కోట్ల ఖరీదైన కారు.. ఆ సమస్యతో రీకాల్
లగ్జరీ స్పోర్ట్స్ కార్ సెగ్మెంట్లో లంబోర్గిని స్ట్రేచరే వేరు. లుక్, డిజైన్, కెపాసిటీ ఇలా అన్ని విభాగాల్లో లోపాలకు తావే లేకుండా ఉంటుంది. అందుకే ఈ కాస్ట్లీ కారుకి ఇండియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఓ లోపం కారణంగా ఈ కారుని లంబోర్గిని రీకాల్ చేసింది. లగ్జరీ కార్ల సెగ్మెంట్లో ఫోక్స్ వ్యాగన్ కంపెనీ లంబోర్గిని బ్రాండ్‌తో కార్లను మార్కెట్లోకి తెస్తోంది. ఇందులో ప్రస్తుతం ఉరూస్ మోడల్‌కి ఫుల్ క్రేజ్ ఉంది. ఈ కారు ఇండియాలో ఎక్స్ షోరూం ధర రూ. 3.10 కోట్లుగా ఉంది. బిజినెస్ మ్యాగ్నెట్లు, సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఈ మోడల్ కార్లను వినియోగిస్తున్నారు. ఇండియాలో లంబోర్గిని ఉరూస్ మోడల్ కార్లు 300ల వరకు ఉన్నాయి. అయితే ఇటీవల ఈ కార్లలో లోపాలను ఉన్నట్టుగా లంబోర్గిని దృష్టికి వచ్చింది. వెంటనే ఆయా కార్లను పరిశీలించింది. 2021 ఫిబ్రవరి 12 నుంచి 24 మధ్య తయారైన కార్లలో సీటు బెల్టుకి సంబంధించి ఆటోమేటిక్ లాకింగ్ రిట్రాక్టర్ (ఏఎల్ఆర్) ఫంక్షన్లో లోపాలు ఉన్నట్టుగా తేలింది. ఇలాంటి లోపాలు ఇండియాలో మూడు కార్లలో ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే లోపాలు ఉన్న కార్లను అక్టోబరు 1న వెనక్కి తీసుకోనుంది లంబోర్గిని. లంబోర్గిని కార్ల క్వాలిటీ విషయంలో ఫోక్స్‌వ్యాగన్ అస్సలు కాంప్రమైజ్ కాదు. ఈ ఘటన జరగడానికి ముందు 2020 డిసెంబరులో ప్రపంచ వ్యాప్తంగా స్వల్ప లోపాలు ఉన్న 80 ఉరూస్ కార్లను వెనక్కి తీసుకుంది. లంబోర్గిని ఉరుస్‌లో 4 లీటర్ ట్విన్ టర్బో వీ 8 ఇంజన్ అమర్చారు. ఈ కారు కేవలం 3.6 సెకన్ల వ్యవధిలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు. లంబోర్గిని ఉరుస్ కార్లను 2018లో మార్కెట్లోకి తెచ్చారు. ఫస్ట్బ్యాచ్లో 1000 కార్లను తయారు చేయగా అందులో ఇండియాకి 25 కార్లను కేటాయించారు. చదవండి : Tesla Cars:'టెస్లా చెత్త కారు'..రివ్యూపై చర్యలకు సిద్ధమైన ఎలాన్ మస్క్ -
లోపాలను సరిచేసుకుంటారా..?
సెల్ఫ్ చెక్ ప్రతిమనిషిలోనూ కొన్ని దోషాలు, లోపాలు ఉంటాయి. లోపాలు ఉండటం తప్పు కాదు, కాని వాటిని ఎవరయినా ఎత్తి చూపితే అంగీకరించే ధైర్యం ఉండాలి. వాటిని ఎత్తి చూపినందుకు కోపం తెచ్చుకోక సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే మరీ మంచిది. 1. మీలో ఏ లోపం లేదు, మీరు చేసే పనులన్నీ కరెక్ట్ అనుకుంటారు. ఎ. కాదు బి. అవును 2. ఎవరి తప్పు వారికి తెలీదు. అటువంటప్పుడు ఎదుటివారు మీలోని లోపాన్ని ఎత్తిచూపితే సరిచేసుకోవాలనుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. లోపం ఉండటం దోషం కాదు, సరిచేసుకోవాలనుకోకపోవడమే తప్పు. ఎ. అవును బి. కాదు 4. లోపాలు లేని మనిషి ఉండరనే మాటను మీరు విశ్వసిస్తారు. ఎ. అవును బి. కాదు 5. ఎదుటి మనిషిలోని లోపాలను ఎత్తి చూపే ముందు మీలోని లోపాలను సరిదిద్దుకోవాలని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 6. ఎదుటి మనిషిలోని లోపాలని కాక సుగుణాల గురించి చర్చించుకోవటం మంచిదనే విషయంతో ఏకీభవిస్తారు. ఎ. అవును బి. కాదు 7. మీ లోపాలను మీ అంతట మీరే సవరించుకోవాలనే కాంక్ష మీలో ఎక్కువ. ఎ. అవును బి. కాదు 8. రామకృష్ణ పరమహంస వంటి వారు తనలోని లోపాలను సరిదిద్దుకున్న తరవాతే శిష్యులకు బోధ చేసేవారని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 9. లోపం లేని వ్యక్తుల కోసం వెతుకులాడకూడదనే మాటతో మీరే ఏకీభవిస్తారు. ఎ. కాదు బి. అవును 10. భగవంతుడు లోపాలను పెట్టడమే కాక వాటిని సరిదిద్దుకునే విధానాలు కూడా చూపాడని మీరు నమ్ముతారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాలు ‘ఏ’ లు ఏడు కంటె ఎక్కువ వస్తే లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారని అర్థం. ‘బి’ లు ఏడు వస్తే మీలో ఉన్న లోపాలను అంగీకరించే తత్త్వం మీలో లేనట్లే. ‘ఏ’ లను సూచనలుగా భావించి మీలోని లోపాలను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. -
గర్భం వాయిదానే ఉత్తమ మార్గం..!
దోమకాటువల్ల వ్యాప్తి చెందే జికా వైరస్... ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా జికా వైరస్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బ్రెజిల్ లో దాదాపు పది లక్షలమందికి జికా సోకి కలకలం రేపడమే కాక మెల్లగా ఇతర ఖండాలకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ గర్భిణులకు సోకితే పుట్టబోయే పిల్లలకు మెదడు లోపాలు తలెత్తే అవకాశం పెద్ద ఎత్తున ఉండటంతో డబ్ల్యూ హెచ్ వో వైరస్ ను నిలవరించేందుకు భారీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న దేశాల్లోని మహిళలు గర్భధారణను ప్రస్తుత సమయంలో వాయిదా వేసుకోవడం మంచిదని హెచ్చరిస్తోంది. పిల్లల పుట్టుకలో లోపాలను నివారించడానికి వ్యాక్సిన్లకు బదులుగా ఈ పద్ధతిని పాటించడం ఉత్తమ మార్గమని చెప్తోంది. జికా వైరస్ సోకిన వెంటనే సాధారణ ప్రజల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోయినా గర్భిణులపై మాత్రం ఈ వైరస్ ప్రభావం అత్యధికంగా ఉంటోంది. జికా తల్లికి పుట్టిన బిడ్డ మెదడులోపంతో ఉండటం ప్రపంచ ఆరోగ్యసంస్థకు పెద్ద సవాలుగా మారింది. దీంతో మహిళలకు ముందు జాగ్రత్త చర్యలను సూచిస్తున్నారు. గర్భం ధరించాలనుకున్న వారు జికా వ్యాప్తి చెందుతున్న సమయంలో వాయిదా వేసుకోవాలని, వ్యాక్సిన్లు వేసినప్పటికీ జికా తల్లులకు పుట్టే బిడ్డలు మెదడు లోపాలతో పుట్టే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే జికా వ్యాప్తి చెందిన అన్ని దేశాల్లో హెచ్చరికలను జారీ చేసిన నిపుణులు.. లైంగిక కార్యకలాపాల వల్ల అనుకున్నదానికంటే ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పుట్టే పిల్లల్లో మైక్రో సెఫిలి నివారించాలంటే గర్భాన్ని వాయిదా వేసుకోవడమే సరైన మార్గమని హెచ్చరిస్తున్నారు. ఈడిస్ ఈజిప్టె రకం దోమలు కుట్టడంద్వారా జికా సంక్రమిస్తుందని మొదట్లో తెలిసినా... లైంగిక కార్యకలాపాలు, ముద్దులు, తినే వస్తువులు మార్పిడితో లాలాజలం వల్ల కూడ జికా ఒకరినుంచీ ఒకరికి సోకే అవకాశం ఉందని తాజా పరిశోధనలద్వారా కనుగొన్నారు. దీంతో కొన్ని దిద్దుబాట్లను చేసిన ఏజెన్సీలు... జికా ప్రభావిత ప్రాంతాల్లో కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇందులో భాగంగా పునరుత్పత్తి వయసులోని పురుషులు, మహిళలు గర్భధారణ జరగకుండా చూసుకోవాలని, వాయిదా వేసుకోవడం అన్నిరకాలుగా మంచిదని చెప్తున్నారు. -
అమెరికాలో మొదటి 'జికా' మామ్!
న్యూ జెర్సీః పుట్టబోయే బిడ్డలకు మెదడు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు జికా వైరస్ వల్ల వస్తున్నాయని వైద్య నిపుణులు ముందే గుర్తించారు. ఇప్పటికే బ్రెజిల్లో తల చిన్నగా ఉండి, మెదడు లోపంతో పిల్లలు పుట్టినట్లు అంచనా కూడ ఉంది. కాగా తాజాగా అమెరికాలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి జికా వైరస్ ఉన్నట్లు వైద్యులు నిర్థారణ చేశారు. న్యూజెర్సీ లోని ఆసుపత్రిలో జికా వైరస్ తో ఉన్నతల్లి ప్రసవించిగా ఆమెకు చిన్న తలతో ఉన్న శిశువు జన్మించినట్లు వైద్యాధికారులు గుర్తించారు. స్పష్టంగా జికా వైరస్ లక్షణాలు కలిగిన ఇటువంటి కేసు అమెరికా ట్రై స్టేట్స్ లో ఇదే మొదటిసారి అని ఇడా సీగల్ నివేదించింది. దోమకాటువల్ల వ్యాప్తి చెందే జికా వైరస్... ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బ్రెజిల్ లో దాదాపు పది లక్షలమందికి సోకి, కలకలం రేపుతున్న జికా వైరస్... మెల్లగా ఇతర ఖండాలకూ విస్తరిస్తోంది.అయితే ఈ వైరస్ వల్ల ఇతరుల్లో పెద్దగా లోపాలు కనిపించకపోయినా గర్భిణులకు సోకితే మాత్రం పుట్టబోయే పిల్లలకు మెదడు లోపాలు తలెత్తుతాయంటూ వైరస్ ను నిలువరించేందుకు డబ్ల్యూహెచ్ వో భారీ కసరత్తు చేస్తోంది. ఈడిస్ ఈజిప్టె రకం దోమల ద్వారా వ్యాప్తి చెందుతున్నజికా వైరస్... సోకిన వెంటనే సాధారణ ప్రజల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోయినా... గర్భిణిలపై మాత్రం ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటోంది. ప్రస్తుతం అమెరికాలో జికా తల్లికి పుట్టిన బిడ్డ మెదడులోపంతో ఉండటం ప్రపంచ ఆరోగ్య సంస్థకు పెద్ద సవాలుగా మారింది. మైక్రో సెఫలి వ్యాధి బారినపడ్డ బిడ్డ.. అమెరికాలోని న్యూజెర్సీ ఆస్పత్రిలో జన్మించింది. ఇలా జికా వైరస్ సోకిన తల్లి ఆమెరికాలోని ఆస్పత్రిని సందర్శించడం ఇదే మొదటిసారి అని హాకెన్‌సాక్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ అధికారులు అంటున్నారు. అయితే ఆ తల్లి.. పూర్తి వైద్య సంరక్షణ అందుకుందని చెప్పిన అధికారులు.. ఆమె గోప్యతను గౌరవిస్తూ... ఆమెకు సంబంధించిన మిగిలిన వివరాలను వెల్లడించలేదు. అయితే ఆమె హోండురాస్ కు చెందిన 31 ఏళ్ళ వయసున్న మహిళ అని ఓ వార్తా పత్రిక వెల్లడింరగా... గర్భం ప్రారంభ దశలోనే ఆమె.. దోమకాటు వల్ల జికా బారిన పడిందని ఆసుపత్రి వైద్యుడు ఒకరు తెలిపారు. అల్ట్రా సౌండ్ టెస్ట్ లో లోపాలు కనిపించడంతో వైద్యులు 35 వారాల గర్భంతో ఉన్న ఆమెకు మంగళవారం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. పుట్టిన బిడ్డ.. తక్కువ బరువుతోపాటు, మైక్రోసెఫలీ వ్యాధి కలిగి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ తల్లికి గర్భంతో ఉన్న సమయంలో శరీరంపై కొద్దిపాటి రాష్ తప్పించి.. మిగిలిన ఎటువంటి లక్షణాలు కనిపించలేదని వైద్యులు చెప్తున్నారు. -
స్థానిక సంస్థల ఆడిటింగ్ లో లోపాలు
ప్రజా పద్దుల సంఘం భేటీలో చర్చ సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఆడిటింగ్‌లో లోపాలున్నాయని, వాటిని తమ పరిధిలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) నిర్ణయించింది. తెలంగాణ పీఏసీ చైర్‌పర్సన్‌గా జె.గీతారెడ్డి ఎన్నికైన తర్వాత తొలి సమావేశం అసెంబ్లీలోని కమిటీ హాల్లో శనివారం జరిగింది. గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి.. గీతారెడ్డిని అభినందించారు. స్థానిక సంస్థల్లో ఆడిటింగ్ జరుగుతున్న విధానం, రెవెన్యూ విభాగాన్ని 1971 నుంచి పీఏసీ సమీక్షించకపోవడంపై చర్చించారు. నగర, పట్టణ పాలక సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో ఆడిటింగ్ జరుగుతున్న విధానంలో చాలా లోపాలున్నాయన్నారు. వీటిని పీఏసీ పరిధిలోకి తీసుకురావాలని, సమగ్ర సమాచారంతో చర్చించాలని నిర్ణయించారు. దీంతో పాటు రెవెన్యూ విభాగంపైనా దృష్టి సారించాలని నిర్ణయించారు. మిగిలిన అన్ని విభాగాలు కూడా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మే 9న పీఏసీ తదుపరి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు టి.జీవన్ రెడ్డి, ఎ.జీవన్ రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, గువ్వల బాలరాజు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి, రాములు నాయక్, భానుప్రసాద్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గర్భిణులు ఒలింపిక్స్‌కు వెళ్లొద్దు!
ఈ ఏడు జరిగే ఒలింపిక్స్‌కు గర్భిణులు వెళ్లకపోవడం మంచిదని అమెరికా ప్రభుత్వం సలహా ఇస్తోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈసారి బ్రెజిల్లో జరిగే ఒలింపిక్స్‌కు జికా వైరస్ ప్రమాదం పొంచి ఉందని, దీంతో గర్భిణిలు ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లరాదని సూచిస్తోంది. పుట్టబోయే పిల్లలకు జికా వైరస్ వల్ల ఎటువంటి నష్టం కలగకూడదన్న అభిప్రాయంతోనే ఈ ప్రత్యేక సూచన చేస్తున్నట్లు సీడీసీ తెలిపింది. 2016లో తప్పనిసరిగా ఒలింపిక్స్‌కు వెళ్లాలనుకున్న గర్భిణిలు మాత్రం ముందుగా తమ డాక్లర్లు, లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్ల సలహాలు, సూచనల మేరకు తగు జాగ్రత్తలు పాటించాలని సీడీసీ ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చింది. ముఖ్యంగా జికా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని దోమలు కుట్టకుండా చూసుకోవాలని సూచిస్తోంది గర్భిణులు మాత్రమే కాదు, వారి భర్తలు ఒలింపిక్స్‌కు వెళ్లినా జికా ప్రమాదం ఉంటుందని సీడీసీ చెప్తోంది. అందుకే అలా వెళ్లాలనుకునే వారు ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లి వచ్చిన భర్తతో సెక్స్ విషయంలోనూ గర్భిణులు జాగ్రత్తలు పాటించాలని, లేందంటే పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గర్భిణిగా ఉన్నంతకాలం సెక్స్ దూరంగా ఉండటం మంచిదని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బ్రెజిల్లో జికా వ్యాప్తి గణనీయంగా ఉండటంతో సీడీసీ ఈ ప్రత్యేక సిఫార్సులు చేసింది. అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటామని సీడీసీ వెల్లడించింది. దోమల వల్ల కలిగే జికా వైరస్ బ్రెజిల్లో వ్యాప్తి చెందుతున్నట్లు గత సంవత్సరంలో బ్రెజిలియన్ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో ఇటువంటి ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నట్లు సీడీసీ చెబుతోంది. గర్భిణులకు జికా వైరస్ సోకితే పుట్టబోయే పిల్లల పెరుగుదలలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీడీసీ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా చిన్న తలతో పుట్టడం, శారీరక ఎదుగుదల లోపించడం, వినికిడి శక్తిలోపం వంటి అసాధారణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. కొన్ని సందర్భాల్లో ఈ సమస్యలు జీవితానికే ప్రమాదం కావచ్చని చెబుతోంది. -
మనిషి గతి ఇంతే!
హ్యూమర్ ప్లస్ మనుషులు లక్షా తొంభై రకాలు. మనకు గట్టిగా తొంభై రకాలే పరిచయమవుతారు. మిగిలిన లక్ష గురించి తెలుసుకోవడం ఇతరుల బాధ్యత. మనం చాలా పర్ఫెక్ట్ అనుకుంటాం కానీ మన డిఫెక్ట్స్ ఎదుటివాళ్లు కనిపెడతారు. ఇతరుల పిచ్చిని తెలుసుకోవడమే పనిగా పెట్టుకున్నవాళ్లు కొందరుంటారు. వాళ్లే పిచ్చాసుపత్రి డాక్టర్లు. జీతం తీసుకుని మరీ పిచ్చివాళ్లతో కలిసి జీవిస్తుంటారు. నాకు తెలిసిన డాక్టర్ ఒకాయన ఉన్నాడు. నైజీరియా ప్రభుత్వం డాక్టరేట్ ఇచ్చి సన్మానం చేస్తుందని ఈ-మెయిల్ వస్తే ఖర్చుల కోసం 50 వేలు బ్యాంక్‌లో కట్టాడు. ఆ తరువాత నైజీరియా నుంచి సమాధానం నై. అసలు నైజీరియా వాళ్లకి కొట్టుకు చావడానికే టైం లేదు, మధ్యలో ఈయన్ని పిలిచి సన్మానం ఎందుకు చేస్తారు. వాళ్లకేమైనా పిచ్చా? అందరి పిచ్చిని తెలుసుకునే ఈయన ఇది తెలుసుకోలేక డబ్బు పోగొట్టుకున్నాడు. మన గురించి ఎవడైనా గొప్పగా అనుకుంటే చాలు ఒళ్లు మరిచిపోతాం. మనకు అంత సీన్ ఉందా లేదా అనేది అవసరం. ఎవడి పెళ్లికి వాడే హీరో అయినట్టు మన జీవితానికి మనమే కథానాయకులం. మనంతటి వారు లేరనేది మన ఫిలాసఫీ. తాగినప్పుడు ఇది చాలామందికి తలకెక్కుతుంది. మీరు తాగుబోతులైనా కాకపోయినా పర్లేదు. అయితే మరీ మంచిది. కల్లు కాంపౌండ్‌లో గానీ వైన్‌షాప్‌లో గానీ కాసేపు కూర్చుని చూడండి. బోలెడంత వేదాంత చర్చ జరుగుతూ ఉంటుంది. ‘‘నేనెవర్ని? ఎలాంటివాన్ని? ఈ లోకాన్ని అడగండి అదే చెబుతుంది. డబ్బుదేముంది. మనుషులు ముఖ్యం. అన్నీ చూడ్డానికి దేవుడున్నాడు. కొంచెం సోడా పొయ్. ఆ బాయిల్డ్ పల్లీ తీసుకో.’’ ఇది ఫస్ట్ రౌండ్ చర్చ. థర్డ్‌కి వెళితే భాష బాషా సినిమాలో రజనీకాంత్‌లా విజృంభిస్తుంది. ‘‘నన్షు అందర్షు మోసమ్ష్ చేసినా నేనెవర్షి షేయలేద్షు...’’ నిషా కదా ష అక్షరం అంతటా తానై నర్తిస్తుంది. ‘ష’ ఒక వూతకర్రతో నడిచినట్టు తాగుబోతుల అడుగులు కూడా బడతడుతాయి. ఎంత తడబడినా మనం మనింటికే వెళితే సేఫ్, లేదంటే వీపు సాప్. మనుషులందరికీ వాస్తవం కంటే భ్రాంతి ఎక్కువ ఇష్టం. రియాల్టీలో క్రూయాల్టీ ఉంటుంది. దాన్ని తట్టుకోవడం కష్టం. అందుకే సినిమాలకెళ్లి రంగుల్లో కలల్ని కొనుక్కుంటాం. కొంతమంది దర్శకులు తెలివి మీరి తెరపైన కూడా జీవితాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. అంతకంత అనుభవిస్తారు. ఉన్న జీవితంతోనే చస్తుంటే డబ్బిచ్చి కూడా జీవితాన్నే చూడమంటే ఎవరు చూస్తారు? లైఫ్ నుంచి, వైఫ్ నుంచి పారిపోవడానికి తాగడం మొదలుపెడతారు. ఎక్కింది దిగగానే ఎదురుగా నైఫ్లే వైఫ్. ఒకాయన ఉన్నాడు. ఆయనెప్పుడూ నోరే తెరవడు. ఒకటి మాట్లాడితే భార్య తంతుంది. రెండు మాట్లాడితే ఉతుకుతుంది. అందుకే ఆ మౌనదీక్ష. కాని మందు పడితే మౌనం పారిపోతుంది. అరుపులు, పెడబొబ్బలు, సవాళ్లు... బండి డౌన్ కాగానే గాలి తీసిన బెలూన్, మూగవాడి పిల్లనగ్రోవి. మనదేశం గొప్పతనం ఏమంటే ఇక్కడ కల్తీ కల్లు తాగి చచ్చిపోతారు. కల్తీ కల్లు దొరక్కపోతే కూడా చచ్చిపోతారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా పోయేది బరియల్ గ్రౌండ్‌కే! - జి.ఆర్.మహర్షి